వీలుంటే నా నాలుగు లంకెలు ...

5, ఫిబ్రవరి 2022, శనివారం

Constitution: రాజ్యాంగ సవరణ/మార్పు అనైతికమా?

0 వ్యాఖ్యలు

రాజ్యాంగం ఏమైనా మత గ్రంథమా?

తప్పులున్నాయని/అసమానతలు వున్నాయి అని తెలిసినా పవిత్రంగా చూసుకోవడానికి? అదేమన్నా పైనుండి ఊడిపడిందా? రాజ్యాంగం అనేది దేశప్రజలందరీ ఓ కామన్ ఎగ్రిమెంట్.. తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు.. దానిలో తప్పేంటి? ఉదాహరణకు, ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం కార్పోరేట్ అవినీతి, దోపిడికి హద్దులు లేకుండా పోయింది, దానికి కారణం రాజ్యాంగం తప్పుకాదు అని కొందరన్నొచ్చు.. కానీ అధికారం లో వున్న వారికి రాజ్యాంగం అమలు చేయకుండా వుండే వెసులుబాటు రాజ్యాంగం లో వుండ బట్టే కదా దేశంలో యింత అవినీతి పెరగడానికి కారణం.. అలానే, ప్రస్తుత రాజ్యంగం వివిధ రాష్ట్రాల మధ్య కేంద్రం వివిక్ష ధోరణి అవలబించకుండా కట్టడి చెయ్యడానికి కుదరడం లేదు. అలా చాలానే వున్నాయి..

మరి ఇలానే కంటున్యూ చెయ్యాలా?

లౌకిక ప్రజతంత్ర సమాన హక్కులను రాజ్యంగంలో వుంచకూడదు అని ఎవరైన అంటే తప్పు అవుతుంది గాని, రాజ్యాంగంలో వున్న లొసులుగులు తీసేయ్యాలి అంటే అహ్వానించాల్సిందే… మరి ఈ అసమానతలను ఇలానే కంటున్యూ చెయ్యలసిందేనా? రాజ్యాంగ సవరణ అంటే అదేదో అంబెద్కర్ ని అవమానించినట్లు అంబెద్కర వాదులు, బిజెపి వారు ఎలా ముద్ర వేస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదు..

కెసిఅర్ అన్నదాంట్లో స్పస్టత లేదు, రాజ్యాంగం లో ఏ అంశాలు మార్చాలో అతను చెప్పనేలేదు.. సో .. ఖండించడంలో అర్థం లేదు.. రాజ్యాంగంలో కొన్ని అంశాలు అమలులో లొసుగులు వున్నాయి.. అవి సరి చెయ్యడానికై మార్చుదాం అని కూడా అని వుండచ్చు కదా? అటివంటి మార్పులనూ కూడా వ్యతిరేకిద్దామా?

అసలు జరగవలసిన చర్చను దారి మళ్లిస్తానికి బిజెపి వేసిన ఎత్తుగడ?

కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ అసమానతల పాలనలో గత 8 సంవత్సరాలలో తెలంగాణా ఎలా నష్ట పోయిందో కుండ బద్దలు కొట్టినట్లయి జనాలకు బాగా అర్థం అయ్యేటట్లు చెప్పాడు (గత 7 బడ్జట్ లను, మోడీ చేసిన అన్నింటిని సపోర్ట్ చేసాడు అదే వేరే విషయం, అది అతని రాజకీయ ఎత్తుగడ కావచ్చు). ఈ ఆరోపణలకు సమాధానం చెప్పే స్థితిలో బిజెపి లేదు.. దాంతొ ‘అంబెద్కర్’ కి అవమానం పేరుమీద రచ్చ చేస్తుంది.. ఆ వలలో అంబెద్కర్ వాదూలు పడటం విచారకరం.. విచిత్రం ఏమిటంటే 2002 సం వరకు బిజెపి అసలు మన రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్నీ గుర్తించలేదు. వాజెపెయి అయితే రాజ్యంగం మార్పు పై ఒక కమిటీ కూడా వేసాడు, మరి అప్పుడు అంబెద్కర్ ని అవమానించడం కనబడని బిజెపికి ఇప్పుడు ఎలా కనబడుతుంది?

మార్పు అనివార్యం, మార్పును అహ్వానించాల్సిందే..

సామాజిక దృక్పథం, సామాజిక అవగాహన, జీవ పరిణామక్రమాలు డార్విన్, మార్క్స్ చెప్పినట్లు నిరంతరం మారుతూనే వుంటాయి. మార్పును ఆహ్వానిస్తూ ముందుకు వెళ్ళాలిసిందే! అంబెద్కర్ అధ్యక్ష వహించిన కమిటి రచించిన మన రాజ్యాంగం లో స్పష్టంగా 2/3 మెజారిటి వుంటే రాజ్యాంగం ని మార్చుకోవచ్చు అని రాసివుంది.. రాజ్యాంగం మార్చొద్దు అని ఎవరైనా అంటే వారు నిజమైన అంబెద్కర్ ద్రోహులవుతారు..

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అల్వేస్ అనే భావన నుండి భయట పడాలి.. సామాజికి మార్పును ఎవరు ఆపినా ఆగేది కాదు!

వాసవ్య యాగాటి..
2022-02-05

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Trade Unions: ప్రభుత్వ రంగ ఉధ్యోగుల పోరాటాలు ఎవరి కోసం? దేని కోసం?

0 వ్యాఖ్యలు


LIC ని ప్రయివేటు పరం చెయ్యొద్దు అని ధర్నా చేస్తుంటే ఏ టిచర్, ఏ ప్రభుత్వ/ స్టీల్ ప్లాంట్ / RTC / విద్యుత్ / బ్యాంక్ / రైల్వే ఉధ్యోగీ అది తన సమస్య అని భావించడం లేదు.. చూసుకుంటూ వెల్లిపోతాడే తప్ప కనీసం ఆగి ఒక్క నిమషం సంఘిబావం కూడా ప్రకటించడు..

అలానే,
👉 స్టీల్ ప్లాంట్ ప్రయివేటు పరము చెయ్యొద్దని ధర్నా చేస్తున్నా,
👉విద్యుత్ ప్రయివేటు పరం చెయ్యొద్దని ధర్నా చేస్తున్నా,
👉ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చెయ్యొద్దని ధర్నా చేస్తున్నా,
👉ప్రభుత్వ స్కూలను ఎత్తివేయోద్దని ధర్నా చేస్తున్నా,
👉RTC ని ప్రయివేటు పరం చెయ్యొదని ధర్నా చేస్తున్నా,
👉రైల్వేలను ప్రయివేటు పరం చెయ్యొదని ధర్నా చేస్తున్నా,

ఆయా సంస్థల ఉధ్యోగుల వరకు మాత్రమే ధర్నాలు, పోరాటాలు చేస్తున్నారే తప్ప, మిగితా సంస్థలలో ఉధ్యోగులు చేస్తున్న దానికి కనీసం సంఘీబావం కూడా ప్రకటించడంలేదు.. పట్టించుకోకపోయిన ఫర్వాలేదు, కానీ మిగితావారు చేస్తున్న ధర్నాలు/పోరాటాలపై చిన్న చూపు కూడాను..

ఈ పరిస్థితి ప్రగతిశీల శక్తులు నాయకత్వం వహిస్తున్న కార్మక సంఘాలలొ వున్న సభ్యులలోనూ చూస్తున్నాం...
ఉదాహరణకు: స్టీలు ప్లాంట్ ప్రయివేటు పరం చేయ్యొదని ప్లాంట్ ఉధ్యోగులు ధర్నా చేస్తుంటే ఎంత మంది టిచర్లు కానీ, RTC ఉధ్యోగులు గాని, విధ్యుత్ ఉధ్యోగులు గానీ ధర్నాలో పాల్గొని వుంటారు?

ఉమ్మడి పోరాటాలు చెయ్యవలసిన ఈ సమయంలో పరిస్థితి ఇలానే కొనసాగితే ఫలితం లేని అసంఘటీత పోరాటాల మాదిరిగానే మిగిలిపోతుంది..

ప్రతీ పోరాటంలో ఆయా ఉధ్యోగులు చెప్పే కామన్ పాయింట్, "మేము పోరాడుతున్నది మా ఉధ్యోగ భద్రత కోసం కాదు, ప్రజల కోసం, ఈ సంస్థ లేకపోతే ప్రజలు నష్టపోతారు" అని చెబుతూనే వుంటారు.. కానీ నా అభిప్రాయం ప్రకారం మెజారిటి ఉధ్యోగులు వారి వారి ఉధ్యోగ భద్రత గురించి మాత్రమే ఆయా ఉధ్యమాలలో పాల్గొంటూన్నారే తప్ప వారి పోరాటంలో ప్రజాహితం శూన్యం! ఇది వింటానికి కఠోరంగా వున్నా మనం అందరం ఒప్పు కోవలసిన పచ్చి నిజం..

ఇప్పుడు టీచర్లు, ఉపాధ్యాయులు యింత భారీ ఎత్తున విజయవాడ తరలి వచ్చారు? దేనికోసం? వారి జీత భత్యాలకోసమే మాత్రమే అని నా ఉద్ధేశం.. అదే రేపు విధ్యుత్ / RTC ఉధ్యోగుల జీతాలలో కోత పెడితే వీరు కనీసం వారి తరుపున మాట్లాడం కూడా టైం వేస్టు అనుకుంటారు..

రేపు టిచర్లకు/ఉధ్యోగులకు డిఏలు ఇచ్చారే అనుకోండి ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తారు కూడా (తెలంగాణాలో చూసామూ కూడా).. సో.. *యిటువంటి ఉద్యమాలు వాపే గానే బలుపు కాదు..*

నాకు గ్రౌండ్ రియాలిటి అంత తెలియక పోవచ్చు కానీ, నా వరకు బయటకు కనబడుతున్న నగ్న సత్యం ఇది..
దీనికి అనుగుణంగా కార్మికులలొ ప్రజాహితం నింపకుండా ఎన్ని పోరాటాలు చేసినా సమాజానికి కలిగే విశాల ప్రయోజనం శూన్యం...

వాసవ్య యాగాటి
2022-02-04