వీలుంటే నా నాలుగు లంకెలు ...

27, అక్టోబర్ 2018, శనివారం

0 వ్యాఖ్యలు
ఎయిర్ పోర్టులో భద్రతా లోపాలు...

  • ఎంతో పగడ్భందీ భద్రత పహారాలో వుండే వినామాశ్రయాలలో కొట్టోచ్చిన భద్రతా లోపం గురించి ఎవరూ మాట్లాడక పోవడం విచిత్రంగా వుంది..
    • రాష్ట్ర పోలీసులేమో ఘటన మా పరిదిలోది కాదని ప్రకటన...
    • ఏయిర్ ఏవియేషన్ వారేమో ప్రయాణికుల భద్రత మా పరిధి కాదని వారి ప్రకటన..
    • CISF వారేమో, చెక్ ఇన్ దగ్గర మాత్రమే మేము చెక్ చేస్తామని ప్రకటన. లాంజ్ రూమ్స్ లో మేము చెక్ చేయమని ప్రకటన..
  • విశాఖపట్నం ఎయిర్ పోర్టు పగలు ప్రజల కోసం, రాత్రిపూట నావికాదళం కోసం వాడుతున్న అత్యంత భద్రత కలిగిన విమానాశ్రయం.
    • డిఫెన్స్ పరిధిలో వున్న ప్రాంతంలో, ఉధ్యోగుల ఎంపికకు మార్గదర్శకాలు ఏమయ్యాయి?
    • వివిఐపి లు బసచేసే ప్రాంతం లో కూడా ప్రయివేటు వ్యక్తులను ఎలా అనుమతిస్తారు?
  • రాజ్యాంగ పదవి లో వున్న వ్యక్తి (ప్రతిపక్ష నేత అంటే క్యాబినేట్ మంత్రి హోదా) పై దాడి జరిగితే విమానాశ్రయాల అధికారులు తీరు చాలా పేలవంగా వుంది. అత్యవసర పరిస్థితులలో యిలాగానే ప్రవర్తించేది?
    • దాడిలో వాడిన కత్తికి సైనేడ్ వంటి విషపూరిత రసాయినాలు పూసి వుంటే?
    • మెడికల్ ఎగ్జామినేషన్ (విషపూరితమో కాదో తెలియకుండా) చేయకుండా 10 నిమిషాలలో ఎలా పంపించి వేశారు?
    • విమాన ప్రయాణ సమయంలో విక్టిమ్ కి ఏమైనా జరిగితే భాద్యత ఎవరిది?
    • మొత్తం ప్రాతంని CISF కంట్రోల్ లోకి తీసుకోకుండా (దాడి చేయడానికి మరి యింకేవరైనా వుండి వుండొచ్చుకాదా!) అంత సింపుల్ గా (విడియోలలో మనం చూశాము) ఎలా తీసుకువెళ్లారు?


రాజకీయ దివాళాకోరు వాదనలు...
  • దాడి జరిగిన మరుక్షణమే వైకాపా ముఖ్యులు యిది చంద్రబాబు జగన్ ను చంపడానికి కుట్ర అని ప్రచారం స్టార్ట్ చేయడం
  • తెదేపా ముఖ్యులేమో యిది జగనే తనకు తాను సింపతీ కోసం చేయుంచుకున్నాడని ఎదురుదాడి చేయడం
  • భాజపా ముఖ్యులు సైతం దీనిలో చంద్రబాబు కుట్ర దాగి వుందని, బయటయితే కష్టం అని విమానాశ్రయంలోనే హత్యాయత్నం చేశారాని ప్రచారం..
  • యిది శాంతిభద్రతల లోపం, రాష్ట్ర పరిస్థితులు చేయిదాటిపోయాయి కేంద్రం స్పందించాలని వైకాపా, భాజపా డిమాండ్
  • మీడియా... రాష్ట్రంలో ఎక్కడ గొడవలు, అరాచాకాలు జరగక పోయినా రాయసీమలో లూటిలు, బస్సు దహానాలు జరుగుతున్నాయని లైవ్ లొ తప్పుడు ప్రచారాలు..
  • డిజిపి... యింకా దర్యాప్తు మొదలు కాక మునుపే తీర్పు ఎలా చెబుతారు? దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమానని, అభిమానంతో నే దాడి జరిగిందని ఎలాచెబుతారు? పోలీసులన్నాక దర్యాప్తు రెండు, మూడు లేక అంతకన్నా ఎక్కువ కోణాలలో జరగాలి, జరుగుతుంది.. ధర్యాప్తు జరగక ముందే మీడియాకు తెదేపా అనుకూలంగా చెప్పడం భాధ్యత కాదు..
  • అపరేషన్ గరుడ: అదో పనికిమాలిన వాదన.. ఆదే నిజమని మీకు తెలిస్తే, ప్రతిపక్ష నాయకుడికి ముందుగానే భద్రతా పరమైన హెచ్చరికలు జారీచేసారా? కావలనే ప్రతిపక్ష నాయకుడనే ఊరుకున్నారా? ముందే కనిపెట్టిన అతనికి అవార్డు యిస్తున్నారా? లేక ఈ ప్లాన్ కి అతనే సూత్రధారి అని అనుకోవాలా? అతని చెప్పినవన్ని ఏమి జరగక పోయినా మొత్తం అతని చెప్పిన స్క్రిప్ట్ మాదిరే జరుగుతుందని ఎందుకు జనాను మభ్యపెడుతున్నారు??


తెదేపా వాదన: జగన్ తనకు తానే హాత్యాయత్నం చేయించుకున్నాడు..

అంత పగడ్భందీ గా సెక్యూరిటీ, కెమెరాలు, హత్యాయత్న డ్రామా చేయడానికి వచ్చిన వ్యక్తి తప్పించుకొని పోయే అవకాశమే లేనటువంటి ప్రదేశంలోనే ప్లాన్ చేస్తారా? హత్యాయత్నం చేసినవాడు దొరకడా, నాలుగు తన్నితే నిజం చెప్పడా? యిది జరిగే పనేనా?

తెదేపా వాదన: ఈ హాత్యాయత్నం మోదీ కుట్రలో భాగమే


ఎన్నొ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్ర ప్రతిపక్షనేతని అదీకూడా కట్టుదిట్టమైన భద్రత వున్న స్థలంలో చంపించే అవకాశం వుంటుందా? కేసు రాష్ట్ర పోలీసులు తీసుకుంటారు.. ధర్యాప్తులో బయట పడవా? ఐటీ దాడులు, రాజకీయ అవకాశాలు, వివిధ పార్టీ నాయకుల లోపాయకారి ఒప్పందాలు మోదీ ఆధ్వర్యంలొ జరుగుతూవుండవచ్చు.. కానీ యిటు వంటి బహిరంగ హత్యా ప్రయత్నాలకు కేంద్ర పాల్పడే అవకాశం వుందా?

చంద్రబాబు: జగన్ ను పరామర్శించడం తప్పు


చంద్రబాబు నాయుడు తనకి తను తన వ్యాల్యూని తగ్గించుకొనే వ్యాక్య అది. అత్యంత దిగుత్సాకరం కూడా.. కుట్ర అవ్వొచ్చు, స్వయంకృతం కావొచ్చు... దాడి నిజం, గాయం నిజం.. మానవతా విలువలువున్న వారెవరైనా, ముఖపరిచయస్తులెవరైనా పరామర్శించడం ఎలా తప్పువుతుంది??

జగన్: నేను ఏపి పోలీసులకు వాంగ్మూలం యివ్వను, నమ్మకం లేదు
  • ఒక ప్రక్క తనకు పోలీసుల భద్రత సరిపోవడం లేదు, యింకా పెంచమని సమయం వచ్చినప్పుడల్లా వైకాపా గొడవ చేస్తుంది.. మరి అప్పుడు ఏపి పోలీసులపై నమ్మకం వుంటుందా?
  • భాద్యతాయుతమైన (రాజ్యాంగ పరమైన) పదవిలో వుండి వైజాగ పోలీసులకు సహకరించడం ఎలా సమర్థనీయం? రేపు జగనే సీఏం అయితే, వేరే రాష్ట్ర పోలీసులను తెపిస్తారా?
  • శాసన సభకు వెళ్లరు, పార్లమెంటుకు వెళ్లరు, ఆల్ పార్టీ మీటింగులకు వెళ్లరు, పోలీసుల పై నమ్మకం లేదు.. మరి ప్రజాస్వామ్యం పై నమ్మకం వుందా? జగనే గెలిస్తే ప్రజాస్వామ్యం బ్రతికి వుంటుందా?


జివిఎల్ నరసింహారావు (భాజపా): సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి, చంద్రబాబుదే భాద్యత

  • అయ్యా జివిఎల్ గారు, సుప్రీం కోర్టు ఎప్పుడో తీర్పించింది సిటింగ్ జడ్జ్స్ ని కమిటిలకు వాడుకోవొద్దని.. (జరిగే పని కాదు అని తెలిసినా!)
  • వైకాపా కన్నా మీరే ఎక్కువ గా తెదేపా ని టార్గెట్ చేశారు ఈ విషయంలో.. తెదేపా నే జగన్ ను చంపాలని చూస్తుందని ఎటువంటి ఆధారాలు లేకుండా డిల్లీ నుండి దాడి చేస్తున్నారు.. చంపాలనుకునేవారు చిన్న కత్తితో, కత్తికి ఎటువంటి విషం రాయకుండా చంపుతారా??
  • కేంద్ర ఐబీ దగ్గర ఏమైన ఆధారాలు వుంటే బయటపెట్టి వాదిస్తే బాగుంటుంది.. ఆలా కాకుండా, ఈ సంఘటనతో రాష్ట్రం అతలాకుతలం అయితే అధికారం మీచేతులకు తీసుకోవచ్చనే మీ ఆలోచన, ఆవేశం టివి చూస్తున్న వారందరికి అర్థం అవుతుంది..
  • ఎక్కడ అధికారం లేకపోతే అక్కడ అరాచాకాలు సృష్టిస్తానికి మీరు పడే తాపత్రయం కేరళ్, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రలలో చూస్తున్నాము..


వాసవ్య యాగాటి
2018-10-27
0 వ్యాఖ్యలు
నీ పాలన లోనే... 
వాసవ్య యాగాటి
2018-10-24
ప్రపంచ వ్యాప్తంగా RBI కి వున్న పరిపతి పోయే నీ పాలనలోనే..

దేశ ప్రజలకు బ్యాంకులపై వున్న నమ్మకం పోయే నీ పాలనలోనే...

1000 నోటు రద్దు చేసి 2000 నోటు ప్రవేశపెట్టడంతో నల్లడబ్బు చలామణి సులువు చేసే నీ పాలనలోనే...

రూపాయి విలువను అధః పాతాళంకు పోయే నీ పాలనలోనే..

సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ప్రెస్ మీట్ పెట్టి ​​ఏడ్చె నీ పాలనలోనే...

నకిలీ వీడియోలు సృష్టించి విద్యార్థులపై దేశద్రోహ దొంగ కేసులు పెట్టించె నీ పాలనలోనే...

సిబిఐ ఆఫీసును సిబిఐ చేతనేే సీజు చేసే పరిస్ఠితి వచ్చే నీ పాలనలోనే...

నీకు ఎదురు నిలిచే మీడియాపై సిబిఐ, ఐటి ద్వారా ఉక్కుపాదము మోపె నీ పాలనలోనే...

అన్యాయాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులను కుక్కలను కాల్చి నట్లు కాల్చినా ధర్యాప్తు సంస్థలు నోరుమెదపనే లే నీ పాలనలోనే...

ధనవంతుల లక్షల కోట్ల అప్పుల రద్దులో చరిత్ర సృష్టించే నీ పాలనలోనే...

దేశ సంపద దోచి విదేశాలకు పారిపోయిన వారికి వీసాలను సైతం సిఫార్సు చేసే నీ పాలనలోనే...

అత్యధిక సొమ్ము ప్రజలనుండి చమురు ద్వారా గుంజె నీ పాలనలోనే...

మానభంగాలు చేసిన వారికి మద్దతుగా ఊరేగింపులు సైతం చేసే నీ పాలనలోనే..

నిన్ను ఎదురించిన రాష్ట్రప్రభుత్వాలను సైతం అల్లకొల్లోలం చేసే నీపాలనలోనే...

అవినీతి పరులు హాయిగా నిద్రపోయే నీ పాలనలోనే...

ప్రజల/ప్రభుత్వ ఆస్తులను ఆదానీ/అంబానీలకు అప్పనంగా అప్పచెప్పే నీ పాలనలోనే..

రిలయన్స్ జియో కోసం ట్రాయ్ చట్టాలను సమూలంగా మా
ర్చే నీపాలనలోనే...

ఒక్క క్లాస్ రూమ్ కూడా లేని జియో యూనివర్శిటికి వేలకోట్ల రూపాయల గ్రాంట్ యిచ్చే నీ పాలనలోనే...

హిందుస్థాన్ ఎరోనాటికల్స్ ను అనిల్ అంబానీల కొరకు గొంతు పిసికి చంపే నీ పాలనలోనే...

ఎర్రకోటను సైతం నీ ఆత్మీయుల కొరకు తాకట్టు పెట్టే నీ పాలనలోనే..

ధక్షణ భారత ప్రజల పై వివక్ష పెంచే నీ పాలనలోనే...

దేశ భక్తి అంటే నిన్ను వ్యక్తిగతంగా కీర్తించడమే అనే భావన నీ భక్తులలో కల్పించే నీ పాలనలోనే..

యింకేమని పొగాడలే.. ఈ పేజి సరిపోదాయె నిన్ను పొగడదానికి...

వాసవ్య యాగాటి
2018-10-24

20, జులై 2018, శుక్రవారం

రాఫెల్ యుద్ధవిమానాలు - మోదీ

0 వ్యాఖ్యలు
  • రాఫెల్ యుద్ధవిమానాల విలువను 16వేల కోట్ల రూపాయల మేర పెంచారు, కారణం చెప్పరు..

  • 45,000 కోట్ల విలువచేసే రాఫెల్ కాంట్రాక్ట్ ని ఒక్క విమానం కూడా తయారు చేసిన అనుభవం లేని 30,000 కోట్ల నష్టాలలో వున్న రిలయన్స్ కు యిచ్చారు..​​​

  • బెంగుళూరులో ఎంతో అనుభవం మంచి యువకులున్న HAL కి కాకుండా, రియలన్స్ కి ఎందుకు యిచ్చారో చెప్పరు..

  • రాఫెల్ ఒప్పందాలలో ఎటువంటి సిక్రేట్స్ లేవని చెప్పిన ఫ్రాన్స్ దేశం, అలాంటప్పుడు ఈ ఒప్పంద విషయాలను ఎందుకు సీక్రేట్ గా ప్రభుత్వం వుంచిందో చెప్పలి..

యివి మోదీని రాహుల్ అడిగిన సూటి ప్రశ్న ఈరోజు పార్లమెంటులో, ఈ నిజాయితీ పరుడైన మన ప్రధాని గారు సాయంత్రం ప్రసంగంలో జవాబు చెప్పుతారో లేక ఎప్పటిలాగే ఈ విషయం డిఫెన్స్ కి సంబధించిందని కుప్పగెంతులేస్తారో చూడాలి...

వాసవ్య యాగాటి
20-07-2018 1:00PM

13, జులై 2018, శుక్రవారం

అమిత్ షా కేవలం ఒక్క రోజు పర్యటన

0 వ్యాఖ్యలు
అమిత్ షా కేవలం ఒక్క రోజు పర్యటనలో ఎంత బిజీ అంటే విమానశ్రయంలో భాజపా లీడర్స్ ని కలిసే టైమ్ లేనంత...

మరి కలిసింది ఎవరిని??

1. ఒక స్టార్ హోటల్ లో RSS  & హిందూ ధార్మిక సంఘాల లీడర్స్ ని.. (తెలంగాణాలో మత కలహాలకు సృష్టించైనా ఒక రెండు సీట్లు తెలంగాణాలో తెచ్చుకోవాలనే.. పరిపూర్ణాంద స్వామి ఎపిసోడ్ అదే!)

2. ఒక పవర్ బ్రోకర్ మరియు మీడియా మొఘల్ గా భావించే వ్యక్తిని...(మీడియాను మ్యానేజ్ చేయడానికి)

తెలుగు ప్రజలు, తస్మాత్ జాగ్రత్త. ఎంత యింపార్టెంట్ పని కాకపోతే స్పెషల్ ఫ్లైట్ లో అంత దూరం నుంది యిక్కడకు వస్తాడు...

వాసవ్య యాగాటి..
2018-07-13