రామ్ జేఠ్మలాని |
అతని జీవితంలో ఎన్నో విధాలుగా కోర్టులను తప్పుదారి పట్టించి వున్నాడో ఈ మహానుభాహుడు! ఎందుకంటే, యితను చేపట్టిన కేసులు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగక మానదు...
మచ్చుగా కొన్ని జేఠ్మలాని వాదించిన బడా అవినీతి కేసులు (చాలావరకు ఓడిపోయినవే)..
- నేను ఈ పెద్దమనిషి ఇందిరా గాంధి హత్యా నింధితుల తరుపున వకల్తా పుచ్చుకున్నపట్టినుండి గమనిస్తూనే వున్నా. కేసు ఫలితం: ఓటమి, ఊరిశిక్ష. కాకపోతే చాలా సంవత్సరాలు పాటు సాగదీయగలిగాడు.
- హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ (రూ. 4,000 కోట్లు). కేసు ఫలితం: ఓటమి, శిక్ష ఖరారు. కారాగారంలోనే నిండితుడి మరణం.
- కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోనం: కేసు ఫలితం: ఓటమి, సంవత్సరంపాటు కఠినగారగార శిక్ష.
- హజీ మస్తాన్ మిర్జా (ముంబాయి అండర్ వరల్డ్ డాన్): కోర్టులలో కేసులు నడుస్తుండగానే హత్యకాబడ్డాడు.
- అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి నిందుతుడు): కేసు ఫలితం: ఓటమి. ఉరి శిక్ష ఖరారు
- లాల్ కృష్ణ అద్వాని (1.8 కోట్ల అమెరికన్ డాలర్ల హవాలా కుంభకోణం): ఫలితం: డైరీ ఒక్కటే సాక్ష్యంగా పరిణగించలేమని కేసు కొట్టివేయ బడినది.
- జెస్సికలా హత్య కేసు (మను శర్మ): ప్రజల నుండి అంతర్ఖాల ద్వారా/సంక్లిప్త సమాచారాల ద్వారా/వార్తా చానళ్ళ ద్వారా వచ్చిన వత్తిడి వలన మను శర్మ, వికాస యాదవ్ & అమర్‌దీప్ సింగ్ ప్రస్తుతం తీహార్ చెరసాలలో వున్నారు
- సొహ్రాబుద్దిన్ బూటకపు ఎన్‌కౌంటర్ (అమిత్ షా): గుజరాత్ లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాని గుజరాత్ లో అడుగు పెట్టకుండా సుప్రీం తీర్పు...
- అమిత్ జోగి (ఛతిస్‌ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు) ముడుపుల కేసు: ఓటమి, జైలుపాలు.
- 2G కుంభకోణం (కనిమోలి): కనీసం బెయిల్ కూడా యిప్పించే స్థితిలో లేడు ఈ లాయరు సార్!
- వై.ఎస్.జగనమోహన్ రెడ్డి - చీటింగ్, అక్రమ పెట్టుబడుల కేసు: ఈరోజే వాదనలు మెదలు సుప్రీంలో.. కనీసం వీరి వాదనలు వినే స్థితిలోనే లేదు..
- యింకో చాలా ఆసక్తి కలిగే కేసు... మాజీ కర్నాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్ప అవినీతి కేసు. మైనింగ్ కుంభకోణంలో లోకాయుక్త ఎంతో సవివరంగా ఆధారాలతో నిరూపించిన యితని అవినీతికి వకల్తా పుచ్చుకొని కర్నాటక హైకోర్టు కు బయలు దేరారు. ఏమవుతుందో చూడాలి.
రామ్ జేఠ్మలాని కోరుకొనేవి:
- పేరు ప్రఖ్యాతలు - మంచికో.. చెడుకో..(ఉచిత పబ్లిసిటి)
- సంపద - బడా కుంభకోణాలలో అయితే రాబడి బాగా వుంటుంది (గంటకు లక్షల్లో).
- పై రెండిటికి సమర్థన: భారత రాజ్యాంగంలోని..సహజ న్యాయసూత్రాలు అందరికి అందివ్వాలని (క్రూరులైనా, దుర్మార్గులైనా, ఉగ్రవాదులైనా, మతవాదులైనా ఒక్కటే)
దక్షణ భారతంలో బారీ అవినీతి కేసులన్నింటినీ యితనే వాదిస్తున్నాడన్నమాట..
- కనిమోళి టీవీ - అక్రమ పెట్టుబడులు (తమిళనాడు)
- మైనింగ్ కుంభకోణం (కర్నాటక)
- ఛీటింగ్, అక్రమ పెట్టుబడులు - సాక్షి, సండూర్ ( ఆంధ్రప్రదేశ్)
నా ఉధేశం ప్రకారం యిటువంటి వారిని బార్ కౌన్సిల్ నుండి బహిష్కరించాలి. ఎందుకంటే, అతను తన క్లైంట్స్‌ని రక్షించుకొనుటకు ఎన్నిసార్లు తప్పుడు వాదనలు, అబద్దాల, కోర్టులను తప్పిదారి పట్టంచి వుండోచ్చు!