వీలుంటే నా నాలుగు లంకెలు ...

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం నాసా ఆడిన నాటకమా? కుట్ర సిద్ధాంతకర్తల వాదనలు ఏమిటి? వాటికి నాసా జవాబులు ఏమిటి?

0 వ్యాఖ్యలు

అపోలో మిషన్Image copyrightNASA

1969 జులై 20.. కమాండర్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ ఆల్డ్రిన్ - ఇద్దరూ అమెరికా వ్యోమగాములు - అపోలో లూనార్ మాడ్యూల్ ఈగిల్‌ను చంద్రుడి మీద దించారు.
కొన్ని గంటల తర్వాత.. చంద్రుడి మీద నడిచిన మొట్టమొదటి మానవుడిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ నిలిచారు. ఆ సంఘటనను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.
చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో అదొకటి.
చంద్రుడి మీదకు మనుషులు వెళ్లారనటానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నా కూడా.. కొంతమంది దీనిని విశ్వసించరు.
చంద్రుడి మీదకు వెళ్లటం కట్టుకథ అనే వాళ్లని 'కుట్ర సిద్ధాంతకర్తలు'గా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే.. అదంతా నాసా ఆడిన నాటకమని వాళ్లు నమ్ముతారు.
ఈ కుట్ర సిద్ధాంతకర్తల వాదనలను కొట్టివేయటానికి.. శాస్త్రవేత్తలు, నాసా నిపుణులు తరచుగా ఆధారాలు ముందుపెట్టాల్సి వస్తుంది.
మూన్ ల్యాండింగ్ జరగలేదని వాదించేవాళ్లు చూపే కొన్ని కారణాలు.. అవి ఎలా తప్పో చెప్పే వివరాలు ఇవి.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES

నింగిలో నక్షత్రాలు లేవు

అపోలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం మీద నుంచి తీసిన ఫొటోలలో నక్షత్రాలు లేకపోవటాన్ని తమ వాదనకు మద్దతుగా ప్రస్తావిస్తుంటారు కొందరు కుట్ర సిద్ధాంతకర్తలు.
'చంద్రుడి మీద గాలి లేదు. దానర్థం.. ఆకాశం నల్లగా ఉంటుంది. కానీ.. నక్షత్రాలు లేకపోవటం విచిత్రమైన విషయం' అని కొందరు అంటుంటారు.
దీనికి జవాబు ఏమిటంటే.. నక్షత్రాలు ఉన్నాయి.. కానీ అవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉన్నాయి.
మనం ఏదైనా ఫొటో తీసేటపుడు.. ఫోకస్ దేని మీద ఉండాలో మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి.. కెమెరా చంద్రుడి మీద ఉన్న వ్యోమగాముల మీద ఫోకస్ చేస్తుంది కానీ.. నక్షత్రాల మీద కాదు. ఇది ఎవరికైనా అర్థమవుతుంది.

అపోలో మిషన్Image copyrightNASA

జెండా రెపరెపలు

చంద్రుడి మీద అమెరికా జెండా చాలా ప్రఖ్యాతి గాంచింది. ఆ క్షణంలో తీసిన ఫొటోల్లో ఆ జెండా గాలిలో రెపరెపలాడుతున్నట్లు కనిపిస్తుంది.
అయితే.. చంద్రుడి మీద గాలి లేదు కాబట్టి గాలి వీచే అవకాశం ఉండదని.. అలాంటపుడు జెండా ఎలా రెపరెపలాడుతుందని విమర్శకులు ప్రశ్నిస్తారు.
వాస్తవం ఏమిటంటే.. ఆ జెండా గాలిలో కదులుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. అది కదలటం లేదు. ఆ జెండాను చంద్రుడి ఉపరితలం మీద పాతినపుడు.. జెండా కదిలి ఉంటుంది. అలా వంగిన రూపం అలాగే ఉండి ఉంటుంది.
వీడియోల్లో కూడా జెండా ముందుకు, వెనుకకు గాలిలో కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇలా ఎందుకంటే.. వ్యోమగాములు ఆ జెండాను నాటుతున్నపుడు.. చంద్రుడి మట్టి మీద రంధ్రం సరిగ్గా చేయటానికి వ్యోమగాములు దానిని ముందుకు వెనుకకు తిప్పారు. దానివల్ల జెండాలో కదలికలు ఏర్పడ్డాయి.

అపోలో మిషన్Image copyrightNASA
చిత్రం శీర్షికభూమి చుట్టూ ఉండే అలెన్ బెల్టులు అని పిలిచే భారీ అణుధార్మిక వలయాలను 1958లో గుర్తించారు

అది అసాధ్యం కాదు

కొంతమంది అంతరిక్ష నౌకను.. చంద్రుడి మీదకు ప్రయాణాలను విశ్వసించరు. ఎందుకంటే భూమి చుట్టూ ఉండే వాన్ అలెన్ బెల్టులు అనే భారీ అణుధార్మిక వలయాల వల్ల అసలు ఆ ప్రయాణమే అసాధ్యమని వారు నమ్ముతారు.
మనుషులు ఈ వలయాలను దాటి వెళ్లలేరని.. అలా వెళ్తే ప్రాణాంతక మోతాదులో అణుధార్మికతకు గురౌతారని వాదిస్తుంటారు.
కొన్ని గంటల వ్యవధిలో 200 నుంచి 1,000 'రాడ్ల' అణుధార్మికతకు గురైనప్పుడు మాత్రమే అణుధార్మిక అనారోగ్యం సంభవిస్తుంది.
అపోలో 11లో ప్రయాణించిన వ్యోమగాములు.. ఈ వాన్ అలెన్ వలయాల పరిధిలో రెండు గంటల కన్నా తక్కువ సమయమే ప్రయాణించారు. కాబట్టి.. వాళ్లు కేవలం 18 రాడ్ల అణుధార్మికతకు గురై ఉంటారని అంచనా. అది సురక్షితమైన పరిమితి లోపలే ఉంది.
అంతరిక్ష నౌకకు సరైన రక్షణ ఉండేలా నాసా జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టి.. 12 రోజుల ప్రయాణంలో సగటు అణుధార్మిక మోతాదు 0.18 రాడ్లు మాత్రమే. ఇది ఛాతీ ఎక్స్-రే తీసుకున్నపుడు గురయ్యే అణుధార్మికతతో సమానం.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికచంద్రుడి మీద నుంచి 382 కిలోల రాళ్లను భూమికి తెచ్చారు

చంద్రుడి రాళ్లు

ఇక చంద్రుడి మీదకు మనిషి వెళ్లివచ్చాడు అనటానికి మరో సాక్ష్యం.. వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం మీది నుంచి రాళ్లు తీసుకురావటం.
వాళ్లు చంద్రుడి మీద నుంచి 382 కిలోల కన్నా ఎక్కువ బరువున్న రాళ్లు తీసుకువచ్చారు. వాటిని చాలా దేశాలతో పంచుకున్నారు. దశాబ్దాల పాటు వాటి మీద అధ్యయనాలు జరిగాయి.
ఆ పరీక్షలన్నీ కూడా.. ఆ రాళ్లు నిజంగా చంద్రుడి మీది నుంచే వచ్చాయని నిర్ధారించాయి.

అపోలో మిషన్Image copyrightNASA

చంద్రుడి మీద పాదముద్రలు

చంద్రుడి మీదకు వెళ్లిన వేర్వేరు అపోలో మిషన్లు ఎక్కడెక్కడ ల్యాండ్ అయ్యాయో ఇప్పడు కూడా అంతరిక్షం నుంచి కనిపిస్తుంటాయి. అంతేకాదు.. చంద్రుడి ఉపరితలం మీద నడిచిన వ్యోమగాముల పాదముద్రలను కూడా అంతరిక్షం నుంచి చూడవచ్చు.
భూమి ఉపరితలం మీద.. పాదముద్రలను కానీ ఇతర గుర్తులు కానీ గాలులతో, వర్షాలతో.. లేదంటే వాతావరణం, సముద్రాలు, జీవం ఉన్న గ్రహాల మీద సంభవించే ఉపరితల కార్యకలాపాలతో సులభంగా చెరిగిపోతాయి.
అయితే.. చంద్రుడి మీద ఇటువంటి పరిస్థితులేవీ లేవు. అందువల్ల అక్కడ పాదముద్రలు ఇంకా అలాగే ఉన్నాయి.
2009 సంవత్సరం నుంచీ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న నాసా లూనార్ రీకన్నియసాన్స్ ఆర్బిటర్.. అపోలో మిషన్లు దిగిన అన్ని ప్రదేశాలనూ ఫొటోలు తీసింది.
ఆ ఫొటోల్లో అపోలో అంతరిక్ష నౌక దిగిన కచ్చితమైన ప్రదేశాలే కాదు.. చంద్రుడి మీద అన్వేషణ జరుపుతూ సంచరించిన వ్యోమగాముల పాదముద్రలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.
చైనా, ఇండియా, జపాన్‌లు స్వతంత్రంగా చంద్రుడి మీదకు ప్రయోగించిన ఇతర అంతరిక్ష వాహనాలు కూడా.. అపోలో మిషన్లు దిగిన ప్రాంతాలను గుర్తించాయి.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES/ SPACE FRONTIERS

చంద్రుడి మీద వదిలివచ్చిన పరికరాలు

చంద్రుడి మీదకు వెళ్లింది కేవలం వినోదం కోసం కాదు. శాస్త్రపరిశోధనలకు ఒక పెద్ద అవకాశమది.
చంద్రుడి గురించి మరింత తెలుసుకోవటం కోసం అనేక సాంకేతిక పరికరాలను అక్కడ ఏర్పాటు చేశారు. వాటిలో కొన్నిటిని చంద్రుడి మీదే వదిలిపెట్టి వచ్చారు.
అలా వదిలి వచ్చిన పరికరాల్లో రెట్రోరిఫ్లెక్టర్లు కూడా ఉన్నాయి. ఈ లూనార్ రిఫ్లెక్టర్లు.. 1969 నుంచి భూమికి - చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని కచ్చితంగా కొలవటానికి వీలుకల్పించాయి. వాటిలో చాలా రిఫ్లెక్టర్లు ఈనాటికీ పనిచేస్తూనే ఉన్నాయి. అపోలో 11, 14, 15 వ్యోమగాములతో పాటు.. సోవియట్ ల్యూనోకోడ్-2 రోవర్ కూడా నెలకొల్పిన ప్రాంతాల నుంచి ఈ రిఫ్లెక్టర్లు లేజర్లను పంపిస్తూ ఉన్నాయి.
మరో ప్రయోగం లూనార్ సర్ఫేస్ మాగ్నెటోమీటర్ (ఎల్ఎస్ఎం). చంద్రుడి అయస్కాంత క్షేత్రాన్ని కొలవటానికి దీనిని డిజైన్ చేశారు. చంద్రుడి ఉపరితలం మీద అయస్కాంతీకృత లక్షణాలు ఉన్నాయని.. కానీ ఆ అయస్కాంతతత్వం చంద్రుడి చుట్టూ ఒకే తరహాలో లేదని అది నిర్ధారించింది.
ఈ ప్రయోగాలతో పాటు ఇతర ప్రయోగాలతో సేకరించిన సమాచారాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.


9, జూన్ 2019, ఆదివారం

ఈ భూమ్మీద మొదట కోతి పుట్టిందా?

0 వ్యాఖ్యలు
మన పిల్లలకి శాస్త్రీయ ఆధారాలు లేని భారతం, బైబిల్, ఖురాన్ ల గురించి చెప్పక పోయిన ఫర్వాలేదు కానీ ఈ విషయం చెప్పి తీరాలి, పిల్లల్లో శాస్త్రీయ ధృక్పథం అలవర్చండి..
👇

ప్రశ్న: ఈ భూమ్మీద మొదట కోతి పుట్టిందని, దాన్నుంచే మానవుడు పుట్టాడని విన్నాను. అదే నిజమేనా? మరి ఈ నాటి కోతులు ఇంకా కోతులలాగానే ఎందుకున్నాయి? అసలు ఈ భూమి, ఈ ప్రకృతి, ఈ ప్రాణులు ఎట్లా ఏర్పడ్డాయి ?
"""""""""""""""""""""""""""""""""""""""""""""

జవాబు : ఈ భూమ్మీద మొదట, అంటే భూమి ఏర్పడ్డ సుమారు *550 కోట్ల సంవత్సరాల క్రితం ఏ జీవీ లేదు.* అపుడు ఈ భూమ్మీద కోతులు, కొంగలు ఇతర (చిన్నా పెద్దా) ప్రాణులు, కొండలూ, గుట్టలూ, నదులూ, సముద్రాలూ, వాతావరణం మొదలైనవేవీ ఇక్కడ లేవు.

ఆదిలో ఈ భూమి, కేవలం ఓ చిన్న సూర్యుడిలాగా, స్వతహాగా కాంతినిచ్చే ఓ బుల్లి నక్షత్రంలాగా వాయువు, దుమ్మూ, ధూళి రూపంలోనే వుండేది.

అది క్రమేపీ తనలో ఉన్న కేంద్రక ఇంధనాల (Nuclear Fuel) యిన హైడ్రోజన్‌, డ్యూటీరియం వంటి వాయువులు కేంద్రక సంలీన చర్యల *(Nuclear Fusion reactions)* ద్వారా పెద్ద పెద్ద పరమాణువులుగా మారాయి. ఆ క్రమంలో ద్రవరూప పదార్థం సలసల మరుగుతూ ఏర్పడింది.

ఉష్ణం, శక్తి ఎక్కడ ఏర్పడ్డాయో అక్కడే ఉండిపోవు. అధిక శక్తి ప్రాంతం నుంచి అల్పశక్తి ప్రాంతం వైపు శక్తి ప్రసరించడం సహజ లక్షణం. దీన్నే శాస్త్రీయ పరిభాషలో ఉష్ణ గతిక శాస్త్ర శూన్య నియమం *(Zero Law of Thermo dynamics)* అంటారు.

కాలక్రమేణా ఉష్ణాన్ని, కాంతి శక్తిని పోగొట్టుకున్న భూమి గోళరూపంలోకి (ఘనాకృతికి) మారింది. ఆ సందర్భంలో కొన్ని రసాయనిక చర్యలు జరిగి వాయురూప నత్రజని, నీటి ఆవిరి ఏర్పడ్డాయి. ఇవి భూమిపై వాతావరణాన్ని ఏర్పర్చాయి. పై పొరలో బురబుర, సలసల మరిగే ద్రవ, ఘన రూప నేల ఉవ్వెత్తున ఎగిరిపడే లావా ఉప్పెనలు, ఆ పై భాగాన అతి వేడిగా ఉన్న వాయు వాతావరణం.. *ఇదీ దాదాపు 500 కోట్ల సంవత్సరాల క్రితపు భూమికీ వున్న భౌతిక రూపం.*

శక్తి వికరణం చెందేకొలదీ ఉష్ణోగ్రత తగ్గి నీటి ఆవిరి వర్షంగా మారింది. ఈ వర్షం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు నిరాఘాటంగా సాగింది. ఆ *చల్లదనానికి లావా లాగా ఎగిసిన ఉప్పెనలు కొండలుగా మారాయి.*

*లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. అవే సముద్రాలుగా మారాయి.* కొండల మీద పడ్డ వాన నేల పొరల్ని రాసుకొంటూ భూమ్యాకర్షణ వల్ల (పల్లం వైపు) సముద్రాలవైపు పయనించింది. ఇవే నదులుగా మారాయి.

*సముద్రంలోని నీరు తిరిగి ఆవిరి కావడం, నేలపైకి మేఘాలుగా రావడం, వర్షంగా మారడం, నదీనదాలు నిండడం వంటి నీటి చక్రం స్థాపితం అయ్యింది.*

ఆ క్రమంలో వేడి వేడిగా వున్న నేల ప్రాంతం నుంచి రకరకాల రసాయనిక ధాతువులు సముద్రాల్లో చేరాయి. అపుడక్కడ ఉన్న ఉష్ణోగ్రత, రసాయనిక భౌతిక పరిస్థితుల ప్రభావంతో కాకతాళీయంగా (ముందే ఎవరో సృష్టికర్త రాసి పెట్టినట్టు కాకుండా) DNA, RNA వంటి అరీశ శకలాలు ఏర్పడ్డాయి.

DNA, RNA లాంటి సంక్లిష్ట అణువులు ఏర్పడ్డాయంటే అంతకన్నా తేలికయిన కార్బన్‌ డయాక్సైడ్‌, నత్రజని సమ్మేళనాలు, సేంద్రియ, నిరింద్రియ పదార్థాలు (Organic and Inorganic Compounds) కూడా ఏర్పడ్డాయనే అర్థం. కొన్ని ప్రత్యేక అనుకూల పరిస్థితుల కారణాన DNA  లేదా RNA వేలిక చుట్టూ తైల అణువుల పొర (lipid layer)  అధ్యణు రసాయనిక ప్రక్రియల (Supramolecular chemical processes) ద్వారా స్వక్రమానుగత పొర (Self Assembled Monolayer) గా ఏర్పడింది. ఇదే తొలి జీవకణం.

ఈ తొలి జీవకణానికి స్వపునరుత్పత్తి (self replication) లక్షణం వుంది. ఇలాంటి దశల మధ్య కాలవ్యవధి సంవత్సరాలు, ఒక మనిషి జీవితకాలం వంటి స్థాయిలో ఉండదు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు క్రమానుగత చర్యలు పర్యవసానంగా వుంటుంది. అంటే కొద్దికొద్దిగా పరిమాణాత్మకంగా *(Quantitatively)* మార్పులు చెందుతూ వ్యవధిలో ఓ సందర్భ దశలో గుణాత్మక *(Qualitative)* మార్పులు చెందడం ద్వారా సంభవించాయి.

ఇలాంటి *తొలి జీవకణాలకు కాలక్రమేణా జీవులకున్న లక్షణాలు పరిపుష్టి చెందాయి.* DNA/ RNA లో వున్న రసాయనిక క్రమం జన్యుస్థాయి (Genetic Rule) ని సంక్రమం చేశాయి.
ఇలాంటి కణాలు *కొన్ని కోట్ల సంవత్సరాల గతితార్కిక సైద్ధాంతిక ప్రక్రియల ద్వారా వృక్షజాతులుగా, మరికొన్ని జంతు జాతులుగా పరిణామం చెందాయి.*

ఎముకలు లేని (అకశేరుక) జీవుల (Invertibrate animals) యుగం కొన్ని వందల కోట్ల సంవత్సరాల పాటు సాగింది. అందులో కొన్నింటిలో జీవ రసాయనిక మార్పులు జరిగి భూమ్మీద సంచరించేలా సకశేరుక (ఎముకలున్న) జంతువులు (Vertibrate animals) రూపొందాయి.

*ఆ క్రమంలో కేవలం కోటి, 5 కోట్ల సంవత్సరాల పూర్వమే పాలిచ్చే జంతువులు (Primates) ఏర్పడ్డాయి.*

కోతులు రూపొంది యిప్పటికి రెండు మూడు కోట్ల సంవత్సరాలు కూడా మించదు. ఈ జాతుల్లోని కొన్ని పరిణామక్రమంలో మానవ శరీరంలోకి పరిణమించాయి. మానవుడు లాంటి క్షీరద జీవి (Mamnal) రూపొంది కోటి 20 లక్షల సంవత్సరాలకు మించదు.

*కాబట్టి కోతులు మొట్ట మొదట ఏర్పడలేదు.* అవి ఈ మధ్యే జీవ పరిణామ క్రమంలో రూపొందాయి. ఇపుడున్న కోతుల జాతి నుండే మానవుడు ఆవిర్భవించాడని అనుకోవడం సరికాదు. *వీటి జాతి వేరు. మానవుల జాతి వేరు.*

వ్యాసకర్త..
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక.

18, మే 2019, శనివారం

మోడీ జీ మూసుకొని కూర్చో..

0 వ్యాఖ్యలు
మోడీ జీ మూసుకొని కూర్చో..

నీకు డైలాగ్స్ లేవు.

మొన్ననే ఛాన్సిస్తే మబ్బులు, డిజిటల్ కెమెరాలు, ఈమెయిల్ అని గబ్బు లేపినవ్..

-అమిత్ షా