వీలుంటే నా నాలుగు లంకెలు ...

24, జూన్ 2013, సోమవారం

"జ్యోతిష్యం" ఒక శాస్త్రమా? లేక మూఢనమ్మకమా?

1 వ్యాఖ్యలు
ఒకే సమయంలో వందలాది మంది (విమాన, రైలు, బస్సు, వరద ప్రమాదాలలో) చనిపోవడమంటే, చనిపోయినవారి అందరి జాతకాలు ఒకేలాగ తగలడ్డనట్లేనా? వారి వారి ఆ వార ఫలాలు "జ్యోతిష్యం"  లో అ విధంగానే చెప్పబడి/వ్రాయబడి   వుంటాయా? పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారయితే, మంచి చేడు చూసుకోకుండా ప్రయాణాలు చేయరు. మరి ఉత్తారాఖండలో యింత ఘోరం ఎలా జరిగింది? 

ఉదయం లెచినదగ్గర నుండి, టివీ, రేడియో, పత్రికలలో ఒకటే ఊదరదంపు  "జ్యోతిష్యం"/వార ఫలాల కార్యక్రమాలు.. ఈ వారం ఫలానా జాతకం కలవారు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిదని ఉపోద్ఘాతాలు. మరి క్రిత వారఫలాలలో యింత మంది జాతకాలు ఒకేలాగ వున్నాయా? కాని, చనిపోయిన వారందరు వేరు వేరు నక్షత్ర, రాశుల లో జన్మించిన వారై వుండును.  అదేవిధంగా, చనిపోయిన వారిలో పాపులు, పుణ్యులు కూడా వుందురు. మరి అందరి జాతకాలు ఒకేవిధంగా ముగించడం అంటే, "జ్యోతిష్యం"  ఒక మూఢనమ్మకం అని "శాస్త్రం" కానేకాదని ఋజవవుతుంది.

-- వాసవ్య యాగాటి 24.06.2013