వీలుంటే నా నాలుగు లంకెలు ...

20, ఏప్రిల్ 2011, బుధవారం

సాయిబాబా! భక్తులకోసం కనీసం కళ్ళుతెరవాలి!

బాబాగారి దయనీయమైన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మానవత్వం కలిగినవారికెవరికైనా ఆందోళనకరమే. కాని కొంతమంది భక్తులు మాత్రం మానవులకు బాబాగారి పెట్టిన ఒక పరిక్షని నీచపు మాటలు మాట్లాడుతున్నారు.  మోన్నటివరకూ వీలుకుర్చీలో పాకుంటూ, యిన్ని రోజులు చావుబతుకులమధ్య సామాన్య మానవుడవలే కష్టాలు పడుతుంటే, కడుపుతర్రుక్కుపోతుంది ఏ మనిషికైనా.

బాబా, సాయి బాబా, నీ శరీరానికి పడుతున్న కష్టం ఓ మానవ జీవిగా చూడలేకపోతున్నారు నీ భక్తులు కానివారుకూడా. కొంతమంది నీభక్తులైతే నిద్రాహారాలు మాని కుసించినసిస్తున్నారు. కనీసం వారికోసమైనా నీవు లేవాలే. నిల్చోని పరిగెత్తాలే (సారీ, నిలబడమనడం కూడా అత్యాశే అనుకుంటా) కనీసం కళ్ళుతెరువు బాబా. నీ అసలైన మహిమలు చూపించ్చే సమయం ఆసన్నమైనది. నీ మహిమలు నమ్మని జీవులకు కూడా కనువిప్పుకలుగుతుంది. లేకపోతే నిన్ను, నీమహిమలను నమ్మిన భక్తులకు నోటిమాట రాదు బాబా.

(కామెంట్స్ వ్రాయాలునుకుంటే ఒక షరతు! బాబా గారి మహిమలు గురించి మాత్రమే వ్రాయండి. బాబాగారు చేసిన 'సేవలు‌' మీ మీబ్లాగ్గులో విస్త్రుతంగా విశ్లేషించుకోండి)

3 కామెంట్‌లు:

  1. మహిమల గురించి వ్రాయలేను. చేతి నుంచి విభూతి తియ్యడం, నోటి నుంచి లింగాలు తియ్యడం, గొలుసులు తియ్యడం ఇవి చాలా మంది మెజిషియన్లకీ, గారడీవాళ్ళకీ తెలిసిన టెక్నిక్‍లే.

    రిప్లయితొలగించండి
  2. బాబాగారి అసలైన మహిమలా..? అవే ఉంటే మరెందుకు కృత్రిమ పరికరాలతో ఆయుష్షును పెంచుకుంటూ వాటి మీద ఆదారపడ్డారు..?
    ఆయన మహిమలను నమ్మని జీవులకు కనువిప్పు కలిగేలా ఆయన మహిమలను చూపించాలా..? ఎలా..? మానసిక బలహీనులు. ఒకరి మీద ఆదార పడ్డవారు అయితేనే ఎవరూ ఏ మహిమలూ చూపినా నమ్ముతారు.. పూజిస్తారు.

    రిప్లయితొలగించండి
  3. డబ్బు, అధికారం, కుటుంబ తగాదాలు, అనారోగ్యం, అశాంతి అందరి మనుషుల్లాగే బాబాకూ వచ్చాయి. అందరిలాగే ఆయనకూ కష్టాలూ, నష్టాలు వచ్చాయి. ఈ సమయంలో ఆయనపట్ల సానుభూతి చూపడం, ఆయన కోలుకోవాలని కోరుకోవడం మానవత్వం ఉన్న మనుషులంతా చేస్తారు. ఒక సామాన్య వ్యక్తికి దైవత్వం ఆపాదించి, భగవత్‌ స్వరూపునిగా ప్రజలను నమ్మించే ప్రయత్నాల వెనుకనున్న కారణాలేమిటో సాయిబాబా చివరి ఘడియల్లో జరుగుతున్న ఈ పరిణామాలు స్పష్టంగా మన ముందుంచుతున్నాయి. ప్రజల్లో చాలాచాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంత్రులూ, అధికారులూ, మహామహులంతా బాబాను నిత్యం దర్శించుకోవడం వెనుక ఆధ్యాత్మికత కన్నా ఆర్థికమే ప్రధానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బాబా ఆశ్రమం అక్రమ ఆర్థిక లావాదేవీలకే కాకుండా పదోన్నతులు, ప్రజాప్రతినిధులు- కార్పొరేట్‌లు- కాంట్రాక్టర్ల మధ్య రహస్య డీల్‌లకు కేంద్రం. నేడు మీడియాలో వస్తున్న వార్తలు ఈ విషయాన్ని రూఢిపరుస్తున్నాయి. ప్రభుత్వం, అధికారుల నేటి మౌనం వెనుక కారణం ఇదేనా? బాబాకు దైవత్వం ఆపాదించి, ఆయన చుట్టూ నిర్మించిన సుమారు 1.30 లక్షల కోట్ల రూపాయల (మన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ కన్నా ఎక్కువ) ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎవరు ఏలాలన్న దానిపై ట్రస్టు సభ్యుల మధ్య సాగుతున్న యుద్ధం యిందుకు పరాకాష్ట. పుట్టపర్తి ఆశ్రమం ఒక మినీ స్విస్‌ బ్యాంకు మాదిరిగా నల్లడబ్బుకూ, అక్రమార్జనా పరుల సంపాదన దాచుకోడానికీ కేంద్రంగా మారిందని పత్రిక రాసింది. మంత్రులూ, బడా బాబులూ తమ అక్రమ సంపాదనలో పెద్ద మొత్తాలు పుట్టపర్తిలో దాచుకున్నారనీ, బాబా ఆరోగ్యం విషమిస్తుండడంతో 'దీపముండగానే ఇల్లు చక్కబెట్టు'కునే చందంగా వారంతా తమతమ సొమ్ములను ఇతర ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారని వార్తలు వస్తున్నాయి.

    రిప్లయితొలగించండి