వీలుంటే నా నాలుగు లంకెలు ...

4, అక్టోబర్ 2011, మంగళవారం

ఆధునిక అతివాద తెలంగాణ కమ్యూనిస్ట్ సిథ్దాంతం - ప్రపంచ శ్రామికులారా ఏకంకండి! తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

భారతదేశ శ్రామికులేకాక, అమెరికా శ్రామికులైనా, పాకిస్తాన్ శ్రామికులైనా మరేదేశ శ్రామికులైనా, ప్రపంచంలో వున్న శ్రామికులందరూ ఏకమై ఈ భూర్జువా భూస్వామ్యవర్గంపై సాయుధ పోరాటంతో సమసమాజం స్థాపించాలని భారతదేశ అతివాద కమ్యూనిస్ట్‌ల ఒక్కపటి అజెండా!

ప్రపంచ శ్రామికులారా ఏకంకండి!
తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

యిది యిప్పటి ఆధునిక అతివాద తెలంగాణ కమ్యూనిస్ట్ సిథ్దాంతం. పోనీ తెలుగు (తెలంగాణ Vs తెలంగాణేతర) శ్రామికులు తన్నుకు చచ్చినా ఏమైనా విప్లవం వస్తుందా అంటే అదీ కాదు.

* దసరా పూట సెలవులు వచ్చేవి శ్రామికులకా? పరిశ్రామాధిపతులకా? యింత గొడవలు జరుగుతున్న సందర్భంలో పరిశ్రామాధిపతులు రిస్క్ రీసుకొని ప్రయాణాలు పెట్టుకోరు.. వారికి కావలసినప్పుడు సెలవులు తీసుకుంటారు. ఎంతోకాలంగా సెలవలకోసం వేచి చూస్తూ తల్లి తండ్రులదగ్గరకు పండగ వంకతోనైనా చూసి వస్తానికి వీలు చేయడం అంటే నా దృష్టిలో మానవత్వం లోపించడమే అవుతుంది.

* బస్సులపై జన్మస్థలాలకు దసరా సెలవలకు వెళ్ళేవారు బడుగులూ, మధ్య తరగతి జీవులు కాదా? - హైదారాబాద్ నుండి ఖరీదైనా కార్లలోనో, విమానాలలో వెళ్ళే బడా పారిశ్రామికాధిపతులకు ఏటువంటి ఆసౌకర్యం కలిగించనటువంటి ఈ రోకోలు ఎవరిపై ఎవరికోసం?

* నిన్న ఓ టీవీ ఛానల్‌లో C.P.I (ML) & పౌరహక్కుల సంఘం నాయకులు మాట్లాడుతూ, రెండు ప్రాంతాల ప్రజలు కొట్టుకొనేలా ప్రభుత్వమే కుట్రపన్నడంవలన ఈ పరిస్థితి దాపురించిందని వాధించారు. ప్రభుత్వాలు కుట్రపన్నుట సహజం అనుకుందాం. ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని ముందే తెలిసినా ఈ మేధావులకు, రెండు ప్రాంత ప్రజలు కొట్టుకు చావకుండా ఏ ఒక్క ఎత్తుగడైనా వేశారా? లేకపోతే కొట్టుకు చచ్చిన తరువాత ప్రభుత్వమే దీనికి భధ్యత వహించాలని డిమాండ్లు చీటీలో వ్రాసుకొని దాచుకున్నారా? లేక ఎలాగూ పాపం ప్రభుత్వానిదే కదా, ప్రజల మధ్య చిచ్చుతో చలికాగుతాగుతామనా?

* ప్రజలలో వ్యక్తిగత  రాగ ద్వేషాలాను రోజు రోజుకు పెంచుతూ, అమ్మనా బూతులూ తిడుతూ అదే తెలంగాణ సంస్కృతి అంటూ చేసే నాయకుడి తోక పట్టుకోని, తెలంగాణాలొ ఎంతో కొంత తమ క్యాడర్‌ని పెంచుకోవచ్చులే అనే తపనే తప్ప యింకొకటి కాదనిపిస్తుంది. మీడియా మొఘల్ మరియు ఆర్.ఎఫ్.సి అధినేత పై కట్టలు తెచ్చుకోనే ఆవేశంతో పాటలు, అదే తెలంగాణాలో మరో గులాబి మీడియా మొఘల్ పై సాఫ్ట్ కార్నర్!

 
* ఆంథ్రప్రాంత బడా పారిశ్రామికులతో కలిసి వ్యాపారాలు చేస్తున్న తెలంగాణ ప్రాంత బడావ్యాపారుల ఊసే వీరికి అక్కర్లేదు.. ఆంథ్రప్రాంతవాసులందరూ (ప్రజలందరూ) దోపిడీదారులూ / బడా వ్యాపారవేత్తలనే తలతిక్క విమర్శలకు వీరి స్పందన కరువు.. ఎవరైన గట్టిగా అడిగితే పెద్ద్ క్లాస్ పీకుతారు.. పలానా సందర్భంలో మేము ఖండించాము.. ఆంథ్రప్రాంతవాసులందరినీ దోపిడీ దారలనడం ఖండనార్హమని. కానీ బహిరంగంగా తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క సందర్భంలోను లౌడు స్పీకర్లలో చెప్పిన దాఖలాలు లేవు. తన్ని తరమండి, లుంగీలు ఊడపీకమని పిప్లవ సాహిత్య పంథాలో కవులు పులలో రూపంలో రెచ్చగొట్టడం అందరికీ తెలిసినదే...

* దోపిడీ వర్గంపై పోరుమాని, కేవలం తెలంగాణా ప్రాంతంకి ముఖ్యమంత్రి పదివి దక్కితే చాలు (పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో) తెలంగాణా ప్రజల జీవితాలు స్వర్గయుగంలోకి వెళ్ళిపోతాయి అనే భ్రమలు కల్పించడం ఏ సిథాంతం ప్రకారం చేస్తున్నారో అర్థం చేసుకోవడం కష్టమే...

ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి సహజ లక్షణమయిన సాంఘీక అసమానతలను ఆసరాగా, ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంలేక పోయినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకంలేకపోయినా, వర్గపోరు మరిచి వ్యక్తిగత రగద్వేషాలను నూరిపోయిడం (వేరే ప్రాంత బడుగు మధ్య తరగతి జీవులపై కూడా) ద్వారా తెలంగాణ ప్రాంతం క్యాడర్ లో వచ్చు ఈ చైతన్యం వాపే అవుతుంది తప్ప బలుపు కాదని గ్రహిస్తే మంచిది. అంతే కాకుండా ఈ ఉధ్యమం ఏ సిథ్దాంత ప్రాతిపదికన చేసున్నదీ తెలియదు. కేవలం ఆంధ్రప్రాంతం వారిని తన్ని తరిమితే ఉధ్యోగవకాశాలు, అన్ని కష్టాలు తెలంగాణా వారికి తీరిపోతాయి అనే ఊహాజనిత భావంతో ప్రేరేపించి జనులను రచ్చగొట్టడం తప్ప యింకొకటి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణాలోని దోపిడీకి గురవుతున్నవారు వుండరనా వీరి అర్థం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అతివాద కమ్యూనిస్ట్ పార్టీలు మూసుకుంటారా? మళ్ళీ ప్రభుత్వంపై యిప్పుడు చేస్తున్న పోరాటాలు కొనసాగించ మంటారా? క్లారిటిగా ప్రజలకు వివరిస్తే బాగుండు.

ఒక్క తెలంగాణాను భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో అంతర్భాగమైన  ఒక రాష్ట్రంగా చేస్తే పెట్టుబడీ, భూస్వామ్య వ్యవస్థ ఎలా కూలుతుందో!

ప్రత్యేక తెలంగాణా అవసరమా, కదా అనే ఆంశంపై రాసిన వ్యాసం కాదు.. కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం  కోసం అలుపెరగకుండా పోరాడుతున్న కామ్రేడ్ల ఆలోచనా పంథాన్ని అవగహానా కోసం రాస్తున్నది....

103 కామెంట్‌లు:

  1. ప్రభుత్వం చేసే తప్పుల్ని విప్లవకారుల మీదకి నెట్టేస్తున్నారా? The United Andhra movement is no way related to proletariat but the Telangana movement is related to proletariat. So, the proletarian parties like CPI(ML) are upholding Telangana struggle.

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాత10/04/2011 08:26:00 PM

    తెలంగాణ వస్తే లాభపడేది తెలంగాన లోని పాలక వర్గాలూ, పెట్టుబడిదారులే. జూపల్లి కృష్ణా రావు (మై హోం గ్రూప్), జీ. వివేక్ (విశాకా గ్రూప్), మంజీరా గ్రూప్ (ఏదో రేడ్డి గారు) లాంటి అనేక మంది పెట్టుబడిదారులూ, రాజకీయులూ పండుగ చేసుకొంటారు, తమకు పోటీ లేదని.
    తెలంగాణ వాదులు చెప్పేది, "మీ పెట్టుబడి దారుల కంటే మా పెట్టుబడి దారులు మాకు ముద్దు", అని. ఈ వాదం లో ఇంకా ఎంత మార్క్సిజం మిగిలి ఉందో అర్ధం కావటం లా?

    రిప్లయితొలగించండి
  3. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్స్ ధరలు పడిపోతే తెలంగాణా పెట్టుబడిదారులకి నష్టం కాబట్టే కదా దానం నాగేందర్ లాంటివాళ్ళు తెలంగాణాని వ్యతిరేకిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాత10/04/2011 08:40:00 PM

    ప్రవీన్ బాబూ,
    ఆల్రెడీ పడిపోయాయ్. ఇంకా ఏమి పడతాయి? ఈ అనిశ్చితి తొలగితే, తెలంగాణ వచ్చినా ఇంకా పైకి లేస్తాయి. దానం నాగేందర్ ఎప్పుడూ తెలంగాణ ని వ్యతిరేకించెలేదు. ఈ విషయం లో అతను కొంచెం సాఫ్ట్ గా ఉండటానికి కారణం అతని నియోజక వర్గం లో ఆంధ్ర వోటర్లు ఎక్కువగా ఉండటమే.

    రిప్లయితొలగించండి
  5. తెలంగాణా ప్రజలు తంతారనే భయంతోనూ గోడ మీద పిల్లిలా అటు, ఇటు కానట్టు నటిస్తున్నాడు.

    రిప్లయితొలగించండి
  6. అజ్ఞాత10/05/2011 05:11:00 AM

    Andhrudu ...
    తెలంగాణ వస్తే లాభపడేది తెలంగాన లోని పాలక వర్గాలూ, పెట్టుబడిదారులే.
    >>>
    సమైక్యాంధ్ర వల్ల లాభ పడేది ఆంద్ర పెట్టుబడిదార్లూ, రాజకీయ దళారులే.!
    భారత స్వాతంత్రం వల్ల లాభ పడిందీ పెట్టుబడిదారీ, భూస్వామ్య, దోపిడీ వర్గాలే.!!
    నిజాం పాలనలో లాభ పడిందీ పెట్టుబడిదార్లూ, భూస్వాములే,!!!
    ప్ర జలు ఎన్నో త్యాగాలు చేసి, ప్రాణాలు అర్పించి నిజాం పాలనను అంతం చేసిన తర్వాత లాభ పడ్డదీ వాళ్ళే !!!
    ప్రజలు లాభాడేది , లాభ పడింది ఎక్కడ?
    తెలంగాణా ప్రజలకు లభించేది కేవలం స్వాభిమానం, పరపీడన తొలగిందన్న స్వతంత్ర భావన మాత్రమె.
    భారత స్వాతంత్రం వల్ల దేశ సామాన్య ప్రజలకు ఎంత మేలు కలిగిందో
    తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణా ప్రజలకు అంటే మేలు కలుగుతుంది.
    అయినా మా తెలంగాణా మాగ్గావాలే.
    పెట్టుబడి దార్లు, భూస్వాములు ,దోపిడీ దార్లు, అవనీతి పరులు వగైరాల సంగతి దేశవ్యాప్తం గా
    మరో ఉద్యమ ద్వారా తేలుద్దాం.
    Pradeep, Hyderabad

    రిప్లయితొలగించండి
  7. కార్మిక వర్గంతో సంబంధం లేని సమైక్యవాద ఉద్యమాన్ని కార్మిక వర్గంతో ముడి పెట్టడానికి ప్రయత్నించింది CPM మేతావులు. అభివృద్ధి చెందిన జిల్లాగా చెప్పుకుంటున్న పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 80% మంది ప్రజలు ఆధారపడేది వ్యవసాయం మీదే. కేవలం హైదరాబాద్ కోసం సాగుతోన్న సమైక్యవాద ఉద్యమంతో వీళ్ళ బతుకులు ఏమైనా మారుతాయా? పైగా ఈ మేతావుల నాయకుడు బివి రాఘవులు ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు. అది పశ్చిమ గోదావరి కంటే చాలా వెనుకబడిన ప్రాంతం. జిల్లాలో ఉన్న నల్లమల ప్రాంతంలో వ్యవసాయం చెయ్యడం కూడా చాలా కష్టం. నల్లమల ప్రాంతానికి వెళ్ళి మనం హైదరాబాద్ కోసం సమైక్యాంధ్ర ఉద్యమం చేద్దాం అంటే ఆ ప్రాంతంలోని ఒక్క చెంచు గిరిజనుడు కూడా రాడు. నల్లమల సంగతి సరే, మైదాన ప్రాంతాలలో ఉండే ఎరుకలవాళ్ళు, యానాదులు కూడా ఆ ఉద్యమంలో పని చెయ్యడానికి ముందుకి రారు. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమం డబ్బున్నవాళ్ళు హైదరాబాద్‌లో తమ ఆస్తులు కాపాడుకోవడానికి చేస్తున్న ఉద్యమం కానీ ప్రజా బాహుళ్య ఉద్యమం కాదు. ఈ ఉద్యమాన్ని కీర్తించే బివి రాఘవులు కార్మిక వర్గ పార్టీ నాయకుడట!

    రిప్లయితొలగించండి
  8. అజ్ఞాత10/05/2011 08:27:00 AM

    మార్కిజం గొప్పదో మార్తాండిజం గొప్పదో, చావోరేవో, ఈరోజుతో తేలిపోవాలి.

    రిప్లయితొలగించండి
  9. మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!!.. నీ
    మా ఊరంటే బస్సే గుర్తొస్తుంది..!

    చదువుకోటానికి నానా అగచాట్లు పడేప్పుడు
    ఫ్రీ-పాసులిచ్చి పదికిలోమీటర్లు పట్టుకెళ్ళి,
    అక్షరాలు నేర్పిన "అదే"గుర్తొస్తుంది.

    పొలంలో కోటేరుని,
    కొణిజర్లలో స్మసానం లో తగలబడుతున్న శవాన్ని..
    ఒళ్ళోకూర్చోబెట్టుకుని కళ్ళారా చూపిచ్చిన బస్సు గుర్తొస్తుంది.!
    కిటికీకి గడ్డం ఆనిచ్చిన చిన్నతనం,
    సీటెనుక పదేళ్ళప్పుడు రాసిన కవిత్వం గుర్తొస్తుంది.!

    బస్సంటే నన్ను చంకనెత్తుకున్న్న అవ్వ,
    బస్సంటే నావరకు గోరుముద్దలు తినిపించిన అమ్మ!

    మా ఊరి మోటుజనపు నేలవిమానం బస్సు

    ఎవడో చుట్టంగాడి పెళ్ళికి అందరూ..
    చిన్నకార్లలొ,మోటారుసైకిల్లలో వస్తే..
    మా గరీబు నాన్న ఎక్కించిన ఎర్రబస్సు గొప్పగా గుర్తొస్తంది !

    ఎదో పనిమీదెళ్తే..
    దిల్-సుఖ్-నగర్ రోడ్డుమీద మా బస్సు కనిపిస్తే
    ఎదురెళ్ళి ముఖం మీద ముద్దుపెట్టుకోబుద్దయ్యేది,
    ఒక పాత స్నేహితుణ్ణి చూసినట్టో..
    ఏదో విషాదం గుండె అడుగునుంచి కారుతున్నట్టొ వుండేది!

    * * *
    ఎవడో చదువుకున్నోడట బస్సుని రాళ్ళతో బద్దలు కొడుతున్నాడు!
    కసాయిలా కిరసనాయులు పోసి కాల్చేస్తునాడు!
    ఎవడొ.. దయామయి బస్సుని ధ్వంసం చేస్తున్నాడు!

    ఇప్పుడెందుకో బస్సుకి గొంతుంటే బాగుండనిపిస్తుంది నాకు!

    మావూరి మట్టిరోడ్డుమీద బస్సుపోతున్నట్లు
    నా ముఖం మీద కన్నీళ్ళు పోతున్నాయి

    తగలబడుతున్న బస్సుల మధ్య కూలబడి
    విజ్ఞానులనే అజ్ఞానుల ఉన్మాదాన్ని వార్తలు చేసుకుంటున్నా..,

    అయినా సరె..
    కారుతున్న నా కన్నీళ్ళని సీసాలో పట్టుంచా..
    తిలక్ ఓసారి ఇలావచ్చి తగలబడుతున్న బస్సుమీద పోసెళ్ళు..

    ఇంతకుముండె..
    మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!!

    ...... నీ

    (నకిరేకల్ వద్ద బస్ లపై రాళ్లు విసిరి అద్దాలు పగులకొట్టి , హైదరాబాద్ లో బస్సులను తగలబెడుతున్న విద్యార్ధి ఉద్యమకారులకి, మేధావులకి.. ఉద్యమస్పూర్తితో...అంకితం)

    రిప్లయితొలగించండి
  10. తెలంగాణా కోటి రతనాల వీణ అయితే సమైక్యాంధ్ర కోటి అబద్దాల మూట. ఈ రెండు లింక్‌లు చదవండి:
    http://kotiratanalu.blogspot.com/2011/10/2.html
    http://visalandhra.blogspot.com/2011/10/blog-post_3727.html
    ఈ రెండు లింక్‌లూ చదవండి. ఎవరు అబద్దాలకోర్లో అర్థమవుతుంది.

    రిప్లయితొలగించండి
  11. "గ్లోబలైజేషన్ వల్ల కార్పొరేట్ పెట్టుబడిదారులు లాభపడ్డారు కానీ చిన్న తరహా పెట్టుబడిదారులు నష్టపోయారు. కనుక చిన్న తరహా పెట్టుబడిదారులని లేకుండా చెయ్యడానికి గ్లోబలైజేషన్ అవసరమే" అని అన్నాడట ఒక మేతావి. తెలంగాణా ఉద్యమం తెలంగాణా పెట్టుబడిదారుల ఉద్యమం కనుక తెలంగాణా పెట్టుబడిదారులకి వ్యతిరేకంగా ఆంధ్ర పెట్టుబడిదారుల ఉద్యమమైన సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కొందరు మేతావులు అడ్వొకేట్ చెయ్యడం అలాగే ఉంది.

    రిప్లయితొలగించండి
  12. అజ్ఞాత10/05/2011 10:45:00 AM

    బాగా గడ్డి పెట్టారు 'మేతా'వులకి.

    రిప్లయితొలగించండి
  13. అజ్ఞాత10/05/2011 10:48:00 AM

    పశ్చిమ బెంగాల్‌లో CPMకి వ్యతిరేకంగా మమతా బెనర్జీతో చేతులు కలిపారంటూ మావోయిస్టులని విమర్శించిన మేతావులే ఇక్కడ తెలంగాణా పెట్టుబడిదారులకి వ్యతిరేకంగా సీమాంధ్ర పెట్టుబడిదారులతో చేతులు కలుపుతున్నారు.

    రిప్లయితొలగించండి
  14. అజ్ఞాత10/05/2011 11:10:00 AM

    There may be a few crony capitalists in the T-movement. This does not reduce the movement's strength.

    The phony united AP crap, on the other hand, is totally run by andhra plutocrats.

    రిప్లయితొలగించండి
  15. మన రాష్ట్రంలోనే ఐదేళ్ళకొక పార్టీతో పొత్తు పెట్టుకునే CPM తెలంగాణావాదులని విమర్శించడం గురువింద గింజ నీతి కాదా?

    రిప్లయితొలగించండి
  16. అజ్ఞాత10/05/2011 11:35:00 AM

    పవీణూ,
    వాసవ్య గారు రాసినదానికి నువ్వు చెప్పేదానికేమైనా సంబంధం వుందా? అతను అడిగిన ప్రశ్నలకి జవ్వబు చెప్పు ముందు నీదగ్గర సమాధానం వుంటే..
    అయినా సరేగానీ నీ బుర్రని ఎక్కువగా వాడుతున్నావు ఈ మధ్య...మెదడు మోకాళ్ళలోంచి అరికాళ్ళలోకి జారుకుంటది జర జాగ్రత్త!

    రిప్లయితొలగించండి
  17. వాసవ్య చెప్పేదేమిటి? మేము తెలంగాణా పెట్టుబడిదారులని uphold చేస్తున్నామనే కదా. అంటే CPM వాళ్ళు ఆంధ్ర పెట్టుబడిదారులని uphold చేస్తున్నారనా?

    రిప్లయితొలగించండి
  18. అజ్ఞాత10/05/2011 11:49:00 AM

    పవీణు.. దీనికేమంటావు??
    "ఒక్క తెలంగాణాను భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో అంతర్భాగమైన ఒక రాష్ట్రంగా చేస్తే పెట్టుబడీ, భూస్వామ్య వ్యవస్థ ఎలా కూలుతుందో!"

    రిప్లయితొలగించండి
  19. అజ్ఞాత10/05/2011 11:51:00 AM

    "ఈ మేధావి వర్గం, రెండు ప్రాంత ప్రజలు కొట్టుకు చావకుండా ఏ ఒక్క ఎత్తుగడైనా వేశారా? లేకపోతే కొట్టుకు చచ్చిన తరువాత ప్రభుత్వమే దీనికి భధ్యత వహించాలని డిమాండ్లు చీటీలో వ్రాసుకొని దాచుకున్నారా?"

    బాగాచెప్పారు...

    రిప్లయితొలగించండి
  20. తెలంగాణా వస్తే ఇండియాలో భూస్వామ్య వ్యవస్థ కూలుతుందని ఎవరూ అనలేదు నాయనా. తెలంగాణా వస్తే సీమాంధ్ర భూస్వాములకి నష్టం అని మాత్రమే అన్నాము.

    రిప్లయితొలగించండి
  21. ఉదయం పది గంటలకి కరెంటొచ్చిన తరువాత కంప్యూటర్ ఆన్ చేసి చూస్తే అటు ఇచ్చంపల్లి విషయంలో విశాలంధ మోసగాళ్ళ సభ కామెడీ, ఇటు సమైక్యాంధ్ర ఉద్యమం కార్మికవర్గ ఉద్యమమని నమ్మించే phoney proletarian party ప్రతినిధి కామెడీ. నవ్వుకోలేక చచ్చాను. స్వయంగా మార్క్సిస్ట్‌నైన నాకు సమైక్యవాద ఉద్యమాన్ని మార్క్సిజానికి అన్వయించేవాళ్ళని చూస్తోంటే కడుపు పట్టుకుని వదల్లేనంత నవ్వొస్తోంది.

    రిప్లయితొలగించండి
  22. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి నాయనా. తెలంగాణా నిజంగా రాదనుకుని తెలంగాణా ఇస్తామని చెప్పి ప్రజలని గొఱ్ఱెలని చేసి ఇప్పుడు తమకేమీ తెలియదన్నట్టు నటిస్తోంది కదా ప్రభుత్వం.

    రిప్లయితొలగించండి
  23. అజ్ఞాత10/05/2011 12:24:00 PM

    తెలంగాణా గొర్రెలు బతికితేనే సమైక్యవాద కసాయిలకి రోజూ కడుపు నిండా బుక్కే పండగ.

    రిప్లయితొలగించండి
  24. ఒకవేళ సమైక్యాంధ్ర ఉద్యమం కార్మికుల భాగస్వామ్యం ఉన్న ఉద్యమమైతే కాకినాడ ఫెర్టిలైజర్ ప్లాంట్‌కి వెళ్ళి అక్కడి కార్మికుల చేత జై సమైక్యాంధ్ర అనిపించండి. అనిపించలేరు. ఎందుకంటే సమైక్యాంధ్రలో కోస్తా ఆంధ్ర కార్మికులకైనా ఒరిగేది ఏమీ ఉండదు.

    రిప్లయితొలగించండి
  25. అజ్ఞాత10/05/2011 01:23:00 PM

    వాళ్ళకు నష్టమైతే నీకేంటి లాభం? తెలిసీ చెప్పకపోయావో నీ తల వేయి వక్కలవుతుంది.

    రిప్లయితొలగించండి
  26. అజ్ఞాత10/05/2011 01:25:00 PM

    నీకు పెళ్ళైతేగాని తిక్క కుదరదు. తిక్క కుదిరితేగాని పిల్లనివ్వరు, ఎట్లాగబ్బా?

    రిప్లయితొలగించండి
  27. అజ్ఞాత10/05/2011 01:28:00 PM

    తెలంగాణ వస్తే లాభపడేది తెలంగాన లోని పాలక వర్గాలూ, పెట్టుబడిదారులే.
    >>>
    సమైక్యాంధ్ర వల్ల లాభ పడేది ఆంద్ర పెట్టుబడిదార్లూ, రాజకీయ దళారులే.!
    భారత స్వాతంత్రం వల్ల లాభ పడిందీ పెట్టుబడిదారీ, భూస్వామ్య, దోపిడీ వర్గాలే.!!
    నిజాం పాలనలో లాభ పడిందీ పెట్టుబడిదార్లూ, భూస్వాములే,!!!
    ప్ర జలు ఎన్నో త్యాగాలు చేసి, ప్రాణాలు అర్పించి నిజాం పాలనను అంతం చేసిన తర్వాత లాభ పడ్డదీ వాళ్ళే !!!
    ప్రజలు లాభాడేది , లాభ పడింది ఎక్కడ?
    తెలంగాణా ప్రజలకు లభించేది కేవలం స్వాభిమానం, పరపీడన తొలగిందన్న స్వతంత్ర భావన మాత్రమె.
    భారత స్వాతంత్రం వల్ల దేశ సామాన్య ప్రజలకు ఎంత మేలు కలిగిందో
    తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణా ప్రజలకు అంటే మేలు కలుగుతుంది.
    అయినా మా తెలంగాణా మాగ్గావాలే.
    పెట్టుబడి దార్లు, భూస్వాములు ,దోపిడీ దార్లు, అవనీతి పరులు వగైరాల సంగతి దేశవ్యాప్తం గా
    మరో ఉద్యమ ద్వారా తేలుద్దాం.

    రిప్లయితొలగించండి
  28. అజ్ఞాత10/05/2011 01:30:00 PM

    కడుపు పట్టుకుని నవ్వి నవ్వి సచ్చిపోతావేమో. అపుడు బ్లాగుల్లో పిచ్చపిచ్చగా వాగేవారుండరని నాకు దిగులుగా వుంది.

    రిప్లయితొలగించండి
  29. అజ్ఞాత10/05/2011 01:33:00 PM

    ఎవడ్రా తెలంగాణావాళ్ళని గొర్రెలని అన్నది?

    రిప్లయితొలగించండి
  30. తెలంగాణా ప్రజలు గొఱ్ఱెలు కాబట్టే కదా ఆంధ్రా కసాయీలు ఇంత కాలం వాళ్ళని బలిపశువుల్ని చేస్తూ ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  31. వాసవ్య గారు,
    మీరు కామెంట్ల తో సహా మళ్ళీ రీపోస్ట్ ఎలా చేయగలుగుతున్నారు? ఆ రహస్యం కాస్త చెప్తారా?

    రిప్లయితొలగించండి
  32. Good catch Bondapati garu...
    No one identified this repetitive publishing...

    That is a small bug/hack I found in blogger... Using that technique I able to do that.. I don't want to reveal that now...

    రిప్లయితొలగించండి
  33. కార్మికవర్గానికి ఏ రకంగానూ ఉపయుక్తం కాని సమైక్యవాద ఉద్యమాన్ని uphold చెయ్యడంతో పాటు అరిగిపోయిన రికార్డ్‌లా తిరిగి ఆ పాటనే తిప్పడం! చిన్నప్పుడు విన్న ఉత్తరాంధ్ర సామెత గుర్తొస్తోంది "పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి" అని. వీరఘట్టం మండలం కత్తుల కవిటి గ్రామంలో దాసరి కులానికి చెందిన పది కుటుంబాలు ఉన్నాయి. అదే మండలంలో మా అమ్మమ్మ గారు ఉండే వండువ గ్రామానికి దాసరివాళ్ళు వచ్చి పాడిన పాత పాటలే పాడేవాళ్ళు. దాంతో ఆ ఊర్లో ఓ సామెత బాగా వెలిగింది "పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి" అని. CPMవాళ్ళు సమైక్యవాదాన్ని కార్మికవర్గంతో ముడిపెట్టడం, దాన్నే దాసరి పాటలా పాడడం చూస్తోంటే నవ్వొస్తోంది. ఒక అబద్దాన్ని ఒకసారి లేదా రెండు సార్లు చెపితే ఫర్వా లేదు కానీ దాసరి పాటలాగ పదిసార్లు చెపితే అదోలా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  34. ప్రవీణ్, నా సహనం నశించేటట్లు చేస్తున్నావు నీ పనికిమాలిన వాదనలతో...
    @ "తెలంగాణా కోటి రతనాల వీణ అయితే సమైక్యాంధ్ర కోటి అబద్దాల మూట"
    >> "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్" అనేది ఎవరైనా ఒప్పుకోవలసినదే. అదేవిధంగా తెలంగాణా అయినా, సమైక్యాంధ్ర అయినా మనుషులే. అంటే నీదృష్టిలో సమైక్యాంధ్రలో వున్న వారందరూ అబద్దాలకోరులా? నువ్వు మార్కిస్టువా? పిండాకూడేమీకాదు? ఒక ప్రాంతంలో వున్న దోపిడీ దారులను, దోపిడీకి గురువతున్నవారినందరిని ఒకే ఘాటునకట్టడం అంటే నీ కంటూ ఒక సిథ్దాంత ఏమిలేదనిపిస్తుంది. నువ్వు నమ్మే సిధాంతాలను ఖంటస్తం చేయకుండా దానిలో వున్న అర్థాలను తెలుసుకొనుటకు ప్రయత్నించు.
    నీకు అర్థమయ్యేటట్లు నీ స్థాయిలో చెప్పాలంటే, "మా అమ్మ, నాన్నలిద్దరూ సమైక్యాంధ్రులైనా పవిత్రులే" మరి మిగతాది నువ్వే తేల్చుకో...

    @ "మార్కిజం గొప్పదో మార్తాండిజం గొప్పదో, చావోరేవో, ఈరోజుతో తేలిపోవాలి"
    >> నీ లాంటి తలతిక్క వాదనలతో "మార్కిజం" అంటేనే బూతు పదంగా నెట్‌జనులు భ్రమించే అవకాశం మొండుగా వున్నాయి. అతనెవరో గాని " మార్తాండిజం" అని కొత్తగా నీవాదనలకి పేరు కూడా పెట్టాడు నీ వాదంతో మార్కిజానికి సంబంధం లేదని. బతికించాడు.
    నేను మార్కిస్టుని, విప్లవకార్లుల గుండెచప్పుడివి అని దయచేసి చెప్పుకోకు ఎబ్బెట్టుగా వుంటుంది.. నువ్వు వారికి కొరియర్‌‌గానో సానుభూతిపరుడుగా చెప్పుకో బాగుంటుంది.

    @ "కార్మిక వర్గంతో సంబంధం లేని సమైక్యవాద ఉద్యమాన్ని కార్మిక వర్గంతో ముడి పెట్టడానికి ప్రయత్నించింది CPM మేతావులు."
    >> నేను వ్రాసినది దేనిమీద, తెలంగాణా అంశంపై అతివాద కమ్యూనిస్ట్ సిథ్దాంతాన్ని ప్రశ్నించా.. ఆ విషయంపై నీకు దానిపై ఎలా సమర్థించుకోవాలో తెలియక తికమక పడి CPM పై ఏడుపుగొట్టు రాద్దాంతం తప్ప నీ వాదనలో యింతైనా విషయం కనబడదు.. "నవ్వువస్తుందంటావు, కడుపు పగిలిపోతుందంటావు" యంకేవో అంటావు.. ఈ వెకిలి రాతలు దేనికి? పెనాయిలేమైన తాగవా? ఏమైనా చేతనైతే నేను అంశాలవారీగా (బుల్లెట్ రూపంలో) కొన్ని ప్రశ్నలు సంధించాను.. వాటిపై అంశాల వారీగా వివరించి విమర్శించు. అలాచేస్తేనే నువ్వు అనుకుంటున్న లక్ష్యం నెరవేరుతుంది.. అలాగకాక నీ వెకిలి రాతలతో "మార్కిజం", "విప్లవకారుల" పరువుతీయ్యొద్దు. యిది నా రెక్వెస్ట్ ఒక వామపక్షవాదిగా!

    @ "వాసవ్య చెప్పేదేమిటి? మేము తెలంగాణా పెట్టుబడిదారులని uphold చేస్తున్నామనే కదా. అంటే CPM వాళ్ళు ఆంధ్ర పెట్టుబడిదారులని uphold చేస్తున్నారనా? "
    >> CPM వాళ్ళు ఆంధ్ర పెట్టుబడిదారులకు అనుకూలంగా చేసిన ఒక్కటంటే ఒక్క ఉధ్యమం సాక్ష్యాలతో చూపు.. నేను ఏ మీడియాలోనూ చూడలా... గాలి కబుర్లు ఆపు...

    @ "మన రాష్ట్రంలోనే ఐదేళ్ళకొక పార్టీతో పొత్తు పెట్టుకునే CPM తెలంగాణావాదులని విమర్శించడం గురువింద గింజ నీతి కాదా?"
    >> టపాతో సంబంధం లేనటువంటి విషయలపై రాతలు రాయడంలో బ్లాగులలో నేను గమనిస్తున్న నాల్గైదు సంవత్సరాలలో నీకు సరిసాటి ఎవరూ రారు. నేను CPM రెప్రజెంటునని నీకెప్పుడైనా చెప్పానా? CPM బలపరుస్తున్న భాషాప్రాయిక్త రాష్ట్రాల సిథ్దాంతాలకు ఈ టపా వేదిక కాదుకదా!

    రిప్లయితొలగించండి
  35. అజ్ఞాత10/06/2011 11:04:00 AM

    Claps, Claps Vasavya. You nailed him. But he won't leave, he is paid by TRS goons.

    రిప్లయితొలగించండి
  36. కార్మికవర్గంతో సంబంధం లేని సమైక్యవాద ఉద్యమాన్ని uphold చేసేవాళ్ళు నాకు శ్రీరంగ నీతులు చెప్పేది. నేను తెలుగు బ్లాగుల్లోకి వచ్చింది నాలుగేళ్ళ క్రితం కాదు, మూడేళ్ళ క్రితం వచ్చాను. అంతకు ముందు నేను ఇంగ్లిష్ బ్లాగులలో వ్రాసినవి చదవొచ్చు. ఇంగ్లిష్ బ్లాగోస్ఫియర్‌తో బాగా టచ్ ఉన్న కెనడా దేశస్తురాలు మండవ స్వప్నని అడగండి. ఆమె నా గురించి బాగా చెపుతుంది. Her father is leader of CPIM in Vizag. But she is the fan of CPI(Maoist).

    రిప్లయితొలగించండి
  37. Her mail address is swapna49@gmail.com She works in Toronto for a company that develops firmware for cell phones. You can contact her and learn more about me.

    రిప్లయితొలగించండి
  38. అజ్ఞాత10/06/2011 11:38:00 AM

    ఫినాయిల్ తాగేవాడికి మీసాలు ఎగబట్టే వారొకరు అన్నట్టు, నీగురించి ఇంకొక మార్తాండిని అడగాలా పెవీనూ? నిన్ను చూస్తున్నం అది చాలాదూ? ఇంకో కొరివితో తల గోక్కోవాలా?

    రిప్లయితొలగించండి
  39. మళ్ళీ అదే తింగరి సమాధానం.. న్రాసింది సరిగ్గా చదివడం గాని, అర్థం చేసుకోవడం గాని లేదు..
    "బ్లాగులలో నేను గమనిస్తున్న నాల్గైదు సంవత్సరాలలో" అంటే నేను బ్లాగుల్లో గమనిస్తున్న కాలం అని వస్తుంది. . నేను చూసిన కాలంలో అయితే నువ్వే నెం.1 సంబంధంలేని విషయాలు బ్లాగులలో డంపు చేయడంలో...
    నువ్వు ఎప్పుడు నుండి బ్లాగులు రాసావో ఎవడకి కావాలి? మళ్ళీ దానికో రెఫరెన్స్ ఈమెయిల్ అడ్రస్ ఒకటి! ఎందుకు పాపం ఆమె ఎక్కడో ఉధ్యోగం చేసుకుంటున్నామిని నీ ఉచ్చులోకి లాగుతావు?

    పనికిమాలిన లాజిక్కులు తియ్యొద్దు, నేను ఎవరినో uphold చేస్తున్నాని నీ ఊహాజనిత ఆలోచనలు అనవసరం... నా ప్రశ్నలకి సూటిగా ఏమైనా సమాధానాలు వుంటే చెప్పు.. లేకపోతే పిల్లిలా జారుకో....

    రిప్లయితొలగించండి
  40. అజ్ఞాత10/06/2011 12:28:00 PM

    it's too baaaad! మూడేళ్ళనుండి పవీనన్నకి బ్గాగులలో చిందులేస్తున్నా యింకా మెచ్యూరిటీ రాలా!

    రిప్లయితొలగించండి
  41. మీరు సమైక్యవాది అయితే సమైక్యవాది అనే చెప్పుకోండి. కార్మికవర్గంతో సంబంధం లేని సమైక్యవాదాన్ని uphold చెయ్యడానికి కార్మికవర్గ తత్వశాస్త్రం పేరు చెప్పుకోవద్దు.

    రిప్లయితొలగించండి
  42. మీరు కేవలం సమైక్యవాదిగా ఈ టపా వ్రాసి ఉంటే నాకు పెద్ద ఇష్యూ ఉండేది కాదు. కార్మికవర్గంతో సంబంధం లేని సమైక్యవాదానికి సంబంధం ఉన్నట్టు చూపించాలనుకున్నారే. అదే ఇక్కడి ఇష్యూ.

    రిప్లయితొలగించండి
  43. ఒకసారి చెబితే నీకు అర్థమవ్వదా? నేను సమైక్యాంధ్రవాదినో, ఫాసిస్టువాదినో యిక్కడ అప్రస్తుతం... కార్మికవర్గ తత్వశాస్త్రం ఆధారంగా "ఆధునిక అతివాద తెలంగాణ కమ్యూనిస్ట్ సిథ్దాంతం - ప్రపంచ శ్రామికులారా ఏకంకండి! తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!" నా వాదాన్ని విశ్లేషించు/విమర్శించు..
    డొంకతిరుగుడు వద్దు... యింకో చాన్సిచ్చా... కావలంటే పిల్లిలా యిక్కడనుండి జా(పా)రిపో....

    రిప్లయితొలగించండి
  44. తెలంగాణావాదాన్ని uphold చేసిన కార్మికవర్గ విప్లవకారులు తాము తెలంగాణా పెట్టుబడిదారులని నమ్ముతున్నట్టు చెప్పుకోలేదే. కోస్తా ఆంధ్ర కార్మికులకి కూడా సమైక్యవాదంతో సంబంధం లేదు. తెలంగాణావాదులు చెప్పనివి చెప్పినట్టు వ్రాసినది మీరు కాదా?

    రిప్లయితొలగించండి
  45. చెప్పనివి చెప్పినట్టు వ్రాస్తే అర్థం చేసుకోవడం సాధ్యమా? తెలంగాణా కార్మికులు కోస్తా ఆంధ్ర కార్మికులని తన్నాలని ఏ విప్లవ పార్టీ ప్రబోధించింది?

    రిప్లయితొలగించండి
  46. మరి రాజకీయ ఐకాస ఈ మధ్య ఢీల్లీ వెళ్ళింది? పోరాటాల ద్వారా తెలంగాణ సాధించకుండా లాబీయింగు కోసం వెళ్ళింది? ఢీల్లీ నాయకులతో కెసిఆర్ కి సెట్లిమెంటు కుదుర్చుతానికేనా?

    రిప్లయితొలగించండి
  47. ఢిల్లీకి వెళ్ళడం, లాబీయింగ్ లాంటి వాటి గురించి నేను మాట్లాడదలచుకోలేదు. తెలంగాణాలో ఉన్న కార్మికవర్గ విప్లవకారులు ఎన్నడూ కోస్తా ఆంధ్ర కార్మికులని తన్నాలని అనలేదు. మీరు వేరే అర్థాలు తీసి మాట్లాడితే నేను అడ్డు చెప్పాను కానీ కెసి‌ఆఋ & కోదండరాంలు ఎవరెవరితో లాబీయింగ్ చేశారు అనేది నేను ఇక్కడ చర్చించదలచుకోలేదు.

    రిప్లయితొలగించండి
  48. నువ్వు హైదరాబాద్‌లో వుంటే తెలుస్తుంది. ఆంథ్రప్రాంత ప్రజలను (కార్మిక వర్గమా/ పెట్టుబడిదారులా అనేది అనవసరం) "ఛ్చీ..ఛ్చీ.. ఆంథ్రావాడా పో" లాంటి ప్రాంతీయ విద్వేషాలు రగిల్చే పాటలు "రాజకీయ ఐకాస" టెంట్లనుండి రోజు ప్రతెధ్వనిస్తునే వున్నయి మాకు...
    రాజకీయ ఐకాసా లో అతివాద కమ్యూనిస్ట్ పార్టీలు వున్నయి కదా... మరి యిప్పుడేమంటావు...

    రిప్లయితొలగించండి
  49. నేను హైదరాబాద్‌లో లేకపోవచ్చు కానీ నేను హైదరాబాద్‌లో తరచు సందర్శించే BHEL, లింగంపల్లి ప్రాంతాలలో ఎక్కడా అలాంటి ధ్వనులు వినలేదు. మా బాబాయి గారు ఉండేది BHEL దగ్గరే. ఒకవేళ తెలంగాణాలో ఆంధ్రులపై దాడులు జరిగితే మావాళ్ళకి నష్టమే. ప్రాంతీయ ఘర్షణలు సృష్టించే potence సమైక్యవాదులకి ఉంటుంది కానీ తెలంగాణావాదులకి ఉండదు.

    రిప్లయితొలగించండి
  50. Don't act so smart...
    యిప్పుడొచ్చినా నీకు చూపుతా దగ్గరుండి.. కూకట్పల్లి నుండి లింగపల్లి వరకు ప్రతీ సెంటర్ లో రాజకీయ ఐకాసా టెంట్లనుండి రాగ విద్వేషాలు చిమ్మే పాటలు... యింక తెలంగాణ పల్లెల్లో చెప్పనక్కర్లేని పరిస్థితి...

    రిప్లయితొలగించండి
  51. నేను లింగంపల్లి వెళ్ళేది ట్రైన్ మీదే కానీ లింగంపల్లి స్టేషన్ నుంచి మా బాబాయి గారు ఉండే అపార్ట్మెంట్ల వరకు వెళ్ళేది ఆటోలో. ఆటో దారిలో నాకు ఎక్కడా ఆ పాటలు వినిపించలేదు.

    రిప్లయితొలగించండి
  52. అంతెదుకు నీ వ్యాక్యమే తీసుకుందాం "తెలంగాణా కోటి రతనాల వీణ అయితే సమైక్యాంధ్ర కోటి అబద్దాల మూట."
    పై వాక్యంలో తెలంగాణా అంటే శ్రామికులని గాని, సమైక్యాంధ్ర అంటే పెట్టుబడీదారులని గానీ కాదుకాదా?
    మొత్తం సమైక్యాంధ్ర ప్రజానీకాన్నీ అభద్దాలకోరుగా వర్ణించడం ఆంటే ఏమిటి.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగోట్టడం ద్వారా తెలంగాణా ప్రజలలో చైతన్యవంతులను చేయడమే ఎత్తుగడగా కనబడుతుంది నాకు...

    రిప్లయితొలగించండి
  53. అంటే నేను ఉండేది కోస్తా ఆంధ్రలో కనుక నేనూ అబద్దాలకోరునే అనే అర్థంతో మాట్లాడానా? ఎవడైనా తాను అబద్దాలకోరుని అని చెప్పుకుంటాడా?

    రిప్లయితొలగించండి
  54. తెలుగు చదవడం వచ్చిన వాడికి ఎవరికైనా దానర్థం అదే.... అయితే పై వ్యాక్యలో నీ భాషలో అర్థం చెప్పు..

    రిప్లయితొలగించండి
  55. అజ్ఞాత10/06/2011 02:06:00 PM

    గట్టివాడివే, మొత్తానికి ఈయన్ని మాటల్లోకి పెట్టోవోయ్ మార్తాండం. మెల్లిగా ఈయన్ని మార్తాండిస్ట్‌గా మార్చేయ్.

    రిప్లయితొలగించండి
  56. Thanks for understanding in your language. దొంగ నోటు అంటే నకిలీ కరెన్సీ అనీ అర్థం వస్తుంది, దొంగ వ్రాసిన ప్రామిసరీ నోటు అనీ అర్థం వస్తుంది. కాంటెక్స్ట్‌ని బట్టే ఎవరైనా అర్థం చేసుకుంటారు.

    రిప్లయితొలగించండి
  57. http://telanganasolidarity.in కోస్తా ఆంధ్రలో ఉన్నా తెలంగాణాకి నేను నా సహాయం చేస్తాను.

    రిప్లయితొలగించండి
  58. "తెలంగాణా కోటి రతనాల వీణ అయితే సమైక్యాంధ్ర కోటి అబద్దాల మూట." దీనికి అర్థంచెప్పు ముందు కాకమ్మ కథలు రతువాత వింటాము..

    రిప్లయితొలగించండి
  59. నిగూడార్థం లేకపోయినా నిగూఢార్థం తీసే తెలివి ఉంది కదా మీకు. కనుక నేను చెప్పడానికి ఏమీ ఉండదు.

    రిప్లయితొలగించండి
  60. ఎవరో ఫేస్‌బుక్‌లో ఈ టపా యొక్క లింక్ పెట్టారు. ఈ టపా చదివి ఖమ్మం నుంచి నాకు ఒకాయన ఫోన్ చేశారు. వాసవ్య గారికి బాగా సమాధానం చెప్పారు అని అన్నారు. అతను నా ఫేస్‌బుక్ ప్రొఫైల్ అడిగారు. నేను ఫేస్‌బుక్ రెగ్యులర్‌గా చదవడం లేదు, గూగుల్ ప్లస్‌లోనే ఉంటాను అని చెప్పాను.
    ఆయన నా అడ్రెస్‌కి పంపిన మెయిల్ ఇది. http://vizaghost.net/images/vcs_mail.png

    రిప్లయితొలగించండి
  61. నువ్వు ఎట్లాగు నేను లేవనెత్తిన వాటికి సమాధానాలు చెప్పలేకపోతున్నావు.. కనీసం నీకు ఫోన్ చేసిన అతనైనా సమాధానాలు చెప్పారా లేద...
    విషయానికి రా కాకమ్మ కథలు వద్దు....

    రిప్లయితొలగించండి
  62. కాకమ్మ కథ కాదు కాబట్టే మెయిల్ యొక్క కాపీ పెట్టాను. ఖమ్మమైనా, కెనడా అయినా నాకు అభిమానులని తయారు చేసేది విమర్శకులే. కార్మికవర్గానికీ, సమైక్యవాదానికీ సంబంధం ఉందంటే అతనూ నవ్వుకోలేక చచ్చాడు.

    రిప్లయితొలగించండి
  63. నువ్వు రాసినదానికి ఈమెయిలో వున్నది ఒకటిగానే వుందా నీకు... అదే తికమక నీకు... అభిమానులంటావు... కార్మికవర్గానికీ, సమైక్యవాదానికీ సంబంధం ఉందంని నువ్వే ఊహించుకుంటావు....
    యింకొకసారి నా టపా చదువి సమాధానాలు చెప్పు చెతనైతే...

    రిప్లయితొలగించండి
  64. అజ్ఞాత10/06/2011 06:50:00 PM

    ముందుగా, ఆ తింగరిగాడికి జవాబుచెప్పాలని తోచిన మీ ధైర్యానికి జోహార్లు.అదీ ఇన్ని సార్లు!!!
    మా అన్నయంటే ఎవరిని మీ ఉద్దేశం? ఆయన మనుషుల్లో సుమన్ బాబు, పశువుల్లో అన్యా పక్కన గుర్రం.కచరా పక్కన కంచర గాడిద.
    కళ్ళకు గంతలుకట్టుకోని ప్రపంచాన్ని చూడగలడు. అసలలాగే చూస్తాడు. ఇంకోలా రాదు. మొన్నీ మధ్యన అడవుల్లో ప్రపంచజ్ఞానం కోశమట్టా తిరుగుతావుంటే పొలీసోళ్ళో సూపు సూసినారంటగా.( నిజమేనా అన్యా, చెప్పవా..అప్పుడు నీ అనుభూతులేంటి..ఆళ్ళు నిన్ను తిట్టిన బూతులేంటి..ఓపాలి చెప్పరాదే?)

    ఆయంతో మీకు వాదన్లేంటి..ఒప్పేసుకోండొప్పేసుకోండి.

    రిప్లయితొలగించండి
  65. వాసవ్య గారు, తెలంగాణావాళ్ళు కోస్తా ఆంధ్రవాళ్ళని తన్నాలని అడ్వొకేట్ చేస్తూ మైక్‌లు పెట్టారని మీరంటున్నారు. అదే నిజమైతే మీరు ఆ వాయిస్ రికార్డింగ్ చేసి అప్‌లోడ్ చెయ్యండి. ఇంతకుముందు వినాయక మంటపాల దగ్గర భక్తి పాటలు కాకుండా సినిమా పాటలు వేస్తున్నారని నిరూపించడానికి నేనూ రికార్డింగ్ చేశాను.

    రిప్లయితొలగించండి
  66. అజ్ఞాత10/06/2011 09:21:00 PM

    I don't know about maikuls..here are some kaitals..
    http://tinyurl.com/3j9dxuf

    రిప్లయితొలగించండి
  67. అజ్ఞాత10/07/2011 12:30:00 AM

    Praveen Sarma is a Non-Telugu and non-Telangana person but a pro-Maoist. It happens to be our bad luck that he knows Telugu so well. He has no sentimental attachment to either Telangana or Samikyaandhra. What he actually wants is just revival of the Maoist domination in Telangana by way of the State's bifurcation.

    Leave him alone and don'r bother about his views, the sole basis of which is the afore-mentioned ideological loyalty.

    రిప్లయితొలగించండి
  68. వాసవ్య గారు ఏదో మైకుల్లో విన్నాడని చెప్పారు కదా. అందుకే రికార్డ్ చెయ్యమన్నాను.

    రిప్లయితొలగించండి
  69. @andhrudu
    ఆ కవితలని నేనూ డౌన్‌లోడ్ చేశాను కానీ మైకుల్లో లేనివి ఉన్నట్టు చెపుతున్నారు కదా. అదే ఇక్కడ క్వెషన్.

    రిప్లయితొలగించండి
  70. అజ్ఞాత10/07/2011 06:58:00 AM

    "మార్తాండ వ్యక్తి కాదు ఒక శక్తి"
    ఓ ఉప్పెన, ఓ సునామి, ఓ భూకంపం, ఓ గుండె దడ. హోల్ మొత్తంగా చెప్పాలంటే "మార్తాండం ఇన్విన్సిబుల్" అని మీకీపాటికి అర్థమయి వుండాలి. మార్తాండం ముందు ఆయన గుడ్డి గుర్రమే నోరెత్తదు, పళ్ళుతోమించుకోవడానికి తప్ప, మానమాత్రులు మీరెంత?

    రిప్లయితొలగించండి
  71. అజ్ఞాత10/07/2011 07:03:00 AM

    ఇంకా విశదంగా చెప్పాలంటే:
    మార్తాండం చెప్పులోని రాయి,
    బ్లాగులోని జోరీగ
    పక్కలో బల్లెం
    చేపలోని ముల్లు
    కుడితిలోని ఎలుక
    కంచంలో పడ్డ బల్లి

    రిప్లయితొలగించండి
  72. My friend Mandava Swapna is also well aware about Telangana movement. Shall I bring her here? Then those people who made allegations will search for anti-Andhra mike voices in streets.

    రిప్లయితొలగించండి
  73. మీరు మార్క్సిజం పూర్తిగా చదవలేదని ఈ టపా యొక్క టైటిల్ చూస్తే అర్థమైపోతుంది. వాదంలో సత్యం లేదా అసత్యం అనేవి ప్రధానమైనవి. అతి లేదా మితి అనేవి ఇక్కడ అంతగా ప్రాధాన్యం లేని విషయాలు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో, హోచిమిన్‌హ్‌లు తాము నిజమని నమ్మినవి చెప్పారు కానీ తాము అతిగా నమ్ముతున్నామనో, మితంగా నమ్ముతున్నామనో చెప్పుకోలేదు. ఎవరైనా అలా చెప్పుకుంటే వాళ్ళ వాదనలో credentials లోపించినట్టే అవుతుంది. నా భాష అర్థం కాకపోతే రంగనాయకమ్మ & గాంధీల రచనలు చదవండి. వాళ్ళిద్దరి భాష నా భాష కంటే స్పష్టంగా ఉంటుంది. రంగనాయకమ్మ గారి రచనలు చదివిన తరువాతే నా భాషలో స్పష్టత పెరిగింది. థీసిస్‌లో అంతగా ప్రాధాన్యం లేని అతి, మితి లాంటి పదాలు ఉపయోగించారంటే మీరు మార్క్సిజం చదవలేదనే అనుమానమే బలంగా ఉంటుందు.

    రిప్లయితొలగించండి
  74. దయచేసి వ్యక్తిగత దూషణాలకు ఈటపాను వేదికగా ఛేసుకోవద్దు...

    రిప్లయితొలగించండి
  75. ప్రవీణు, నువ్వు చెప్పావని గబగబా నాపనులన్నింటిని మాని ఓ మొబైల్ ఫోన్‌తోనో కెమారాతోనో తెలంగాణా టెంట్‌ని చిత్రీకరించాననుకో రెపటినుండి నాబ్లాగు మూగబోవలసిందే, నా ఫేస్‌బుక్ ఏమ్మాలి? జీమెయిల్ ఎకౌంట్ ఏమవ్వాలి? ఏంప్లాను వేసావు బాబు.. ఏ పోలీస్ ఇన్‌ఫార్మ్‌రో అనుకుని చావగొట్టరూ నన్ను! నీ ఎత్తులు సాగవు -:(

    సింగిడి తెలంగాణ రచయితలు వదిలిన ఈ (http://tinyurl.com/3j9dxuf) బూతు సాహిత్యం మేము నిత్యం ఏదో మూల తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వింటూనే వున్నాము.
    నిజమో కాదో నీ మిత్రులను అడిగి తెలుసుకో...

    రిప్లయితొలగించండి
  76. నేను ఏమేమి చదివానో ఏమి చదవలేదో మీ దగ్గర నిరూపించుకోవలసిన అవసరం లేదు.. నాకు టివీ లో సినిమా ఛూడాలంటే, టివీ యొక్క శాస్త్రసాంకేతిక ప్రజ్ఞాణము ఏమీ అక్కర్లేదు.
    తెలంగాణ విప్లవకారులు కూడా "తెలుగు శ్రామికులారా తన్నుకునేటట్లు ఎందుకు చేస్తున్నారో చెప్పు. మార్క్సిజం గురించి నీ దగ్గర నాకు ట్యూషన్స్‌ అక్కర్లేదు.. ఎందుకంటే మార్క్సిజం నువ్వు రాసినది కాదుకదా!

    రిప్లయితొలగించండి
  77. సింగిడి తెలంగాణా రచయితలలో ప్రముఖుడైన షేక్ యాకూబ్ బాబా (స్కైబాబ) గారు నాకు తెలుసు. ఆయన నాతో ఒకటిరెండు సార్లు ఫోన్‌లో మాట్లాడారు. ఆయనతో ఈ కవితల గురించి ఓసారి చర్చించి చెపుతాను. ఆయన నంబర్ ఇప్పటికీ నా కాలర్ ఐడిలో ఉంది.

    రిప్లయితొలగించండి
  78. ఆయన నంబర్ ౯౯౮౫౯౨౧౩౭ కావాలంటే మీరూ ఆయనతో మాట్లాడండి. ఆయన వ్యక్తిగతంగా చాలా పొలైట్. ఎలాంటి ప్రాంతీయ గజ్జి లేని వ్యక్తి. ఆయన కవితలని ఉదహరించి తెలంగాణా ప్రజలకి కోస్తా ఆంధ్రపై ద్వేషం ఉందనడం బాగాలేదు.

    రిప్లయితొలగించండి
  79. మార్క్సిజం నేను వ్రాసినది కాదు. థీసిస్‌లో ఎవరు వ్రాసారు అనేది పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. The duel between truth and false is the point of view here. Any Marxist can define it. It is not my own definition.

    రిప్లయితొలగించండి
  80. అజ్ఞాత10/07/2011 01:07:00 PM

    వదలొద్దు, చీపురుకట్టతో నివాళించేదాకా ఇక్కడే పట్టుకు వేలాడు. మార్తాండమా మజాకా.

    రిప్లయితొలగించండి
  81. ప్రవీణ్
    నువ్వు అనుకున్నట్లు నా అబిప్రాయాలతో సీపీయం కు ఎటువంటి సంబంధం లేదు.. నా అభిప్రాయాలు సీపీయం అభిప్రాయాలతో సరిపోవొచ్చోమో... అంతమాత్రానా నీకు సీపీయం మీద వున్న ఒంటెద్దు వ్యతిరేకతను నా బ్లాగులో ప్రదర్శించకర్లా... మీ బ్లాగులు మీకున్నాయిగా... టాపికి డైవర్ట్ చెయ్యోద్దు... కావాలంటే పిల్లిలా జారుకో...

    రిప్లయితొలగించండి
  82. అజ్ఞాత10/07/2011 06:49:00 PM

    ఏమండీ వాసవ్యగారూ దసరాకి ఇంట్లో ఏమీ తోచటములేదా? కాస్త గోడకు చెప్పుకుంటే నయంగా ఉండేదేమో!

    రిప్లయితొలగించండి
  83. ఊరెల్లల, మా అమ్మదగ్గరకూ వెళ్ళనివ్వలా ఈ తెలంగాణ జెఏసి.
    ఏదో ప్రవీణ్ తో పండగపూట యిలా టైమ్‌పాసయిపోయింది...

    రిప్లయితొలగించండి
  84. ఏలూరు వెళ్ళాలనుకుంటే గన్నవరానికి కొత్తగా వేసిన విమానాలు దొరుకుతాయి. తెలంగాణా జె‌ఎ‌సి వంక పెట్టక్కరలేదు. మన లాంటి వైట్ కాలర్ వాళ్ళకి విమాన టికెట్లు ఖరీదా ఏమిటి? BHELకి శంషాబాద్ దూరం కనుక నేను సాయింత్రం ట్రైన్ ఎక్కి, హాయిగా నిద్రపోయి, ఉదయం సికందరాబాద్‌లో దిగి లింగంపల్లి లోకల్ ఎక్కుతాను కానీ విమానం ఎక్కలేక కాదు.

    రిప్లయితొలగించండి
  85. ప్రవీణూ,

    విమానాలు, నీ స్తొమత(కెపాసిటీలు) మాకెందుకులేగాని... అసలు పాయింట్‌కి రా?

    శ్రామికుల మధ్య ప్రాంతీయ/వ్యక్తిగత ద్వేషాలకు పాలకులతో పాటు తెలంగాణ ఐకాస కూడా కుట్ర పన్నుతున్నట్లు పైన చర్చల లో ఋజవయినది... మావోయిస్టు మరికొన్ని విప్లవపార్టీలు ఎందుకు ఐకాస లో కొనసాగుతున్నాయి??

    రిప్లయితొలగించండి
  86. సమైక్యాంధ్ర ఉద్యమమేమీ కార్మికవర్గ ఉద్యమం కాదు కదా. రాష్ట్రంలోని పెట్టుబడిదారుల్లో ఎక్కువ మంది కోస్తా ఆంధ్రకి చెందినవాళ్ళేననే విషయం గుర్తుంచుకోండి. తెలంగాణా ఉద్యమం జరుగుతున్నది కోస్తా ఆంధ్ర పెట్టుబడిదారులకి వ్యతిరేకంగానే అనే విషయమూ గుర్తుంచుకోండి. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని ఫస్ట్ ఎసి పెట్టెలో 6 కేబిన్‌లు, 18 బెర్త్‌లు ఉంటే ఆ బెర్త్‌లు రిజర్వ్ చేసుకునేవాళ్ళందరూ వైజాగ్, సామర్లకోట & రాజమండ్రిలలో ఎక్కే వైట్ కాలర్ క్లాస్ ప్రయాణికులు. వైజాగ్ స్టేషన్‌లో పెట్టెకి అంటించిన చార్ట్ మీద చూస్తే వాళ్ళందరి డెస్టినేషన్ సికందరాబాద్ లేదా హైదరాబాద్ అనే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతాలకి చెందిన ధనవంతులే వ్యాపార పనుల కోసం హైదరాబాద్ ఎక్కువగా వెళ్తారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళి దోచుకునేవాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్నదే తెలంగాణా పోరాటం. అంతే కానీ అది స్థానిక దోపిడీదారులకి వ్యతిరేకంగా జరుగుతున్నది కాదు అని తెలంగాణావాదులకి తెలుసు.

    రిప్లయితొలగించండి
  87. అజ్ఞాత10/08/2011 12:00:00 PM

    మనిషన్నవాడు తెలంగాణా ఉద్యమానికి మద్దతు పలుకుతాడు అందుకే నేను మద్దతు పలికాను అని కోస్తాన్ద్రకు చెందిన సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్ నారాయణ మూర్తి చెప్పిన మాట మీ అందరి వాదనలకు సమాధానం

    రిప్లయితొలగించండి
  88. అజ్ఞాత10/08/2011 12:10:00 PM

    మార్తాండ అని ఎవరిని అంటున్నారో తెలియదు కానీ బ్లాగ్స్ లో చాలా మందికి మీ పేరు వింటే హడల్. ఒక రకంగా మీ పేరు పలకని క్షణం వారి జీవితం లో ఉండదేమో. మీ మీద వాళ్ళు కవితలు కూడా రాస్తున్నారంటే మీరు విజయం సాధించారండానికి ఇంతకన్నా ఏం కావాలి ?

    రిప్లయితొలగించండి
  89. Anonymous,10/08/2011 12:00:00 PM
    "మనిషన్నవాడు తెలంగాణా ఉద్యమానికి మద్దతు పలుకుతాడు"
    బుర్ర అన్నది ఉన్న వాడు ఇలా జెనరలైజ్ చేసి మాట్లాడడు. దీనిని బట్టి నారాయన మూర్తికి బుర్ర అరికాల్లో ఉందని మరోసారి రుజువైంది.

    రిప్లయితొలగించండి
  90. పై అజ్ఞాతా, భరద్వాజుడనే ఒకడు ఒంగోలు శ్రీనుతో కలిసి నా మీద కవితలు వ్రాసి వాడి అమ్మ బతుకుని బజారున పెట్టుకున్నాడు. Watch this audio: http://audios.teluguwebmedia.in/72574108 వాడికి అమ్మ కంటే శతృవు మీద పగ సాధించడమే ముఖ్యమైతే వాడు ఒక మనిషే కాదు. వాడు మనిషి కాదని నిరూపించడానికే వాడి అమ్మ మీద బూతు ఆడియోలు పెట్టాను. సింగిడి వాళ్ళు ఎలాంటి కవితలు వ్రాయగలరో, నేను అంత కంటే కత్తి లాంటి ఆడియోలు పెట్టగలను.

    రిప్లయితొలగించండి
  91. నన్ను ఎవడు ఎంత తిట్టినా నేను తెలంగాణావాదాన్నే సమర్థిస్తాను. సమాజం గురించి ఆలోచించకుండా మెటాఫిజికల్‌గా బతికేవాళ్ళు ఎక్కువగా ఉన్న సమాజంలో ఒక వర్గంవాళ్ళు కేవలం భాషా సమైక్యత పరిరక్షణ కోసం హింస చేస్తారంటే అది నమ్మశక్యంగా లేదు. ఎవరో గజ్జి కుక్కలు నా పేరు చెపితే హడలిపోతున్నారనో, నా మీద బూతు కవితలు వ్రాస్తున్నారనో వాళ్ళకి భయపడి నిజంగా లేని సమైక్యవాదాన్ని సమర్థించాలని రూల్ లేదు. బూతులు వ్రాయాలనుకుంటే సింగిడి కంటే పచ్చిగా బూతులు వ్రాయగలను.

    రిప్లయితొలగించండి
  92. అజ్ఞాత10/10/2011 01:33:00 PM

    @Praveen Sarma regarding సింగిడి తెలంగాణా poetry:

    True some of the poems used vulgar language. Their inspiration was the 1940 homage written by Srisri "దొంగ డాష్ లు అసలే మసలే ధూర్త లోకంలో"

    రిప్లయితొలగించండి
  93. యాగాటిగారూ
    మీ పోస్ట్ చదివాను. తీరిగ్గా సమాధానం రాస్తాను. అప్పటివరకూ మన్నించగలరు.

    రిప్లయితొలగించండి
  94. యాగాటి గారికి

    * తెలంగాణ డిమాండ్ పైన ప్రజల్లో ఉన్న మద్దతును చూసుకుని వాచాలత్వం ప్రదర్శించినవారి మాటలు తెలంగాణ ఉద్యమానికి అంటగట్టలేము.

    * నిరసన తెలియజేయడానికి రోకోలు ఒక సాధనం. ప్రజలకి అసౌకర్యమే. కాని అంతకంటే మించి ఇటువంటి ఉద్యమ చర్యలు ధనికుల వ్యాపారాలను దెబ్బతీస్తాయి. ఉత్పత్తి, అమ్మకాలను తగ్గిస్తాయి. తక్షణం ఉద్యమ డిమాండ్లపైకి దృష్టి సారించేలా ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తాయి. ఫలానా సమ్మె వల్ల ప్రయాణీకులు ఇళ్ళకు చేరలేకపోయారనో, ఆసుపత్రికి చేరలేక రోగులు చనిపోయారనో, లేక ఇలాంటివో మరికొన్ని కారణాల వల్లనో ఉద్యమం మొత్తాన్ని తప్పు పట్టడం భావ్యం కాదు. ప్రభుత్వాలు ప్రజల సమస్యలని ఏనాడూ చెప్పకుండా పట్టించుకున్న పాపానపోవు. తమ ఓట్ల అవసరాల కోసం బియ్యం రెండు రూపాయలకూ, ఇప్పుడు ఒక రూపాయికీ ఇస్తాయి కాని ఆ ప్రజలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్వంతగా పని చేసుకుని సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పించవు. అటువంటిది ప్రభుత్వాలను నడిపే ధనికులకు వ్యతిరేకమైన డిమాండ్ ను ప్రజా ఉద్యమాలు లేవనెత్తినపుడు దాన్ని పక్కదారి పట్టించడానికి ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తాయి. అందులో సమ్మెలవల్ల, రోకోల వల్ల ప్రజలకే నష్టం అని ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం కూడా ఒకటి. అందులో నిజం ఉన్నా ఉద్యమాల అంతిమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూసి ప్రభుత్వాల ప్రచారాలను తిప్పి కొట్టాలి తప్ప వారి ప్రచారంలో పడి కొట్టుకుపోరాదని నా అభిప్రాయం. ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఒక రాజకీయ ఉద్యమాన్ని పండగ సెలవులకి వెళ్లనీయకపోవడం లాంటి సాధారణ కారణాలతో పోల్చి చిన్నబుచ్చడం భావ్యం కాదు.

    * మీరన్నట్లు ప్రజా ఉద్యమాలపైన ప్రభుత్వాలు కుట్రలు పన్నడం సహజం. కుట్ర పన్నినపుడు ప్రభుత్వం కుట్రపన్నిందనే ఉద్యమ సంస్ధలు చెబుతాయి. ఎత్తుగడ విషయానికి వస్తే, తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరి సంపూర్ణ ఆధిపత్యంలోనో, నియంత్రణలోనో లేదు. ఉద్యమంలో ఉన్న సి.పి,ఐ (ఎం.ఎల్-న్యూ డెమొక్రసీ) లాంటి పార్టీలకు తప్ప ఇతర పార్టీలకు తమ తమ కార్యకర్తలపైనా, ప్రజా సమూహాలపైనా నియంత్రణ లేదు. న్యూ డెమొక్రసీ లాంటి పార్టీలు ఉద్యమంలో తమ తరపున తీసుకువచ్చే కార్యకర్తలను, ప్రజలను ఒక వ్యూహం ప్రకారం పాల్గొనేలా నియంత్రించగలరు. కాని తమకిందలేని కార్యకర్తలను అవి నియంత్రించలేవు. మిలియన్ మార్చ్ కార్యక్రమం తీసుకుంటే న్యూడెమొక్రసీ వాళ్ళు పధకం ప్రకారం పని చేయడం వల్ల వారి కార్యకర్తలు పోలీసు బ్యారికేడ్లను ఛేదించుకుని ట్యాంక్ బండ్ పైకి వెళ్ళాకే ఇతర పార్టీలవాళ్ళు రాగలిగారు. ఈ విధమైన నియంత్రణను తమ కార్యకర్తల కదలికలను ఉద్యమాల్లో కూడా అదుపులోకి ఉంచుకోగల సంస్ధలే చేయగలవు తప్ప ఇతర పార్టీలు చేయలేవు. టి.ఆర్.ఎస్, బి.జె.పి లాంటి పార్టీలు పధకాలు వెయ్యడం, ప్రచారాలను అడ్డుకోవడం, పోలీసులు ప్రభుత్వ ప్రచారాలను ఎత్తుగడలను తిప్పికొట్టడం చెయ్యలేవు. అది చెయ్యగల సంస్ధలకు పూర్తి నియంత్రణ లేదు. ఈ నేపధ్యంలో అనేక తప్పులు దొర్లుతాయి.

    చీటీల్లో రాసుకోవడం, చలికాగడం చేసే నాయకులు కూడా లేకపోలేదు. ఉద్యమాల్లో స్వార్ధ శక్తులు కూడా ఉంటాయి కదా. అలా క్రమ శిక్షణ లేకనే తెలంగాన ఉద్యమం ఇంకా ఏమీ సాధించలేకపోయింది. తెలంగాణలో వచ్చిన ఈ పెద్ద కదలికను సరైన దారిలో పెట్టగల ఏకైక నాయకత్వం ఉన్నట్లయితే అది ఎన్నడో లక్ష్యం సాధించి ఉండేది. ఉద్యమంలో పొరబాట్లను పొరబాట్లుగానే చూడాలి తప్ప వాటిని ఉద్యమ లక్షణాలుగా చూడరాదు.

    తెరాస, కె.సి.ఆర్ లాంటి స్వార్ధ శక్తులు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. ప్రజల్లో అత్యధిక భాగం కూడా ఆశగా అటువంటి శక్తుల వెనుక సమకూరుతున్నారు. ఇది నిజాయితీతో పోరాడుతున్న శక్తుల బలహీనతగా గుర్తించాలి. వారు అప్రమత్తతో ఉండి కదలకముందే స్వార్ధ శక్తులు స్పందించి నాయకత్వ స్దాయిని చేజిక్కించుకున్నపుడు అటువంటు ఉద్యమాలకు బోల్డన్ని బలహీనతలు. అది ప్రజా ఉద్యమంగా ఉంది గనక, ప్రజలు పాల్గొంటున్నందున ఆ ఉద్యమాలని కమ్యూనిస్టులు విస్మరించలేరు. బూర్జువాలు ఉన్నారనో, భూస్వాములు నాయకత్వం వహిస్తున్నారనో ఇటువంటి విశాల ప్రాతిపదికన జరిగే ఉద్యమాల పట్ల కొన్నిసార్లు తమ నిబంధనలను తాత్కాలికంగానైనా సడలించుకుని సాధ్యమైనంతమేరకు లేదా శక్తిమేరకు ఉద్యమాన్ని తమకిందకు తెచ్చుకునే ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది. అటువంటప్పుడు ఉద్యమాలలో వున్న బలహీనతలన్నింటికీ కొద్ది సంఖ్యలో గల నిజాయితీ పోరాట శక్తులను బాధ్యులుగా చేయలేము. సాధ్యమైనంతగా ఉద్యమంలోకి చొచ్చుకుని పోయి ప్రజా ఉద్యమాలని ప్రజాస్వామికీకరించడానికి వారు ప్రయత్నం చెయ్యక తప్పదు. లేదంటే తర్వాత కాలంలో వారు సమాధానం చెప్పుకోవలసి వస్తుంది.
    (కింద రెండో భాగం చూడండి -విశేఖర్)

    రిప్లయితొలగించండి
  95. * తెలంగాణ సంస్కృతి ఏమిటో నిజంగా చెబుతున్న వారు కూడా ఉన్నారు. అమ్మనాబూతులు చెప్పేవారిని ఆ దృష్టితోనే చూసి పక్కకు నెట్టెయ్యడమే చేయవలసింది తప్ప వారికి విలువ ఇవ్వడం ఎందుకు? ఇప్పుడున్న పరిస్ధితుల్లో ప్రజలు గణనీయ సంఖ్యలో అటువంటి వారి ఆదేశాలను పట్టించుకుంటున్నపుడు కొన్నింటిని పంటి బిగువున భరించక తప్పదు. క్యాడర్ పెంచుకోవాలన్న ఆలోచన కమ్యూనిస్టు విప్లవకారులు చేస్తే తప్పు కాదు. అది వారు చెయ్యవలసిన పనే. అయితే అదే లక్ష్యంగా ఉద్యమంలో పాల్గొనడం తప్పు. తక్షణ లక్ష్యం కోసం కృషి చేస్తూనే సంస్ధ యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యమాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ అవగాహనతో పని చేయ్యవలసిన అగత్యం కమ్యూనిస్టు విప్లవకారులపై ఉంది.

    ఆర్.ఎఫ్.సి అంటే నాకు తెలియదు. మీడియా మొఖల్స్ విషయం కూడా తెలియదు. కాని వాటిని కూడా ఉద్యమాల్లో కొన్ని శక్తులు తమ తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి చేసే పనులుగానో చూడాలని మాత్రం చెప్పగలను.

    * స్వయంగా తెరాస అధిపతి ఆంధ్ర ప్రాంత వ్యాపారులతో కలిసి వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణకి కె.సి.ఆర్ జవాబు చెప్పలేదు. మౌనంగా ఉండడాన్ని బట్టి అది నిజమేనని భావించవచ్చేమో. అయినా అది నిరభ్యంతరంగా కొనసాగడం ఉద్యమానికి ఉన్న అనేక బలహీనతల్లో ఒకటి. తెలంగాణ ఉద్యమం కమ్యూనిస్టు ఉద్యమం కాదు. కమ్యూనిస్టులే నాయకత్వం వహిస్తున్న ఉద్యమం కాదు. కనీసం సి.పి.ఐ లాంటి పార్టీలు నాయకత్వం వహిస్తున్న ఉద్యమం కూడ కాదు. కనుక ఉద్యమాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసి అంతకంటే మెరుగుకావడానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వగలిగితే మంచిది. తప్పులు చూసి నిరాశ చెంది ఉద్యమాన్ని విరమించడం కంటే తప్పులు సవరించుకోవడానికి ప్రయత్నిస్తూ ద్విగుణీకృత ఉత్సాహంతో పని చేయాలని ఆశిద్దాం. తలతిక్క విమర్శలకు స్పందన ఎందుకండీ? వాటిని అలా వదిలి వెయ్యడమే సరైంది కదా. ఆంధ్ర ప్రాంతం వాళ్ళంతా దోపిడి దారులని చెప్పిన ఉపన్యాసాలు నేను విన్నాను, చదివాను. కె.సి.ఆర్ కూడా రెండు మూడు సందర్భాల్లో చెప్పడం విన్నాను. అదే వ్యక్తి అందుకు పూర్తిగా భిన్నమైన వ్యాఖ్యలు చేయడం కూడా విన్నాను. అనేక బలహీనతలతో సాగుతున్న ప్రజా ఉద్యమం కనుక.... .... షరా మామూలే. వెల్. మీరు (ఇంకొకరో మరి) బూతు సాహిత్యమంటూ ఇచ్చిన లింక్ చూశాను. కవితలు చాలా చాలా ఘోరంగా ఉన్నాయ్. అటువంటివారిని ఉద్యమాలకు దూరంగా పెట్టడమే మంచిది. వారు పూర్తి బాధ్యతారాహిత్యంతో అలాంటివి రాస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి వారు కొంతమంది తెలంగాన వ్యతిరేకుల కంటే ఎక్కువ నష్టాన్ని చేస్తున్నారు. నేనయితే పూర్తిగా చదవలేకపోయాను. చాలా ఛీదర పుట్టింది. వారు తెలంగాణ ఉద్యమం నుండి వేరు చేయతగ్గవాళ్ళు.

    * తెలంగాణ వల్ల దోపిడీ వ్యవస్ధ పోతుందని విప్లవకారులు చెప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రం వల్ల తాత్కాలిక ప్రయోజనాలే సంభవిస్తాయనే వారు చెబుతున్నారు. కాకుంటే ఉద్యమ రొదలో పడి వారు గొంతులు వినబడడం లేదు.

    * కేవలం తన్నండి, తరమండి అంటున్న వారి వ్యాఖ్యలను మాత్రమే పరిగణించి తెలంగాణ ఉద్యమాన్ని అంచనా వెయ్యడం భావ్యం కాదు. ముందే చెప్పినట్లు ఇది అనేక బలహీనతలున్న ఉద్యమం. కాని అది ప్రజా ఉద్యమం. వ్యక్తిగత రాగ ద్వేషాలను నూరిపోయడం అన్నది మీరు అంటున్న స్ధాయిలో ఉందని నేను అనుకోవడం లేదు. అటువంటి పనులు, వాటి పర్యవసానాలు కొద్ది కాలం ఉంటాయి. తర్వాత మరుగున పడతాయి. తెలంగాణ ఉద్యమానికి ప్రజల మద్దతు ఉండడం వల్లన అటువంటి వారి వేషాలు చెల్లుతున్నాయి. అంతవరకూ గ్రహించాలి.
    (కింద మూడో భాగాన్ని చూడండి)

    రిప్లయితొలగించండి
  96. కేవలం రాగద్వేషాలను నూరిపోయడం ద్వారానే ఈ స్ధాయి ఉద్యమం తలెత్తిందని మీరు అనడం చాలా బాధ కలిగిస్తోంది. ప్రజా ఉద్యమాన్ని అలా చిన్నబుచ్చడం భావ్యం కాదు. నూరిపోస్తే ఉద్యమాలు చెలరేగితే అది విప్లవకారులు బాగా చెయ్యగలరు. కాని వారు చేస్తున్న పనికి తగిన స్పందన ఎందుకు లేదు? ఉద్యమానికి కారణం తెలంగాణ లో ఉన్న భౌతిక పరిస్ధితులే.

    ప్రజా ఉద్యమాలకు ఏ సిద్ధాంతం కావాలి? సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్నలు ఒక పార్టీ గానీ, సంస్ధ గానీ నాయకత్వం వహిస్తున్నపుడు తలెత్తుతాయి. ఈ ఉద్యమం అనేక సంస్ధలు, వివిధ దృక్పధాలు కలిగిన సంస్ధలు నాయకత్వం వహిస్తున్న ఉద్యమం. దీనికి ఒకేఒక లక్ష్యం తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రం వస్తే తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం వస్తుందని ప్రజలు నమ్ముతున్న ఉద్యమం. వారు ఆశించినంతగా పరిష్కారం రాకపోయినా కొద్దిగయినా పరిస్ధితి మెరుగుపడుతుందని విప్లవ సంస్ధలు భావిస్తున్న ఉద్యమం. ఇందులో ఒక్కొక్క సంస్ధకు ఒక్కొక్క లక్ష్యం ఉంది. కాని అందరి లక్ష్యాలూ రాష్ట్రం సాధించడం వల్ల నెరవేరతాయీని అందరూ నమ్ముతున్నారు. తెలంగాణ సాధనా లక్ష్యం వారిని ఒకే వేదికవద్దకు చేర్చించింది. నమ్ముతున్న లక్ష్యాలన్ని నెరవేరతాయా లేవా అన్నది వేరే చర్చ. ముందే చెప్పినట్లు విప్లవకారుల లక్ష్యం ఇటువంటి విశాల ప్రజా ఉద్యమాలలో ఎలా ఉండాలంటే అందులో భాగం పంచుకుంటూ వీలయితే నాయకత్వ పాత్రను దొరకబుచ్చుకుని ప్రభుత్వాల నిజ స్వరూపాలను తెలియజెప్పి అసలు లక్ష్యం వైపుకి తీసుకెళ్లగలగాలి. అది సాధ్యం కాకపోతే సాధ్యమైనంత మందిని పార్టీల నిర్మాణం లోకి తెచ్చుకొని మరింత పునాదిని సంపాదించుకుని భవిష్యత్ ఉద్యమాలకు తగిన పునాదిని ఏర్పరుచుకోవాలి. అన్ని సమస్యలు తీరుతాయి అని ప్రజలు భావిస్తున్నారనిగానీ, అలా నాయకులు చెబుతుంటే ప్రజలు నమ్ముతున్నారని గాని చెబితే ప్రజలను తక్కువగా అంచనా వేయడమే కాగలదు. తెలంగాణ ప్రజలకు అనేక ఉద్యమాలలో పాల్గొన అనుభవాలు ఉన్నాయి. అవి వారికి ఎంతోకొంత వాస్తవికతను నేర్పాయి కూడా. నమ్మేవారు ఉన్నా వారు అంతవరకే పరిమితం. అలాంటి వారిని ఎందుకు ముందు పీఠిన నిలబెట్టడం?

    అతివాద కమ్యూనిస్టు పార్టీలు అని ఎవరిని అంటున్నారు మీరు? మావోయిస్టులనా? వారు తెలంగాణ ఉద్యమంలో లేరు. ఉన్నా వ్యక్తులే తప్ప ఉద్యమ నిర్మాణంలో లేరు. అజ్ఞాత నాయకుల ప్రకటనలు పత్రికలకు పరిమితమే తప్ప ఆచరణలో అవి లేవు. కనుక వారి ప్రభావం పరిగణించలేము. అదీకాక వారి ఆచరణ ప్రజా ఉద్యమాలకు అందుబాటులో ఉన్న కార్యక్రమాలు కావు. ప్రజలను ప్రేక్షకులుగా ఉంచే వారి కార్యక్రమాల వల్ల ఏ ఫలితమూ రాదు. అది గ్రహించినట్లుగా వారి సమీక్షల ద్వారా తెలుస్తున్నా సవరించుకోలేని పరిస్ధితుల్లో వారు ఉన్నట్లు కనిపిస్తోంది. అదంతా వేరే చర్చ. విప్లవ పంధాలలో ఏది సరైంది అన్న చర్చలో అవి మాట్లాడుకోవచ్చు.

    తెలంగాణ వచ్చాక కూడా ప్రజలను తమ దైనందిన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను కొనసాగించవలసిందే. అప్పుడు కె.సి.ఆర్ పైన కూడా ఉద్యమాలు చెయ్యవలసి ఉంటుంది. ఎందుకంటె తెరాస గూడా ధనికుల పార్టీయే. అది భూస్వాముల, పెట్టుబడిదారుల పార్టీయే. సందేహం లేదు.

    కామ్రేడ్స్ అందరికీ ఒకే విధమైన అవగాహన లేకపోవచ్చు. వారి అవగాహనల్లో వారికి అర్ధమైన దాన్ని బట్టి హెచ్చు తగ్గులు ఉండవచ్చు. వ్యక్తుల అభిప్రాయాలు, వారి ఉపన్యాసాలు, ప్రకటనలు బట్టి కాక వరి సంస్ధలు సూత్రబద్ధంగా ప్రకటిస్తున్న వైఖరిని పరిగణన లోకి తీసుకోవాలి.
    (సమాప్తం -విశేఖర్)

    రిప్లయితొలగించండి
  97. విశేఖర్ గారు,
    మీ సమయాన్ని వెచ్చించి వివరణాత్మకమైన కామెంట్స్ పెట్టినందుకు కృతజ్ఞతలు.
    మీరు పైన చెప్పినవాటిలో మరియు మీరు వివధ సందర్భలలో మీ బ్లాగూలో వ్రాసిన వాటి మధ్య తేడా గమనించాను.
    నేను ప్రస్తుతం పని వత్తిడిలో వున్నాను.. రెండు మూడు రోజులలో జవాబు యివ్వగలను.

    రిప్లయితొలగించండి
  98. వి శేఖర్ గారు, మీ కామెంట్లపై నాకున్న సందేహాలు, అభిప్రాయాలు యివి:

    రాస్తారోకోలు:

    పెట్టుబడీదారీ వ్యవస్థ సైతం శాంతియుత రాస్తారోకోలను ప్రజలు నిరసన తెలియజేయడంలో భాగంగా గుర్తించాయ. దానినీ ఎవరూ కాదనరు.

    కాకపోతే ఈ హక్కును వ్యక్తిగత రాగవిద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ఉపయోగించడం సహించరానిది. మొన్న దసరా రోజున తెలంగాణా అంతటా రహదార్ల దిగ్భందనం అంటే అర్థంచేసుకోవచ్చు. కానీ 7 వ నంబరు జాతీయ రహదారిని మాత్రమే నిర్భందించడంలో ఆతంర్యం ఏమిటి? దానివల్ల నిరసన ఎవరిమీద తెలియజేయడానికి? ప్రభత్వంపైనా లేక ఒక ప్రాంత ప్రజలను భయబ్రాంతులు చేయడానికా? ఆ రోజు బస్సులలో ప్రయాణించిన ప్రజల మనస్సులలో నాటుకుపోయిన భయంతో కూడిన ద్వేషబావాన్ని తెలంగాణ వచ్చినతరువాతనైనా తుడవగలరా?

    సమ్మెలు:

    శ్రామికుల సమ్మె హక్కును విమర్శించేటంతటి వాడిని కాదు నేను. సమ్మెహక్కును కార్మికులకు లేకుండా చేయాడానికి అన్నికోణాలనుండి ప్రభుత్వాలు, కోర్టులు, పెట్టుబడీదారులు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణాన ఉధ్యోగ పరమైన సమస్యలపై కాకుండా, రాజకీయ ప్రక్రీయలో భాగంగా కేవలం ప్రభుత్వ రంగ/కార్పోరేషన్ ఉధ్యోగులు మాత్రమే సమ్మెకు దిగడం అంటే వెరొక చర్చకు దారి తీస్తుంది.

    1. తెలంగాణాలో ఎటువంటి పెట్టుబడిదారుడికీ ఈ సమ్మె వల్ల నష్టం కలగలేదు.
    2. ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులకీ ఏమీ నష్టం జరగలేదు (ప్రైవేటు బస్సులయితే రు.200/- చార్జీని అమాంతం రు.800 కి పెంచి మరీ వారి వ్యాపారాని వృద్ధిచేసుకున్నాయి.
    3. సమ్మె విరమించేటప్పుడు సమ్మె కాలానికి వేతనం గాని, లేక వేతనంతో కూడిన సెలవుదినాలగా ప్రకటించకుండా నాకు ఊహ తెలిసినప్పటినుండి ఏ సమ్మె విరమణ జరగలేదు. ఈ ధైర్యముతోనేనా అన్ని రోజులు సమ్మెచేసింది? యిప్పుడు కుడా అదేజరిగింది సమ్మె కాలానికి జీతం బదులుగా రుణం యిచ్చారు. (ఈ రుణం రికవరీ గురించి మాత్రం ఎవరూ మాట్లాడరు - బహుశా యిది నాన్ రిఫండబుల్ లోను అనుకుంటా!)
    4. ప్రజలలో అంత చైతన్యం వుంటే, సకల జనుల సమ్మె ఎందుకు జరగలేదు? కేవలం సకల ప్రభుత్వోధ్యోగుల సమ్మె మాత్రమే ఎందుకు జరిగింది? మందు/సినిమాలు కూడా బంద్ చేస్తామని గాలి కబుర్లు మాత్రం చేశారు. వారి వ్యాపారాలు వాళ్ళుచేసుకున్నారు.
    5. సరే సమ్మె హక్కు రాజకీయ పోరాటాలకు సైతం వుండాలనుకుందా! తెలంగాణా ఉధ్యోగస్తుల సమ్మెకు మద్దతు యిద్దాం. రేపు రాయపాటో లగడపాటో లేక యింకెవరో సమైక్యవాదానికి మద్దతుగా సకల జనుల సమ్మెకు పిలుపునిస్తే పరిస్థితి ఏమిటి? ప్రైవేటు కార్మికులు సమ్మెను జయప్రదం చేయకున్నా ప్రభుత్వోధ్యోగుల మాత్రం సమ్మె జయప్రదం చేస్తారు. అప్పుడు కూడా మీలాంటి వారు ఆ సమ్మెకు మద్దతు యిస్తారా? ఎటువంటి సందర్భంలో సమ్మెలు చేయాలి? ఎప్పుడు చేయకూడదు? సమ్మె ఎవరుచేసినా ఎందుకు చేసినా మద్దతు యివ్వలసినదేనా? గీటురాయి ఏమనా వుందా? యిది నా ప్రశ్నకాదు.. ఈ రోజు వార్తాపత్రికలు చదవగలిగే స్థాయి ప్రజల ప్రశ్న.
    6. నా ఉద్ధేశ ప్రకారం సమ్మె చేస్తున్న కార్మికుల సహేతుకమైనా డిమాండ్లు (ఉధ్యోగ పరమైన) లేకుండా సమ్మెకు దిగితే, ఈ పెట్టుబడీదారీ వ్యవస్థలో సమ్మె హక్కునేలేకుండా చేయాడానికి మధ్యతరగతి,మేధావి వర్గాన్ని చాలా సునాయాసంగా ఒప్పించగలదు ఈ ప్రభుత్వం. ఉదాహరణకు, మారుతీ-సుజికీ ఉధ్యోగూల సమ్మెనే తీసుకుందాం. ఒక్క నిమషం లేటుగా వచ్చినా, టీ సమయం 2:30 నిమషాలకంటే ఎక్కవ తీసుకున్నా, ఒకసారి కంటే ఎక్కువ సార్లు టాయిలెట్స్ కి వెళ్ళినా ఒకరోజు జీతం కట్ చేస్తారని విన్నాను. అటువంటి విషయాలపై వారితరుపున పోరాటాలు చేస్తే కనీసం మధ్యతరగతి ప్రజలకు దగ్గరవ్వొచ్చు. సమ్మెల వల్ల లాభాలు కనిపిస్తాయి శ్రామికులకు.
    (సశేషం...)

    రిప్లయితొలగించండి
  99. శ్రామికుల, పెట్టుబడీదారుల, విప్లవకారుల ఐక్య ఉధ్యమం:
    ఈ తెలంగాణ ఐక్య (శ్రామికులు, పెట్టుబడీదారులు, విప్లవకారులు) ఉధ్యమంలో జరిగే మంచి అంతా విప్లవకారులదే, చెడు అంతా కెసిఆర్ దే అంటే మింగుడు పడటం కష్టమే! బహుశా యిటువంటి ఐక్య ఉధ్యమం ప్రపంచంలో ఎక్కడా జరగలేదేమో? ఈ ఐక్య ఉధ్యమం (తెలంగాణ పెట్టుబడీదారులను కలుపుకొని) ఎవరిపైనా? అధికార రాజకీయనాయకులపైనా? కేంద్ర ప్రభుత్వం పైనా? ఆంధ్ర పెట్టుబడీదారులపైనా? నేను గమనించిందేమంటే, సీమాంధ్ర పజలపైనే కదా (కాకపోతే చిన్న స్టార్ మార్క్ కనీకనిపించుకుండా ఎక్కడో పెడతారు, సీమాంధ్ర పజలంటే సీమాంధ్ర ప్రజలందరూ కాదని, కేవలం సీమాంధ్ర పెట్టుబడీదారులని)?



    తాత్కాలిక ప్రయోజనాలు:

    యిటువంటి ఐక్య ఉధ్యమం కేవలం తాత్కాలిక ప్రయోజనాలాసించి మాత్రమే అంటే కొంత బాధగా వుంది! మెజారిటి ప్రజలు నమ్ముతున్న అభిప్రాయాలతో (అ పోరాటాలు శ్రామికుల అనైతికతకు/విప్లవ పందాను విఘాతం కలిగించేవైనా),కమ్యూనిస్ట్ పార్టీలు తాత్కాలికమైన ప్రయోజనాలు ఆశించి వారి సిథాంతాలను తనకాపెట్టడం వేరొక చర్చకు దారి తీస్తుంది.



    నేను చాలా వార్తా పత్రికలు, న్యూస్ ఛానల్స్ చూస్తూనే వుంటా, జాగ్రత్తగా గమనిస్తూనే వుంటా, ఏనాడు పబ్లిక్ గా ఆంథ్ర వలసవాదులన్న వారిని ఏ తెలంగాణ ప్రాంత కమ్యునిస్ట్ నాయకుడూ ఖండించిందిలేదు. ఆంథ్ర వాళ్ళు దోపిడీ దార్లు అన్న టిఆర్‌ఎస్ ని బహిరంగంగా ఖండించిన దాఖలాలూ లేవు. ఎవరైనా గట్టిగా చర్చవేదికలపై అడిగితే మాత్రం ఎప్పుడో రాసుకొని దాచుకున్న చిట్టీలు బయటకు తీసి చూపుతారు మేము ఆనాడే ఖండించాము అని.

    యింత ప్రజా చైతన్యం వచ్చింది, ప్రజల పక్షాన లేకపోతే దోషులవుతాము అన్నారు. మరి కెసిఆర్ నిరవధిక నిరహారదీక్షకు ముందు యింత ఉఘ్యమమే లేదు, ప్రజలలో స్పందనకూడా లేదు. అంటే, వామపక్షాల పాత్ర అస్సలు కనబడదు ఈ ప్రజా చైతన్యంలో. కెసిఆర్ వల్ల మాత్రమే ఎందుకు యింతప్రజా చైతన్యం వచ్చింది? అద్వానీ వల్ల మత్రమే భజపా రెండు స్థనాలనుండి అధికారాని వరకు వెళ్ళింది? స్నేహితుడను గ్రంథాలయానికి తీసుకువెళ్ళడం కష్టం గాని, సినిమాకు తీసుకువెళ్ళడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అదేవిధంగా కెసిఆర్ కూడా ఎక్కడో కంటికి కనబడని వందలలో వున్న ఆంథ్ర పెట్టుబడీదారులను అతను టార్గెట్ చేసుకోలేదు. సిమెంటు ప్యాక్టరీలోనో, షుగర్ ఫ్యాక్టరీలోనో, ప్రభుత్వోధ్యోగులనో లేక హైదరాబాద్ లో వివిధ కంపెనీలో చిరుధ్యోగాలు చేసే వారిని మాత్రమే టార్గెట్ చేశాడు. వీరు లేకపోతే ఈ ఉధ్యోగాలన్ని మన తెలంగాణా ప్రజలకే దక్కేవని ఆశలు చూపించి వ్యక్తిగత రాగద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారామాత్రమే ఈ ఉధ్యమం యింత స్పందన కనబడిందికాదంటారా? ప్రతీసారీ చెబుతారు ౬౦ ఏళ్ళ పోరాటమని, నేను హైదారాబద్ వచ్చి 15 సంవత్సరాలైంది. తెరాసా పెట్టే వరకు యిక్కడ తెలంగాణ ఉధ్యమం వుందని నాకు తెలియదు.. ఎవరది లోపం?
    (సశేషం...)

    రిప్లయితొలగించండి
  100. సరే తెలంగాణ వస్తే గాని ప్రజల కష్టాలు కొంత మేరైనా మెరుగు పడతాయని భావించాలంటే, తెలంగాణా లో విప్లవకారులు అధికారంలోకి వచ్చే అవకశమే లేదు. సీమాంథ్ర పెట్టుబడీదార్లకు తీసుపోనటువంటి కేసీఆర్ మాత్రమే లీడర్! తెలంగాణ వచ్చిన తరువాత కూడా పోరాటం కోనసాగుతుంది అన్నారు. మీరు పోరాటం చేస్తే పజలు మీ వెంటే వుంటారని గ్యారెంటీ ఏమైనా వుందా? యిప్పుడేమయింది. కెసీఆర్ ఏదోరకంగా కూడాకట్టాగలిగాడు కాబట్టి ఉధ్యమం ఈ స్థాయి కి వచ్చింది. అంటే తెలంగాణ వచ్చిన తరువాత మళ్ళీ పోరాటాలకు మీరు నాయకత్వం వహించాలంటే, మళ్ళి యింకో లీడర్ పుట్టాలేమో యిప్పటి ప్రత్యేక తెలంగాణ ఉధ్యమం లాగ ఎదో ప్రజలకు తాత్కాలికమైన ప్రయోజనాలు చేకూర్చే ఉధ్యమం.

    యింకొక విషయం తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ కోరుకుంటున్నారు, ఉధ్యమాలు చేస్తున్నారు అంటున్నారు. ప్రజల నాడిని యిప్పటివరకూ ఎవరైనా కనిపెట్టగలిగారా? ఎవరైనా కనిపెట్టాగలిగి వుంటే, పార్లమెంటు ఎన్నికలప్పుడైనా, శాసనసభ ఎన్నికలప్పుడైనా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఫలితాలు వచ్చేవరకు చెప్పలేని పరిస్థితి ఎవరిదైనా.. అలాంటప్పుడు.. తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ కోరుకుంటున్నారని పదే పదే ఎలా చెప్పగలగుతున్నారు? అదేవిధంగా సీమాంధ్రలో ప్రజలలో సమైక్యవాదం అస్సలు లేదని ఎలా చెప్పగలగుతున్నారు? గట్టిగ అరిచినవారిదే నిజమైన వాదమా?

    సమైక్యవాదం బలపరుస్తూ బహిరంగంగా వివరించే సాహసం ఎవరైనా చేయగలరా యిప్పటి పరిస్థితిలో? ప్రజల మధ్య వైషమ్యాలు లేవని మీరు అంటున్నారు? ఎలా నమ్మేది? స్వానుభవం కూడా మాకుంది. ఆఫీసులలో తెలంగాణేతర, తెలంగాణ ప్రాంత చిరుధ్యోగూలమధ్య స్నేహపూర్వకమైన సెటైర్స్ అయినా కొంత మనస్సులో బాధించక మానవు. "మీ ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి దోచుకున్నది చాలు యింక మీ ప్రాంతంకి పారిపో" అని సరదాగా తెలంగానేతురులను అంటే. బయటికి నొచ్చుకోక పోయినా, మనస్సులో ఎంత బాధగా వుంటుంది? మా ఊరిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక్ పాలిటెక్నిక్, మూడు ఐటి‌ఐ లు వున్నాయి. వారు చదువు పూర్తి చేసిన తరువాత ఏమి చేయాలి? హైదాఅబాదే దిక్కు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హోదాలో డిఫెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ప్రవేటు కంపెనీలన్నీ హైదరాబాద్‌లోనే తగలడ్డాయి. ఈ కేంద్రీ కృతమైన ఈ అభిరుద్దిని ఏనాడు విమర్శించలేదు. ప్రజల మధ్య వైషమ్యాలు లేకుండా చేయడానికి భాద్యతా పరులెవరైనా గట్టి ప్రయత్నం ఏమైనా చేశారా బహిరంగంగా? భిగ్గరగా? కనీసం ఒక్కటి నాకు చూపండి!

    యింకొక సందేహం,. ఉత్తరప్రదేశ్ ని నాలుగు ముక్కలు చేయాలన్న మాయావతిని మీరు సమర్థి స్తారా? నాలుగు ముక్కలు చేస్తే నాలుగు చోట్లా కూడా ప్రజలు తాత్కాలికమైన ప్రయోజనాలు పొందే వీలుంటుంది కదా? మీరు సమర్థిస్తారా? విచిత్రమేమిటంటే, దేశాన్ని 100 రాష్ట్రాలు గా విడగొట్టాలన్న ప్రతిపాదన వున్న RSS/BJP కూడా వ్యతిరేకిస్తుంది.

    రిప్లయితొలగించండి
  101. మీరు ఒక రుణ అవసరం?
    మీరు చెడు క్రెడిట్ ఉందా?
    మీరు బిల్లులు చెల్లించడానికి అవసరం?
    మీరు ఒక కొత్త వ్యాపార మొదలు అవసరం?
    మీరు పేద నిధులు కారణంగా చేతిలో పూర్తికాని ప్రాజెక్ట్ను ఉందా?
    మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి
    standardloan1990@outlook.com

    రిప్లయితొలగించండి
  102. Saya seorang pemberi pinjaman David Johnson dari sebuah syarikat pinjaman yang diluluskan dan disahkan oleh kerajaan. Adakah anda memerlukan pinjaman peribadi atau perniagaan, adakah anda berada di dept dan memerlukan kewangan penyatuan? Kami menawarkan pinjaman pada kadar faedah yang sangat rendah 2%. Adakah anda bosan mencari pinjaman, bimbang tidak lagi kerana kami sepenuhnya di sini dan bersedia untuk membantu anda daripada masalah kewangan anda.Adakah anda telah scammed, Mengapa mati dalam keheningan? Terapkan dan terima pinjaman anda. Perbadanan hari ini semasa menawarkan last..Interested orang harus menghubungi kami melalui E-mel (davidjohnsonloanfirm1@gmail.com)

    రిప్లయితొలగించండి