వీలుంటే నా నాలుగు లంకెలు ...

4, జులై 2009, శనివారం

రాష్ట్రాల హక్కులను హరించే కేంద్ర వైఖరి

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ తన మంత్రిత్వ శాఖకు చెందిన 100 రోజుల ప్రణాళికను విడుదల చేస్తూ అదే సమయంలో పలు ప్రకటనలను చేశాడు. ఆయన ప్రతిపాదించిన చర్యల్లో ఒకటేమంటే 10వ తరగతి పరీక్షలను రద్దు చేయాలనటం లేదా దానిని ఐచ్చికంగా ఉంచటం. అదేవిధంగా, విశ్వవిద్యాలయాలలో ప్రవేశార్థం ఒకే బోర్డు కింద అఖిల భారత స్ధాయిలో 12వ తరగతి పరీక్షల నిర్వహణ. అంతకుముందు ఆయన 'ఉన్నత విద్య పునరుద్ధరణ-పునరుజ్జీవం' అన్న అంశంపై యశ్‌పాల్‌ కమిటీ సమర్పించిన నివేదికలోని సిఫార్సుల అమలు గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

పాఠశాల విద్య ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఎమర్జన్సీ సమయంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. తదనంతర కాలంలో ఈ రంగానికి సంబంధించి పలు చర్యలను చేపట్టటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా రంగాన్ని కేంద్రీకృతం చేసింది. రాష్ట్రాలకు దీనిలో నామమాత్రపు జోక్యం మాత్రమే మిగిలింది. అయితే పాఠశాల విద్యకు సంబంధించి ఆయా రాష్ట్రాల సామాజిక, సాంస్కృతిక, భౌగోళిక తదితర అంశాల ప్రాతిపదికపై పాఠ్యాంశాలను రూపొందించే విశిష్టమైన హక్కు రాష్ట్రాలకు ఉన్నది. రాష్ట్ర బోర్డుల ద్వారా పాఠశాల పరీక్షలు జరుగుతాయి. కనుక పరీక్షలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఏకపక్షంగా ప్రకటన చేయటమంటే, అది రాష్ట్రాల హక్కులను ఉల్లంఘించటం, పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్రాల అధికారాలను లాగివేయడమే అవుతుంది. అఖిల భారత స్ధాయిలో 12వ తరగతికి ఒకే బోర్డు అధ్వర్యంలో పరీక్షలను నిర్వహించటమంటే వివిధ రాష్ట్రాలలోని వైవిధ్యానికి పాతర వేయడమే అవుతుంది. ఆయా రాష్ట్రాలలో నెలకొన్న సంస్కృతికీ, పరిస్థితులకూ అనుగుణంగా పాఠశాల స్ధాయిలో విద్యా బోధనకుగాను రాష్ట్రాలకున్న స్వయం ప్రతిపత్తిని లాగివేయడమే అవుతుంది. ఈ ప్రతిపాదనలు ఆచరణలోకి వచ్చినట్లయితే పాఠశాల స్ధాయిలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్రా లేకుండా పోతుంది.

2 కామెంట్‌లు:

  1. బహుశా మీరు కపిల్ సిబ్బల్ సూచనను తప్పుగా అర్థం చేసుకున్నారేమో! ప్రస్తుతానికి ఈ పదోతరగతిని ఐచ్చికం చెయ్యడం కేవలం కేంద్రప్రభుత్వం ఆదీనంలో ఉన్న CBSE స్కూళ్ళలోనే అమలౌతుంది. ఇందులో రాష్ట్రాల్ని బలవంతపెట్టడం ఏమీ లేదు. NCFW-2005 లో అంగీకరించినట్లు రాష్ట్రాలు త్వరలో ఆ సూచనలు స్వచ్చందంగా అమలు చెయ్యడానికి ప్రణాళిక మాత్రం ఏర్పాటుచేస్తే చాలు.

    రిప్లయితొలగించండి
  2. "ఒక మంచి కుక్కను చంపాలంటే "పిచ్చిది" అని ముద్ర వేయాలి" అనే నానుడి వుంది. ఉదహరణకు, ఏదైన ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేటుకు అప్పజెప్పాంలటే, ఆసంస్థను నష్టాలలో చూపడం జరుగుతుంది. అదే విధంగా, ఏ విషయాని నేను, విధ్య పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించే ఆలోచనలో ఉన్నట్లు భావిస్తున్నను.

    రిప్లయితొలగించండి