వీలుంటే నా నాలుగు లంకెలు ...

21, మే 2024, మంగళవారం

Background of L&T statement to exit from Hyd Metro

0 వ్యాఖ్యలు

Analyzing the Controversy Surrounding the Free Bus Scheme and Metro Occupancy Rates

-- Vasavya Yagati


The government has requested that L&T rebuild the pillar at their own cost. During the election period, L&T had promised to cover these repair costs. However, now they are reluctant to take on that responsibility. The previous government did not accept any design failure, and L&T did not accept any construction defect. So, who will take responsibility of pillar collapse?

There is a lack of understanding between Revanth and L&T, unlike the previously good relationship between L&T and KCR.

  1. There has been no reduction in the number of travelers on the Metro; in fact, demand has been increasing month by month. There is no information indicating a decrease in the occupancy rate due to free buses.
  2. Many city buses on Metro routes were canceled at least five years ago.
  3. t's important to note that the free bus scheme applies only to passenger (ordinary) buses, which are very limited on Metro routes.
  4. Typically, those who can't afford Metro tickets are opting to travel on free buses even at heavy rush
  5. Over the past year, free buses have also been introduced in Bangalore. Compared to Bangalore Metro, Hyderabad Metro has been more successful in terms of occupancy rates.

L&T statement is simply Politically  & Business baised..

I don't know how dare to comment publicly on a Govt scheme (that too, govt implemented based on People of Telangana given mandate for that scheme in recent elections) without any evidence/concurrence data presented to the Govt by a contractor doing business with Govt..

IMO, Govt of Telangana must give a show cause notice to L&T for their politically motivated statement to blame Govt.

15, జనవరి 2024, సోమవారం

0 వ్యాఖ్యలు

 నా మిత్రులు అడుగుతున్నారు మాల్దీవ్స్-లక్షద్వీప్స్ పైన నా అభిప్రాయం  ఏమిటని?


ఈ ప్రశ్న నన్ను అడగటానికి ఒక్కటే వారిలో బలమైన కారణం నాకు కనబడుతుంది. ఎవరైతే మోది చేస్తున్న ప్రచారార్భాటాలను, జాతీయ వనరులను అతికొద్ది క్కార్పొరేట్స్ కి కట్టబెట్టడాన్ని, అతివాద మత మనోభావాలను రెచ్చగొట్టడాన్ని, రాజకియ అవినీతిని ప్రశ్నిచిన వారిని వాటికి సమాధానాలు లెనప్పుడల్లా ఒక్కటే ఎదురు దాడి వారంతా దేశద్రొహులు / యాంటి నేషనిస్టులు / చైనా-పాకిస్తన్ ఏజంట్లు అనే భావన విపరీతంగా వందలాది కోట్ల రూపాయిల ఖర్చుతో ఫేస్ బుక్,యుట్యుబ్, ట్విట్టర్, వాట్సాప్, హస్తగతం చేసుకున్న పేపర్,ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా యాక్టివ్ గా వుండే ప్రజల మెద్దళ్లొ జొప్పించారు.


చరిత్ర ఒక్క సారి నెమరవేసుకుంటే..

1) 1962 లొ నెహ్రు ప్రధానిగా వున్నప్పుడు చైనా తో యుద్ధం లో మనం ఓడిపొయాము. ఆ పరిస్థితులకు దారితీసిన వ్యవహారాన్ని తప్పు పట్టిన వారిని అప్పట్లొ "దేశ ద్రోహులు", "చైనా ఏజెంట్స్" అని ముద్ర వేశారు.  

2) కార్గిల్ యుద్ధం లో మనకు జరిగిన ప్రాణ నష్టంకు కారణం ను ప్రశ్నించిన వారిని ఇప్పుడు బిజెపి  "దేశ ద్రోహులు", "పాకిస్తాన్ ఏజెంట్స్" అనే ముద్ర వేస్తుంది.

3) మోదీ హయ్యంలొ చైన అరుణచల్ ప్రదేశ్ దగ్గర మన భూభగాన్ని అక్రమించు కున్నదానిలో మన ప్రభుత్వ వైఫల్యన్ని ప్రశ్నిస్తే "చైన ఏజెంట్స్" అనే ముద్ర వెయ్యడం


ఇది కాంగ్రేస్ పార్టికీ ఒక గుణపాఠం.. అప్పుడైనా, ఇప్పుడైనా విదేశీ విధాన లోపాలను ప్రశ్నించే వారిని దేశద్రోహులు అనే ముద్ర వేసి అసలు సమస్యను ప్రక్క దారి పట్టించడం పరిపాటి గా మారింది.


సో, మాల్దీవ్స్-లక్షద్వీప్స్ సమస్య మీద చర్చ జరుగుతున్నప్పుడు, పైన చెప్పిన భావజాలం నుండి బయటకు వచ్చి విశాల దృక్పథం తో ఆలొచిస్తే నే అర్థం అవుతంది.

 

మాల్దీవ్స్-లక్షద్వీప్స్ సమస్య గురించి మాట్లాడే ముందు గత సంవత్సరం జరిగిన ఇలాంటి ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి..


నుపూర్ శర్మ గుర్తుంది గా? ఆమె బిజెపి అధికార ప్రతినిధి కాబట్టి ఆమె ఎది చెప్పినా బిజెపి చెప్పినట్లుగా మనం భావించాలి, అలానే రాజా సింగ్ ఒక చట్టసభ ప్రతినిధి. వీరిద్దరూ మహ్మద్ ప్రవక మీద ఎవో అభ్యంతకరమైన విమర్శలు చేశారు అని అరబ్ దేశాలు భారత దేశ ప్రభుత్వం కు నిరశన తెలియ జేశారు. (గుర్తు పెట్టుకోడి, ఈ విషయంలో ఏ లౌకికవాది కూడా వారిని తప్పు పట్టలేదు, క్షమాపన చెప్పమనలేదు. భావ స్వేచ వుంది కాబట్టి!). కాని ఇతర దేశాల నుండి వచ్చిన ఒత్తిడి తరుణంలో తప్పని పరిస్ఠితులలో వారి ఇద్దరినీ పార్టి నుండి తొలిగించింది బిజెపి, వారు మాట్లాడినది వారి వారి వ్యక్తిగతం, పార్టికి సంబధం లేదు అని భారత ప్రభుత్వం అలానే బిజెపి వివరణ ఇచ్చింది. ఆ వివరణతో ఇతర దేశాలు సంతృప్తి చెంది, అ విషయాన్ని అక్కడితో ప్రక్కన పెట్టినవి. దానికి దేశాల మధ్య సంబంధాల విషయానికి ముడి పెట్టలేదు. ఎక్కడా దాని ప్రస్తావన తీసుకు రావడం లేదు. ఇది సనస్య పరిష్కార మార్గం. ఈ చిన్న విషయం ద్వారా రెండు దేశాల మధ్య దురం  పెంచకూడదు అనే ఉద్దేశం వుంది కబట్టి సమస్య పరిష్కారం అయ్యింది


యిప్పుడు ప్రస్తుత సమస్య దగ్గరకి వద్దాం..


ఇద్దరు మాల్దివుల మంత్రులు భారత దేశం లోని హోటల్స్ శుభ్రంగా వుండవు అని విమర్శ చేసారు. దానికి మన ప్రభుత్వం ఖండించింది. అలా ఒక దేశాన్ని వేరొక దేశం వారు అంటే ఎవరూ ఊరుకోరు. అలా అనడం ముమ్మటికి తప్పే కూడా.


భారత ప్రభుత్వ అభ్యంతరం, భారత ప్రజల ప్రతిస్పందనల వలన వెంటనే మాల్దీవ్ ప్రభుత్వం ఆ ఇద్దరి మంత్రులను తొలగించింది వివరణ కూడా ఇచ్చింది అది అ దేశ అభిప్రాయం కాదని, భారత్ అంటె వారికి 911 లాంటి ఎమెర్జెన్సి సర్విస్ లాంటిది అని. ఇంతకన్నా ఎవరు ఏమి కోరుకుంటారు ఒక దేశం నుండి? వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు మన దేశం కూడా అదే చేసింది కదా నుపూర్ శర్మ విషయం లో..


కాని, బిజెపి కి లాభం ఏమిటి ఆ సమస్య అలా తీరిపోతే? దీనిని కూడ మోది భజన కార్యక్రమానికి వాడుకోవడానికి ఫుంఖాలు ఫుంఖాలుగా కథనాలు మాల్దివుల పై ప్రచారాలు. ఇటువంటి చర్యలతో ఖచ్చితంగా యిరు దేశాల సంబధాలు దెబ్బ తింటాయి. ఇలాంటి చర్యలతోనే మోది అధికారం లోకి వచ్చిన తరువాత మన చుట్టు వున్న అన్ని దేశాలతో మన సంబంధాలు దెబ్బ తిన్నవి.. అంతే కాకుండా మన చుట్టు ప్రక్కల వున దేశాలు చైనా పంచన జేరాడానికి మోది విదేశి విధానం దోహదం చేస్తుంది,చేసింది.


బిజెప్/అర్ ఎస్ ఎస్  ఎత్తుగడ ఒక్కటే, భారత దేశం (హిందువుల) పై ప్రపంచ వ్యాపితంగా దాడి ఎక్కువవుతుంది అని నిరూపించి, దానికి దేశభక్తి కి ముడి పెట్టి హిందూ ఓటు బ్యంక్ సుస్థిర పరుచుకొని ఎల్ల కాలం అధికారం లొ వుండాలి. అంతే తప్ప దీనిలో దేశ భక్తి లేదు హిందు మత ఉద్దరణా లేదు.


- వాసవ్య యాగాటి 

2024-01-12

5, ఫిబ్రవరి 2022, శనివారం

Constitution: రాజ్యాంగ సవరణ/మార్పు అనైతికమా?

0 వ్యాఖ్యలు

రాజ్యాంగం ఏమైనా మత గ్రంథమా?

తప్పులున్నాయని/అసమానతలు వున్నాయి అని తెలిసినా పవిత్రంగా చూసుకోవడానికి? అదేమన్నా పైనుండి ఊడిపడిందా? రాజ్యాంగం అనేది దేశప్రజలందరీ ఓ కామన్ ఎగ్రిమెంట్.. తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు.. దానిలో తప్పేంటి? ఉదాహరణకు, ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం కార్పోరేట్ అవినీతి, దోపిడికి హద్దులు లేకుండా పోయింది, దానికి కారణం రాజ్యాంగం తప్పుకాదు అని కొందరన్నొచ్చు.. కానీ అధికారం లో వున్న వారికి రాజ్యాంగం అమలు చేయకుండా వుండే వెసులుబాటు రాజ్యాంగం లో వుండ బట్టే కదా దేశంలో యింత అవినీతి పెరగడానికి కారణం.. అలానే, ప్రస్తుత రాజ్యంగం వివిధ రాష్ట్రాల మధ్య కేంద్రం వివిక్ష ధోరణి అవలబించకుండా కట్టడి చెయ్యడానికి కుదరడం లేదు. అలా చాలానే వున్నాయి..

మరి ఇలానే కంటున్యూ చెయ్యాలా?

లౌకిక ప్రజతంత్ర సమాన హక్కులను రాజ్యంగంలో వుంచకూడదు అని ఎవరైన అంటే తప్పు అవుతుంది గాని, రాజ్యాంగంలో వున్న లొసులుగులు తీసేయ్యాలి అంటే అహ్వానించాల్సిందే… మరి ఈ అసమానతలను ఇలానే కంటున్యూ చెయ్యలసిందేనా? రాజ్యాంగ సవరణ అంటే అదేదో అంబెద్కర్ ని అవమానించినట్లు అంబెద్కర వాదులు, బిజెపి వారు ఎలా ముద్ర వేస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదు..

కెసిఅర్ అన్నదాంట్లో స్పస్టత లేదు, రాజ్యాంగం లో ఏ అంశాలు మార్చాలో అతను చెప్పనేలేదు.. సో .. ఖండించడంలో అర్థం లేదు.. రాజ్యాంగంలో కొన్ని అంశాలు అమలులో లొసుగులు వున్నాయి.. అవి సరి చెయ్యడానికై మార్చుదాం అని కూడా అని వుండచ్చు కదా? అటివంటి మార్పులనూ కూడా వ్యతిరేకిద్దామా?

అసలు జరగవలసిన చర్చను దారి మళ్లిస్తానికి బిజెపి వేసిన ఎత్తుగడ?

కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ అసమానతల పాలనలో గత 8 సంవత్సరాలలో తెలంగాణా ఎలా నష్ట పోయిందో కుండ బద్దలు కొట్టినట్లయి జనాలకు బాగా అర్థం అయ్యేటట్లు చెప్పాడు (గత 7 బడ్జట్ లను, మోడీ చేసిన అన్నింటిని సపోర్ట్ చేసాడు అదే వేరే విషయం, అది అతని రాజకీయ ఎత్తుగడ కావచ్చు). ఈ ఆరోపణలకు సమాధానం చెప్పే స్థితిలో బిజెపి లేదు.. దాంతొ ‘అంబెద్కర్’ కి అవమానం పేరుమీద రచ్చ చేస్తుంది.. ఆ వలలో అంబెద్కర్ వాదూలు పడటం విచారకరం.. విచిత్రం ఏమిటంటే 2002 సం వరకు బిజెపి అసలు మన రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్నీ గుర్తించలేదు. వాజెపెయి అయితే రాజ్యంగం మార్పు పై ఒక కమిటీ కూడా వేసాడు, మరి అప్పుడు అంబెద్కర్ ని అవమానించడం కనబడని బిజెపికి ఇప్పుడు ఎలా కనబడుతుంది?

మార్పు అనివార్యం, మార్పును అహ్వానించాల్సిందే..

సామాజిక దృక్పథం, సామాజిక అవగాహన, జీవ పరిణామక్రమాలు డార్విన్, మార్క్స్ చెప్పినట్లు నిరంతరం మారుతూనే వుంటాయి. మార్పును ఆహ్వానిస్తూ ముందుకు వెళ్ళాలిసిందే! అంబెద్కర్ అధ్యక్ష వహించిన కమిటి రచించిన మన రాజ్యాంగం లో స్పష్టంగా 2/3 మెజారిటి వుంటే రాజ్యాంగం ని మార్చుకోవచ్చు అని రాసివుంది.. రాజ్యాంగం మార్చొద్దు అని ఎవరైనా అంటే వారు నిజమైన అంబెద్కర్ ద్రోహులవుతారు..

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అల్వేస్ అనే భావన నుండి భయట పడాలి.. సామాజికి మార్పును ఎవరు ఆపినా ఆగేది కాదు!

వాసవ్య యాగాటి..
2022-02-05

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Trade Unions: ప్రభుత్వ రంగ ఉధ్యోగుల పోరాటాలు ఎవరి కోసం? దేని కోసం?

0 వ్యాఖ్యలు


LIC ని ప్రయివేటు పరం చెయ్యొద్దు అని ధర్నా చేస్తుంటే ఏ టిచర్, ఏ ప్రభుత్వ/ స్టీల్ ప్లాంట్ / RTC / విద్యుత్ / బ్యాంక్ / రైల్వే ఉధ్యోగీ అది తన సమస్య అని భావించడం లేదు.. చూసుకుంటూ వెల్లిపోతాడే తప్ప కనీసం ఆగి ఒక్క నిమషం సంఘిబావం కూడా ప్రకటించడు..

అలానే,
👉 స్టీల్ ప్లాంట్ ప్రయివేటు పరము చెయ్యొద్దని ధర్నా చేస్తున్నా,
👉విద్యుత్ ప్రయివేటు పరం చెయ్యొద్దని ధర్నా చేస్తున్నా,
👉ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చెయ్యొద్దని ధర్నా చేస్తున్నా,
👉ప్రభుత్వ స్కూలను ఎత్తివేయోద్దని ధర్నా చేస్తున్నా,
👉RTC ని ప్రయివేటు పరం చెయ్యొదని ధర్నా చేస్తున్నా,
👉రైల్వేలను ప్రయివేటు పరం చెయ్యొదని ధర్నా చేస్తున్నా,

ఆయా సంస్థల ఉధ్యోగుల వరకు మాత్రమే ధర్నాలు, పోరాటాలు చేస్తున్నారే తప్ప, మిగితా సంస్థలలో ఉధ్యోగులు చేస్తున్న దానికి కనీసం సంఘీబావం కూడా ప్రకటించడంలేదు.. పట్టించుకోకపోయిన ఫర్వాలేదు, కానీ మిగితావారు చేస్తున్న ధర్నాలు/పోరాటాలపై చిన్న చూపు కూడాను..

ఈ పరిస్థితి ప్రగతిశీల శక్తులు నాయకత్వం వహిస్తున్న కార్మక సంఘాలలొ వున్న సభ్యులలోనూ చూస్తున్నాం...
ఉదాహరణకు: స్టీలు ప్లాంట్ ప్రయివేటు పరం చేయ్యొదని ప్లాంట్ ఉధ్యోగులు ధర్నా చేస్తుంటే ఎంత మంది టిచర్లు కానీ, RTC ఉధ్యోగులు గాని, విధ్యుత్ ఉధ్యోగులు గానీ ధర్నాలో పాల్గొని వుంటారు?

ఉమ్మడి పోరాటాలు చెయ్యవలసిన ఈ సమయంలో పరిస్థితి ఇలానే కొనసాగితే ఫలితం లేని అసంఘటీత పోరాటాల మాదిరిగానే మిగిలిపోతుంది..

ప్రతీ పోరాటంలో ఆయా ఉధ్యోగులు చెప్పే కామన్ పాయింట్, "మేము పోరాడుతున్నది మా ఉధ్యోగ భద్రత కోసం కాదు, ప్రజల కోసం, ఈ సంస్థ లేకపోతే ప్రజలు నష్టపోతారు" అని చెబుతూనే వుంటారు.. కానీ నా అభిప్రాయం ప్రకారం మెజారిటి ఉధ్యోగులు వారి వారి ఉధ్యోగ భద్రత గురించి మాత్రమే ఆయా ఉధ్యమాలలో పాల్గొంటూన్నారే తప్ప వారి పోరాటంలో ప్రజాహితం శూన్యం! ఇది వింటానికి కఠోరంగా వున్నా మనం అందరం ఒప్పు కోవలసిన పచ్చి నిజం..

ఇప్పుడు టీచర్లు, ఉపాధ్యాయులు యింత భారీ ఎత్తున విజయవాడ తరలి వచ్చారు? దేనికోసం? వారి జీత భత్యాలకోసమే మాత్రమే అని నా ఉద్ధేశం.. అదే రేపు విధ్యుత్ / RTC ఉధ్యోగుల జీతాలలో కోత పెడితే వీరు కనీసం వారి తరుపున మాట్లాడం కూడా టైం వేస్టు అనుకుంటారు..

రేపు టిచర్లకు/ఉధ్యోగులకు డిఏలు ఇచ్చారే అనుకోండి ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తారు కూడా (తెలంగాణాలో చూసామూ కూడా).. సో.. *యిటువంటి ఉద్యమాలు వాపే గానే బలుపు కాదు..*

నాకు గ్రౌండ్ రియాలిటి అంత తెలియక పోవచ్చు కానీ, నా వరకు బయటకు కనబడుతున్న నగ్న సత్యం ఇది..
దీనికి అనుగుణంగా కార్మికులలొ ప్రజాహితం నింపకుండా ఎన్ని పోరాటాలు చేసినా సమాజానికి కలిగే విశాల ప్రయోజనం శూన్యం...

వాసవ్య యాగాటి
2022-02-04