వీలుంటే నా నాలుగు లంకెలు ...

11, అక్టోబర్ 2010, సోమవారం

సిగ్గు, లజ్జ లేని అధికార దాహం తొ భాజాపా/కాంగ్రెస్ నాయకత్వం...

2 వ్యాఖ్యలు
వెంకయ్యనాయుడు గారు ఇలా సెలవిచ్చారు... "కర్నాటకాలొ జరిగిన ముఖ్యమంత్రి విశ్వాసతీర్మాన విజయం  ప్రజాస్వామ్య విజయం" ఇంకనయం "రామ రాజ్యం" గెలుపు అనలేదు .

విప్ / ఓట్టింగ్ జరగకుండా పార్టీ ఫిరాయుంపుల చట్టం వర్తిస్తుందా? మూడోవొంతు సభ్యులు వేరే కుంపటి పెట్టుకునే అవకాశము ప్రస్తుత చట్టం కలిపిస్తుంది. స్వపక్షంలో అసమతి మూడొంతులు వుందా లేదా అనేది ఎవరు నిర్ణయించాలి? ఏవిధంగా  నిర్ణయించాలి?  ఎప్పుడు నిర్ణయించాలి? పార్టీ ఫిరాయుంపుల చట్టం స్వతంత్ర  సభ్యులకు ఎలా వర్తిస్తుందో బొత్తిగా బోదపడటం లేదు. ఇప్పుడు కర్నాటకాలో 11 మంది స్వపక్ష సభ్యులను ఐదగురు స్వతంత్రుల శాసనసభ సభ్యత్వం రద్దుచేసారు. అదికూడా విశ్వాస పరీక్షకు ముందు. ఇది ప్రజాస్వమ్యం కు పరాకాష్టంగా భావించొచ్చేమో! రేపు మరే శాసనసభలోనో విపక్ష సభ్యులను కూడా అనర్హత వేటు వేసి ఓట్టింగ్ జరిపించవచ్చేమో (స్వతంత్ర శాసన సభ్యులను అనర్హత వేటు వేసిన మాదిరిగా)!  ఎన్నికలప్పుడు ఎన్నికల అభ్యర్దులను నిలబేట్టేటప్పుడు వారికి పార్టీపై నిబద్దత వుందా లేదా అనేది కాకుండా, కేవలం గెలుపు గుర్రలు అనిచెప్పి ఎంత అవినీతి పరుడైనా, ఎంత అసాంఘిక  శక్తికైనా సీటు ఇచ్చినందుకు ప్రతిఫలమే ఈ ఫిరాయింపులు. మా శాసనసభ్యులను ప్రలొభ పెడుతున్నారు అని ప్రతిపక్షం పై ఏడుపు ఎందుకు? ప్రలొభపడేవాడు వుంటే ప్రలోభ పెట్టేవారూ వుంటారు. క్రితం సారి, ఈ భాజాపాయే కదా కాంగ్రేసు వారిని ప్రలొభ పెట్టి రాజీనామ చేయించి ఎన్నికలుకు వెళ్ళింది.

అవినీతికి మారుపేరైన జనార్ధన రెడ్డి సహాయంతో పాలన కొనసాగిస్తుండటం, భాజాప ని దేశవ్యాప్తంగా రామ పాలన సాధిస్తనికేనా? బాజాప అసలిరంగు ఈ అధికార దాహంతో బయటపడినందుకు దేశప్రజలు ఆనందపడాలి.  యిక కాంగ్రెస్ పార్టీ అధికారదాహం గురించి చెప్పె అంత వయసు నాకు లెదు.. ఎందుకంటే, 125 సంవత్సరాల నుండి దేశ ప్రజలు చూస్తూనే వున్నరు. అయినా వారికే ప్రజలు పట్టం గడుతున్నారు. అందుకేనేమో భాజాపా ధీమా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెసినా ఫర్వాలేదు అనుకుంటుంది.. కుహానా ప్రజాస్వామ్య వాదులంటే వీరుకాక మరెవరైనా వుంటారా?
 వెంకయ్యనాయుడు గారి ఉద్దేశం లోని ఈ ప్రజాస్వామిక విజయాన్ని చూసి మనం సిగ్గుపడదాం! ఎందుకంటే మనకు సిగ్గు లజ్జ వున్నాయి కదా.