మాంద్యం (Recession) అంటే?
వరుసగా రెండు పర్యాలు (Two Consequent terms) స్థూల
దేశీయోత్పత్తి (GDP) గాని తగ్గితే దానిని మాంద్యం (Recession) అంటారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన
భారత అర్థికరంగ మాంద్యమానికి
ప్రధాన కారణం "ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గడమే" (Decrease
in purchasing power among people)
కేంద్ర ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు
- ఒక లక్షా నలభై కోట్ల రూపాయిల (₹1.4 Lakh Crores per year) విలువైన కార్పోరేట్ పన్ను(Corporate Tax) రాయితీ తో కలుపుకుంటే కార్పోరేట్ కంపెనీలకు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం యిచ్చిన రాయతీలు అక్షరాల రెండు లక్షల కోట్ల రూపాయిలు (₹2 Lakh Crores).
- గత ఐదు సంవత్సరాలలో కార్పోరేట్ కంపెనీలు తీర్చలేని రుణాలను, రుణ ఎగవేత దారులు అప్పులను Corporate Non-Performing Assets (NPAs) గా గుర్తించి వాటిని మాఫీ చేసిన మొత్తము అక్షరాల ఐదు లక్షల కోట్ల రూపాయిలు (₹5 Lakh Crores).
- GST రేట్లు పెద్దగా ప్రభావం చూపని వస్తువులపై కొంత మేర తగ్గింపు
కార్పోరేట్ టాక్స్ తగ్గింపు
·
టాక్స్ ఎవరు
కడతారు?
ప్రైవేటు లిమిటెడ్ మరియు పబ్లిక్
లిమిటెడ్ కంపెనీలు వాటి వార్షిక ఆదాయములో వచ్చే లాభం (Profit) మీద మాత్రమే ప్రభుత్వానికి కట్టే పన్ను.
·
తగ్గింపు ఎవరికి లాభం?
కంపెనీలకి
లాభం వస్తేనే కట్టేది ఈ పన్ను, అంటే లాభాలో
వున్న కంపెనీలకి యింకా లాభం. ప్రస్తుతం నష్టాలలో
వున్న కంపెనీలకు ఈ పన్ను ఎంత వున్నా నష్టం లేదు. అంటే,
నష్టాలలో వున్న కంపేనీలకు ఎటువంటీ లాభం లేదు.
·
కార్పోరేట్ టాక్స్ తగ్గింపు వలన కలిగే లాభాలు..
కంపెనీలకు
లాభాలు పెరగడం వలన, పెట్టుబడులు పెరుగుతాయి, ఉధ్యోగాలు పెరుగుతాయి, ఉధ్యోగుల జీతాలు పెరుగుతాయి, వీటిద్వారా ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుతుందిని ప్రజలను నమ్మిస్తుంది.
·
కార్పోరేట్ టాక్స్ యింకా తగ్గాలి
కార్పోరేట్
టాక్స్ భారత్ లో ఎక్కువ ఇతర దేశాలతో పోల్చుకుంటే,
యింకా తగ్గాలి అనే వారు కూడా వున్నారు.
కార్పోరేట్ టాక్స్ తగ్గింపు పై నా విశ్లేషణ
- కొందరు ఈ టాక్స్ తగ్గింపు వలన లాభం చాలా లాభాలు వున్నాయని భావిస్తున్నారు. లాభాలు పెరిగినప్పుడు ఆ లాభాన్ని ఎంప్లాయిస్ కి గాని, ఆ కంపెనీ కష్టమర్ల కు గాని ఆ లాభాన్ని బదలాయించడం/పంచండం (Transfer) ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, జరగదు కూడా.
- లాభాలు వచ్చేవానికి ఈ తగ్గింపువలన యింకా లాభాలు ఎక్కువగా వస్తాయి. సంవత్సరం ఆఖరున వచ్చిన లాభాలను పంచుకు తింటారు గాని ప్రజలకు పంచరు.
- ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించడం వలన వచ్చిన అధిక ఆదాయం తన ప్రతిభ/శ్రమకు వచ్చిన ఆదాయంగా భావిస్తాడు గాని, ఆ ఆదాయాన్ని దిగువ వానికి బదిలీ (Transfer) చెయ్యాడు. యిది జగమెరిగిన సత్యం.
- యిలా తగ్గించడం యిదే మొదటి సారి కాదు. 1997 లో కూడా ఒక సారి తగ్గించారు, అప్పట్లో 38.5% నుండి 30% కి తగ్గించారు. దానితో మన ఆర్థిక వ్యవస్తేమి అమాంతం పెరిగిపోలేదు.
- కార్పోరేట్ టాక్స్ భారత్ లో ఎక్కువ ఇతర దేశాలతో పోల్చుకుంటే అనే వారు గుర్తు పెట్టుకోవసినది ఏమిటంటే, ఆర్థికం గా బలంగా వున్న దేశాలలో ప్రత్యక్ష పన్ను (ఆదాయపు పన్ను Income Tax) ద్వారా 60-70% ఆదాయము, మిగిలినది పరోక్ష పన్ను (Indirect Tax - GST, Corp.Tax, Cess, etc.) ద్వారా ఆదాయాని సమకూర్చుకుంటున్నారు. మనదేశంలో పరోక్ష పన్ను ద్వారా 60-70% సంపాదిస్తున్నాము. ఈ విషయాన్ని దాచి పెట్టి కార్పోరేట్ టాక్స్ భారత్ లో ఎక్కువ అని బూటకపు ప్రచారం చేస్తున్నారు
కార్పోరేట్ మొండి బకాయిలను రద్దు
- మనలను ఒప్పించేందుకు (convince) ఈ మొండి బకాయలకు చాలా పేర్లు పెట్టారు. ఉధ్ధేశకపూర్వ ఎగవేత, నిరర్ధక అప్పులు (Definitive debts), చెడు రుణాలు (Bad Debts) వీటినన్నింటికీ ముద్దు పేరే పనికిరాని ఆస్తులు(Non-Performing Assets).
- ఎక్కడా కార్పొరేట్ అప్పులను రద్దు చేశాము అని ఎక్కడా చెప్పకుండా జాగ్రత్త తీసుకుంటారు. NPAs అని, Written off అని, రద్దు చెయ్యలేదు కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో చూపించడం లేదు అని మనకు చెబుతుంటారు.
- NPA క్రింద చూపిన ఒక్క అప్పు యిప్పటి వరకు బ్యాంకులు రికవరీ చేసిన దాఖలాలు లేవు.
- అంటే, డొంకతిరుడు (Indirect) గా రుణాలని మాఫీ చెయ్యడమే!.
·
మొండి బకాయిలను మాఫీ పై నా విశ్లేషణ
- పారిశ్రామిక వేత్తలు చేసే వ్యాపారలలో వుండే నష్టాలను (RISK) ప్రభుత్వం మీదకు రుద్దడం, లాభాలు వస్తే మాత్రం వారు వివధ మార్గాలు ద్వారా స్వంత ఆస్తులుగా మలుచుకోవడం ఈ దేశంలో జరుగుతూనే వుంది, ఈ ఆదాయాని/లాభాలను వారి ప్రతిభకు/తెలివి తేటలకు చిహ్నంగా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది.
- ఈ NPAs రుణ మాఫీలు అందరికి వుండదు.. రాజకీయ పలుకుబడి, బడా బాడా ప్రారిశ్రామికి వేత్తలకు మాత్రమే యివ్వడం జరుగుతుంది.
- యిలా రుణమాఫీ పొందిన బడా వ్యాపారులు అధికారంలో వున్న పార్టీల ఎన్నికల నిధులు సమకూర్చే వారీగా మారుతున్నారు. అందువలన, ఈ ఋణ మాఫీ అటూ రాజకీయ పార్టీలకు, వ్యాపారస్తులకు ఆభిస్తుంది. ఇదో చైన్ ఎఫెక్ట్.
స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగింది?
- నా ఉద్ధేశం ప్రకారం స్టాక్ మార్కెట్ మధ్య తరగతి ప్రజల సొమ్ము ఒక పద్దతి ప్రకారం కాజేయ్యడానికి ఒక వేదిక.
- షెర్స్ కొన్న వాడు ఎప్పుడూ బాగుపడలేదు (బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కవ లాభం వచ్చింది లేదు. కానీ కంపెనీ అధిపతులు (Board of Directos) ఆస్తులు అనూయంగా పెరిగిపోతాయి. ఒకటి రెండు ఉదాహరణలు కాదు చూడవలసినది. రామారామీగా (Average) గా కూసినప్పుడు షేర్ హోల్దెర్స్ కి నాష్టాలే మిగిల్చాయి సామాన్యులకు .
- సామాన్య ప్రజలను ఏదో ఒకటి చూపి పెట్టుబడులు పెట్టించడం (షేర్ వాల్యూని క్ఱుత్రిమంగా పెంచి), తరువాత షేర్ వాల్యూని కావాలని తగ్గించడం. నష్ట పోయేది సామాన్య ప్రజలే
- కొందరు బాడా బాబులు స్టాక్ మార్కెట్ ని ఓ జూదశాలగా చేశారు.
- ఈ పెరుగుదల బాడా బాబులు సామాన్య ప్రజలకు వేసిన ఒక బిస్కేట్ మాత్రమే.
- ఈ స్టాక్ మార్కెట్ జూదంలో అంతిమంగా ఒడేది సామాన్య ప్రజలే
బిజేపి ప్రభుత్వా నికి ఇవ్వన్ని తెలియదా?
- ఖచ్చితంగా తెలుసు. మరి ఎందుకు? యిదో విష వలయం.
- ప్రభుత్వం లోకి రావాలంటే రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ లో డబ్బులు ఖర్చు పెట్టాలి. మరి ఫండ్ ఎలా వస్తుంది? అందుకే బిజేపి ప్రభుయత్వం ఎన్నియకల బాండ్లను (Election Bonds) ప్రవేశ పెట్టిండి.
- ఈ దేశంలో 1% (1,30,000) మంది దగ్గర 70% మన దేశ సంపద గుమిగూడి వున్నది. అంటే 99% శాతం ప్రజల సొమ్ము 1% శాతం మంది దగ్గర వుండి అన్నమాట. అలానే, దేశం మొత్తంలో 100 మంది మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను సాశించే స్థాయిలో వున్నారు.
- ఈ 100 మంది ఎలక్షన్ బాండ్స్ లో కావలసిన పార్టీకి పెట్టుబడులు పెడతారు. దాని ప్రతిఫలం గెలిచిన తరువాత ప్రభుత్వం ఈ బాడా వ్యాపారులకు యిచ్చి తీరాలి.
- అందుకనే వేలకోట్లు బాకీ వున్న వారి ఆస్తులు ఆటోమాటిక్ జప్తు అయ్యే టట్లు కఠిన చట్టాలు తీసుకు రాలేవు. ఎన్నికల బ్లాండ్ల విష సంస్కృతే ఈ క్విడ్ ప్రోకో (యిచ్చి పుచ్చుకొనే దోరణి)
- ఎలానో వుంటారు కొందరు, వీరు కార్పోరేట్స్ కి చేస్ ప్రభుత్వ మేలును, ప్రజలకోసమే చేసినట్లు పిట్ఠకధలు చెప్పటానికి. వారినే "ఇంటలేక్చువాల్స్" అంటారు. వీరు కార్పొరేట్స్ కి బ్రోకర్స్
- ప్రజలలో కొనుగోలు శక్తి పెంచాలంటే, కనీస వేతనం (Minimum wage) నెలకు 18 వేలు చెయ్యాలి దేశవ్యాపితంగా
- ఎక్కువ మంది వాడే వస్తువులపై GST (Indirect Taxes) తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని GST పరిధిలోకి తీసుకురావాలి.
- ఆదాయప పన్ను నుండి మద్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాలి.
- కోట్లాది రూపాయిలు సంపాదించే వారిపై ఆదాయప పన్ను పెంచాలి.
- అప్పు ఎగ్గొట్టీన ప్రతీ కార్పొరేటర్ ని డీఫాల్టర్ గా డిక్లర్ చేసి, వారి ఆస్తుయాలను స్వాధీనం చేసుకోవాలి.
వాసవ్య యాగాటి
2019-09-23