- కనీసం సుష్మాస్వరాజ్ గారు అప్పటి భాజపా రాష్ట్ర అధ్యక్షులు దత్తాత్రేయ గారు వైఎస్‌ఆర్ కి కుప్పలుకుప్పలుగా రాసిన బహిరంగ ఉత్తరాలు గురించి తెలియకుండా మాట్లాడుతున్నారా? ఆంటే దత్తాత్రేయగారి బహిరంగ ఉత్తరాలు ఉట్టిట్టివేనా? వైఎస్‌ఆర్ చాలా నిజాయితీ పరుడని వారి అధిష్టానానికి అంతర్గతంగా తెలియజేశారా?
- చనిపోయిన వారి గురించి చట్టం మాట్లాడకూడదంటే, భోఫోర్స్ కుంభకోణం గురించి చనిపోయిన రాజీవ్‌గాంధి పేరు మీరు మాటమాటికి ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
- నాటి ఎమర్జన్సీ కాలంలో జరిగిన అరాచకాలనూ ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించకండి ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా చనిపోయారుగా.
- సుష్మారాజ్ గారి ఉపన్యాసం "నవ్విపోదురు జనులు నాకేంటి సిగ్గు" అన్నచందంగా వుంది.
- అదీనూ పార్లమెంటు ప్రత్యేక సమావేశం లోకపాల్‌పై చర్చిస్తానికి, సందర్భరహితంగా వైఎస్‌ఆర్ అవినీతిని సమర్థిస్తూ, జగన్ అక్రమ వ్యాపారాలపై సిబిఐ దాడులను ఖండించడం అంటే... బరితెగించడమే అధికారం కోసం.
"The late YSR name in the FIR registered against Jagan in the alleged illegal wealth case is a clear example of the CBI being used for the selfish gains of the congress party." |
విడ్డూరం:
- మతుండి మాట్లాడుతున్నారో లేదో కూడా అనుమానం రాక మానదు. జలయజ్ఞం పనులలో చాలా అవినీతి జరిగిందనంటలో అతిశోయక్తి ఏమీవుండదేమో... అంతెందుకు, ఒక్కపట్టి భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు నూరుకు పైగా బహిరంగ ఉత్తరాలు అప్పటి రాయడం అందరికీ తెలిసినదే. ఆయన బ్రతికే వుండుంటే, కోర్టులూ యింత క్రీయాశీలంగా వుంటే, సిబీఐ యింత చలాకీగా వుండి వుంటే వైఎస్‌ఆర్ మొదటి ముద్దయే అనండంలో ఎవరకీ సందేహముండకర్లా! ఆంటే వైఎస్‌ఆర్ కాలంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో వున్న భాజపా అనవసర రాధాంతం చేసిందని ఒప్పుకుంటున్నారా?
- యిక జగన్ ఆస్తులు అన్యూహంగా పెరగడం, సాక్షిలో జలయజ్ఞం గుత్తేదార్ల అక్రమ పెట్టుబడుల గురించి భాజాపా మాజీ జాతీయ అధ్యక్షుడైన వెంకయ్యనాయిడుగారు ఎన్నిసార్లు విమర్శించి వున్నారో ఆయినికే గుర్తుండి వుండదు. అంటే భాజపా కి జగన్ గురించి బాగాతెలిసే వుండి కూడా "తప్పుడు ఆర్థిక నేరారోపణ" అని సుష్మాస్వరాజ్ గారు ఏలా అనగలిగారో?
ఏదోరకంగా దేశంలో అధికారమే పరామావధిగా కాంగ్రేస్ పార్టీని మించి అవినీతి/అలౌకిక విధనాలతో సమతూగ గలిగే ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ నీరూపించుకుంది యింకొకసారి పార్లమెంటు సాక్షిగా ఈరోజు.
అలౌకిక విధానం
కాంగ్రేస్: మైనారిటీ మతస్థుల ఓట్లపై పిల్లి మొగ్గలు
భాజాపా: మెజారిటి మతస్థుల ఓటర్లను ఏకంచేసి గుత్తంగా వారికి మళ్ళించుకోవడం
అవినీతి:
కాంగ్రేస్: అవినీతి గురించి యిక్కడ రాసేంత టైమ్ నాకులేదు..
భాజపా: (నాకు గుర్తున్నవాటిలో కొన్ని..)
- ఎల్.కె.అద్వాని - 1.8 అమెరికా డాలర్ల హవాలా కుంభకోణం
- ప్రమోద్ మహాజన్ అంబానీల స్నేహం - టెలికం రంగంలో అంబానీలకు గుత్తంగా లైసెన్స్‌లు కట్టబెట్టి దేశంలోనే అంబానీలను అత్యంత దనవంతులను చేసింది.
- దక్షణ భారత దేశంలో ఏలాగైనా అధికారం చేపట్టాలని, దక్షణ భారత దేశంలో మతతత్వానికి ఓట్లు పడవని ఒకటీ,రెండు సీట్లకంటే ఎక్కవరావని గ్రహించిన భాజపా, అవినీతికి కొమ్ముకాసి మైనింగ్ మాఫియా అయిన గాలి బ్రదర్స్ ని చేరదీసి వారి అవినీతి సొమ్ముతో కర్నాటకాని హస్తగతం చేసుకోకలిగింది. గాలి సోదర్లూ, యడ్యూరప్ప అవినీతి చేస్తున్నాడని తెలిసినా వారిని సిగ్గులేకుండా వెనకేసుకొచ్చింది కేవలం అధికార దాహార్థం.
- యిప్పుడు అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‌కి కూడా అమలు చేయాలునుకుంటుంది. సుష్మాస్వరాజ్ కు గాలి బ్రదర్శ్ నమ్మిన బంట్లని అందరకీ తెలిసిందే. వారి యింట్లో జరిగే చిన్నపాటి కార్యక్రమాలకు సైతం ఆమె హాజరు తప్పనిసరి. అదేవిధంగా గాలి సొదర్లు, జగన్ మధ్య లింకు గురించి వేరే చెప్పక్కర్లేదు. వీరి త్రికోణపు బంధంతో యిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాలుమోపాలని ప్రయత్నంగా కనబడుతుంది.