వీలుంటే నా నాలుగు లంకెలు ...

25, ఆగస్టు 2011, గురువారం

అవినీతి కేసులకు చిరునామ - రామ్ జేఠ్మలాని: బార్ కౌన్సిల్ నుండి బహిష్కరించాలి

రామ్ జేఠ్మలాని
        మన దేశంలో బయటకు వచ్చే అవినీతి శాతం చాలా  తక్కువ, వచ్చినా విచారణ అంఖం పూర్తి చేసుకొని కోర్టులవరకూ వచ్చేవి నామ మాత్రం. అటువంటి వాటిలో హైకోర్టులను దాటుకొని సుప్రీంకోర్టుకు వచ్చేవి బహు స్వల్పం.  అయితే అతిపెద్ద భారీ కుంభకోణం అయినా లేక ఏమైన సంచలన కేసయితే మాత్రం ప్రాస్‌క్యూషన్‌కి వ్యతిరేకంగా వాదిస్తానికి ఒక గంటకు లక్షలలో వసూలు చేస్తూ చేపట్టిన కేసులో నీతి, న్యాయం, ధర్మం, సామాజిక స్పృహ, దయ, జాలి లేకపోయినా పర్వాలేదు ఈ 88 సంవత్సరాల పేరొందిన సుప్రీమ్ కోర్టు న్యాయవాది రామ్ జేఠ్మలాని. న్యాయం ఎక్కడవుందో అక్కడ వాలిపోయి చట్టం ముందు అడ్డంగా అన్యాయానికి వకల్తా పుచ్చుకొని వాదించడం యితనిని మించినవారు ఎవరూలెరనుకుంటా.. అందుకనేమో అంత "డిమాండ్"

        అతని జీవితంలో ఎన్నో విధాలుగా కోర్టులను తప్పుదారి పట్టించి వున్నాడో ఈ మహానుభాహుడు! ఎందుకంటే, యితను చేపట్టిన కేసులు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగక మానదు...

మచ్చుగా కొన్ని జేఠ్మలాని వాదించిన బడా అవినీతి కేసులు (చాలావరకు ఓడిపోయినవే)..

  • నేను ఈ పెద్దమనిషి ఇందిరా గాంధి హత్యా నింధితుల తరుపున వకల్తా పుచ్చుకున్నపట్టినుండి గమనిస్తూనే వున్నా. కేసు ఫలితం: ఓటమి, ఊరిశిక్ష. కాకపోతే చాలా సంవత్సరాలు పాటు సాగదీయగలిగాడు.
  • హర్షద్‌ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ (రూ. 4,000 కోట్లు).  కేసు ఫలితం: ఓటమి, శిక్ష ఖరారు. కారాగారంలోనే నిండితుడి మరణం.
  • కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోనం:  కేసు ఫలితం: ఓటమి, సంవత్సరంపాటు కఠినగారగార శిక్ష.
  • హజీ మస్తాన్ మిర్జా (ముంబాయి అండర్ వరల్డ్ డాన్):  కోర్టులలో కేసులు నడుస్తుండగానే హత్యకాబడ్డాడు.
  • అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి నిందుతుడు): కేసు ఫలితం: ఓటమి. ఉరి శిక్ష ఖరారు
  • లాల్ కృష్ణ అద్వాని (1.8 కోట్ల అమెరికన్ డాలర్ల హవాలా కుంభకోణం): ఫలితం: డైరీ ఒక్కటే సాక్ష్యంగా పరిణగించలేమని కేసు కొట్టివేయ బడినది.
  •  జెస్సికలా హత్య కేసు (మను శర్మ): ప్రజల నుండి అంతర్ఖాల ద్వారా/సంక్లిప్త సమాచారాల ద్వారా/వార్తా చానళ్ళ ద్వారా వచ్చిన వత్తిడి వలన మను శర్మ, వికాస యాదవ్ & అమర్‌దీప్ సింగ్ ప్రస్తుతం తీహార్ చెరసాలలో వున్నారు
  • సొహ్రాబుద్దిన్ బూటకపు ఎన్‌కౌంటర్ (అమిత్ షా): గుజరాత్ లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాని గుజరాత్ లో అడుగు పెట్టకుండా సుప్రీం తీర్పు...
  •  అమిత్ జోగి (ఛతిస్‌ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు) ముడుపుల కేసు: ఓటమి, జైలుపాలు.
  • 2G కుంభకోణం (కనిమోలి): కనీసం బెయిల్ కూడా యిప్పించే స్థితిలో లేడు ఈ లాయరు సార్!
  • వై.ఎస్.జగనమోహన్ రెడ్డి -   చీటింగ్, అక్రమ పెట్టుబడుల కేసు: ఈరోజే వాదనలు మెదలు సుప్రీంలో.. కనీసం వీరి వాదనలు వినే స్థితిలోనే లేదు..
  • యింకో చాలా ఆసక్తి కలిగే కేసు... మాజీ కర్నాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్ప అవినీతి కేసు. మైనింగ్ కుంభకోణంలో లోకాయుక్త ఎంతో సవివరంగా ఆధారాలతో నిరూపించిన యితని అవినీతికి వకల్తా పుచ్చుకొని కర్నాటక హైకోర్టు కు బయలు దేరారు. ఏమవుతుందో చూడాలి.
మీకింకా ఏమైనా అనుమానమా? పైన చెప్పిన అన్ని కేసుల పరిష్కారం ఏమయిందో చూసిన తరువాత కూడా!

రామ్‌ జేఠ్మలాని కోరుకొనేవి:
  • పేరు ప్రఖ్యాతలు - మంచికో.. చెడుకో..(ఉచిత పబ్లిసిటి)
  • సంపద - బడా కుంభకోణాలలో అయితే రాబడి బాగా వుంటుంది (గంటకు లక్షల్లో). 
  • పై రెండిటికి సమర్థన:  భారత రాజ్యాంగంలోని..సహజ న్యాయసూత్రాలు అందరికి అందివ్వాలని (క్రూరులైనా, దుర్మార్గులైనా, ఉగ్రవాదులైనా, మతవాదులైనా ఒక్కటే)
యింకో విచిత్రమేమిటంటే, భారతీయ జనతా పార్టీ కూడా యితని విషయంలో వింత ప్రవర్తన... 2004 ఎన్నికలలో అటల్ బిహారీ వాజపేయ్ కి వ్యతిరేకంగా స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన యితనిని, 2010 లో భాజాపా తరుపున రాజ్య సభకు పంపింది యిటువండి వాడిని.

దక్షణ  భారతంలో బారీ అవినీతి కేసులన్నింటినీ  యితనే వాదిస్తున్నాడన్నమాట..
  • కనిమోళి టీవీ - అక్రమ పెట్టుబడులు (తమిళనాడు)
  • మైనింగ్ కుంభకోణం (కర్నాటక)
  • ఛీటింగ్, అక్రమ పెట్టుబడులు - సాక్షి, సండూర్ ( ఆంధ్రప్రదేశ్)

నా ఉధేశం ప్రకారం యిటువంటి వారిని బార్ కౌన్సిల్ నుండి బహిష్కరించాలి. ఎందుకంటే, అతను తన క్లైంట్స్‌ని రక్షించుకొనుటకు ఎన్నిసార్లు తప్పుడు వాదనలు, అబద్దాల, కోర్టులను తప్పిదారి పట్టంచి వుండోచ్చు!

9 కామెంట్‌లు:

  1. kasab ni vadilesaadu yenduko gaani. bahusaa isi dabbulu ivvaledanukuntaa

    రిప్లయితొలగించండి
  2. ఈ ముసలోడిది బుల్ డాగ్ మొహం అని రాజీవ్ గాంధీ బతికున్నపుడు ఒకసారి విసుక్కున్నాడు. కుక్క లాగా దొంగయినా దొరయినా విశ్వాసం చూపడం ఈ ముసలి గుంటనక్క గుణమేమో. డబ్బు కోసం గడ్డి కరిచే కుక్క అని నా ఉద్ధేశ్యం.

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత8/25/2011 06:34:00 AM

    :)
    ఇది అర్థంలేని నింద. జట్మా పట్టి కేసులన్నీ పనికిమాలినోళ్ళవి, అందులోనూ వాటిని కొట్టివేసేలా వాదించి న్యాయం చేస్తున్నాడు, మంచిపనేగా! దొంగ వెధవల సీక్రెట్లన్నీ వాళ్ళ లాయర్‌గా ఏ బుక్కో రాసి చస్తే దేశానికి కూడా మంచి చేసిన వాడవుతాడు.

    కనిమొళి విషయంలో వాదించినది నాకు నచ్చింది. ఏమన్నాడంటే -" కనిమొళి ఓ స్త్రీ/తల్లి అనే పవిత్రమైన భావంతో బెయిల్ ఇవ్వమని" కోర్టుకు విన్నవించాడు. అంటే ఇంతకన్నా చెప్పుకోదగ్గ బేవార్స్ బెయిలబుల్ రీజన్ నాకు పీనల్ కోడంతా తోడినా కనిపించలేదహో అంటూ జడ్జి గార్కి సంకేతం ఇచ్చినట్టే కదా?

    కాబట్టి , మై లార్డ్.... ఆయన వుండాల్సిందే ... దొంగెదవల ముక్కుపిండి వసూల్ చేయడమే కాదు, శల్యుడిలా పక్కనుండి 'న్యాయంగా' బొంద పెడతాడు.

    రిప్లయితొలగించండి
  4. >>>>>
    లాల్ కృష్ణ అద్వాని (1.8 కోట్ల అమెరికన్ డాలర్ల హవాలా కుంభకోణం): ఫలితం: డైరీ ఒక్కటే సాక్ష్యంగా పరిణగించలేమని కేసు కొట్టివేయ బడినది.
    >>>>>
    డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఎవరిది? క్రిమినాలజీ & ఫోరెన్సిక్ నిపుణుల చేత పరిశీలన చెయ్యించారా?

    రిప్లయితొలగించండి
  5. >>>లాల్ కృష్ణ అద్వాని (1.8 కోట్ల అమెరికన్ డాలర్ల హవాలా కుంభకోణం)
    ఈ కేసు కూడా రామ్ జెఠ్మలాని ప్రతిభవల్ల వీగిపోలా... ప్రాస్‌క్యూషన్, సిబీఐ అప్పటిలో అంత పట్టుదలగా సాక్షాల సేకరణ, విచారణ జరగక పోవడం వలన అద్వానిని జెఠ్మలాని బతికించేశాడు.

    రిప్లయితొలగించండి
  6. @mmd
    కసబ్ తరుపున మీరు ఖర్చు బరాయిస్తారంటే, ఈయన రెడీ!

    @KRISHNA
    "డబ్బు కోసం గడ్డి కరిచే కుక్క అని నా ఉద్ధేశ్యం"
    పాపం కనీసం ఆయిన వయస్సుకు విలువద్దాం...

    @Snkr
    >>>>దొంగ వెధవల సీక్రెట్లన్నీ వాళ్ళ లాయర్‌గా ఏ బుక్కో రాసి చస్తే దేశానికి కూడా మంచి చేసిన వాడవుతాడు
    చాలా మంచి సలహా... వింటాడంటారా?

    రిప్లయితొలగించండి
  7. పోలీసులు పెట్టే కేసులలో అన్నీ నిజాయితీగా మోపిన అభియోగాలేనని చెప్పగలమా? పోలీసులలో 50 శాతం నిజాయితీ ఉండవచ్చు.కనుక నిందితుల తరఫున వాదించడానికి విశాల హృదయం , సానుభూతి, ధైర్యం ఉండాలి. అవి ఉన్న వ్యక్తిగా రాం జఠ్మలానీ గారిని పరిగణించుదాం.

    రిప్లయితొలగించండి
  8. @అజిత్
    మీరు చెప్పినది నిజమే, పోలీసులు పలుకుబడి కలిగిన వ్యక్తులపై పట్టుమని ఒక్క శాతం కేసులు కూడా తప్పులు పెట్టి పెట్టరు. ఏమీలోనేడుపైనే వారి ప్రతాపం.
    యికపోతే, రామ్ జఠ్మలానీ గారైతే, వాదించినవన్ని.. దేశాన్ని దోచేసేని వారి తరుపనే...పైన చెప్పిన కేసులలో ఒక్కటైనా మీకు తప్పుడు కేసులాగ కనబడుతున్నాయా?

    రిప్లయితొలగించండి