- కనీసం సుష్మాస్వరాజ్ గారు అప్పటి భాజపా రాష్ట్ర అధ్యక్షులు దత్తాత్రేయ గారు వైఎస్‌ఆర్ కి కుప్పలుకుప్పలుగా రాసిన బహిరంగ ఉత్తరాలు గురించి తెలియకుండా మాట్లాడుతున్నారా? ఆంటే దత్తాత్రేయగారి బహిరంగ ఉత్తరాలు ఉట్టిట్టివేనా? వైఎస్‌ఆర్ చాలా నిజాయితీ పరుడని వారి అధిష్టానానికి అంతర్గతంగా తెలియజేశారా?
- చనిపోయిన వారి గురించి చట్టం మాట్లాడకూడదంటే, భోఫోర్స్ కుంభకోణం గురించి చనిపోయిన రాజీవ్‌గాంధి పేరు మీరు మాటమాటికి ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
- నాటి ఎమర్జన్సీ కాలంలో జరిగిన అరాచకాలనూ ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించకండి ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా చనిపోయారుగా.
- సుష్మారాజ్ గారి ఉపన్యాసం "నవ్విపోదురు జనులు నాకేంటి సిగ్గు" అన్నచందంగా వుంది.
- అదీనూ పార్లమెంటు ప్రత్యేక సమావేశం లోకపాల్‌పై చర్చిస్తానికి, సందర్భరహితంగా వైఎస్‌ఆర్ అవినీతిని సమర్థిస్తూ, జగన్ అక్రమ వ్యాపారాలపై సిబిఐ దాడులను ఖండించడం అంటే... బరితెగించడమే అధికారం కోసం.
"The late YSR name in the FIR registered against Jagan in the alleged illegal wealth case is a clear example of the CBI being used for the selfish gains of the congress party." |
విడ్డూరం:
- మతుండి మాట్లాడుతున్నారో లేదో కూడా అనుమానం రాక మానదు. జలయజ్ఞం పనులలో చాలా అవినీతి జరిగిందనంటలో అతిశోయక్తి ఏమీవుండదేమో... అంతెందుకు, ఒక్కపట్టి భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు నూరుకు పైగా బహిరంగ ఉత్తరాలు అప్పటి రాయడం అందరికీ తెలిసినదే. ఆయన బ్రతికే వుండుంటే, కోర్టులూ యింత క్రీయాశీలంగా వుంటే, సిబీఐ యింత చలాకీగా వుండి వుంటే వైఎస్‌ఆర్ మొదటి ముద్దయే అనండంలో ఎవరకీ సందేహముండకర్లా! ఆంటే వైఎస్‌ఆర్ కాలంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో వున్న భాజపా అనవసర రాధాంతం చేసిందని ఒప్పుకుంటున్నారా?
- యిక జగన్ ఆస్తులు అన్యూహంగా పెరగడం, సాక్షిలో జలయజ్ఞం గుత్తేదార్ల అక్రమ పెట్టుబడుల గురించి భాజాపా మాజీ జాతీయ అధ్యక్షుడైన వెంకయ్యనాయిడుగారు ఎన్నిసార్లు విమర్శించి వున్నారో ఆయినికే గుర్తుండి వుండదు. అంటే భాజపా కి జగన్ గురించి బాగాతెలిసే వుండి కూడా "తప్పుడు ఆర్థిక నేరారోపణ" అని సుష్మాస్వరాజ్ గారు ఏలా అనగలిగారో?
ఏదోరకంగా దేశంలో అధికారమే పరామావధిగా కాంగ్రేస్ పార్టీని మించి అవినీతి/అలౌకిక విధనాలతో సమతూగ గలిగే ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ నీరూపించుకుంది యింకొకసారి పార్లమెంటు సాక్షిగా ఈరోజు.
అలౌకిక విధానం
కాంగ్రేస్: మైనారిటీ మతస్థుల ఓట్లపై పిల్లి మొగ్గలు
భాజాపా: మెజారిటి మతస్థుల ఓటర్లను ఏకంచేసి గుత్తంగా వారికి మళ్ళించుకోవడం
అవినీతి:
కాంగ్రేస్: అవినీతి గురించి యిక్కడ రాసేంత టైమ్ నాకులేదు..
భాజపా: (నాకు గుర్తున్నవాటిలో కొన్ని..)
- ఎల్.కె.అద్వాని - 1.8 అమెరికా డాలర్ల హవాలా కుంభకోణం
- ప్రమోద్ మహాజన్ అంబానీల స్నేహం - టెలికం రంగంలో అంబానీలకు గుత్తంగా లైసెన్స్‌లు కట్టబెట్టి దేశంలోనే అంబానీలను అత్యంత దనవంతులను చేసింది.
- దక్షణ భారత దేశంలో ఏలాగైనా అధికారం చేపట్టాలని, దక్షణ భారత దేశంలో మతతత్వానికి ఓట్లు పడవని ఒకటీ,రెండు సీట్లకంటే ఎక్కవరావని గ్రహించిన భాజపా, అవినీతికి కొమ్ముకాసి మైనింగ్ మాఫియా అయిన గాలి బ్రదర్స్ ని చేరదీసి వారి అవినీతి సొమ్ముతో కర్నాటకాని హస్తగతం చేసుకోకలిగింది. గాలి సోదర్లూ, యడ్యూరప్ప అవినీతి చేస్తున్నాడని తెలిసినా వారిని సిగ్గులేకుండా వెనకేసుకొచ్చింది కేవలం అధికార దాహార్థం.
- యిప్పుడు అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‌కి కూడా అమలు చేయాలునుకుంటుంది. సుష్మాస్వరాజ్ కు గాలి బ్రదర్శ్ నమ్మిన బంట్లని అందరకీ తెలిసిందే. వారి యింట్లో జరిగే చిన్నపాటి కార్యక్రమాలకు సైతం ఆమె హాజరు తప్పనిసరి. అదేవిధంగా గాలి సొదర్లు, జగన్ మధ్య లింకు గురించి వేరే చెప్పక్కర్లేదు. వీరి త్రికోణపు బంధంతో యిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాలుమోపాలని ప్రయత్నంగా కనబడుతుంది.
very well said
రిప్లయితొలగించండితామూ, జగనూ కాంగ్రెస్‌కు వ్యతిరెకపక్షంకాబట్టి ఇప్పుడు ఈ రెండు పార్టీలూ దోస్తానా వెలగబెట్టాలనే పాతచింతకాయ పచ్చడి సిధ్ధాంతం తప్ప ఈమె మాటల్లో మరింకేమీకనపడటంలేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే రేప్పొద్దున కాంగ్రెస్‌ను కాదంటే ఎన్నుకోవలసింది వీళ్ళను. వీళ్ళరంగేమో మీరన్నట్లుగా కర్ణాటకలో అలా తగలడింది. సుష్మాస్వారాజ్ మీద నాకున్న సదభిప్రాయం కడిగేసినట్లు మాయమయ్యింది.
రిప్లయితొలగించండిShe is foul mouthed Kapil Saibal in BJP. Anyway, Marxists were partners of the UPA and their corrupt deeds. Somanath could not leave his chair having tasted the congress's hospitality. :D
రిప్లయితొలగించండిGarapati Chowdary
రిప్లయితొలగించండిSushma Swaraj also joined J-Gang.
inka FIR lo mana Raja of Corruption YSR peru undhani kondharu gola cheyadam chusthe vari mohan meedha ummi veyalanpisthundhi... chanipoyinantha mathrana okkasariga raakshasulu dhevullu aiporuga...
Ramayanam lo Raavanudine theskundham, athadu manchi siva bhakthudu...okka seetha vishayam lo thappa migilina vishayalalo chala goppa vadu...alanti ravanudine thappu chesadani ramudu champaka kuda raakshasudu gane chusthaam...raavanudu chanipoyina rojuna pandugalu kuda cheskuntam... anthati purana purushude chanipoyina kani inka raakshasudey... alantidhi oka faction family nunchi vachhi, rajakeeya hathyalu chesi dhesam nivverapoyentha avineethi chesina YSR ki, athadi koduku ki kondharu MLA lu, media support cheyadam siggu chetu... inka oka pakka Anna ki jai koduthu inko pakka jagan ki vathhaasu palukuthunna BJP vaallani inka emanalo....
http://www.facebook.com/garapati.chowdary
ఒక పాత జోక్- అలాఉమ్మేసి మాట్లాడకు మనం రాజకీయాలు మాట్లాడుతున్నామనుకుంటారు.
రిప్లయితొలగించండిMy 2 cents...
రిప్లయితొలగించండిఈ పోస్ట్ పత్రికల వక్రీకరణ కు కొనసాగింపు గానే కనపడుతోంది.
I have listened 3 times of her speech, But I couldn't derive into that conclusion.
జన లోక్ పాల్ పై చర్చలో భాగంగా, CBI లోక్ పాల్ పరిధి లో ఉండాల్సిన ఆవస్యకతను వ్యక్తపరుస్తూ, CBI ని కాంగ్రెస్ ఏ విధంగా దుర్వినియోగ పరుస్తోందో తెలియజేస్తూ, కాంగ్రెసు లో ఉన్నంతవరకూ జగన్ అవినీతిని పట్టించుకోని కాంగ్రెసు పార్టీ, బయటికి పోగానే అవినీతి పరుడు గా ఎలా అయ్యాడు. That's the context of her speech.
Here again,(from onwards my opinion..) CBI inquiry is being ordered by High court with Congress Minister Shankar Rao's petition. Prior to this TDP leaders have filed several cases, but no court was heard of those.
I'm no BJP or Sushma's fan, but strongly believe that Congress is no holy cow and if Jagan joins them all CBI cases would be closed down.
DrVvln Sastry-
రిప్లయితొలగించండి@Besides Gali Brothers lineage, for BJP in A.P., both TRS and YSR Congress will be their natural allies in post poll scenario, hence BJP will not leave an opportunity to support them. But it's a toughest thing for them to Crack support from AP. The real culprit for today's pathetic scenairo in AP is BJP with their slogan one vote-two states. Though Venkayya Naidu a great orator he could never visualize the side effects of their loose political statement which they made at KAKINADA that too keeping in mind their future political life.
http://www.facebook.com/profile.php?id=100000894689250&sk=info
/ఈ పోస్ట్ పత్రికల వక్రీకరణ కు కొనసాగింపు గానే కనపడుతోంది/
రిప్లయితొలగించండిYes, you are right. But, BJP failed to clearly highlight its point that if Jagan is corrupt, why not YSR? The timing is also wrong.
Anyway BJP should pay price for its stupid & opportunistic stand on Telangana seperation, in view of Adwani's letter to Narendra.
I hate cheap and unethical politics being played by Sushma Swaraj.
@కాంగ్రెసు లో ఉన్నంతవరకూ జగన్ అవినీతిని పట్టించుకోని కాంగ్రెసు పార్టీ, బయటికి పోగానే అవినీతి పరుడు గా ఎలా అయ్యాడు. That's the context of her speech....కాబట్టి జగన్ ని ప్రశ్నించకూడదా?
రిప్లయితొలగించండిCBI inquiry is being ordered by High court with Congress Minister Shankar Rao's petition. Prior to this TDP leaders have filed several cases, but no court was heard of those.
కోర్టులను నమ్మరు...సీబీఐ ని నమ్మరు...ప్రతిపక్షాలు చేసే ఆరోపణల మీద ప్రత్యారోపణలు చేస్తారు...ఎలాగోలా మొత్తమ్మీద ఈ లక్షల కోట్ల అవినీతి మీద విచారణ జరుగుతుంటే తినేసిన పెద్ద మనిషిని సపోర్ట్ చేసే ఆర్గ్యుమెంట్లు చేస్తారు...మీ భారత జాతి ఎప్పుడు బాగు పడుతుంది నాయనా??
విజ్ఞులు గుర్తించాలి.. నేను వేసిన ఈ టపా ఏ పత్రిక ఆధారంగా రాసింది కాదు. నేను ఆమె ప్రసంగం టి.వి లో చూడాగానే వ్రాసినది. టపా యొక్క తేదీ, సమయం గమనించండి.
రిప్లయితొలగించండిఅవినీతి ఏ రాజకీయపార్టీ లేదా ఏ వ్యక్తి చేసినా ఖండించాలి.. కాని వారికి యిష్టమయవారి అవినీతిని సమర్థిస్తానికి మాత్రం "రీజన్స్" వెతకడం బహుబాధాకరం!
ఉదాహరణకు: జగని అవినీతి ని సమర్థిస్తానికి జగన అభిమానులు,భాజపా వాదుల "రీజన్స్" (ఒంకలు/డొంకలు)...
౧. సిబిఐ ని వాడుకొంటున్నారు..
౨. కోర్టులను మంత్రులద్వారా ప్రలోభపెడుతున్నారు.
౩. కాంగ్రేస్‌ని వీడటం వలనే ఈ సిబిఐ దాడులు
౪. వైఎస్‌ఆర్ పేరును పాడుచేయాడానికే ఈ దాడులు..
నేను యిదివరకు రాసిన టపా (అవినీతిని నిర్భయంగా సమర్థిస్తానికి మూల కారణాలు...) నిజమని మరోక్కసారి నాకు నమ్మకం కలిగింది.
@ కాని వారికి యిష్టమయవారి అవినీతిని సమర్థిస్తానికి మాత్రం "రీజన్స్" వెతకడం బహుబాధాకరం!
రిప్లయితొలగించండిexcellent...చాలా సింపిల్ గా చెప్పారు...జగన్ ను విమర్శించే వాళ్ళను...మానసికంగా అటాక్ చేయడానికి కూడా చీప్ ట్రిక్స్..play చేస్తున్నారు..
http://kvsv.wordpress.com/2011/08/29/%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE/
కాంగ్రేస్: అవినీతి గురించి యిక్కడ రాసేంత టైమ్ నాకులేదు.
రిప్లయితొలగించండిWrite the full details about Congress (Nehru, Indira, Rajiv, Sonia, etc) corruption after 1947
'Write the full details about Congress (Nehru, Indira, Rajiv, Sonia, etc) corruption after 1947"
రిప్లయితొలగించండిహమ్మ్మ! నా సమయానంతా వృధా చేపిద్దామాని మీ ప్లానా? మీ బుట్టలో నేను పడనులెండి!
Rayala Seema
రిప్లయితొలగించండి1957.. హరిదాస్ ముంద్రా స్కాం. కలకత్తాకు చెందిన ముంద్రా పారిశ్రామిక వేత్త, స్టాక్ స్పెక్యులేటర్. అప్పట్లో కొత్తగా నెలకొల్పిన భారతీయ జీవిత భీమా సంస్థ షేర్లను ముంద్రా ఫోర్జరీ చేశాడు.
1971..నగర్ వాలా స్కాం. ముక్తి భాహిని అనే మహిళ ఇందిరాగాంధీ గొంతును అనుకరించి ఎస్ బీ ఐ ఛీఫ్ క్యాషియర్ వేద్ ప్రకాష్ మల్హోత్రాకు ఫోన్ చేశారు. మాజీ ఆర్మీ అధికారి రుస్తం సోహర్బ్ నగర్ వాలా వెళ్లి మల్హోత్రా నుండి రూ.60 లక్షలు తీసుకున్నాడు.
1982..ఏ ఆర్ అంతులే స్కాం..ఇందిరాగాంధీ పేరు మీద ట్రస్టు మొదలు పెట్టి ప్రభుత్వం నుండి కోటాకు మించి సిమెంటును తీసుకెళ్లారు.
1989..బోఫోర్స్ కుంభకోణం. దేశాన్ని కుదిపేసిన కుంభకోణం ఇది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హస్తమున్న కుంభకోణం. 400 మిలియన్ డాలర్లు దీనిలో చేతులు మారాయి.
1992..హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం. నాలుగు వేల కోట్ల కుంభకోణం.
1992..పామోలిన్ కుంభకోణం(కేరళ). మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్, మరో ఏడుగురు దీనిలో ఉన్నారు.
1995..పురూలియా అక్రమ ఆయుధాల కేసు. అటానోవ్ ఎఎన్ 26 హెలికాప్టర్ లో ఏకే 47 తుపాకులు, మిలియన్ల కొద్ది బుల్లెట్లు డిసెంబర్ 17 1995న పురూలియా జిల్లా జలద, బెలాము గ్రామాలలో పడవేశారు. తరువాత ఆ ఆయుధాలు విడిచిన హెలికాప్టర్ ముంబయి రక్షణ శాఖలో దర్శనమిచ్చింది. దీనిలో భారత వైమానికి అధికారుల హస్తం ఉన్నట్లు తేలింది.
1995..ఎస్ ఎన్ సీ లావాలిన్ స్కాం (కేరళ). విద్యుత్ సంస్థకు చెందిన కుంభకోణంలో రూ.374 కోట్ల నష్టం వాటిల్లింది. కేరళ మంత్రి పినరయ్ విజయన్ దీనిలో నిందితుడు.
1995..తెల్గీ నకిలీ స్టాంపుపేపర్ల స్కాం..అబ్దుల్ కరీం తెల్గీ చేసిన ఈ కుంభకోణం అంచనా రూ.20,000 కోట్లు.
1996..బీహార్ గడ్డి కుంభకోణం..రూ.950 కోట్ల కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ నిందితుడు.
1996..సుఖ్ రామ్ టెలికాం స్కాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రి అయిన సుఖ్ రామ్ టెలికాకం కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు రూ.3.6 కోట్ల రూపాయలు అక్రమంగా సూట్ కేసుల ద్వారా తీసుకుంటూ పట్టుబడ్డాడు.
1997..హవాలా స్కాం..18 అమెరికన్ మిలియన్ డాలర్ల హవాలా కుంభకోణంలో దేశంలోని ప్రముఖ నేతలు బీజేపీ నేత అద్వాని, వీసీ శుక్లా, మాజీ గవర్నర్ పి.శివశంకర్, శరద్ యాదవ్, బలరామ్ జక్కర్, మదన్ లాల్ ఖురానా తదితరులు ఉన్నారు. నలుగురు హవాలా బ్రోకర్ల ద్వారా నేతలు డబ్బులు తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి.
2001 ..కేతన్ పరేఖ్ సెక్యూరిటీస్ స్కాం..గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, మాదవపుర మర్కంటైల్ కో - ఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఈ స్కాంకు పాల్పడ్డారు.
2001..బరాక్ మిస్సయిల్ స్కాం.. రక్షణ శాఖలో జరిగిన కుంభకోణంలో సమతా పార్టీ నేత ఆర్కే జైన్, జార్జ్ ఫెర్నాండెజ్, జయా జైట్లీ, నేవీ అధికారులు సురేష్ నందా, ఎస్.ఎమ్.నందాలు ఉన్నారు.
2002 ..కార్గిల్ స్కాం..రూ.1762 కోట్ల విలువయిన కుంభకోణం ఇది. అప్పట్లో కార్గిల్ యుద్దంలో సైనికులు దీని మూలంగా నష్టపోయారు.
2003..తాజ్ కారిడార్ స్కాం..ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి నిందితురాలిగా ఉన్న 175 కోట్ల విలువైన స్కాంలో మాయావతి రూ.15 కోట్లు లాభపడినట్లు తేలింది.
2003..హడ్కో స్కాం..
2004..జియాంగ్ అపాంగ్ పీడీఎస్ స్కాం. పౌర సరఫరాల పంపిణీలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జియాంగ్ అపాంగ్ ది దీనిలో ప్రధాన పాత్ర.
2005..ఆయిల్ మరియు ఆహార పథకం స్కాం(నట్వర్ సింగ్)..మాజీ కేంద్ర మంత్రి అయిన నట్వర్ సింగ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు.
2006 ..నేవీ వార్ రూమ్ స్పై స్కాండల్..రూ.500 కోట్ల విలువయిన కుంభకోణంలో బ్రోకర్లు అభిషేక్ వర్మ, రవి శంకరన్, నేవీ అధికారి అరుణ్ ప్రకాష్ నిందితులు.
2006 కేరళ ఐస్ క్రీం పార్లర్ సెక్స్ స్కాండల్. .కేరళ ప్రజా ప్రతినిధులు కున్హలి కుట్టి, శశి, ఈకె నయనార్ లు దీనిలో నిందితులు.
2008.. సత్యం కుంభకోణం..ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రామలింగరాజు చేసిన భారీ కుంభకోణం ఇది. రు.
2008..ఓటుకు నోటు కుంభకోణం..యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని బీజేపీ ప్రజా ప్రతినిధులను మభ్యపెట్టని కేసు.
2008..హసన్ అలీ కేసు.. విదేశాలలో నల్లధనం దాయడం, ప్రముఖులకు బినామీగా వ్యవహరించడం, పన్నులు కట్టకుండా కోట్ల రూపాయల నల్లధనం దాయడం వంటి అభియోగాలు నమోదయ్యాయి.
2010 ..2జీ స్పెక్ట్రం కుంభకోణం.
ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ కుంభకోణం (ముంబయి)
కామన్ వెల్త్ క్రీడల కుంభకోణం
ఇంటి రుణాల కుంభకోణం
ఉత్తర ప్రదేశ్ ధాన్యం కుంభకోణం
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంస్థ భూముల కుంభకోణం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (క్రికెట్) స్కాం
2011.. స్విస్ బ్యాంకులో భారతదేశ నల్లధనం కేసు
నోయిడా కార్పోరేషన్ భూ కుంభకోణం
బళ్లారి గనుల కుంభకోణం
బీ ఎల్ కశ్యప్ కుంభకోణం