నా మిత్రులు అడుగుతున్నారు మాల్దీవ్స్-లక్షద్వీప్స్ పైన నా అభిప్రాయం ఏమిటని?
ఈ ప్రశ్న నన్ను అడగటానికి ఒక్కటే వారిలో బలమైన కారణం నాకు కనబడుతుంది. ఎవరైతే మోది చేస్తున్న ప్రచారార్భాటాలను, జాతీయ వనరులను అతికొద్ది క్కార్పొరేట్స్ కి కట్టబెట్టడాన్ని, అతివాద మత మనోభావాలను రెచ్చగొట్టడాన్ని, రాజకియ అవినీతిని ప్రశ్నిచిన వారిని వాటికి సమాధానాలు లెనప్పుడల్లా ఒక్కటే ఎదురు దాడి వారంతా దేశద్రొహులు / యాంటి నేషనిస్టులు / చైనా-పాకిస్తన్ ఏజంట్లు అనే భావన విపరీతంగా వందలాది కోట్ల రూపాయిల ఖర్చుతో ఫేస్ బుక్,యుట్యుబ్, ట్విట్టర్, వాట్సాప్, హస్తగతం చేసుకున్న పేపర్,ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా యాక్టివ్ గా వుండే ప్రజల మెద్దళ్లొ జొప్పించారు.
చరిత్ర ఒక్క సారి నెమరవేసుకుంటే..
1) 1962 లొ నెహ్రు ప్రధానిగా వున్నప్పుడు చైనా తో యుద్ధం లో మనం ఓడిపొయాము. ఆ పరిస్థితులకు దారితీసిన వ్యవహారాన్ని తప్పు పట్టిన వారిని అప్పట్లొ "దేశ ద్రోహులు", "చైనా ఏజెంట్స్" అని ముద్ర వేశారు.
2) కార్గిల్ యుద్ధం లో మనకు జరిగిన ప్రాణ నష్టంకు కారణం ను ప్రశ్నించిన వారిని ఇప్పుడు బిజెపి "దేశ ద్రోహులు", "పాకిస్తాన్ ఏజెంట్స్" అనే ముద్ర వేస్తుంది.
3) మోదీ హయ్యంలొ చైన అరుణచల్ ప్రదేశ్ దగ్గర మన భూభగాన్ని అక్రమించు కున్నదానిలో మన ప్రభుత్వ వైఫల్యన్ని ప్రశ్నిస్తే "చైన ఏజెంట్స్" అనే ముద్ర వెయ్యడం
ఇది కాంగ్రేస్ పార్టికీ ఒక గుణపాఠం.. అప్పుడైనా, ఇప్పుడైనా విదేశీ విధాన లోపాలను ప్రశ్నించే వారిని దేశద్రోహులు అనే ముద్ర వేసి అసలు సమస్యను ప్రక్క దారి పట్టించడం పరిపాటి గా మారింది.
సో, మాల్దీవ్స్-లక్షద్వీప్స్ సమస్య మీద చర్చ జరుగుతున్నప్పుడు, పైన చెప్పిన భావజాలం నుండి బయటకు వచ్చి విశాల దృక్పథం తో ఆలొచిస్తే నే అర్థం అవుతంది.
మాల్దీవ్స్-లక్షద్వీప్స్ సమస్య గురించి మాట్లాడే ముందు గత సంవత్సరం జరిగిన ఇలాంటి ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి..
నుపూర్ శర్మ గుర్తుంది గా? ఆమె బిజెపి అధికార ప్రతినిధి కాబట్టి ఆమె ఎది చెప్పినా బిజెపి చెప్పినట్లుగా మనం భావించాలి, అలానే రాజా సింగ్ ఒక చట్టసభ ప్రతినిధి. వీరిద్దరూ మహ్మద్ ప్రవక మీద ఎవో అభ్యంతకరమైన విమర్శలు చేశారు అని అరబ్ దేశాలు భారత దేశ ప్రభుత్వం కు నిరశన తెలియ జేశారు. (గుర్తు పెట్టుకోడి, ఈ విషయంలో ఏ లౌకికవాది కూడా వారిని తప్పు పట్టలేదు, క్షమాపన చెప్పమనలేదు. భావ స్వేచ వుంది కాబట్టి!). కాని ఇతర దేశాల నుండి వచ్చిన ఒత్తిడి తరుణంలో తప్పని పరిస్ఠితులలో వారి ఇద్దరినీ పార్టి నుండి తొలిగించింది బిజెపి, వారు మాట్లాడినది వారి వారి వ్యక్తిగతం, పార్టికి సంబధం లేదు అని భారత ప్రభుత్వం అలానే బిజెపి వివరణ ఇచ్చింది. ఆ వివరణతో ఇతర దేశాలు సంతృప్తి చెంది, అ విషయాన్ని అక్కడితో ప్రక్కన పెట్టినవి. దానికి దేశాల మధ్య సంబంధాల విషయానికి ముడి పెట్టలేదు. ఎక్కడా దాని ప్రస్తావన తీసుకు రావడం లేదు. ఇది సనస్య పరిష్కార మార్గం. ఈ చిన్న విషయం ద్వారా రెండు దేశాల మధ్య దురం పెంచకూడదు అనే ఉద్దేశం వుంది కబట్టి సమస్య పరిష్కారం అయ్యింది
యిప్పుడు ప్రస్తుత సమస్య దగ్గరకి వద్దాం..
ఇద్దరు మాల్దివుల మంత్రులు భారత దేశం లోని హోటల్స్ శుభ్రంగా వుండవు అని విమర్శ చేసారు. దానికి మన ప్రభుత్వం ఖండించింది. అలా ఒక దేశాన్ని వేరొక దేశం వారు అంటే ఎవరూ ఊరుకోరు. అలా అనడం ముమ్మటికి తప్పే కూడా.
భారత ప్రభుత్వ అభ్యంతరం, భారత ప్రజల ప్రతిస్పందనల వలన వెంటనే మాల్దీవ్ ప్రభుత్వం ఆ ఇద్దరి మంత్రులను తొలగించింది వివరణ కూడా ఇచ్చింది అది అ దేశ అభిప్రాయం కాదని, భారత్ అంటె వారికి 911 లాంటి ఎమెర్జెన్సి సర్విస్ లాంటిది అని. ఇంతకన్నా ఎవరు ఏమి కోరుకుంటారు ఒక దేశం నుండి? వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు మన దేశం కూడా అదే చేసింది కదా నుపూర్ శర్మ విషయం లో..
కాని, బిజెపి కి లాభం ఏమిటి ఆ సమస్య అలా తీరిపోతే? దీనిని కూడ మోది భజన కార్యక్రమానికి వాడుకోవడానికి ఫుంఖాలు ఫుంఖాలుగా కథనాలు మాల్దివుల పై ప్రచారాలు. ఇటువంటి చర్యలతో ఖచ్చితంగా యిరు దేశాల సంబధాలు దెబ్బ తింటాయి. ఇలాంటి చర్యలతోనే మోది అధికారం లోకి వచ్చిన తరువాత మన చుట్టు వున్న అన్ని దేశాలతో మన సంబంధాలు దెబ్బ తిన్నవి.. అంతే కాకుండా మన చుట్టు ప్రక్కల వున దేశాలు చైనా పంచన జేరాడానికి మోది విదేశి విధానం దోహదం చేస్తుంది,చేసింది.
బిజెప్/అర్ ఎస్ ఎస్ ఎత్తుగడ ఒక్కటే, భారత దేశం (హిందువుల) పై ప్రపంచ వ్యాపితంగా దాడి ఎక్కువవుతుంది అని నిరూపించి, దానికి దేశభక్తి కి ముడి పెట్టి హిందూ ఓటు బ్యంక్ సుస్థిర పరుచుకొని ఎల్ల కాలం అధికారం లొ వుండాలి. అంతే తప్ప దీనిలో దేశ భక్తి లేదు హిందు మత ఉద్దరణా లేదు.
- వాసవ్య యాగాటి
2024-01-12
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి