వీలుంటే నా నాలుగు లంకెలు ...

9, జూన్ 2019, ఆదివారం

ఈ భూమ్మీద మొదట కోతి పుట్టిందా?

0 వ్యాఖ్యలు
మన పిల్లలకి శాస్త్రీయ ఆధారాలు లేని భారతం, బైబిల్, ఖురాన్ ల గురించి చెప్పక పోయిన ఫర్వాలేదు కానీ ఈ విషయం చెప్పి తీరాలి, పిల్లల్లో శాస్త్రీయ ధృక్పథం అలవర్చండి..
👇

ప్రశ్న: ఈ భూమ్మీద మొదట కోతి పుట్టిందని, దాన్నుంచే మానవుడు పుట్టాడని విన్నాను. అదే నిజమేనా? మరి ఈ నాటి కోతులు ఇంకా కోతులలాగానే ఎందుకున్నాయి? అసలు ఈ భూమి, ఈ ప్రకృతి, ఈ ప్రాణులు ఎట్లా ఏర్పడ్డాయి ?
"""""""""""""""""""""""""""""""""""""""""""""

జవాబు : ఈ భూమ్మీద మొదట, అంటే భూమి ఏర్పడ్డ సుమారు *550 కోట్ల సంవత్సరాల క్రితం ఏ జీవీ లేదు.* అపుడు ఈ భూమ్మీద కోతులు, కొంగలు ఇతర (చిన్నా పెద్దా) ప్రాణులు, కొండలూ, గుట్టలూ, నదులూ, సముద్రాలూ, వాతావరణం మొదలైనవేవీ ఇక్కడ లేవు.

ఆదిలో ఈ భూమి, కేవలం ఓ చిన్న సూర్యుడిలాగా, స్వతహాగా కాంతినిచ్చే ఓ బుల్లి నక్షత్రంలాగా వాయువు, దుమ్మూ, ధూళి రూపంలోనే వుండేది.

అది క్రమేపీ తనలో ఉన్న కేంద్రక ఇంధనాల (Nuclear Fuel) యిన హైడ్రోజన్‌, డ్యూటీరియం వంటి వాయువులు కేంద్రక సంలీన చర్యల *(Nuclear Fusion reactions)* ద్వారా పెద్ద పెద్ద పరమాణువులుగా మారాయి. ఆ క్రమంలో ద్రవరూప పదార్థం సలసల మరుగుతూ ఏర్పడింది.

ఉష్ణం, శక్తి ఎక్కడ ఏర్పడ్డాయో అక్కడే ఉండిపోవు. అధిక శక్తి ప్రాంతం నుంచి అల్పశక్తి ప్రాంతం వైపు శక్తి ప్రసరించడం సహజ లక్షణం. దీన్నే శాస్త్రీయ పరిభాషలో ఉష్ణ గతిక శాస్త్ర శూన్య నియమం *(Zero Law of Thermo dynamics)* అంటారు.

కాలక్రమేణా ఉష్ణాన్ని, కాంతి శక్తిని పోగొట్టుకున్న భూమి గోళరూపంలోకి (ఘనాకృతికి) మారింది. ఆ సందర్భంలో కొన్ని రసాయనిక చర్యలు జరిగి వాయురూప నత్రజని, నీటి ఆవిరి ఏర్పడ్డాయి. ఇవి భూమిపై వాతావరణాన్ని ఏర్పర్చాయి. పై పొరలో బురబుర, సలసల మరిగే ద్రవ, ఘన రూప నేల ఉవ్వెత్తున ఎగిరిపడే లావా ఉప్పెనలు, ఆ పై భాగాన అతి వేడిగా ఉన్న వాయు వాతావరణం.. *ఇదీ దాదాపు 500 కోట్ల సంవత్సరాల క్రితపు భూమికీ వున్న భౌతిక రూపం.*

శక్తి వికరణం చెందేకొలదీ ఉష్ణోగ్రత తగ్గి నీటి ఆవిరి వర్షంగా మారింది. ఈ వర్షం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు నిరాఘాటంగా సాగింది. ఆ *చల్లదనానికి లావా లాగా ఎగిసిన ఉప్పెనలు కొండలుగా మారాయి.*

*లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. అవే సముద్రాలుగా మారాయి.* కొండల మీద పడ్డ వాన నేల పొరల్ని రాసుకొంటూ భూమ్యాకర్షణ వల్ల (పల్లం వైపు) సముద్రాలవైపు పయనించింది. ఇవే నదులుగా మారాయి.

*సముద్రంలోని నీరు తిరిగి ఆవిరి కావడం, నేలపైకి మేఘాలుగా రావడం, వర్షంగా మారడం, నదీనదాలు నిండడం వంటి నీటి చక్రం స్థాపితం అయ్యింది.*

ఆ క్రమంలో వేడి వేడిగా వున్న నేల ప్రాంతం నుంచి రకరకాల రసాయనిక ధాతువులు సముద్రాల్లో చేరాయి. అపుడక్కడ ఉన్న ఉష్ణోగ్రత, రసాయనిక భౌతిక పరిస్థితుల ప్రభావంతో కాకతాళీయంగా (ముందే ఎవరో సృష్టికర్త రాసి పెట్టినట్టు కాకుండా) DNA, RNA వంటి అరీశ శకలాలు ఏర్పడ్డాయి.

DNA, RNA లాంటి సంక్లిష్ట అణువులు ఏర్పడ్డాయంటే అంతకన్నా తేలికయిన కార్బన్‌ డయాక్సైడ్‌, నత్రజని సమ్మేళనాలు, సేంద్రియ, నిరింద్రియ పదార్థాలు (Organic and Inorganic Compounds) కూడా ఏర్పడ్డాయనే అర్థం. కొన్ని ప్రత్యేక అనుకూల పరిస్థితుల కారణాన DNA  లేదా RNA వేలిక చుట్టూ తైల అణువుల పొర (lipid layer)  అధ్యణు రసాయనిక ప్రక్రియల (Supramolecular chemical processes) ద్వారా స్వక్రమానుగత పొర (Self Assembled Monolayer) గా ఏర్పడింది. ఇదే తొలి జీవకణం.

ఈ తొలి జీవకణానికి స్వపునరుత్పత్తి (self replication) లక్షణం వుంది. ఇలాంటి దశల మధ్య కాలవ్యవధి సంవత్సరాలు, ఒక మనిషి జీవితకాలం వంటి స్థాయిలో ఉండదు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు క్రమానుగత చర్యలు పర్యవసానంగా వుంటుంది. అంటే కొద్దికొద్దిగా పరిమాణాత్మకంగా *(Quantitatively)* మార్పులు చెందుతూ వ్యవధిలో ఓ సందర్భ దశలో గుణాత్మక *(Qualitative)* మార్పులు చెందడం ద్వారా సంభవించాయి.

ఇలాంటి *తొలి జీవకణాలకు కాలక్రమేణా జీవులకున్న లక్షణాలు పరిపుష్టి చెందాయి.* DNA/ RNA లో వున్న రసాయనిక క్రమం జన్యుస్థాయి (Genetic Rule) ని సంక్రమం చేశాయి.
ఇలాంటి కణాలు *కొన్ని కోట్ల సంవత్సరాల గతితార్కిక సైద్ధాంతిక ప్రక్రియల ద్వారా వృక్షజాతులుగా, మరికొన్ని జంతు జాతులుగా పరిణామం చెందాయి.*

ఎముకలు లేని (అకశేరుక) జీవుల (Invertibrate animals) యుగం కొన్ని వందల కోట్ల సంవత్సరాల పాటు సాగింది. అందులో కొన్నింటిలో జీవ రసాయనిక మార్పులు జరిగి భూమ్మీద సంచరించేలా సకశేరుక (ఎముకలున్న) జంతువులు (Vertibrate animals) రూపొందాయి.

*ఆ క్రమంలో కేవలం కోటి, 5 కోట్ల సంవత్సరాల పూర్వమే పాలిచ్చే జంతువులు (Primates) ఏర్పడ్డాయి.*

కోతులు రూపొంది యిప్పటికి రెండు మూడు కోట్ల సంవత్సరాలు కూడా మించదు. ఈ జాతుల్లోని కొన్ని పరిణామక్రమంలో మానవ శరీరంలోకి పరిణమించాయి. మానవుడు లాంటి క్షీరద జీవి (Mamnal) రూపొంది కోటి 20 లక్షల సంవత్సరాలకు మించదు.

*కాబట్టి కోతులు మొట్ట మొదట ఏర్పడలేదు.* అవి ఈ మధ్యే జీవ పరిణామ క్రమంలో రూపొందాయి. ఇపుడున్న కోతుల జాతి నుండే మానవుడు ఆవిర్భవించాడని అనుకోవడం సరికాదు. *వీటి జాతి వేరు. మానవుల జాతి వేరు.*

వ్యాసకర్త..
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక.

18, మే 2019, శనివారం

మోడీ జీ మూసుకొని కూర్చో..

0 వ్యాఖ్యలు
మోడీ జీ మూసుకొని కూర్చో..

నీకు డైలాగ్స్ లేవు.

మొన్ననే ఛాన్సిస్తే మబ్బులు, డిజిటల్ కెమెరాలు, ఈమెయిల్ అని గబ్బు లేపినవ్..

-అమిత్ షా

13, మే 2019, సోమవారం

‘మేఘావృతమైనప్పుడు రాడార్‌ పని చేయదని, అలాంటి సమయంలో దాడులు చేస్తే శత్రువులు పట్టుకోలేరన్న మోదీ'

0 వ్యాఖ్యలు
‘మేఘావృతమైనప్పుడు రాడార్‌ పని చేయదని, అలాంటి సమయంలో దాడులు చేస్తే శత్రువులు పట్టుకోలేరన్న మోదీ'

ఒక దేశ భక్తుడని చెప్పుకునే వ్యక్తి యిలానేనా మాట్లాడేది??

1. యుద్ద తంత్రాలను ఒక ప్రధవి లో వుండి భహిర్గతం చేస్తాడా, అదీను ఎన్నికల సభలో?

2. యిది మన వాయుసేన కెపాసిటిని తక్కువ ఆంచనా /చులకన చేయడమే కదా!

3. వాయుసేనలో రాడార్స్ పై ఎన్నో ఏళ్ళనుండి పనిచేస్తూ, అవి తయారు చేస్తున్న వారికి తెలియని విషయం ఈ బూటకపు డిగ్రీ హోల్డర్ కు తెలిసిందా? మెఘాలు వున్నప్పుడు రాడార్ పని విధానం ఎలా వుంటుందో ఎవరికి యితను చెప్పె వరకు తెలియదా?

4. ఎలక్షన్ కోడు ప్రకారం సైనిక పరమైన విషయాలు చర్చించ వద్దని చాల క్లియర గా వుంది. అటువంటప్పుడు, ఏకంగా సైనిక రహస్యాలను బయటపెటకు చెప్పొచ్చా?

తక్షణం ఈ ఫేక్ చౌకీదార్ ని  ఎన్నికల కమీషన్  ఎన్నికల నుండి బహిష్కరించాలి.. వైమానిక దళం ఈ ఫేకుని రహస్యాలు బయట పెట్టిన నేరానికి గాను  మార్షల్ చెయ్యాలి..

భక్తులూ మీ దేశ భక్తిని చాటుకొనే సమయం అసన్నమైంది..

వాసవ్య యాగాటి
2019-05-13