వీలుంటే నా నాలుగు లంకెలు ...

16, నవంబర్ 2011, బుధవారం

అవినీతి పరుల అస్త్రం "సహజ న్యాయసూత్రం"

3 వ్యాఖ్యలు
నాటి వార్త: "జగన్ అక్రమార్జన పై హైకోర్ట్ ప్రాదమిక విచారణకు ఆదేశం..."
     వైఎస్సార్ పార్టీ వివిధ సంధర్భాలలో ప్రకటనలు..
  1. యిది రాజకీయ కుట్రతో కూడుకున్న పిటీషన్.
  2. సోనియా ప్రోద్భలంతోనే ఈ విచారణ.
  3. సిబి‌ఐ అంటే, "కాంగ్రేస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్"
  4. న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళడం సహజ న్యాయ సూత్రం. ఆ హక్కు మేము ఒదులుకోం. (చంద్రబాబు మాత్రం సుప్రీం కోర్టుకు వెళ్ళడం అంటే తప్పు ఒప్పుకున్నట్లే!)
  5. "2004-2009 మధ్య అక్రమాలు జరిగినట్లయితే...అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ రావు 2010 నవంబర్ వరకు ఎందుకు మౌనంగా ఉన్నారని జగన్ ప్రశ్నించారు. "నాపై వచ్చిన ఆరోపణలకు, శంకర్ రావుకు ప్రత్యక్ష సంబంధం ఏమిటి? ఆయన ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం కలిగిందా?'' అని జగన్ ప్రశ్నించారు" (చంద్రబాబు అధికారం పోయి చాలా సంవత్సరాలయింది.. మరి మీ తండ్రి హాయాంలో గోల్లు గిల్లు కుంటూ కూర్చున్నారా?)
  6. " హైకోర్టు నేరుగా తనపై సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడం చెల్లదు. "ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారణకే స్వీకరించకూడదు. నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడే, హైకోర్టు జోక్యం చేసుకోవాలి. హైకోర్టు నేరుగా సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 226ను దుర్వినియోగపరచడమే. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే''.  - సుప్రీంకోర్టులో జగన్ వాదన. (శంకర్రవు లేని నష్టం విజయమ్మకు చంద్రబాబు విషయంలో ఏమి నష్టం వచ్చిందో? దోచినదాంట్లో వాటాలు యివ్వలేదనా)
     తెలుగుదేశం పార్టీ:.
  1. అక్రమ సంపాదన కాదని నిరూపించుకొనే అవకాశం వచ్చింది. స్టే కోసం సుప్రీమ్ కోర్టుకు జగన్ వెళ్ళకూడదు...
  2. జగని చిప్పకూడు తినే రోజులు దగ్గకొచ్చాయి.
  3. వైఎస్‌ఆర్ మంత్రివర్గం పై కూడా సిబి‌ఐ విచారణ చేయాలి.
    కాంగ్రేస్ పార్టీ:
  1. హైకోర్టు స్పందిస్తే, సోనియా ప్రోద్భలం అనడం తగదు.
  2. చట్టం తనపని తాను చేసుకుపోతుంది.
    తెరాస పార్టీ:
  1. యిది రాజకీయ కుట్ర
  2. చోటా నాయకులు తప్ప, పోలిట్ బ్యూరో స్థాయి నేతలనుండి స్పందన లేదు.
     వామపక్షాలు, లోక్‌సత్త పార్టీలు:

  1. ఆహ్వానించదగ్గ పరిణామం.
  2. సిబిఐ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా విచారణ చేయాలి.
నేటి వార్త: "చంద్రబాబు అక్రమార్జన పై హైకోర్ట్  సిబి‌ఐ సమగ్ర విచారణకు ఆదేశం..."
 
     వైఎస్సార్ పార్టీ ప్రకటనలు..
  1. న్యాయం గెలిసింది.. విజయమ్మ పిటీషన్ స్వీకరించింది. (జగన్ విషయంలో సహజ న్యాయసూత్రాలు పాటించలేదు)
  2. సోనియా ప్రోద్భలం ఏమిలేదు... హైకోర్టు విషయంలో సోనియా ఎలాగ కలుగజేసుకుంటుంది? (జగని విషయంలో సోనియా ప్రోద్భలంతోనే)
  3. బాబుపై సిబి‌ఐ విచారణ మొదలు పెట్టాలి. (జగన్ పై సిబి‌ఐ దాడులు ఆపాలి)
  4. న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళడం అంటే చంద్రబాబు తప్పు ఒప్పుకున్నట్లే... (జగన వెళ్ళడం తప్పుకాదు)
     తెలుగుదేశం పార్టీ:.
  1. యిది రాజకీయ కుట్రతో కూడుకున్న పిటీషన్.(జగన్ మీద మాత్రం రాజకీయ కుట్ర కాదు)
  2. సోనియా ప్రోద్భలంతోనే ఈ విచారణ. (జగన్ విషయంలో మాత్రం కోర్టులు బగా పనిచేస్తున్నాయి)
  3. రిలయన్స్, జిఎమ్మార్, ఎల్&టి  తో పాటు వివిధ  సంస్థలు చంద్రబాబు హయాంలో లాభపడ్డాయిని ఆరోపించినప్పుడు మరి ఆ సంస్థలను పిటీషన్‌లో ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదు..  జిఎమ్మార్ వైఎస్‌ఆర్ లింకులు బయటకొస్తాయనా? 
  4. వైఎస్సార్ 26 కేసులు వేస్తే నిలబడలేదు.. యిప్పుడు కొత్తగా ఏమిలేదు...
    కాంగ్రేస్ పార్టీ:
  1. బాబు తనకు తానుగా హైకోర్టు ఆదేశాలకు ముందుగా సిబి‌ఐ విచారణకోసం కోరలసింది.
  2. హైకోర్టు స్పందిస్తే, సోనియా ప్రోద్భలం అనడం తగదు.
  3. చట్టం తనపని తాను చేసుకుపోతుంది.
    తెరాస పార్టీ:
  1. చేసిన తప్పులకు ప్రతిఫలం (జగని విషయంలో అయితే రాజకీయ కుట్ర)
  2. పోలిట్ బ్యూరో స్థాయి నేతలనుండే స్పందనలు..
  3. సుప్రీంకోర్టుకు స్టే కోసం వెళ్ళకూడదు.
  4. సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడేమి ఒరుగుతుందని "నమస్తే తెలంగాణ" లో పలుకులు (పై స్టేట్ మెంటుకు భిన్నంగా)
     వామపక్షాలు, లోక్‌సత్త పార్టీలు:
  1. ఆహ్వానించదగ్గ పరిణామం.
  2. సిబిఐ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా విచారణ చేయాలి.

అంతామన మంచికేనా? లేక యిదేమైనా రాజకీయ క్రీడా?
ఏదేమైనా జగన్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత సోనియాపై జగన్ లో ఎంతో కొంత మార్పు కొట్టొచ్చినట్లు రాష్ట్ర ప్రజలు గుర్తించే స్థాయిలోనే వుంది. కాకతాళీయమో లేక ప్రోద్భలమో చెప్పలేము గాని, విజయమ్మ వేసిన పిటీషన్ తో హైకోర్టు స్పందనలో నాకు కొంత వ్యత్యాసం కనబడినది. శంకరావు వేసిన పిటీషన్‌ తో హైకోర్టు కేవలం ప్రాధమిక విచారణకు మాత్రమే ఆదేశించినది జగన్ వాదనలను విన్న తరువాత. మరి విజయమ్మ పిటీషన్‌తో ఏకంగా సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినది చంద్రబాబు వాదనలు వినకుండానే! అదే జగని విషయంలో అయితే, సుప్రీంకోర్టులో కూడా తన వాదనలు వినిపించే అవకాశం ఉపయోగించుకున్నాడు "సహజ న్యాయ సూత్రాల ప్రకారం". మరి చంద్రబాబు విషయంలో ""సహజ న్యాయ సూత్రాల" అవకాశం ఉపయోగించకూడదంట. యిది చిన్నపిల్లల తొండాట లాగలేదు?

ఆంతా మనమంచికే అనుకుందాం... ఎలుక ఎలుక రొట్టె కోసం తన్నుకొని పిల్లికి పెట్టినట్లు.. మనకేమైనా లాభం కలుగుతుందోమని చూద్దాం.. ఎందుకంటే తగిన శిక్షలు పడే వరకూ మనం ఏమి నమ్మలేము... ఏ క్షణాన ఏమవుతుందో చెప్పలేము. పుసుక్కున సిబి‌ఐ కేసులను ఉపసంహరించుకోవచ్చు సాక్షాలు లేవని చెప్పి.. నిన్న కాక మొన్న అదే జరిగింది.. కరుణానిధి ఢిల్లీ వెళ్ళి 'అమ్మ‌'  దర్శనం చేసుకొనేటప్పుడుకి సిబి‌ఐ "కనిమొళి" విషయంలో చప్పబడింది కనిమెళి బెయిల్ పిటీషన్ కి ఎదురు చెప్పమని చెప్పింది. కోర్టులు ఈ మధ్య "యాక్టివ్" గా వున్నయి కదా సరిపోయింది. కనిమెళి బెయిల్ కి సిబి‌ఐ అభ్యంతరం చెప్పనప్పటికి కోర్టు బెయిల్ నిరాకరించింది కాబట్టి సరిపోయింది లేక పోతే హాయిగా ఈపాటి ఎసి రూములో వుండేది.

చూద్దాం.. రేపు ఢిల్లీ ఎవరు వెళతారు? ఎవరి కేసులు వీగిపోతాయో!

 నర్మగర్భంగా ఒప్పుకొనేది ఏమంటే..

తన మీద ఆరోపణలు వచ్చినపప్పుడు నిరూపించుకోవలసింది పోయి, కనీసం ఆ ఆరోపణలపై స్పందించకుండా, వారిమీద కేసులేదు, వీరిమీద కేసులేదు నామీదే కేసులు వేసారంటే దానర్థం ఏమిటి? వేరే ఏమైనా చెప్పాలా!


చట్టం తనపని తాను చేసుకుపోతుందిని నమ్మలంటే...వీరందరికి శిక్షలు పడాలి!
సిబి‌&ఐ విచారణలో వున్న ప్రముఖులు..

  1. గనులపేరుతో దోపిడి - గాలి
  2. వ్యాపారం/అధికారం పేరుతో దోపిడి - జగన్
  3. హైటెక్ పేరుతో దోపిడి - చంద్రబాబు
  4. దొంగ లెక్కలతో దోపిడి - రామలింగరాజు
 యింక మిగిలిన నాయకులపై కూడా విచారణ జరగాలి.. మచ్చుగా నాకు బాగా గుర్తున్న కొందరు..
  1. మతం పేరుతో దోపిడి - బ్రదర్ అనిల్ కుమార్
  2. మూఢ విశ్వాసాలతో దోపిడి - సత్యసాయి ట్రస్ట్
  3. స్నేహం పేరుతో దోపిడి -  కెవిపి రామచంద్ర రావు
  4. భూకబ్జాలతో దోపిడి -  సత్తిబాబు
  5. కృత్రమ వర్షాలని దోపిడి - రఘువీరా
  6. నీటి డ్యాముల పేరుతో దోపిడి -పొన్నాల
  7. విధ్యుత్పోత్తి పేరుతో దోపిడి - రాజగోపాల్
  8. సెంటిమెంటు పేరుతో దోపిడి - కెసిఆర్
  9. బ్లాక్‌మెయిలింగ్‌ లతో దోపిడి- కెటీఆర్
  10. సంస్కృతి పేరుతో దోపిడి - కవిత
  11.  మీడియా పేరుతో దోపిడి - రామోజీ రావు
  12. సినిమాల పేరుతో దోపిడి - మగధీర, దూకుడు నిర్మాతలు (యిప్పుడిప్పుడు బయటకొసున్నయి ఏ సినిమామీద ఎంత సంపాదించినది - ఐటి దాడులు చేస్తేగాని అస్సలు లెక్కలు బయటకు రావు)
యిప్పుడు చెప్పండి దోపిడీకి ఏదీ అనర్హం కానిదే కదా? దోపిడి చేయడానికి ప్ర్రాంతీయ భేదాలు లేవు, కుల మతాలసలే లేవు...


4, అక్టోబర్ 2011, మంగళవారం

ఆధునిక అతివాద తెలంగాణ కమ్యూనిస్ట్ సిథ్దాంతం - ప్రపంచ శ్రామికులారా ఏకంకండి! తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

103 వ్యాఖ్యలు
భారతదేశ శ్రామికులేకాక, అమెరికా శ్రామికులైనా, పాకిస్తాన్ శ్రామికులైనా మరేదేశ శ్రామికులైనా, ప్రపంచంలో వున్న శ్రామికులందరూ ఏకమై ఈ భూర్జువా భూస్వామ్యవర్గంపై సాయుధ పోరాటంతో సమసమాజం స్థాపించాలని భారతదేశ అతివాద కమ్యూనిస్ట్‌ల ఒక్కపటి అజెండా!

ప్రపంచ శ్రామికులారా ఏకంకండి!
తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

యిది యిప్పటి ఆధునిక అతివాద తెలంగాణ కమ్యూనిస్ట్ సిథ్దాంతం. పోనీ తెలుగు (తెలంగాణ Vs తెలంగాణేతర) శ్రామికులు తన్నుకు చచ్చినా ఏమైనా విప్లవం వస్తుందా అంటే అదీ కాదు.

* దసరా పూట సెలవులు వచ్చేవి శ్రామికులకా? పరిశ్రామాధిపతులకా? యింత గొడవలు జరుగుతున్న సందర్భంలో పరిశ్రామాధిపతులు రిస్క్ రీసుకొని ప్రయాణాలు పెట్టుకోరు.. వారికి కావలసినప్పుడు సెలవులు తీసుకుంటారు. ఎంతోకాలంగా సెలవలకోసం వేచి చూస్తూ తల్లి తండ్రులదగ్గరకు పండగ వంకతోనైనా చూసి వస్తానికి వీలు చేయడం అంటే నా దృష్టిలో మానవత్వం లోపించడమే అవుతుంది.

* బస్సులపై జన్మస్థలాలకు దసరా సెలవలకు వెళ్ళేవారు బడుగులూ, మధ్య తరగతి జీవులు కాదా? - హైదారాబాద్ నుండి ఖరీదైనా కార్లలోనో, విమానాలలో వెళ్ళే బడా పారిశ్రామికాధిపతులకు ఏటువంటి ఆసౌకర్యం కలిగించనటువంటి ఈ రోకోలు ఎవరిపై ఎవరికోసం?

* నిన్న ఓ టీవీ ఛానల్‌లో C.P.I (ML) & పౌరహక్కుల సంఘం నాయకులు మాట్లాడుతూ, రెండు ప్రాంతాల ప్రజలు కొట్టుకొనేలా ప్రభుత్వమే కుట్రపన్నడంవలన ఈ పరిస్థితి దాపురించిందని వాధించారు. ప్రభుత్వాలు కుట్రపన్నుట సహజం అనుకుందాం. ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని ముందే తెలిసినా ఈ మేధావులకు, రెండు ప్రాంత ప్రజలు కొట్టుకు చావకుండా ఏ ఒక్క ఎత్తుగడైనా వేశారా? లేకపోతే కొట్టుకు చచ్చిన తరువాత ప్రభుత్వమే దీనికి భధ్యత వహించాలని డిమాండ్లు చీటీలో వ్రాసుకొని దాచుకున్నారా? లేక ఎలాగూ పాపం ప్రభుత్వానిదే కదా, ప్రజల మధ్య చిచ్చుతో చలికాగుతాగుతామనా?

* ప్రజలలో వ్యక్తిగత  రాగ ద్వేషాలాను రోజు రోజుకు పెంచుతూ, అమ్మనా బూతులూ తిడుతూ అదే తెలంగాణ సంస్కృతి అంటూ చేసే నాయకుడి తోక పట్టుకోని, తెలంగాణాలొ ఎంతో కొంత తమ క్యాడర్‌ని పెంచుకోవచ్చులే అనే తపనే తప్ప యింకొకటి కాదనిపిస్తుంది. మీడియా మొఘల్ మరియు ఆర్.ఎఫ్.సి అధినేత పై కట్టలు తెచ్చుకోనే ఆవేశంతో పాటలు, అదే తెలంగాణాలో మరో గులాబి మీడియా మొఘల్ పై సాఫ్ట్ కార్నర్!

 
* ఆంథ్రప్రాంత బడా పారిశ్రామికులతో కలిసి వ్యాపారాలు చేస్తున్న తెలంగాణ ప్రాంత బడావ్యాపారుల ఊసే వీరికి అక్కర్లేదు.. ఆంథ్రప్రాంతవాసులందరూ (ప్రజలందరూ) దోపిడీదారులూ / బడా వ్యాపారవేత్తలనే తలతిక్క విమర్శలకు వీరి స్పందన కరువు.. ఎవరైన గట్టిగా అడిగితే పెద్ద్ క్లాస్ పీకుతారు.. పలానా సందర్భంలో మేము ఖండించాము.. ఆంథ్రప్రాంతవాసులందరినీ దోపిడీ దారలనడం ఖండనార్హమని. కానీ బహిరంగంగా తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క సందర్భంలోను లౌడు స్పీకర్లలో చెప్పిన దాఖలాలు లేవు. తన్ని తరమండి, లుంగీలు ఊడపీకమని పిప్లవ సాహిత్య పంథాలో కవులు పులలో రూపంలో రెచ్చగొట్టడం అందరికీ తెలిసినదే...

* దోపిడీ వర్గంపై పోరుమాని, కేవలం తెలంగాణా ప్రాంతంకి ముఖ్యమంత్రి పదివి దక్కితే చాలు (పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో) తెలంగాణా ప్రజల జీవితాలు స్వర్గయుగంలోకి వెళ్ళిపోతాయి అనే భ్రమలు కల్పించడం ఏ సిథాంతం ప్రకారం చేస్తున్నారో అర్థం చేసుకోవడం కష్టమే...

ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి సహజ లక్షణమయిన సాంఘీక అసమానతలను ఆసరాగా, ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంలేక పోయినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకంలేకపోయినా, వర్గపోరు మరిచి వ్యక్తిగత రగద్వేషాలను నూరిపోయిడం (వేరే ప్రాంత బడుగు మధ్య తరగతి జీవులపై కూడా) ద్వారా తెలంగాణ ప్రాంతం క్యాడర్ లో వచ్చు ఈ చైతన్యం వాపే అవుతుంది తప్ప బలుపు కాదని గ్రహిస్తే మంచిది. అంతే కాకుండా ఈ ఉధ్యమం ఏ సిథ్దాంత ప్రాతిపదికన చేసున్నదీ తెలియదు. కేవలం ఆంధ్రప్రాంతం వారిని తన్ని తరిమితే ఉధ్యోగవకాశాలు, అన్ని కష్టాలు తెలంగాణా వారికి తీరిపోతాయి అనే ఊహాజనిత భావంతో ప్రేరేపించి జనులను రచ్చగొట్టడం తప్ప యింకొకటి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణాలోని దోపిడీకి గురవుతున్నవారు వుండరనా వీరి అర్థం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అతివాద కమ్యూనిస్ట్ పార్టీలు మూసుకుంటారా? మళ్ళీ ప్రభుత్వంపై యిప్పుడు చేస్తున్న పోరాటాలు కొనసాగించ మంటారా? క్లారిటిగా ప్రజలకు వివరిస్తే బాగుండు.

ఒక్క తెలంగాణాను భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో అంతర్భాగమైన  ఒక రాష్ట్రంగా చేస్తే పెట్టుబడీ, భూస్వామ్య వ్యవస్థ ఎలా కూలుతుందో!

ప్రత్యేక తెలంగాణా అవసరమా, కదా అనే ఆంశంపై రాసిన వ్యాసం కాదు.. కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం  కోసం అలుపెరగకుండా పోరాడుతున్న కామ్రేడ్ల ఆలోచనా పంథాన్ని అవగహానా కోసం రాస్తున్నది....

27, ఆగస్టు 2011, శనివారం

సుష్మాస్వరాజ్ - నవ్విపోదురు జనులు నాకేంటి సిగ్గు

14 వ్యాఖ్యలు
  • కనీసం సుష్మాస్వరాజ్ గారు అప్పటి భాజపా రాష్ట్ర అధ్యక్షులు దత్తాత్రేయ గారు వైఎస్‌ఆర్ కి కుప్పలుకుప్పలుగా రాసిన  బహిరంగ ఉత్తరాలు గురించి తెలియకుండా మాట్లాడుతున్నారా? ఆంటే దత్తాత్రేయగారి బహిరంగ ఉత్తరాలు ఉట్టిట్టివేనా?  వైఎస్‌ఆర్ చాలా నిజాయితీ పరుడని వారి అధిష్టానానికి అంతర్గతంగా తెలియజేశారా?
  • చనిపోయిన వారి గురించి చట్టం మాట్లాడకూడదంటే, భోఫోర్స్ కుంభకోణం గురించి చనిపోయిన రాజీవ్‌గాంధి పేరు మీరు మాటమాటికి ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
  • నాటి ఎమర్జన్సీ కాలంలో జరిగిన అరాచకాలనూ ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించకండి ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా చనిపోయారుగా.
  • సుష్మారాజ్ గారి ఉపన్యాసం "నవ్విపోదురు జనులు నాకేంటి సిగ్గు" అన్నచందంగా వుంది.
  • అదీనూ పార్లమెంటు ప్రత్యేక సమావేశం లోకపాల్‌పై చర్చిస్తానికి, సందర్భరహితంగా వైఎస్‌ఆర్ అవినీతిని సమర్థిస్తూ, జగన్ అక్రమ వ్యాపారాలపై సిబిఐ దాడులను ఖండించడం అంటే... బరితెగించడమే అధికారం కోసం.

"The late YSR name in the FIR registered against Jagan in the alleged illegal wealth case is a clear example of the CBI being used for the selfish gains of the congress party."

విడ్డూరం:
  • మతుండి మాట్లాడుతున్నారో లేదో కూడా అనుమానం రాక మానదు. జలయజ్ఞం పనులలో చాలా అవినీతి జరిగిందనంటలో అతిశోయక్తి ఏమీవుండదేమో... అంతెందుకు, ఒక్కపట్టి భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు నూరుకు పైగా బహిరంగ ఉత్తరాలు అప్పటి  రాయడం అందరికీ తెలిసినదే. ఆయన బ్రతికే వుండుంటే, కోర్టులూ యింత క్రీయాశీలంగా వుంటే, సిబీఐ యింత చలాకీగా వుండి వుంటే వైఎస్‌ఆర్ మొదటి ముద్దయే అనండంలో ఎవరకీ సందేహముండకర్లా! ఆంటే వైఎస్‌ఆర్ కాలంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో వున్న భాజపా అనవసర రాధాంతం చేసిందని ఒప్పుకుంటున్నారా? 
  • యిక జగన్ ఆస్తులు అన్యూహంగా పెరగడం, సాక్షిలో జలయజ్ఞం గుత్తేదార్ల అక్రమ పెట్టుబడుల గురించి భాజాపా మాజీ జాతీయ అధ్యక్షుడైన వెంకయ్యనాయిడుగారు ఎన్నిసార్లు విమర్శించి వున్నారో ఆయినికే గుర్తుండి వుండదు. అంటే భాజపా కి జగన్ గురించి బాగాతెలిసే వుండి కూడా "తప్పుడు ఆర్థిక నేరారోపణ" అని సుష్మాస్వరాజ్ గారు ఏలా అనగలిగారో?

    ఏదోరకంగా దేశంలో అధికారమే పరామావధిగా కాంగ్రేస్ పార్టీని మించి అవినీతి/అలౌకిక విధనాలతో సమతూగ గలిగే ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ నీరూపించుకుంది యింకొకసారి పార్లమెంటు సాక్షిగా ఈరోజు.

    అలౌకిక విధానం
    కాంగ్రేస్:    మైనారిటీ మతస్థుల ఓట్లపై పిల్లి మొగ్గలు
    భాజాపా:  మెజారిటి  మతస్థుల ఓటర్లను ఏకంచేసి గుత్తంగా వారికి మళ్ళించుకోవడం

    అవినీతి:
    కాంగ్రేస్: అవినీతి గురించి యిక్కడ రాసేంత టైమ్ నాకులేదు..
    భాజపా: (నాకు గుర్తున్నవాటిలో కొన్ని..)
    • ఎల్.కె.అద్వాని - 1.8 అమెరికా డాలర్ల హవాలా కుంభకోణం
    • ప్రమోద్ మహాజన్ అంబానీల  స్నేహం - టెలికం రంగంలో అంబానీలకు గుత్తంగా లైసెన్స్‌లు కట్టబెట్టి దేశంలోనే అంబానీలను అత్యంత దనవంతులను చేసింది.
    • దక్షణ భారత దేశంలో ఏలాగైనా అధికారం చేపట్టాలని,  దక్షణ భారత దేశంలో మతతత్వానికి ఓట్లు పడవని ఒకటీ,రెండు సీట్లకంటే ఎక్కవరావని గ్రహించిన భాజపా, అవినీతికి కొమ్ముకాసి మైనింగ్ మాఫియా అయిన గాలి బ్రదర్స్ ని చేరదీసి వారి అవినీతి సొమ్ముతో కర్నాటకాని హస్తగతం చేసుకోకలిగింది. గాలి సోదర్లూ, యడ్యూరప్ప అవినీతి చేస్తున్నాడని తెలిసినా వారిని సిగ్గులేకుండా వెనకేసుకొచ్చింది కేవలం అధికార దాహార్థం.
    • యిప్పుడు అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‌కి కూడా అమలు చేయాలునుకుంటుంది. సుష్మాస్వరాజ్ కు గాలి బ్రదర్శ్ నమ్మిన బంట్లని అందరకీ తెలిసిందే. వారి యింట్లో జరిగే చిన్నపాటి కార్యక్రమాలకు సైతం ఆమె హాజరు తప్పనిసరి. అదేవిధంగా గాలి సొదర్లు, జగన్ మధ్య లింకు గురించి వేరే చెప్పక్కర్లేదు. వీరి త్రికోణపు బంధంతో యిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాలుమోపాలని ప్రయత్నంగా కనబడుతుంది.

    25, ఆగస్టు 2011, గురువారం

    అవినీతి కేసులకు చిరునామ - రామ్ జేఠ్మలాని: బార్ కౌన్సిల్ నుండి బహిష్కరించాలి

    9 వ్యాఖ్యలు
    రామ్ జేఠ్మలాని
            మన దేశంలో బయటకు వచ్చే అవినీతి శాతం చాలా  తక్కువ, వచ్చినా విచారణ అంఖం పూర్తి చేసుకొని కోర్టులవరకూ వచ్చేవి నామ మాత్రం. అటువంటి వాటిలో హైకోర్టులను దాటుకొని సుప్రీంకోర్టుకు వచ్చేవి బహు స్వల్పం.  అయితే అతిపెద్ద భారీ కుంభకోణం అయినా లేక ఏమైన సంచలన కేసయితే మాత్రం ప్రాస్‌క్యూషన్‌కి వ్యతిరేకంగా వాదిస్తానికి ఒక గంటకు లక్షలలో వసూలు చేస్తూ చేపట్టిన కేసులో నీతి, న్యాయం, ధర్మం, సామాజిక స్పృహ, దయ, జాలి లేకపోయినా పర్వాలేదు ఈ 88 సంవత్సరాల పేరొందిన సుప్రీమ్ కోర్టు న్యాయవాది రామ్ జేఠ్మలాని. న్యాయం ఎక్కడవుందో అక్కడ వాలిపోయి చట్టం ముందు అడ్డంగా అన్యాయానికి వకల్తా పుచ్చుకొని వాదించడం యితనిని మించినవారు ఎవరూలెరనుకుంటా.. అందుకనేమో అంత "డిమాండ్"

            అతని జీవితంలో ఎన్నో విధాలుగా కోర్టులను తప్పుదారి పట్టించి వున్నాడో ఈ మహానుభాహుడు! ఎందుకంటే, యితను చేపట్టిన కేసులు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగక మానదు...

    మచ్చుగా కొన్ని జేఠ్మలాని వాదించిన బడా అవినీతి కేసులు (చాలావరకు ఓడిపోయినవే)..

    • నేను ఈ పెద్దమనిషి ఇందిరా గాంధి హత్యా నింధితుల తరుపున వకల్తా పుచ్చుకున్నపట్టినుండి గమనిస్తూనే వున్నా. కేసు ఫలితం: ఓటమి, ఊరిశిక్ష. కాకపోతే చాలా సంవత్సరాలు పాటు సాగదీయగలిగాడు.
    • హర్షద్‌ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ (రూ. 4,000 కోట్లు).  కేసు ఫలితం: ఓటమి, శిక్ష ఖరారు. కారాగారంలోనే నిండితుడి మరణం.
    • కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోనం:  కేసు ఫలితం: ఓటమి, సంవత్సరంపాటు కఠినగారగార శిక్ష.
    • హజీ మస్తాన్ మిర్జా (ముంబాయి అండర్ వరల్డ్ డాన్):  కోర్టులలో కేసులు నడుస్తుండగానే హత్యకాబడ్డాడు.
    • అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి నిందుతుడు): కేసు ఫలితం: ఓటమి. ఉరి శిక్ష ఖరారు
    • లాల్ కృష్ణ అద్వాని (1.8 కోట్ల అమెరికన్ డాలర్ల హవాలా కుంభకోణం): ఫలితం: డైరీ ఒక్కటే సాక్ష్యంగా పరిణగించలేమని కేసు కొట్టివేయ బడినది.
    •  జెస్సికలా హత్య కేసు (మను శర్మ): ప్రజల నుండి అంతర్ఖాల ద్వారా/సంక్లిప్త సమాచారాల ద్వారా/వార్తా చానళ్ళ ద్వారా వచ్చిన వత్తిడి వలన మను శర్మ, వికాస యాదవ్ & అమర్‌దీప్ సింగ్ ప్రస్తుతం తీహార్ చెరసాలలో వున్నారు
    • సొహ్రాబుద్దిన్ బూటకపు ఎన్‌కౌంటర్ (అమిత్ షా): గుజరాత్ లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాని గుజరాత్ లో అడుగు పెట్టకుండా సుప్రీం తీర్పు...
    •  అమిత్ జోగి (ఛతిస్‌ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు) ముడుపుల కేసు: ఓటమి, జైలుపాలు.
    • 2G కుంభకోణం (కనిమోలి): కనీసం బెయిల్ కూడా యిప్పించే స్థితిలో లేడు ఈ లాయరు సార్!
    • వై.ఎస్.జగనమోహన్ రెడ్డి -   చీటింగ్, అక్రమ పెట్టుబడుల కేసు: ఈరోజే వాదనలు మెదలు సుప్రీంలో.. కనీసం వీరి వాదనలు వినే స్థితిలోనే లేదు..
    • యింకో చాలా ఆసక్తి కలిగే కేసు... మాజీ కర్నాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్ప అవినీతి కేసు. మైనింగ్ కుంభకోణంలో లోకాయుక్త ఎంతో సవివరంగా ఆధారాలతో నిరూపించిన యితని అవినీతికి వకల్తా పుచ్చుకొని కర్నాటక హైకోర్టు కు బయలు దేరారు. ఏమవుతుందో చూడాలి.
    మీకింకా ఏమైనా అనుమానమా? పైన చెప్పిన అన్ని కేసుల పరిష్కారం ఏమయిందో చూసిన తరువాత కూడా!

    రామ్‌ జేఠ్మలాని కోరుకొనేవి:
    • పేరు ప్రఖ్యాతలు - మంచికో.. చెడుకో..(ఉచిత పబ్లిసిటి)
    • సంపద - బడా కుంభకోణాలలో అయితే రాబడి బాగా వుంటుంది (గంటకు లక్షల్లో). 
    • పై రెండిటికి సమర్థన:  భారత రాజ్యాంగంలోని..సహజ న్యాయసూత్రాలు అందరికి అందివ్వాలని (క్రూరులైనా, దుర్మార్గులైనా, ఉగ్రవాదులైనా, మతవాదులైనా ఒక్కటే)
    యింకో విచిత్రమేమిటంటే, భారతీయ జనతా పార్టీ కూడా యితని విషయంలో వింత ప్రవర్తన... 2004 ఎన్నికలలో అటల్ బిహారీ వాజపేయ్ కి వ్యతిరేకంగా స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన యితనిని, 2010 లో భాజాపా తరుపున రాజ్య సభకు పంపింది యిటువండి వాడిని.

    దక్షణ  భారతంలో బారీ అవినీతి కేసులన్నింటినీ  యితనే వాదిస్తున్నాడన్నమాట..
    • కనిమోళి టీవీ - అక్రమ పెట్టుబడులు (తమిళనాడు)
    • మైనింగ్ కుంభకోణం (కర్నాటక)
    • ఛీటింగ్, అక్రమ పెట్టుబడులు - సాక్షి, సండూర్ ( ఆంధ్రప్రదేశ్)

    నా ఉధేశం ప్రకారం యిటువంటి వారిని బార్ కౌన్సిల్ నుండి బహిష్కరించాలి. ఎందుకంటే, అతను తన క్లైంట్స్‌ని రక్షించుకొనుటకు ఎన్నిసార్లు తప్పుడు వాదనలు, అబద్దాల, కోర్టులను తప్పిదారి పట్టంచి వుండోచ్చు!

    24, ఆగస్టు 2011, బుధవారం

    భిన్నత్వంలో... ఏకత్వం... అంటే యిదే మన... భారతదేశం..

    2 వ్యాఖ్యలు
    ఈ ఫోటో ఎవరు ఎక్కడ తీసారో తెలియదు గాని (బహుశా, మొన్న కృష్ణాష్టమికి బడులలో పెట్టిన వస్త్రాదరణ పోటీలకనుకుంట), ఫేస్‌బుక్ లో బాగా చలామణిలో వున్న ఈ ఫోటో నిజంగా భారతదేశంలో వున్న భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిభింబం...


    ఫేస్‌బుక్ సౌజన్యంతో

    22, ఆగస్టు 2011, సోమవారం

    అవినీతిని నిర్భయంగా సమర్థిస్తానికి మూల కారణాలు...

    12 వ్యాఖ్యలు
    కొతమంది అవినీతి అని తెలిసినా ఎందుకు సమర్ధిస్తున్నారని ఆలోచిస్తే నాకు తట్టిన కొన్ని మూల విషయాలు యివి...

    1. వారి వల్ల ఆర్థిక లభ్ది పొందినవారు.

    2. "పెయిడ్" మేధావి వర్గం (ఉదాహరణ: విలేకర్లు, రాజకీయ విశ్లేషకులు).

    3. కులగజ్జి కలవారు.

    4. వారి వల్ల ఏమైనా భవిష్యత్తులో  రాజకీయంగా/ఆర్థికంగా ఏమైనా వ్యక్తిగత ఉపయోగం వుంటుందేమో అనే ఉద్ధేశం కలవారు.

    5. వ్యక్తి ఆరాధన/మూఢాభిమానం, రాజకీయ అజ్ఞానం (ప్రజాస్వామ్యం పై అవగాహానా రాహిత్యం, రాజరక వ్యవస్థలోని బానిస మనస్థత్వం)
     
    6. వారి అవినీతిలో భాగస్వామ్యులు...

    పై కారణాలతో అవినీతి ని సమర్థిస్తూ  దిగువతెలిపిన సమర్థనలు వినిపిస్తున్నాయి...

    1. సంపాదించుకుంటే తప్పేమిటి, అందరూ సంపాదించుకుంటున్నారుగా?
    2. తెలివితేటలు వున్నయి కాబట్టి సంపాదించుకున్నాడు.. మీకావకాశం లేదు కాబట్టి ఈ ఏడుపు.
    3. పలనావాడి అవినీతి కంటే మావాడిది చాలా చిన్నదనే సరిపెట్టుకోవడం.
    4. వాళ్ళ ఎంత దోపీడీ చేసినా పట్టించుకోరా? కేవలం మావాడిపైనేనా?
    5. యిన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? (అంటే, వారిది అవినీతి అని నమ్మినా, ఎప్పటికీ తనవారికి మినహాయింపు యివ్వాలని ఉద్ధేశం)
    6. యిది రాజకీయ కుట్ర అని ఎదురుదాడి చేయడం


    మీరు జతచేయండి యింకేమయనా వుంటే...

    21, ఆగస్టు 2011, ఆదివారం

    ఎడ్డం.. అంటే.. తెడ్డం.... ఆంధ్ర ప్రజ... అవినీతిని బలపరుస్తూ ఉధ్యమం!

    5 వ్యాఖ్యలు
    2G/కనిమొలి/బోఫోర్స్ వంటి స్కాములతొ విసుగుపోయి, అవినీతికి వ్యతిరేకంగా దేశమంతా ఉధ్యమబాట పడితే, మన ఆంధ్రాలో మాత్రం సిబీఐ దాడులకు నిరసనగా ప్రదర్శనలు, రాజీనామాలు బహిరంగ దోపిడీని బలపరుస్తూ! హవ్వ!

    నాకో పాతవిషయం గుర్తుకోస్తుంది...ఇందిరా గాంధి పెట్టిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో దేశమంతా తుడిచి పెట్టుకొని పోతే, మన ఆంధ్రాలో మాత్రం ఆమెకు/కాంగ్రేసుకు అఖండ విజియాన్ని యిచ్చాము..

    ప్రజలను ఏమీ అనలేము కదా! ప్రజలను ఏమైనా అంటే మనమీద మనం ఉమ్మేసుకున్నట్లే! కాబట్టి... నోరెల్ల బెట్టి చూడలసిందేనా?

    16, ఆగస్టు 2011, మంగళవారం

    తీహార్ చరసాలలో అన్నాహజారేనినీ, కనిమొలినినీ, రాజానీ, కల్మాడీనీ ఈ కాంగ్రేస్ ప్రభుత్వం ఒకే గదిలో పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో!!

    2 వ్యాఖ్యలు

    బ్రదర్ అనిల్‌కుమార్: నీ మహిమతో/ప్రార్ధనతో వైఎస్‌ఆర్ ని ఎందుకు కాపాడుకోలేక పోయావు?

    13 వ్యాఖ్యలు
    నీకు అంత శక్తిని ఆ ప్రభువు ఏసు యిచ్చిన యెడల ఆ రోజు నీవు "కమాండ్" చేసి ఆ మాయదారి వర్షాన్ని ఎందుకు ఆపలేక పోయావు?

    (ఫేస్‌బుక్ సౌజన్యంతో) ఈవీడియో ఫేస్‌బుక్ లో బాగా చలామణిలో వుంది.

    బ్రదర్ అనిల్‌కుమార్! నీ శక్తిని చూస్తుంటే నీ బావమరిది వాదనలో నిజముందనిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డిది సహజమరణం కాదని రెండేళ్ళయినా నెత్తినోరూ కొట్టుకుంటుంటే. కొంపదీసి నువ్వేవర్షాన్ని ఆదేశించావా ఆరోజు వర్షాన్ని పావురాలగుట్టలో కుమ్మేయ్యమని...

    ఫాదర్ అనిల్‌ కుమార్ ఈ విడియోలో చెప్పినవి ( ఆ ప్రభువు అంతటి శక్తిని ఈ బ్రదర్‌కి ధరాదత్తం చేసిన యెడల) నిజమని నమ్మిన యెడల దిగువ తెలిపిన వాటికి (మచ్చుక కొన్ని మాత్రమే) నువ్వే జవాబుదారుడుగా భావించాలి...

    ౧. మామను కావాలనే కాపాడుకోలేకపోయాడు (వర్షాన్ని అపకుండా). వర్షం ఆరోజు కురవకపోతే హెలెకాప్టర్ దుర్ఘటన జరిగేదే కాదు కదా.

    ౨. మామ ప్రయాణిస్తున్న హెలెకాప్టర్‌ మీదకి కావాలనే వర్షం కురవమని ఆదేశించి వుండవచ్చు.

    ౩. రైతుల వర్షాలు లేక్ ఆత్మహత్యలకు కారకుడు (వర్షాలు కురవకుండా ఆజ్ఞాపించి వుండవచ్చు).

    ౪. రైతులు అధిక వర్షాలు/వరదలు వలన ఆత్మహత్యలకు కారకుడు (వర్షాలు అధికంగా కురవమని ఆజ్ఞాపించి వుండవచ్చు).

     ఎవరి దగ్గర ఏమైనా మహిమలు/దైవశక్తి/అతీతశక్తులు వున్నాయని చెప్పుకోనేవారిని జైళ్ళలో పెట్టే రాజ్యాంగ సవరణ చేయ్యాలి. వారు బాబాలైనా, ఫాస్టర్స్ అయినా!

    14, ఆగస్టు 2011, ఆదివారం

    స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న వారందరకీ అభినందనలు...

    6 వ్యాఖ్యలు
    64 సంవత్సరాలు నిండిన స్వతంత్ర భారతంలో రాజకీయ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న వారందరకీ అభినందనలు...
    దేశానికి/ప్రజలందరికీ ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చిందా అనేది నాకు సందేహమే!
    ఇటీవల "కేబుల్స్" లో బయటపడిన విషయాలు చూస్తుంటే, ఎవరు విదేశాంగ మంత్రి, ఎవరు ఆర్ధిక మంత్రో ఆమెరికాతో మంతనాలు చెయ్యకుండా మనపాలకులు వున్నారంటే కనీసం రాజకీయ స్వాతంత్ర్యాన్నీ కోల్పోతున్నమేమోననిపిస్తుంద...

    26, జులై 2011, మంగళవారం

    Fibrication of States: చిన్న రాష్ట్రాలపై వివిధ పార్టీల లోగుట్టు

    98 వ్యాఖ్యలు


    జాతీయ పార్టీలు

    భాజాపా/ఆర్ ఎస్ ఎస్:

    దేశాన్ని 100 రాష్ట్రాలగా విభజించాలని వారి ప్రతిపాదన. భాషాభిమానం/ప్రాంతీయాభిమానం ప్రజలకు పోయి.. అంతా హిందూవులం అనేభావం తో జనాలందరూ ఏకమయి వారికి అధికారం కట్టబెడతారాని వారి అబిప్రాయం. విభజించి పాలించంటంకూడా వీరి ఎత్తుగడే!


    కాంగ్రేస్:

    విభజించి పాలించాలి, ఎక్కువ ముక్కలు చెయ్యాలని వారి అభిప్ర్రాయం. బ్రిటీషర్స్ వీరికి ఆదర్శం. కాకపోతే సీమాంధ్రలో కాంగ్రేస్ కనుమరుగవుతుందోమని భయంతో తెలంగాణ విషయంలో తాత్సారం చేస్తుంది. కేంద్రంలో సీమాంధ్రనాయకుల పలుకుబడీ కొంత కారణం.


    మావోయిస్టులు:

    చిన్న రాష్ట్రాలైతే వారి సాయిధ పోరాటాలకు అడ్డుతక్కువని, ప్రభుత్వాల అరాచకాలను ప్రజలలోకి ఈజిగా తీసుకువెళ్ళవచ్చని వీరి అభిప్రాయం. చిన్నరాష్ట్రాల ద్వారా విప్లవం త్వరగా తేవచ్చని కూడా వీరి అభిప్రాయం.


    సిపిఐ:

    విశాలాంధ్రకు అనుకూలం, భాషాప్రాయిక్త రాష్ట్రాలకే కట్టుబడివుంది, గాని, తెలంగాణ క్యాడర్ ఎదురు తిరగటం చేత తప్పని పరిస్థితిలో ప్రత్యేక తెలంగాణ బాట. దేశంలో మిగిలిన చోట్ల వేర్పాటువాదానికి వ్యతిరేకం.


    సిపియం:

    దేశం మరిన్ని రాష్ట్రాలుగా ముక్కలవడం యిష్టంలేదు.. భాషాప్రాయిక్త రాష్ట్రాలకే కట్టుబడివుంది. గూర్ఖలాండ్ విషయంలోగాని,మరే ఏర్పాటువాదానికైనా వ్యతిరేకం.



    ప్రాంతీయ పార్టీలు

    తెరాసా:

    కేవలం తెలంగాణాలో ఏకఛక్రాధిపత్యంతో అధికారం దక్కించుకోవడమే ఏకైక లక్ష్యం అని నిర్మహమోటంగా వేధికలపై ప్రకటించుకున్న పార్టీ. మరో రామోజీరావులాగ మీడియా మొఘల్, ఇంకో డిఎంకే పార్టీ లాగ కుటుంబపాలనకోసం ఎదురుచూపులు చూస్తున్న పార్టీ.


    విప్లవ పార్టీలు (ఎమ్‌‌ఎల్-న్యూడెమక్రసీ, మొ..):

    చిన్న రాష్ట్రాలపై సరైన అభిప్రాయాలు ఏదీనూ స్పష్టంగా తెలియజేయనప్పటికి, తెలంగాణలో ప్రాంతీయ అసమానతలను అసరగాచూపైనా ప్రజాఊద్యమాలతో ప్రజలను చైతన్యపరిచి కమ్యూనిస్ట్ పార్టిని తెలంగాణాలో బలోపేతం చేయడం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నమ్మకమంలేకపోయినా, తెలంగాణ రాష్ట్రం మాత్రం ప్రజాస్వామ్య పరిథిలో ఏర్పడాలి.


    వామపక్ష మేధావి వర్గంగా చెప్పుకుంటున్న కొంతమంది ఫ్రొఫెసర్లు:

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, అదేదో విప్లవం వచ్చినట్లేనని వీరి ప్రచార ఆర్భాటం. తెలంగాణ వచ్చినా భారత రాజ్యాధికారణ పరిధిలో (ప్రజాస్వాయంలో)పనిచేయాలని తెలిసినా, జనుల సర్వ కష్టాలకు ప్రత్యేక తెలంగానే మందు అనేరీతిలో తెలంగాణాలోని పెట్టుబడీభూస్వామ్య వర్గానికి కొమ్ముకాస్తూ ఉధ్యమాలు చేయడం. పోరాటాల ద్వారా కాకుండా లాబీయింగ్ ద్వారా తెలంగాణ తెస్తామనేవారి చేతిలో పావులు వీరు.


    టీడీపి, లోక్‌సత్తా, మిగతాపార్టీలు:

    స్థిరమైన అభిప్రాయాలేమీ లేవు.. సమయానుకూలంగా మార్చుకుంటారు. వారివారి తాత్కాలిక వ్యక్తిగత లాభనష్టాల భేరీజుపై అభిప్రయాలు మారతాయి.


    సమైఖ్యాంధ్రా నాయకులు:

    కేవలం హైదరాబాదును రక్షించుకొనుటయే ఏకైక లక్ష్యంతో కృత్రిమంగా ఏర్పాటైన ఒక అనూహ్యవేధిక. వున్న ఊళ్ళలో అన్ని అమ్ముకోని హైదరాబాద్లో వ్యపారాలు చేస్తున్నవారు, బడాపారిశ్రామికవేత్తలు, రాజకీయ పెత్తందారీస్వభావగ్రస్థులు ఈ ఉధ్యమానికి దశ, దిశ నిర్ధేశుకులు.


    ఫైన పేర్కన్న నా అభిప్రాయాలన్నీ నిజం కాకపోవచ్చు. వారివారి రహస్య అజెండాలు, వారి అంతర్గత సాహిత్యం చదివుండకపోవచ్చు, కాని సగటు పాఠకుడుగా వివిధ వార్తా సాధనాల ద్వారా నేను సంగ్రహించినది యిదే!

    21, జూన్ 2011, మంగళవారం

    I love you mom...

    0 వ్యాఖ్యలు

    మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి తయారు చేసిన ఆల్బమ్ లోని యిది ఒక పాట. దీనికి సంగీతం, రచన మరియు స్వరం అన్ని మహేష్ యాగాటి (ప్రొఫైల్ కోసం యిక్కడ క్లిక్ చేయండి).
    మీ సలహాలు సూచనలు ఏమైనా వుంటే ఈ 18 సంవత్సరముల కుర్రాడికి యివ్వగలరు.


    4, జూన్ 2011, శనివారం

    వేలకోట్ల కుబేరుడు ఆమరణ దీక్షకు దిగె!

    34 వ్యాఖ్యలు
    అవినీతి, నల్లధనం, ఇంగ్లీషు బోధన, రైతులకు మద్దతు ధరలు... ఇలా ఒకదానితో మరోదానికి పొంతనలేని డిమాండ్లతో వేలకోట్ల కోటీశ్వరుడైన రామ్‌దేవ్‌ బాబా ఆమరణ దీక్ష ప్రారంభమైంది. దీక్షకు మద్దతునివ్వాలని దేశవ్యాప్తంగా ఉన్న తమ శ్రేణులకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశించింది.

    చూస్తుంటే యిదేదో పెద్ద కార్పోరేట్ కుట్రగా వుంది అవినీతిపై పోరాటం అంటే! అవినీతి గురించి మాట్లాడేవారిని చూసి ప్రజలు చీకొట్టే రోజుకోసమ్ వీరి ప్రయాస!

    1, జూన్ 2011, బుధవారం

    విమాన ఇంధన ధరలు తగ్గింపు

    2 వ్యాఖ్యలు
    సామాన్యులు ఉపయోగించే వంట గ్యాస్‌,డీజిల్‌,పెట్రోల్‌ ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారం వేస్తోన్న ప్రభుత్వం, సంపన్నుల కోసం ఉపయోగపడే విమాన ఇంధన ధరలను మాత్రం తగ్గించింది. తీవ్ర నష్టాల్లో ఉన్నామంటూ ప్రభుత్వ రంగరలోని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఒకవైపు పెట్రోల్‌ ధరలను పెంచుతున్నాయి. ముడి చమురు అంతర్జాతీయ ధరలు తగ్గిన కారణంగా విమాన ఇంధన ధరలను నాలుగు శాతం తగ్గిస్తున్నట్లు అవే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గించిన ధరలను మంగళవారం ప్రకటించాయి. ఢిల్లీలో కిలో లీటరు విమాన ఇంధనం ధర రూ.56,466.11గా ఉండగా తగ్గింపు 3.95 శాతం లేదా రూ.2,327.89 గా ఉంది. ఇప్పటివరకు రు.56.46గా వున్న లీటరు విమాన ఇంధనం ధర రు. 54.14కి తగ్గింది. యుపిఎ-2 సర్కారు తీరిదీ!

    18, మే 2011, బుధవారం

    సీట్లు తగ్గినా ఓటింగ్‌ బలం పదిలం

    1 వ్యాఖ్యలు
    శాసనసభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ప్రజలతో మరింతంగా మమేకమవ్వడంపై దృష్టి కేంద్రీకరిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌ పేర్కొన్నారు. బెంగాల్‌ ఎన్నికల ఓటమిపై లోతుగా చర్చించి, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. 34 సంవత్సరాల అవిచ్ఛిన్న పాలన అనంతరం బెంగాల్లో వామపక్షాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్నారు. తన పాలనలో బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం చారిత్రాత్మక ప్రజానుకూల చర్యలను చేపట్టిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పు నినాదానికి అనూకులంగా నిర్ణయాత్మకంగా ఓటు చేశారని వ్యాఖ్యానించారు.

    ఇవి కేవలం భ్రమలుగానే మిగిలిపోతాయి. వారి అభి ప్రాయం తప్పని భవిష్యత్తు నిరూపిస్తుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ బెంగాల్లో వామపక్షాలకు కోటీ 96 లక్షల ఓట్లు లభించాయి. 2009 ఎన్నికల కంటే ఇవి 11 లక్షలు అధికం. వామపక్ష కూటమి 41 శాతానికి పైగా ఓట్లను సాధించింది. 2009 ఎన్నికల అనంతరం చేపట్టిన దిద్దుబాటు చర్యల వల్లే పార్టీ ఓట్లు పెరిగాయి. ఐతే ప్రతిపక్ష కూటమికీ ఈ ఎన్నికల్లో 34 లక్షల ఓట్లు అధికంగా లభించాయి. మార్పు కోరుకున్న ప్రజల మనసులను మేం పూర్తిగా మార్చలేకపోయాం. ప్రజలతో మరింతగా మమేకమై, వారి హక్కుల రక్షణ కోసం సిపిఎం అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తుంది ' అని ఆయన చెప్పారు. ఫలితాలు వెలువడిన రెండ్రోజుల్లోనే రాష్ట్రంలో ముగ్గురు సిపిఎం కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు.