తప్పులున్నాయని/అసమానతలు వున్నాయి అని తెలిసినా పవిత్రంగా చూసుకోవడానికి? అదేమన్నా పైనుండి ఊడిపడిందా? రాజ్యాంగం అనేది దేశప్రజలందరీ ఓ కామన్ ఎగ్రిమెంట్.. తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు.. దానిలో తప్పేంటి? ఉదాహరణకు, ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం కార్పోరేట్ అవినీతి, దోపిడికి హద్దులు లేకుండా పోయింది, దానికి కారణం రాజ్యాంగం తప్పుకాదు అని కొందరన్నొచ్చు.. కానీ అధికారం లో వున్న వారికి రాజ్యాంగం అమలు చేయకుండా వుండే వెసులుబాటు రాజ్యాంగం లో వుండ బట్టే కదా దేశంలో యింత అవినీతి పెరగడానికి కారణం.. అలానే, ప్రస్తుత రాజ్యంగం వివిధ రాష్ట్రాల మధ్య కేంద్రం వివిక్ష ధోరణి అవలబించకుండా కట్టడి చెయ్యడానికి కుదరడం లేదు. అలా చాలానే వున్నాయి..
మరి ఇలానే కంటున్యూ చెయ్యాలా?
లౌకిక ప్రజతంత్ర సమాన హక్కులను రాజ్యంగంలో వుంచకూడదు అని ఎవరైన అంటే తప్పు అవుతుంది గాని, రాజ్యాంగంలో వున్న లొసులుగులు తీసేయ్యాలి అంటే అహ్వానించాల్సిందే… మరి ఈ అసమానతలను ఇలానే కంటున్యూ చెయ్యలసిందేనా? రాజ్యాంగ సవరణ అంటే అదేదో అంబెద్కర్ ని అవమానించినట్లు అంబెద్కర వాదులు, బిజెపి వారు ఎలా ముద్ర వేస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదు..
కెసిఅర్ అన్నదాంట్లో స్పస్టత లేదు, రాజ్యాంగం లో ఏ అంశాలు మార్చాలో అతను చెప్పనేలేదు.. సో .. ఖండించడంలో అర్థం లేదు.. రాజ్యాంగంలో కొన్ని అంశాలు అమలులో లొసుగులు వున్నాయి.. అవి సరి చెయ్యడానికై మార్చుదాం అని కూడా అని వుండచ్చు కదా? అటివంటి మార్పులనూ కూడా వ్యతిరేకిద్దామా?
అసలు జరగవలసిన చర్చను దారి మళ్లిస్తానికి బిజెపి వేసిన ఎత్తుగడ?
కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ అసమానతల పాలనలో గత 8 సంవత్సరాలలో తెలంగాణా ఎలా నష్ట పోయిందో కుండ బద్దలు కొట్టినట్లయి జనాలకు బాగా అర్థం అయ్యేటట్లు చెప్పాడు (గత 7 బడ్జట్ లను, మోడీ చేసిన అన్నింటిని సపోర్ట్ చేసాడు అదే వేరే విషయం, అది అతని రాజకీయ ఎత్తుగడ కావచ్చు). ఈ ఆరోపణలకు సమాధానం చెప్పే స్థితిలో బిజెపి లేదు.. దాంతొ ‘అంబెద్కర్’ కి అవమానం పేరుమీద రచ్చ చేస్తుంది.. ఆ వలలో అంబెద్కర్ వాదూలు పడటం విచారకరం.. విచిత్రం ఏమిటంటే 2002 సం వరకు బిజెపి అసలు మన రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్నీ గుర్తించలేదు. వాజెపెయి అయితే రాజ్యంగం మార్పు పై ఒక కమిటీ కూడా వేసాడు, మరి అప్పుడు అంబెద్కర్ ని అవమానించడం కనబడని బిజెపికి ఇప్పుడు ఎలా కనబడుతుంది?
మార్పు అనివార్యం, మార్పును అహ్వానించాల్సిందే..
సామాజిక దృక్పథం, సామాజిక అవగాహన, జీవ పరిణామక్రమాలు డార్విన్, మార్క్స్ చెప్పినట్లు నిరంతరం మారుతూనే వుంటాయి. మార్పును ఆహ్వానిస్తూ ముందుకు వెళ్ళాలిసిందే! అంబెద్కర్ అధ్యక్ష వహించిన కమిటి రచించిన మన రాజ్యాంగం లో స్పష్టంగా 2/3 మెజారిటి వుంటే రాజ్యాంగం ని మార్చుకోవచ్చు అని రాసివుంది.. రాజ్యాంగం మార్చొద్దు అని ఎవరైనా అంటే వారు నిజమైన అంబెద్కర్ ద్రోహులవుతారు..
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అల్వేస్ అనే భావన నుండి భయట పడాలి.. సామాజికి మార్పును ఎవరు ఆపినా ఆగేది కాదు!
LIC ని ప్రయివేటు పరం చెయ్యొద్దు అని ధర్నా చేస్తుంటే ఏ టిచర్, ఏ ప్రభుత్వ/ స్టీల్ ప్లాంట్ / RTC / విద్యుత్ / బ్యాంక్ / రైల్వే ఉధ్యోగీ అది తన సమస్య అని భావించడం లేదు.. చూసుకుంటూ వెల్లిపోతాడే తప్ప కనీసం ఆగి ఒక్క నిమషం సంఘిబావం కూడా ప్రకటించడు..
ఆయా సంస్థల ఉధ్యోగుల వరకు మాత్రమే ధర్నాలు, పోరాటాలు చేస్తున్నారే తప్ప, మిగితా సంస్థలలో ఉధ్యోగులు చేస్తున్న దానికి కనీసం సంఘీబావం కూడా ప్రకటించడంలేదు.. పట్టించుకోకపోయిన ఫర్వాలేదు, కానీ మిగితావారు చేస్తున్న ధర్నాలు/పోరాటాలపై చిన్న చూపు కూడాను..
ఈ పరిస్థితి ప్రగతిశీల శక్తులు నాయకత్వం వహిస్తున్న కార్మక సంఘాలలొ వున్న సభ్యులలోనూ చూస్తున్నాం...
ఉదాహరణకు: స్టీలు ప్లాంట్ ప్రయివేటు పరం చేయ్యొదని ప్లాంట్ ఉధ్యోగులు ధర్నా చేస్తుంటే ఎంత మంది టిచర్లు కానీ, RTC ఉధ్యోగులు గాని, విధ్యుత్ ఉధ్యోగులు గానీ ధర్నాలో పాల్గొని వుంటారు?
ఉమ్మడి పోరాటాలు చెయ్యవలసిన ఈ సమయంలో పరిస్థితి ఇలానే కొనసాగితే ఫలితం లేని అసంఘటీత పోరాటాల మాదిరిగానే మిగిలిపోతుంది..
ప్రతీ పోరాటంలో ఆయా ఉధ్యోగులు చెప్పే కామన్ పాయింట్, "మేము పోరాడుతున్నది మా ఉధ్యోగ భద్రత కోసం కాదు, ప్రజల కోసం, ఈ సంస్థ లేకపోతే ప్రజలు నష్టపోతారు" అని చెబుతూనే వుంటారు.. కానీ నా అభిప్రాయం ప్రకారం మెజారిటి ఉధ్యోగులు వారి వారి ఉధ్యోగ భద్రత గురించి మాత్రమే ఆయా ఉధ్యమాలలో పాల్గొంటూన్నారే తప్ప వారి పోరాటంలో ప్రజాహితం శూన్యం! ఇది వింటానికి కఠోరంగా వున్నా మనం అందరం ఒప్పు కోవలసిన పచ్చి నిజం..
ఇప్పుడు టీచర్లు, ఉపాధ్యాయులు యింత భారీ ఎత్తున విజయవాడ తరలి వచ్చారు? దేనికోసం? వారి జీత భత్యాలకోసమే మాత్రమే అని నా ఉద్ధేశం.. అదే రేపు విధ్యుత్ / RTC ఉధ్యోగుల జీతాలలో కోత పెడితే వీరు కనీసం వారి తరుపున మాట్లాడం కూడా టైం వేస్టు అనుకుంటారు..
రేపు టిచర్లకు/ఉధ్యోగులకు డిఏలు ఇచ్చారే అనుకోండి ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తారు కూడా (తెలంగాణాలో చూసామూ కూడా).. సో.. *యిటువంటి ఉద్యమాలు వాపే గానే బలుపు కాదు..*
నాకు గ్రౌండ్ రియాలిటి అంత తెలియక పోవచ్చు కానీ, నా వరకు బయటకు కనబడుతున్న నగ్న సత్యం ఇది..
దీనికి అనుగుణంగా కార్మికులలొ ప్రజాహితం నింపకుండా ఎన్ని పోరాటాలు చేసినా సమాజానికి కలిగే విశాల ప్రయోజనం శూన్యం...
వరుసగా రెండు పర్యాలు (Two Consequent terms) స్థూల
దేశీయోత్పత్తి (GDP) గాని తగ్గితే దానిని మాంద్యం (Recession) అంటారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థప్రకటన
భారత అర్థికరంగ మాంద్యమానికి
ప్రధాన కారణం "ప్రజలలో కొనుగోలు శక్తితగ్గడమే" (Decrease
in purchasing power among people)
కేంద్ర ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు
ఒక లక్షా నలభై కోట్ల రూపాయిల (₹1.4 Lakh Crores per year)విలువైన
కార్పోరేట్పన్ను(Corporate Tax)రాయితీ తో
కలుపుకుంటేకార్పోరేట్కంపెనీలకు
ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం యిచ్చిన రాయతీలు అక్షరాల రెండు లక్షలకోట్ల
రూపాయిలు (₹2 Lakh Crores).
గత ఐదు సంవత్సరాలలోకార్పోరేట్
కంపెనీలుతీర్చలేని రుణాలను, రుణ
ఎగవేత దారులు అప్పులనుCorporate Non-Performing
Assets(NPAs) గా గుర్తించివాటిని
మాఫీ చేసిన మొత్తము అక్షరాల ఐదు లక్షల కోట్ల రూపాయిలు(₹5 Lakh Crores).
GST రేట్లు
పెద్దగా ప్రభావం చూపని వస్తువులపై కొంత మేర తగ్గింపు
కార్పోరేట్ టాక్స్ తగ్గింపు
·టాక్స్ ఎవరు
కడతారు?
ప్రైవేటు లిమిటెడ్ మరియు పబ్లిక్
లిమిటెడ్ కంపెనీలు వాటి వార్షిక ఆదాయములో వచ్చే లాభం (Profit) మీద మాత్రమే ప్రభుత్వానికి కట్టే పన్ను.
·తగ్గింపు ఎవరికి లాభం?
కంపెనీలకి
లాభం వస్తేనే కట్టేది ఈ పన్ను, అంటే లాభాలో
వున్న కంపెనీలకి యింకా లాభం. ప్రస్తుతం నష్టాలలో
వున్న కంపెనీలకు ఈ పన్ను ఎంత వున్నా నష్టం లేదు. అంటే,
నష్టాలలో వున్న కంపేనీలకు ఎటువంటీ లాభం లేదు.
·కార్పోరేట్ టాక్స్ తగ్గింపు వలన కలిగే లాభాలు..
కంపెనీలకు
లాభాలు పెరగడం వలన, పెట్టుబడులు పెరుగుతాయి, ఉధ్యోగాలు పెరుగుతాయి, ఉధ్యోగుల జీతాలు పెరుగుతాయి, వీటిద్వారా ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుతుందిని ప్రజలను నమ్మిస్తుంది.
·కార్పోరేట్ టాక్స్ యింకా తగ్గాలి
కార్పోరేట్
టాక్స్ భారత్ లో ఎక్కువ ఇతర దేశాలతో పోల్చుకుంటే,
యింకా తగ్గాలి అనే వారు కూడా వున్నారు.
కార్పోరేట్ టాక్స్ తగ్గింపు పై నా విశ్లేషణ
కొందరు ఈ టాక్స్
తగ్గింపు వలన లాభం చాలా లాభాలు వున్నాయని భావిస్తున్నారు.లాభాలు
పెరిగినప్పుడు ఆ లాభాన్నిఎంప్లాయిస్
కి గాని, ఆ కంపెనీ
కష్టమర్ల కు గాని ఆ లాభాన్ని బదలాయించడం/పంచండం (Transfer) ప్రపంచంలోఎక్కడా
జరగలేదు, జరగదు కూడా.
లాభాలు
వచ్చేవానికి ఈ తగ్గింపువలన యింకా లాభాలు ఎక్కువగా వస్తాయి. సంవత్సరం ఆఖరున వచ్చిన
లాభాలను పంచుకు తింటారు గాని ప్రజలకు పంచరు.
ప్రభుత్వం
ట్యాక్స్ తగ్గించడం వలన వచ్చిన అధిక ఆదాయం తన ప్రతిభ/శ్రమకు వచ్చిన ఆదాయంగా
భావిస్తాడు గాని, ఆ ఆదాయాన్ని దిగువ వానికి బదిలీ (Transfer) చెయ్యాడు. యిది జగమెరిగిన సత్యం.
యిలా
తగ్గించడం యిదే మొదటి సారి కాదు. 1997 లో కూడా ఒక సారి తగ్గించారు, అప్పట్లో 38.5% నుండి 30% కి తగ్గించారు. దానితో మన ఆర్థిక వ్యవస్తేమి
అమాంతం పెరిగిపోలేదు.
కార్పోరేట్
టాక్స్ భారత్ లో ఎక్కువ ఇతర దేశాలతో పోల్చుకుంటే అనే వారు గుర్తు పెట్టుకోవసినది
ఏమిటంటే, ఆర్థికం గా బలంగా వున్న దేశాలలో ప్రత్యక్ష
పన్ను (ఆదాయపు పన్ను Income Tax)
ద్వారా 60-70% ఆదాయము, మిగిలినది పరోక్ష పన్ను (Indirect
Tax - GST,Corp.Tax,Cess,etc.) ద్వారా ఆదాయాని సమకూర్చుకుంటున్నారు. మనదేశంలో పరోక్ష పన్ను ద్వారా 60-70% సంపాదిస్తున్నాము. ఈ విషయాన్ని దాచి పెట్టి కార్పోరేట్
టాక్స్ భారత్ లో ఎక్కువ అని బూటకపు ప్రచారం చేస్తున్నారు
కార్పోరేట్ మొండి బకాయిలను రద్దు
మనలను ఒప్పించేందుకు (convince) ఈ మొండి బకాయలకు చాలా పేర్లు పెట్టారు. ఉధ్ధేశకపూర్వ ఎగవేత, నిరర్ధక అప్పులు (Definitive debts), చెడు రుణాలు (BadDebts) వీటినన్నింటికీ ముద్దు పేరే పనికిరాని ఆస్తులు(Non-Performing Assets).
ఎక్కడా కార్పొరేట్ అప్పులను రద్దు చేశాము అని ఎక్కడా చెప్పకుండా జాగ్రత్త
తీసుకుంటారు. NPAs అని,Written
off అని, రద్దు చెయ్యలేదు కంపెనీ బ్యాలెన్స్ షీట్
లో చూపించడం లేదు అని మనకు చెబుతుంటారు.
NPA క్రింద చూపిన ఒక్క అప్పు యిప్పటి వరకు
బ్యాంకులు రికవరీ చేసిన దాఖలాలు లేవు.
అంటే, డొంకతిరుడు (Indirect) గా రుణాలని మాఫీ చెయ్యడమే!.
·
మొండి బకాయిలను మాఫీ పై నా విశ్లేషణ
పారిశ్రామిక
వేత్తలు చేసే వ్యాపారలలో వుండే నష్టాలను (RISK) ప్రభుత్వంమీదకు
రుద్దడం, లాభాలు
వస్తే మాత్రం వారు వివధ మార్గాలు ద్వారా స్వంత ఆస్తులుగామలుచుకోవడం
ఈ దేశంలో జరుగుతూనే వుంది, ఈ ఆదాయాని/లాభాలను వారి ప్రతిభకు/తెలివి తేటలకు చిహ్నంగా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది.
ఈ NPAs రుణ
మాఫీలు అందరికి వుండదు.. రాజకీయ పలుకుబడి,బడా
బాడా ప్రారిశ్రామికి వేత్తలకుమాత్రమే
యివ్వడం జరుగుతుంది.
యిలా రుణమాఫీ
పొందిన బడా వ్యాపారులు అధికారంలో వున్న పార్టీల ఎన్నికల నిధులు సమకూర్చే వారీగా మారుతున్నారు.
అందువలన, ఈ ఋణ మాఫీ అటూ రాజకీయ పార్టీలకు, వ్యాపారస్తులకు ఆభిస్తుంది. ఇదో చైన్ ఎఫెక్ట్.
స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగింది?
నా ఉద్ధేశం ప్రకారం స్టాక్ మార్కెట్ మధ్య తరగతి ప్రజల సొమ్ము ఒక పద్దతి ప్రకారం కాజేయ్యడానికి ఒక వేదిక.
షెర్స్ కొన్న వాడు ఎప్పుడూ బాగుపడలేదు (బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కవ లాభం వచ్చింది లేదు. కానీ కంపెనీ అధిపతులు (Board of Directos) ఆస్తులు అనూయంగా పెరిగిపోతాయి. ఒకటి రెండు ఉదాహరణలు కాదు చూడవలసినది. రామారామీగా (Average) గా కూసినప్పుడు షేర్ హోల్దెర్స్ కి నాష్టాలే మిగిల్చాయి సామాన్యులకు .
సామాన్య ప్రజలను ఏదో ఒకటి చూపి పెట్టుబడులు పెట్టించడం (షేర్ వాల్యూని క్ఱుత్రిమంగా పెంచి), తరువాత షేర్ వాల్యూని కావాలని తగ్గించడం. నష్ట పోయేది సామాన్య ప్రజలే
కొందరు బాడా బాబులు స్టాక్ మార్కెట్ ని ఓ జూదశాలగా చేశారు.
ఈ పెరుగుదల బాడా బాబులు సామాన్య ప్రజలకు వేసిన ఒక బిస్కేట్ మాత్రమే.
ఈ స్టాక్ మార్కెట్ జూదంలో అంతిమంగా ఒడేది సామాన్య ప్రజలే
బిజేపి ప్రభుత్వా నికి ఇవ్వన్ని తెలియదా?
ఖచ్చితంగా తెలుసు. మరి ఎందుకు? యిదో విష వలయం.
ప్రభుత్వం లోకి రావాలంటే రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ లో డబ్బులు ఖర్చు పెట్టాలి. మరి ఫండ్ ఎలా వస్తుంది? అందుకే బిజేపి ప్రభుయత్వం ఎన్నియకల బాండ్లను (Election Bonds) ప్రవేశ పెట్టిండి.
ఈ దేశంలో 1% (1,30,000) మంది దగ్గర 70% మన దేశ సంపద గుమిగూడి వున్నది. అంటే 99% శాతం ప్రజల సొమ్ము 1% శాతం మంది దగ్గర వుండి అన్నమాట. అలానే, దేశం మొత్తంలో 100 మంది మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను సాశించే స్థాయిలో వున్నారు.
ఈ 100 మంది ఎలక్షన్ బాండ్స్ లో కావలసిన పార్టీకి పెట్టుబడులు పెడతారు. దాని ప్రతిఫలం గెలిచిన తరువాత ప్రభుత్వం ఈ బాడా వ్యాపారులకు యిచ్చి తీరాలి.
అందుకనే వేలకోట్లు బాకీ వున్న వారి ఆస్తులు ఆటోమాటిక్ జప్తు అయ్యే టట్లు కఠిన చట్టాలు తీసుకు రాలేవు. ఎన్నికల బ్లాండ్ల విష సంస్కృతే ఈ క్విడ్ ప్రోకో (యిచ్చి పుచ్చుకొనే దోరణి)
ఎలానో వుంటారు కొందరు, వీరు కార్పోరేట్స్ కి చేస్ ప్రభుత్వ మేలును, ప్రజలకోసమే చేసినట్లు పిట్ఠకధలు చెప్పటానికి. వారినే "ఇంటలేక్చువాల్స్" అంటారు. వీరు కార్పొరేట్స్ కి బ్రోకర్స్
నా ఉద్ధేశం ప్రకారం ఈ చర్యలు తీసుకోవాలి
ప్రజలలో కొనుగోలు శక్తి
పెంచాలంటే, కనీస వేతనం (Minimumwage) నెలకు 18 వేలు చెయ్యాలి దేశవ్యాపితంగా
ఎక్కువ మంది వాడే వస్తువులపై GST (Indirect Taxes)
తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని GST పరిధిలోకి తీసుకురావాలి.
ఆదాయప పన్ను నుండి మద్య తరగతి
ప్రజలకు ఉపశమనం కలిగించాలి.
కోట్లాది రూపాయిలు
సంపాదించే వారిపై ఆదాయప పన్ను పెంచాలి.
అప్పు ఎగ్గొట్టీన ప్రతీ
కార్పొరేటర్ ని డీఫాల్టర్ గా డిక్లర్ చేసి,
వారి ఆస్తుయాలను స్వాధీనం చేసుకోవాలి.
భారత కీర్తి పతాకను విశ్వాంతరాలకు చేర్చిన ప్రయోగం చంద్రయాన్ 2. 2019 జులై 22న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ చంద్రయాన్ 2 నింగికెగిసింది. అయితే ఇక్కడే ఓ చిన్న ప్రశ్న కొందరి మదిలో మెదులుతోంది. అదేంటంటే..
సరిగ్గా 50 ఏళ్ల కిందట అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన అపోలో 11 అనే మానవ సహిత వ్యోమనౌక... నాలుగు రోజుల్లో గమ్యాన్ని చేరుకుని... చంద్రుడి మీద ల్యాండ్ అయ్యింది. కానీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 మాత్రం చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు పడుతుంది.
50 ఏళ్ల కిందటే... అంత వేగంగా చేరుకోగలిగినప్పుడు.. ఇస్రో పంపిన చంద్రయాన్ ఇంకా వేగంగా వెళ్లగలగాలి కదా. కానీ ఎందుకు ఆలస్యంగా వెళ్తోంది అన్నదే సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న.
నాసా ప్రయాణం వెనుక..
1969 జులై 16న... అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి శాటరన్ ఫైవ్ ఎస్ఏ506 రాకెట్ సాయంతో నీల్ ఏ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్, మైఖెల్ కొల్లిన్స్ అనే ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపింది.
జులై 16 ఉదయం 8గంటల 32 నిముషాలకు నింగిలోకి దూసుకెళ్లిన అపోలో 11... 102 గంటల 45 నిముషాలకు గమ్యాన్ని చేరుకుని, చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. అంటే కేవలం నాలుగు రోజుల ఆరు గంటల్లోనే వారు గమ్యం చేరుకున్నారు. ఆపై వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్‌లు చంద్రుడిపై దిగి, అక్కడి మట్టి, రాళ్లను సేకరించారు.
జులై 21న భూమ్మీదకు తిరుగు ప్రయాణం ప్రారంభించిన అపోలో 11 వ్యోమగాములున్న మాడ్యూల్ జులై 24న నార్త్ ఫసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అంటే భూమ్మీద నుంచి చంద్రుడి మీదకు వెళ్లి, అక్కడ పరిశోధనలు చేసి, తిరిగి భూమ్మీదకు రావడానికి వాళ్లకు కేవలం ఎనిమిది రోజుల 3 గంటలు మాత్రమే పట్టింది.
కానీ ఇస్రో చంద్రుడి మీద పరిశోధనల కోసం కేవలం ఆర్బిటర్, ల్యాండర్‌లను మాత్రమే పంపించింది. అయినా... అవి చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఇంత ఆలస్యం వెనుక చాలా పెద్ద కథే ఉంది.
ఎందుకింత ఆలస్యం..
చంద్రయాన్ 2 సుదీర్ఘ ప్రయాణం వెనుక సాంకేతికంగా చాలా కారణాలున్నాయి.
1969లో నాసా ప్రయోగించిన అపోలో 11 రాకెట్ బరువు ఇంధనంతో కలిపి దాదాపు 2800 టన్నులు. కానీ ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ బరువు ఇంధనంతో కలసి 640 టన్నులే.
సాధారణంగా శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే పీఎస్ఎల్వీ రాకెట్లు ఇంతింత బరువు ఉండవు. ఎందుకంటే అవి కేవలం శాటిలైట్లను తీసుకెళ్లి జియో సింక్రనైజ్డ్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్లలో ప్రవేశ పెడతాయి. కానీ చంద్రయాన్ ఇందుకు విభిన్నం. ఎందుకంటే చంద్రుడి దగ్గరకు వెళ్లాల్సిన వాహక నౌకలో ఇంధనంతో పాటు చాలా పరికరాలు ఉంటాయి. అందుకే ఇలాంటి ప్రయోగాలకు అత్యంత శక్తిమంతమైన రాకెట్లను వినియోగిస్తారు.
ఈ విషయంలో కూడా నాసా ప్రయోగించిన రాకెట్ల బరువు ఎక్కువే. భూకక్ష్యను దాటిన తర్వాత... చంద్రుడి వైపు ప్రయాణించిన అపోలో వ్యోమనౌక బరువు... 45.7 టన్నులు. ఇందులో 80 శాతానికి పైగా ఇంధనమే. అంటే అపోలో 11లో ఈగిల్ అనే ల్యాండర్ చంద్రుడి మీద దిగి, వ్యోమగాములు చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేశాక, తిరిగి ఆ ల్యాండర్ ఆర్బిటర్‌ను చేరుకుని, అది భూమ్మీదకు రావడానికి ఇంత ఇంధనం అవసరం.
అపోలో 11 ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్ శాటరన్ ఫైవ్ ఎస్ఎఏ506 అత్యంత శక్తిమంతమైనది. అంత భారీ ఇంధనం, అంత భారీ రాకెట్ కాబట్టే... అపోలో 11 కేవలం నాలుగు రోజుల్లో నేరుగా ప్రయాణించి చంద్రుడిని చేరిందని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీజీ సిద్ధార్ధ్ తెలియ చేశారు.
తక్కువ ఇంధనం... ఎక్కువ ప్రయాణం..
ప్రస్తుతం ఇస్రో దగ్గరున్న అత్యంత శక్తిమంతమైన రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్ త్రీ.
జులై 22న చంద్రయాన్ 2ను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లినప్పుడు ఆ రాకెట్ మొత్తం బరువు 640 టన్నులు. ఈ రాకెట్ గరిష్టంగా నాలుగు టన్నుల బరువున్న శాటిలైట్లను మోసుకెళ్లగలదు. అంటే నాలుగు టన్నుల బరువైన చంద్రయాన్ 2ను జీఎస్ఎల్వీ మార్క్ త్రీ అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. అక్కడి నుంచి చంద్రయాన్ 2 తనంతట తాను ప్రయాణించి చంద్రుడిని చేరుకోవాలి.
50 ఏళ్ల కిందట నాసా చేపట్టిన అపోలో 11 ప్రయోగంలో... ఇలా అంతరిక్షం నుంచి దూసుకెళ్లిన రాకెట్ బరువు 45 టన్నులకు పైమాటే. కానీ చంద్రయాన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, ఇంధనంతో కలిపి మొత్తం బరువు 4 టన్నుల లోపే ఉంది. అంటే అతి తక్కువ ఇంధనంతో... చంద్రుడి దగ్గరకు చేరుకోవాలి. ఇందుకోసమే... ఇస్రో ఓ వినూత్న ఆలోచన చేసింది.
ఈ విధానంలో రాకెట్ నేరుగా చంద్రుడి మీదకు దూసుకెళ్లడానికి బదులుగా... భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ, క్రమంగా తన అపోజీని పెంచుకుంటూ వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఆపై భూ కక్ష్య నుంచి బయటపడి చంద్రుడి వైపు ప్రయాణం చేసి, అక్కడ నుంచి చంద్రుడి చుట్టూ ఇదేలా దీర్ఘవత్తాకార కక్ష్యలో తిరుగుతూ క్రమంగా తన అపోజీని తగ్గించుకుంటూ, చివరికి చంద్రుడి వైపు ప్రయాణించి, ఆ ఉపరితలంపై దిగుతుంది.
చంద్రయాన్ 2 ప్రయాణం సాగిందిలా...
ఈ విధానంలో జులై 22న అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 2... 23 రోజుల పాటు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ... దాని అపోజీ పరిధి పెంచుకుంటూ పోయింది. 23వ రోజు భూ కక్ష్య నుంచి విడిపోయి... చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించింది.
అలా ఏడు రోజులు నేరుగా చంద్రుడి వైపు ప్రయాణించిన తర్వాత... 30వ రోజున అంటే ఆగస్ట్ 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.
ఇలా చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించడాన్నే లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్ అంటారు. అక్కడి నుంచి చంద్రుడి చుట్టూ 13 రోజులు పరిభ్రమిస్తూ... అపోజీ తగ్గించుకుని, చంద్రుడి మీదకు దిగేలా ప్రోగ్రామ్ చేశారు.
ఇలా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన 13వ రోజు... చంద్రయాన్ 2లోని ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించి, 48వ రోజు... ల్యాండర్ చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేసేలా ఇస్రో అంతా ముందుగానే ప్రోగ్రామ్ చేసింది.
ఒక్కసారి చంద్రయాన్‌లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగిన తర్వాత, అందులో వివిధ రకాల సెన్సర్లు చంద్రుడిపై పరిశోధనలు చేసి, ఆ సమాచారాన్ని భూమ్మీదకు పంపేలా ఏర్పాట్లు చేశారు.
ఇక ల్యాండర్ నుంచి బయటకు వచ్చే రోవర్ ప్రజ్ఞాన్... చంద్రుడి మీద తిరుగుతూ... అక్కడి నేలను విశ్లేషించడంతో పాటు, మరిన్ని పనులు చేస్తుంది.
ఇలా ఇస్రో తన దగ్గరున్న రాకెట్ సామర్థ్యంతో, అతితక్కువ ఇంధనంతో విజయవంతంగా చంద్రుడిని చేరుకోడానికే ఇలాంటి విధానాన్ని ఎంచుకుంది. ఈ విధానం వల్లే అతి తక్కువ ఖర్చుతో ఇస్రో తన ప్రయోగాలు పూర్తి చేస్తోందని బీజీ సిద్ధార్ధ్ తెలిపారు.
అన్ని ప్రయోగాలకూ ఇదే పద్ధతి
2008లో ఇస్రో చంద్రయాన్ 1 ప్రయోగాన్ని 386 కోట్ల రూపాయల ఖర్చులో పూర్తి చేసింది.
ఆపై 2014లో మార్స్ మీదకు ప్రయోగించిన మంగళ్‌యాన్ ప్రాజెక్టు కూడా... 450 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేశారు. ఇదే మార్స్ మీదకు నాసా ప్రయోగించిన అమెరికా మావెన్ ఆర్బిటర్ ప్రయోగానికి ఇంత కన్నా పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినట్లు... బీబీసీ సైన్స్ వెల్లడించింది. అప్పట్లో భారత్ చేపట్టిన మంగళ్‌యాన్ ప్రయోగాన్ని ప్రపంచమంతా కొనియాడింది. హాలీవుడ్‌లో భారీ వ్యయంతో స్పేస్ సినిమాలు తీస్తుంటే... అంత కన్నా తక్కువ ఖర్చుతో ఇస్రో మంగళ్‌యాన్ ప్రాజెక్ట్ పూర్తి చేసిందని ప్రధాని మోదీ కూడా కొనియాడారు.
ఇప్పుడు కూడా... ఇలాగే మీడియం లిఫ్ట్ హెవీ వెహికల్ అయిన జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్‌ని ఉపయోగించి కేవలం 978 కోట్ల రూపాయల అతి తక్కువ ఖర్చుతో ఇస్రో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ పూర్తి చేసిందని, త్వరలో ఇదే తరహాలో గగనయాన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయబోతోందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్.శ్రీరఘునందన్ బీబీసీతో తెలియచేశారు.
చంద్రయాన్-1లోనే చంద్రుడిపై ల్యాండర్
చంద్రయాన్ 1 ప్రయోగంలో ఇస్రో కేవలం ఆర్బిటర్ మాత్రమే ప్రయోగించిందని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రయోగంలో ఆర్బిటర్‌తో పాటుగా... మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను కూడా ప్రయోగించింది.
చంద్రయాన్ 1 లో ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటే... మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మాత్రం చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఆ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌కి నాలుగు పక్కలా భారతీయ జెండాను ఉంచారు. అలా చంద్రుడి మీద భారత జాతీయ పతాకం పదేళ్ల కిందటే కాలు మోపిందన్నమాట.
అంతే కాదు... ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఇచ్చిన సమాచారంతోనే చంద్రుడి మీద నీటి జాడలను ఇస్రో గుర్తించింది.
50 ఏళ్ల కిందట భారత్‌లో ఇస్రో ప్రస్థానం ప్రారంభం కావడానికన్నా ముందే అమెరికా తమ వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపి, అక్కడి శిలలను భూమికి తీసుకొచ్చింది.
ఆపైనా 1972 వరకూ నాసా 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. కానీ చంద్రుడి మీద నీటి జాడలు మాత్రం అమెరికా సహా మరే దేశమూ కనిపెట్టలేకపోయింది. కానీ చంద్రయాన్ 1 తో ఇస్రో ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మాత్రం ఆ ఘనత సాధించిందని రఘునందన్ తెలిపారు.
తొలి ప్రయత్నంలోనే ఇస్రో విజయం
అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చెయ్యడమే కాదు... అన్ని అంశాల్లోనూ దాదాపు తొలి ప్రయత్నాలతోనే విజయం సాధిస్తూ వస్తోంది ఇస్రో.
చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మంగళ్‌యాన్ ప్రయోగాల్లో అత్యంత సంక్లిష్టమైన దశ... లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్. ఇది అనుకున్నంత సులువైన దశ కాదు. అమెరికా, రష్యాలు తొలినాళ్లలో 14 సార్లు ఈ దశ దగ్గరే విఫలమయ్యాయి. 15వ సారి మాత్రమే ఈ దశ దగ్గర విజయం సాధించాయి. కానీ ఇస్రో మాత్రం తొలి ప్రయత్నంలోనే చంద్రయాన్ 1 ప్రయోగంలో ఈ దశను విజయవంతంగా అధిగమించింది.
Nasa.gov వెల్లడించిన వివరాల ప్రకారం అపోలో 11 ప్రయోగంలోనే కాదు.. అంత కన్నా ముందుకూడా చాలా మందిని చంద్రుడి మీదకు పంపింది నాసా. కానీ వాళ్లంతా చంద్రుడి కక్ష్య వరకూ వెళ్లి, చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి వెనక్కి వచ్చేశారు తప్ప చంద్రుడి మీద దిగలేదు. 1968 డిసెంబర్ 25న ఫ్రాంక్ బోర్మన్, బిల్ యాండ్రెస్, జిమ్ లోవెల్‌లతో కూడిన వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి, తిరిగి వెనక్కి వచ్చేసింది. కానీ వాళ్లు చంద్రుడి మీద దిగకపోవడంతో... ఈ ప్రయోగం ప్రపంచానికి తెలియలేదు.
12 మందిని చంద్రుడిపైకి పంపిన నాసా
కేవలం అపోలో 11 ద్వారా ముగ్గురు వ్యోమగాముల్ని పంపడమే కాదు.. ఆ తర్వాత కూడా ఇలాంటి ప్రయోగాలు కొనసాగించింది నాసా.
1969 నవంబర్ 14న అపోలో 12 రాకెట్ ద్వారా మరో ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. అలా 1972 డిసెంబర్ 7న అపోలో 17 చివరి సారిగా ముగ్గురు వ్యోమగాముల్ని పంపింది. ఇలా మూడేళ్ల వ్యవధిలో నాసా 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది.
ఆ తర్వాత చంద్రుడి మీదకు మనుషుల్ని పంపే ప్రయోగాలను నిలిపేసింది. ఈ విజయాల వెనుక నాసా ఎన్నో వైఫల్యాలను కూడా చవిచూసింది.
1967 ఫిబ్రవరి 21న నాసా అపోలో 1 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. కానీ రిహార్సల్ టెస్టింగ్ టైంలో క్యాబిన్లో మంటలు రేగడంతో... రాకెట్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యోమగాములతోపాటు 27 మంది సిబ్బంది మరణించారు.
ఇలా ఎన్నో విఫలయత్నాల తర్వాత... నాసా విజయవంతంగా చంద్రుడి మీద కాలు మోపింది.
కానీ ఇస్రో మాత్రం అతి తక్కువ ఖర్చుతో, తొలి ప్రయత్నాలతోనే విజయం సాధిస్తూ వస్తోందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలియ చేశారు.
చంద్రయాన్‌లో ఏమున్నాయి..?
చంద్రయాన్‌లో ప్రధానంగా మూడు భాగాలున్నాయి. అందులో మొదటిది చంద్రుడి కక్ష్యలోనే తిరిగే ఆర్బిటర్. రెండోది జాబిల్లి మీద దిగే ల్యాండర్. దీనిపేరే విక్రమ్. ఇక మూడోది ఆ ల్యాండర్ చంద్రుడి మీద దిగిన తర్వాత బయటకొచ్చి చంద్రుడిపై కలియ తిరిగే రోవర్.. దీని పేరు ప్రజ్ఞాన్. ఈ మూడింటినీ కలిపి కాంపోజిట్ మాడ్యూల్ అంటారు.
ఇలా ఆర్బిటర్‌ను, ల్యాండర్‌ను ఒకేసారి పంపడం అంత సులువైన విషయం కాదు. ఇస్రో మాత్రం ఈ రెండింటినీ ఒకేసారి ఒకే రాకెట్‌తో ప్రయోగించేసింది. అంతేకాదు.. ఇందులో ఆర్బిటర్‌తో పాటు, చంద్రుడి మీద దిగే రోవర్‌ను కూడా.. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించింది.
ఇక్కడ మరో అద్భుతమైన విషయం గురించి కూడా ప్రస్తావించాలి. భూమ్మీద నుంచి చంద్రుడి మీదకు సిగ్నల్ పంపాలంటే 15 నిముషాలు పడుతుంది. అంటే ల్యాండర్ చంద్రుడి మీద దిగేటప్పుడు భూమ్మీద నుంచి దాన్ని కంట్రోల్ చెయ్యడం దాదాపు అసాధ్యం. అందుకే ల్యాండర్ తనంతట తానే నిర్ణయాలు తీసుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రోగ్రామ్ చేశారని రఘునందన్ తెలియ చేశారు.