సామాన్యులు ఉపయోగించే వంట గ్యాస్,డీజిల్,పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారం వేస్తోన్న ప్రభుత్వం, సంపన్నుల కోసం ఉపయోగపడే విమాన ఇంధన ధరలను మాత్రం తగ్గించింది. తీవ్ర నష్టాల్లో ఉన్నామంటూ ప్రభుత్వ రంగరలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఒకవైపు పెట్రోల్ ధరలను పెంచుతున్నాయి. ముడి చమురు అంతర్జాతీయ ధరలు తగ్గిన కారణంగా విమాన ఇంధన ధరలను నాలుగు శాతం తగ్గిస్తున్నట్లు అవే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గించిన ధరలను మంగళవారం ప్రకటించాయి. ఢిల్లీలో కిలో లీటరు విమాన ఇంధనం ధర రూ.56,466.11గా ఉండగా తగ్గింపు 3.95 శాతం లేదా రూ.2,327.89 గా ఉంది. ఇప్పటివరకు రు.56.46గా వున్న లీటరు విమాన ఇంధనం ధర రు. 54.14కి తగ్గింది. యుపిఎ-2 సర్కారు తీరిదీ!