వీలుంటే నా నాలుగు లంకెలు ...

10, ఏప్రిల్ 2011, ఆదివారం

శ్రీ సత్యసాయిబాబా - సగటుమనిషి సంవేదన! - ఈ టపాకు సమాధానం....

దీనికి కొనసాగింపుగా(click) ఈ దిగువ కామెంట్‌ని రాజేష్ జి(click) దాచిపెట్టాడు(పబ్లిష్ చెయ్యలేదు) ప్రస్తుతానికి!
శ్రీకర్ గారు...
మీ కామెంట్స్ చాలా బాగున్నాయ్! మీ వివరణ బాగుంది మిగతా బ్లాగర్ల లాగ వితండవాదనలు, ఆక్రోశం, నిరాశతో, వెకిలి రాతులు, జగుత్సాకరవిగా కాకుండా. కాకపోతే మీవాదనతో నేను పూర్తిగా ఏకీభవించను అదివేరే విషయం.

ఒకరిద్దరు కామెంటేటర్లు పరాయిదేశాన్ని నిసిగ్గుగా పొగుడుతూ మాతృ దేశాన్ని చిన్నచూపుగా, వెకిళి రాతలు (ఆమెరికా లేక పోతే మనము లేము అనేరీతిలో) వ్రాసిన వారికి జవాబు చెప్పకుండా మీలాంటి వారిలాగ వుండలేకపోయా! నా భావ ప్రకటనలో ఒక చిన్న పొరపాటు జరిగినది. కాకపోతే నా కామెంట్స్ మొత్తం ప్రవాసాంధ్రులందరికి వర్తిస్తాయి అని గమనించలేకపోయా. పరాయిదేశానికి వలస వెళ్ళడం తప్పుకాదు. వెళ్ళడం వలన లాభాలు వున్నాయి అదేవిధంగా నష్టాలు వున్నాయని వేరే చెప్పక్కర్లేదు. నావల్ల బాధకలిగిన ప్రవాసాంధ్రులందరికి క్షమాపణలు(కేవలం మాతృదేశఅభిమానులకు, ఆమెరికా కుటిలనీతిని రుర్తెరిగిన వారికి మాత్రమే).

>>>పైన రాసినవి చదివిన తరువాత ఎవరి ప్రోత్సాహం తో ఎవరు హిందూ మతం మీద ఎవరు బురద జల్లుతున్నారో గమనించండి... మీరు హేతువాదులలో ఎటువంటి కేటగిరిలోకి వస్తారొ నాకు తెలియదు.. కెరీర్ ఇచ్చి ప్రోత్సహించటం లేదు. వారికి వారే స్వచ్చందం గా చర్చలో పాల్గోంట్టున్నారు
****
నాకు ఏ సంఘంలోనూ సభ్యత్వం లేదు. ఆధారరహిత వాదన, మీరు ఊహించుకుంటుంన్నట్లు ఎవరూ నన్ను ప్రోత్సహించటంలేదు. డబ్బులూ యివ్వడంలేదు. అంటే మీభావాలకు వ్యతిరేకమయితే, స్పాన్సర్షిప్ కామెంట్స్ అనేనా మీ ఉద్ధేశం?


>>>తీవ్రంగా విమర్సిస్తూ రాసే వారిలో నాకు తెలిసిన ఒకరిద్దరు గురించి చదవండి
****
నీతులు చాలామంది చెబుతారు. ఆచరణలోకి వచ్చేసరికి చాలామంది తుస్సుమంటారు(ఏ వాదం చేసేవారైనా). ధైవత్వం నమ్మినవారు తప్పుచెయ్యరనా మీ ఉద్ధేశం? ఒకరెద్దరేమి లక్షలమంది వుంటారు. మా తాత ముత్తాతలు,తల్లితండ్రులు ఆస్థికులు, నేను భక్తుడను కాను. అంటే వారి ఆస్థికత్వం తప్పని దీని అధారంగా నిర్ధారించలేము కదా. అట్లానే పలానా వ్యక్తి కొడుకే ఇట్లా రాశాడు అట్లా రాశాడు అనే ఆధారంతో విమర్శించడం తగదు.

>>>కాని బ్లాగుల్లో రాసేవారు చాలా దేశాలు తిరిగి, చూసి, ఎంతో ఆలోచించి ఒక విశాల దృక్పధం తో రాస్తున్నారని అని గమనించండి/తెలుసుకోండి.
****
యిది అర్థరహితం. నేను కూడా చాలాదేశాలు చూశాను అని మీకు నిరూపిస్తే నా వాదనలన్నీ నిజమని మీరు ఒప్పుకుంటారా? విశాల దృక్పధం అనేది కేవలం యిప్పుడున్న కాలేజి చదువులతో 100% తెచ్చుకొని క్యాంపస్ లో సెలెక్టయినంత మత్రాన రాకపోవచ్చు. పెరిగిన వాతావరణం ముఖ్యం. ఎంత చదివారని, ఎంత సంపాదిస్తున్నారని, ప్రస్తుతం ఎక్కడవున్నరని కాదు. ఖండాంతరాల నుండి వచ్చే ప్రతీ వేగు విశాల దృక్పధం తోరాసేదేనా?


>>>జపాన్ వర్సస్ అమెరికా హార్డ్వేర్ గురించి
ఇక పవీణ్ అడిగినదానికి నన్ను సమాదానం అడుగుతున్నారు. ప్రవీణ్ మీకు తెలిసినంత కూడా నాకు తెలియదు. నా థృష్ఠిలో ఆమెరీకా అయిన, జపాని అయినా, చైనా అయిన, పాకిస్తాన్ అయినా ఒక్కటే! విశ్వశాంతి వర్ధిల్లాలి! దుర్మార్గం నశించాలి.

2 కామెంట్‌లు:

  1. మీరు చాలా అర్ధవ౦తమైన వ్యాఖ్య చేసారు, ఆ బ్లాగు లో.

    రిప్లయితొలగించండి
  2. వాసవ్య గారు, కొంత మంది టెక్నాలజీ ఒక దేశంలో పుట్టింది అని వాదిస్తోంటే వాళ్ళకి సమాధానంగా జపాన్ హార్డ్‌వేర్ గురించి చెప్పాను. ARPANETని USAవాళ్ళు కనిపెట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉన్న IPV4ని డెవెలప్ చేసింది CNES, యూరోప్. మనం సొంత టెక్నాలజీని డెవెలప్ చేసుకోవచ్చు కానీ మనవాళ్ళు ఇంకా సామ్రాజ్యవాద దేశాల మీద ఆధారపడడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.

    రిప్లయితొలగించండి