వీలుంటే నా నాలుగు లంకెలు ...

18, మే 2011, బుధవారం

సీట్లు తగ్గినా ఓటింగ్‌ బలం పదిలం

1 వ్యాఖ్యలు
శాసనసభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ప్రజలతో మరింతంగా మమేకమవ్వడంపై దృష్టి కేంద్రీకరిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌ పేర్కొన్నారు. బెంగాల్‌ ఎన్నికల ఓటమిపై లోతుగా చర్చించి, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. 34 సంవత్సరాల అవిచ్ఛిన్న పాలన అనంతరం బెంగాల్లో వామపక్షాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్నారు. తన పాలనలో బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం చారిత్రాత్మక ప్రజానుకూల చర్యలను చేపట్టిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పు నినాదానికి అనూకులంగా నిర్ణయాత్మకంగా ఓటు చేశారని వ్యాఖ్యానించారు.

ఇవి కేవలం భ్రమలుగానే మిగిలిపోతాయి. వారి అభి ప్రాయం తప్పని భవిష్యత్తు నిరూపిస్తుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ బెంగాల్లో వామపక్షాలకు కోటీ 96 లక్షల ఓట్లు లభించాయి. 2009 ఎన్నికల కంటే ఇవి 11 లక్షలు అధికం. వామపక్ష కూటమి 41 శాతానికి పైగా ఓట్లను సాధించింది. 2009 ఎన్నికల అనంతరం చేపట్టిన దిద్దుబాటు చర్యల వల్లే పార్టీ ఓట్లు పెరిగాయి. ఐతే ప్రతిపక్ష కూటమికీ ఈ ఎన్నికల్లో 34 లక్షల ఓట్లు అధికంగా లభించాయి. మార్పు కోరుకున్న ప్రజల మనసులను మేం పూర్తిగా మార్చలేకపోయాం. ప్రజలతో మరింతగా మమేకమై, వారి హక్కుల రక్షణ కోసం సిపిఎం అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తుంది ' అని ఆయన చెప్పారు. ఫలితాలు వెలువడిన రెండ్రోజుల్లోనే రాష్ట్రంలో ముగ్గురు సిపిఎం కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు.

30, ఏప్రిల్ 2011, శనివారం

హిందూత్వవాదులారా కళ్ళుతెరవండి!

51 వ్యాఖ్యలు
     యిప్పటి అంచనాల ప్రకారం, సాయిబాబా ట్రస్ట్ విరాళాలు/సంపాదన లో ఒకటి లేక రెండు శాతం కన్నా ప్రజావశరాలకోసం ఖర్చుచేసినట్లు లేదు. దాతలు (భక్తులు కానివారుకూడా సమాజసేవకోసం ఉపయోగపడతాయని) యిచ్చిన విరాళాలను సమాజసేవకోసం కాకుండా స్థిర చర ఆస్తులగా మలుచుకొని ఆసోమ్మును బ్యాంకులో వేసుకుంటే వచ్చేవడ్డీకన్నా తక్కువమోత్తంలోనే 'సమాజసేవ‌' వున్నట్లు అర్ధంచేసుకోవడానికి ఆడిటర్‌కూడా అవసరం లేదు. ఐదారు జిల్లాలలో (మొత్తం నాలుగు రాష్ట్రాలలో కలిపి) ఈ సేవా కార్యక్రమాలను మొత్తం లోకకల్యాణము నెరవేర్చడంగా చిత్రీకరించడం చాలా దారుణం. రాబడి గాని, ఖర్చు గాని లెక్కాలేదు తొక్కలేదు. ప్రతీపైసాకి లెక్కవుందంటారు కాని చూపరు. ప్రభుత్వానికి ఎప్పటికప్పటికి  తెలుపుతుంటామంటారు. ప్రభూత్వమూ ప్రజలకు తెలపదు. ప్రభుత్వముకు అంతా భాద్యతే వుంటే ప్రశాంతి నిలయంలో 1993 నాటి కాల్పుల కేసుపై యిప్పటికీ చార్జ్‌షీట్ పెట్టకుండా వుండేదా? కాల్పులు, చనిపోవడం మిధ్యకాదుకదా!

    ట్రస్ట్‌ దగ్గర వున్న సొమ్ము బాబా మహిమలతో సృష్టించినది కాదు ప్రజల డబ్బే. సాయిబాబా కష్టపడి సంపాదించినది కాదు. కేవలం విరాళాలతో సేకరించినదేననటం ఎవరూ కాదనలేనటువంటి నిజం. నిజంగా మహిమలుంటే విరాళాలు సేకరించడం దేనికి? మహిమలతో గాలినుంచి బంగారం సృష్టించేబదులు, పేదప్రజలకు కనీసం ఒకపూట ఆకలి తీర్చలేకపోయారు? అకాలవర్షాలతో రైతన్న నష్టాలబారి చేసుకున్న ఆత్మహత్యలను ఆపలేకపోయరు కనీసం బాబాగారు అవతారపురుషిడిగా ప్రకటించుకున్నరుకదా వర్ణుడితో చెప్పి ఆపించవచ్చుకదా!

     ఇటువంటి నీచపు సామ్రాజ్యాన్ని హిందూ ధార్మికతతో ముడిపెడుతున్న వారు హిందూత్వవాదులు కాదు వారు కుహానా హిందూత్వవాదులే. యిది నాస్థికులుగాని/వామపక్షవాదులుగాని హిందూత్వంపై చేస్తున్న దాడికాదు. హిందూధార్మిక బావజాలంతో /బాబాల పేరుతో అమాయక ప్రజలతో వ్యాపారం చేసుకుంటున్న వారే.

20, ఏప్రిల్ 2011, బుధవారం

సాయిబాబా! భక్తులకోసం కనీసం కళ్ళుతెరవాలి!

3 వ్యాఖ్యలు
బాబాగారి దయనీయమైన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మానవత్వం కలిగినవారికెవరికైనా ఆందోళనకరమే. కాని కొంతమంది భక్తులు మాత్రం మానవులకు బాబాగారి పెట్టిన ఒక పరిక్షని నీచపు మాటలు మాట్లాడుతున్నారు.  మోన్నటివరకూ వీలుకుర్చీలో పాకుంటూ, యిన్ని రోజులు చావుబతుకులమధ్య సామాన్య మానవుడవలే కష్టాలు పడుతుంటే, కడుపుతర్రుక్కుపోతుంది ఏ మనిషికైనా.

బాబా, సాయి బాబా, నీ శరీరానికి పడుతున్న కష్టం ఓ మానవ జీవిగా చూడలేకపోతున్నారు నీ భక్తులు కానివారుకూడా. కొంతమంది నీభక్తులైతే నిద్రాహారాలు మాని కుసించినసిస్తున్నారు. కనీసం వారికోసమైనా నీవు లేవాలే. నిల్చోని పరిగెత్తాలే (సారీ, నిలబడమనడం కూడా అత్యాశే అనుకుంటా) కనీసం కళ్ళుతెరువు బాబా. నీ అసలైన మహిమలు చూపించ్చే సమయం ఆసన్నమైనది. నీ మహిమలు నమ్మని జీవులకు కూడా కనువిప్పుకలుగుతుంది. లేకపోతే నిన్ను, నీమహిమలను నమ్మిన భక్తులకు నోటిమాట రాదు బాబా.

(కామెంట్స్ వ్రాయాలునుకుంటే ఒక షరతు! బాబా గారి మహిమలు గురించి మాత్రమే వ్రాయండి. బాబాగారు చేసిన 'సేవలు‌' మీ మీబ్లాగ్గులో విస్త్రుతంగా విశ్లేషించుకోండి)

10, ఏప్రిల్ 2011, ఆదివారం

శ్రీ సత్యసాయిబాబా - సగటుమనిషి సంవేదన! - ఈ టపాకు సమాధానం....

2 వ్యాఖ్యలు
దీనికి కొనసాగింపుగా(click) ఈ దిగువ కామెంట్‌ని రాజేష్ జి(click) దాచిపెట్టాడు(పబ్లిష్ చెయ్యలేదు) ప్రస్తుతానికి!
శ్రీకర్ గారు...
మీ కామెంట్స్ చాలా బాగున్నాయ్! మీ వివరణ బాగుంది మిగతా బ్లాగర్ల లాగ వితండవాదనలు, ఆక్రోశం, నిరాశతో, వెకిలి రాతులు, జగుత్సాకరవిగా కాకుండా. కాకపోతే మీవాదనతో నేను పూర్తిగా ఏకీభవించను అదివేరే విషయం.

ఒకరిద్దరు కామెంటేటర్లు పరాయిదేశాన్ని నిసిగ్గుగా పొగుడుతూ మాతృ దేశాన్ని చిన్నచూపుగా, వెకిళి రాతలు (ఆమెరికా లేక పోతే మనము లేము అనేరీతిలో) వ్రాసిన వారికి జవాబు చెప్పకుండా మీలాంటి వారిలాగ వుండలేకపోయా! నా భావ ప్రకటనలో ఒక చిన్న పొరపాటు జరిగినది. కాకపోతే నా కామెంట్స్ మొత్తం ప్రవాసాంధ్రులందరికి వర్తిస్తాయి అని గమనించలేకపోయా. పరాయిదేశానికి వలస వెళ్ళడం తప్పుకాదు. వెళ్ళడం వలన లాభాలు వున్నాయి అదేవిధంగా నష్టాలు వున్నాయని వేరే చెప్పక్కర్లేదు. నావల్ల బాధకలిగిన ప్రవాసాంధ్రులందరికి క్షమాపణలు(కేవలం మాతృదేశఅభిమానులకు, ఆమెరికా కుటిలనీతిని రుర్తెరిగిన వారికి మాత్రమే).

>>>పైన రాసినవి చదివిన తరువాత ఎవరి ప్రోత్సాహం తో ఎవరు హిందూ మతం మీద ఎవరు బురద జల్లుతున్నారో గమనించండి... మీరు హేతువాదులలో ఎటువంటి కేటగిరిలోకి వస్తారొ నాకు తెలియదు.. కెరీర్ ఇచ్చి ప్రోత్సహించటం లేదు. వారికి వారే స్వచ్చందం గా చర్చలో పాల్గోంట్టున్నారు
****
నాకు ఏ సంఘంలోనూ సభ్యత్వం లేదు. ఆధారరహిత వాదన, మీరు ఊహించుకుంటుంన్నట్లు ఎవరూ నన్ను ప్రోత్సహించటంలేదు. డబ్బులూ యివ్వడంలేదు. అంటే మీభావాలకు వ్యతిరేకమయితే, స్పాన్సర్షిప్ కామెంట్స్ అనేనా మీ ఉద్ధేశం?


>>>తీవ్రంగా విమర్సిస్తూ రాసే వారిలో నాకు తెలిసిన ఒకరిద్దరు గురించి చదవండి
****
నీతులు చాలామంది చెబుతారు. ఆచరణలోకి వచ్చేసరికి చాలామంది తుస్సుమంటారు(ఏ వాదం చేసేవారైనా). ధైవత్వం నమ్మినవారు తప్పుచెయ్యరనా మీ ఉద్ధేశం? ఒకరెద్దరేమి లక్షలమంది వుంటారు. మా తాత ముత్తాతలు,తల్లితండ్రులు ఆస్థికులు, నేను భక్తుడను కాను. అంటే వారి ఆస్థికత్వం తప్పని దీని అధారంగా నిర్ధారించలేము కదా. అట్లానే పలానా వ్యక్తి కొడుకే ఇట్లా రాశాడు అట్లా రాశాడు అనే ఆధారంతో విమర్శించడం తగదు.

>>>కాని బ్లాగుల్లో రాసేవారు చాలా దేశాలు తిరిగి, చూసి, ఎంతో ఆలోచించి ఒక విశాల దృక్పధం తో రాస్తున్నారని అని గమనించండి/తెలుసుకోండి.
****
యిది అర్థరహితం. నేను కూడా చాలాదేశాలు చూశాను అని మీకు నిరూపిస్తే నా వాదనలన్నీ నిజమని మీరు ఒప్పుకుంటారా? విశాల దృక్పధం అనేది కేవలం యిప్పుడున్న కాలేజి చదువులతో 100% తెచ్చుకొని క్యాంపస్ లో సెలెక్టయినంత మత్రాన రాకపోవచ్చు. పెరిగిన వాతావరణం ముఖ్యం. ఎంత చదివారని, ఎంత సంపాదిస్తున్నారని, ప్రస్తుతం ఎక్కడవున్నరని కాదు. ఖండాంతరాల నుండి వచ్చే ప్రతీ వేగు విశాల దృక్పధం తోరాసేదేనా?


>>>జపాన్ వర్సస్ అమెరికా హార్డ్వేర్ గురించి
ఇక పవీణ్ అడిగినదానికి నన్ను సమాదానం అడుగుతున్నారు. ప్రవీణ్ మీకు తెలిసినంత కూడా నాకు తెలియదు. నా థృష్ఠిలో ఆమెరీకా అయిన, జపాని అయినా, చైనా అయిన, పాకిస్తాన్ అయినా ఒక్కటే! విశ్వశాంతి వర్ధిల్లాలి! దుర్మార్గం నశించాలి.