గ్రామీణులకు మినరల్ వాటర్ ఉచితమా? రొక్కమా? వెల్లడించని వైఎస్
గ్రామీణ ప్రజలకు బాటిళ్లలో మినరల్ వాటర్‌ను సరఫరా చేస్తామని శుక్రవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభ సందేశంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారు. ఆగస్టు 15 నుండి డ్వాక్రా సంఘాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్ల గ్రామీణ ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నందున అందరికీ రక్షిత నీటిని అందించనున్నామన్నారు. మినరల్ వాటర్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారా లేక ఛార్జీలు వసూలు చేస్తారా అన్న విషయాన్ని సిఎం వెల్లడించలేదు. ఇటీవల ప్రభుత్వం ఆమోదించిన జల ముసాయిదాలో తాగునీటిని సైతం విలువ ఆధారంగా చూడాలన్న నిబంధన ఉంది. ప్రపంచ బ్యాంక ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నీటి బొట్టునూ అమ్మాలన్న షరతును అమలు చేసే ఉద్దేశం మినరల్ వాటర్ సరఫరా వెనుక దాగుందని తెలుస్తోంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి