చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పై నిన్న ప్రధాని నన్ను(ప్రజలను) ఉధ్దేశించి మాట్లాడిన తరువాత ప్రధానికి నా బహిరంగ లేఖ..
2. విదేశీ పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి.
3. చైనాను చూసి నేర్చుకోవాలి.
వ్యాపారం సంస్థలేమి నిశ్వార్థ స్వఛ్చంద సంస్థలేమి కాదు కదా? మీరు చదివిన ఆర్థిక రంగ శాస్త్రాలలో ఎక్కడా చెప్పరు కదా! వ్యాపారం ఆంటే కేవలం లాభ నష్టాల భేరీజు మాత్రమే ఈ విషయాన్నిఅందరూ ఒప్పుకున్నదే. ఆఫ్‌ఘనిస్తాన్ లోనైనా వ్యాపారం చేస్తాడు లాభాలు వస్తాయంటే..
b. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో పారిశ్రామిక ఉత్పాదన పెంచేదై వుండాలి.
c. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో ప్రజలకు ఉపాధి కల్పించ కలగాలి..
పైన పేర్కొన్న మూడింటిలో కనీసం ఒక్కటి కూడా నెరవేరదు రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల ద్వారా.. మరి ఎందుకు విదేశీ పెట్టుబడీదారులలో విశ్వాసాన్ని కలింగించాలి? చైనా నుండి ఏమి నేర్చుకోవాలి?
మీ బొగ్గు మసిని బాగానే ప్రక్కదారి పట్టించారు. ఎంతంటే, భజాపాను కమ్యూనిస్ట్‌లు ఒకే వేదికను పంచుకోనేటంత. చిన్న సమస్యను మరో పెద్ద సమస్య సృష్టించడంతో సరి!
క్విట్ ఇండీయా స్పూర్తికి విరుద్ధంగా మరో ఈస్ట్ ఇండియా ప్రవేశ సన్నివేశాన్ని మాకు చూపించి... మా రాబోయే తరానంతటిని ఆర్థిక బానిసలుగా పరాయి దేశానికి అప్పగించే విదానం తప్ప మరోకటి కాదు..
మిమ్ములను గెలిపించిన పాపానిక
మనస్థాపంతో
ఓ భారతీయుడు...
ఒక్ Rs.40,000/- అయిందనుకోండి..
దానిలో అధిక లాభ శాతము డెల్ కంపెనీకి చేరుతుంది (ఆమెరికాకు)
దానిలో కొంత లాభ శాతం డెల్ తయారు చేసిన కంపెనీకి చేరుతుంది (చైనాకు)
దానిలో ఓ పది శాతం ఆ లాప్‌టాప్ అమ్మిన షాప్‌కి చేరుతుంది (మన దేశంలో బడా/చిరు వ్యాపారులకు).
ఆంటే మనం ఖర్చు పెట్టే దానిలో ఒక పది శాతమైనా మన దేశ ప్రయోజనాలకు ఉపయోగ పడుతుంది.. (DELL SHOPPE అని పెద్ద డెల్ బోర్డ్ వుంటే అది మొత్తం డెల్ కంపెనీ ది కాదని గుర్తించంది.. అది డెల్ కి ఆథరైజ్‌డ్ స్వదేశీ రీటైల్ షోరూమ్ మాత్రమె)
కానీ రేపు.. హైదరాబాద్ లో డెల్ కంపెనీనే డైరెక్ట్‌గా రిటైల్ షోరూమ్ ప్రారంభిస్తే పరిస్థితి ఏమిటి.. డెల్ ల్యాప్‌టాప్ ని కంపెనీ షోరూమ్ లోనే కొంటానికి ప్రయత్నిస్తారు. ఆ పది శాతం లాభం కూడా అమెరికాకు తరలిపోలోతుంది. ఇక అన్ని షాప్‌లలో డెల్ ల్యాప్‌టాప్స్ అమ్మక్కర్లేదు..
1. షాపింగ్ మాల్స్ లో సేల్స్‌మ్యన్స్ కూడా అంత మందిని కొనసాగించక్కర్లేదు.. నిరుద్యోగం పెరుగుతుంది..
2. రిటైల్ రంగంలో వచ్చే ఆఖరి లాభం కూడా యితర దేశాలకు చేరుతుంది.
3. కనీసం టెక్నాలజీ కూడా మనకు ఈ రంగంలో కొత్తగా వచ్చేది ఏమీ లేదు...
4. ఫ్యాక్టరీలు కట్టడానికి కావలసినంత పెట్టుబడూలూ ఈ రంగానికి అవసరం వుండదు. ప్రధాని భాషలో చెప్పాలంటే, కేవలం వారికి విశ్వాసం/నమ్మకం కలిగించటానికే నంట దోచుకు పోవడానికి.
5. నిన్న అసమర్థ ప్రధాని అన్న టైమ్స్ మ్యాగ్‌జైన్ నేడు ప్రధాని పదవిని కూడా లెక్క చెయ్యని వీరుడు సూరుడు అని అన్నా ఆశ్చర్య పోవక్కర్లేదు...
ప్రధాని ఉపన్యాస సారాంశం..
1. సంస్కరణలు తప్పవు... దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది.2. విదేశీ పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి.
3. చైనాను చూసి నేర్చుకోవాలి.
1. సంస్కరణలు తప్పవు... దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది.
అసలు సమస్య అదేకదా ప్రధాని గారు.. మీరు ప్రారంభించిన నూతన ఆర్థిక విధానాల సంస్కరణల ఫలితమే కదా ఈ దేశం క్లిష్ట పరిస్థితిలోకి చేరింది. ఆంటే యిప్పటి వరకూ జరిగిన సంస్కరణలు దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికే ఉపయోగ పడినవని మీ పరొక్ష అంగీకారమా? సంస్కరణలు ఆ జాతి ని ఉద్దరించాలి గాని పరాయి దేశాలకు జాతిని తాకట్టు పెట్టడం కాదు.2. విదేశి పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి...
విదేశి పెట్టుబడి దారులేమానా శారీరిక / మానసిక వికలాంగులా? లేక వారు భారత సమాజంలో సాంఘిక అసమానతలకు లోనవుతున్నవారా? వారిలో ఆత్మవిశ్వాసాన్ని, మనమీద నమ్మకాన్ని వారికి ఎందుకు కలింగించాలి?వ్యాపారం సంస్థలేమి నిశ్వార్థ స్వఛ్చంద సంస్థలేమి కాదు కదా? మీరు చదివిన ఆర్థిక రంగ శాస్త్రాలలో ఎక్కడా చెప్పరు కదా! వ్యాపారం ఆంటే కేవలం లాభ నష్టాల భేరీజు మాత్రమే ఈ విషయాన్నిఅందరూ ఒప్పుకున్నదే. ఆఫ్‌ఘనిస్తాన్ లోనైనా వ్యాపారం చేస్తాడు లాభాలు వస్తాయంటే..
3. చైనాను చూసి నేర్చుకోవాలి...
మీరేనా మాట్లాడింది? చైనా ఆర్థిక సంస్కరణలపై చలాసార్లు విమర్శించిన మీరు యిన్నాలకు కళ్ళు తెరిచారా? లేక యిన్నాల్లు మోసంచేశారా?
నాకు తెలిసినంత వరకు చైనా అవలంభిస్తున్న విదేశీ కంపెనీల పై విధానం...
a. చాలా వరకు వసతులు రాయతీలు / ఉచితం గా కల్పించడం జరుగుతుంది (భూమి, నీరు, కరెంటు..)
b. కొంత కాలం (10 సంవత్సరాలు అనుకుంటా) తరువాత, కంపెనీ లో వున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర ని అంతా చైనా ప్రభుత్వానికి అప్పగించాలి.
c. కంపెనీలో అన్ని రంగాలలో స్వదేశీ కార్మికుల కే ఉద్యోగం కల్పించాలి. చాలా క్లిష్టమైన రంగంలో చైనా కార్మికులు లేకపోతే వారికి ట్రైనింగ్ యిచ్చి వారినే ఉద్యోగంలోకి తీసుకోవాలి...
నాకు తెలిసినంత వరకు చైనా అవలంభిస్తున్న విదేశీ పెట్టుబడుల ఆహ్వానం పై విధానం...
a. ఆ కొత్త పెట్టుబడులతొ దేశానికే మైనా శాస్త్రసాంకేతికి పరిజ్ణాణం వచ్చేదయి వుండాలి..b. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో పారిశ్రామిక ఉత్పాదన పెంచేదై వుండాలి.
c. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో ప్రజలకు ఉపాధి కల్పించ కలగాలి..
పైన పేర్కొన్న మూడింటిలో కనీసం ఒక్కటి కూడా నెరవేరదు రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల ద్వారా.. మరి ఎందుకు విదేశీ పెట్టుబడీదారులలో విశ్వాసాన్ని కలింగించాలి? చైనా నుండి ఏమి నేర్చుకోవాలి?
ఆమెరికా పెట్టుబడీ దారుల వ్యూహం పలించినట్లు వుంది.. టైమ్స్ పత్రక ద్వరా మీరు అసమర్థులు అనే విషయంతొ మిమ్ములను బాగానే రెచ్చగొట్టారు.. మిరు కోరుకొనే ప్రంపచ స్థాయి ఆర్థిక వేత్త బిరుదు వంటివి నోబుల్ బహుమతైనా సరే మీతెలివి తేటలను బట్టి యివ్వరు.. వాళ్లకు మీరు ఎంత వరకు ఉపయోగపడ్డారు మీజాతిని ఎంత వరకు వాళ్ళకు తాకట్టు పెట్టారు అనేవే వారికి కొలమానం.
మీ బొగ్గు మసిని బాగానే ప్రక్కదారి పట్టించారు. ఎంతంటే, భజాపాను కమ్యూనిస్ట్‌లు ఒకే వేదికను పంచుకోనేటంత. చిన్న సమస్యను మరో పెద్ద సమస్య సృష్టించడంతో సరి!
క్విట్ ఇండీయా స్పూర్తికి విరుద్ధంగా మరో ఈస్ట్ ఇండియా ప్రవేశ సన్నివేశాన్ని మాకు చూపించి... మా రాబోయే తరానంతటిని ఆర్థిక బానిసలుగా పరాయి దేశానికి అప్పగించే విదానం తప్ప మరోకటి కాదు..
మిమ్ములను గెలిపించిన పాపానిక
మనస్థాపంతో
ఓ భారతీయుడు...
మన సాఫ్ట్‌వేరు రంగ మితృలకు అర్థమయ్యే ఉధాహరణ:
ఒక DELL Laptop కొనాలంటే హైదరాబాద్ లో అయితే ఏమి చేస్తాము? యిప్పుడున్న స్వదేశీ సంస్థలైన ఏదైనా షాపింగ్ మాల్ కో వెళ్ళి, లేక సికింద్రాబాద్ లో చెన్నెయ్ ట్రేడ్ సెంటర్ కో వెళ్ళి లాప్‌టాప్ కొంటాం..ఒక్ Rs.40,000/- అయిందనుకోండి..
దానిలో అధిక లాభ శాతము డెల్ కంపెనీకి చేరుతుంది (ఆమెరికాకు)
దానిలో కొంత లాభ శాతం డెల్ తయారు చేసిన కంపెనీకి చేరుతుంది (చైనాకు)
దానిలో ఓ పది శాతం ఆ లాప్‌టాప్ అమ్మిన షాప్‌కి చేరుతుంది (మన దేశంలో బడా/చిరు వ్యాపారులకు).
ఆంటే మనం ఖర్చు పెట్టే దానిలో ఒక పది శాతమైనా మన దేశ ప్రయోజనాలకు ఉపయోగ పడుతుంది.. (DELL SHOPPE అని పెద్ద డెల్ బోర్డ్ వుంటే అది మొత్తం డెల్ కంపెనీ ది కాదని గుర్తించంది.. అది డెల్ కి ఆథరైజ్‌డ్ స్వదేశీ రీటైల్ షోరూమ్ మాత్రమె)
కానీ రేపు.. హైదరాబాద్ లో డెల్ కంపెనీనే డైరెక్ట్‌గా రిటైల్ షోరూమ్ ప్రారంభిస్తే పరిస్థితి ఏమిటి.. డెల్ ల్యాప్‌టాప్ ని కంపెనీ షోరూమ్ లోనే కొంటానికి ప్రయత్నిస్తారు. ఆ పది శాతం లాభం కూడా అమెరికాకు తరలిపోలోతుంది. ఇక అన్ని షాప్‌లలో డెల్ ల్యాప్‌టాప్స్ అమ్మక్కర్లేదు..
1. షాపింగ్ మాల్స్ లో సేల్స్‌మ్యన్స్ కూడా అంత మందిని కొనసాగించక్కర్లేదు.. నిరుద్యోగం పెరుగుతుంది..
2. రిటైల్ రంగంలో వచ్చే ఆఖరి లాభం కూడా యితర దేశాలకు చేరుతుంది.
3. కనీసం టెక్నాలజీ కూడా మనకు ఈ రంగంలో కొత్తగా వచ్చేది ఏమీ లేదు...
4. ఫ్యాక్టరీలు కట్టడానికి కావలసినంత పెట్టుబడూలూ ఈ రంగానికి అవసరం వుండదు. ప్రధాని భాషలో చెప్పాలంటే, కేవలం వారికి విశ్వాసం/నమ్మకం కలిగించటానికే నంట దోచుకు పోవడానికి.
5. నిన్న అసమర్థ ప్రధాని అన్న టైమ్స్ మ్యాగ్‌జైన్ నేడు ప్రధాని పదవిని కూడా లెక్క చెయ్యని వీరుడు సూరుడు అని అన్నా ఆశ్చర్య పోవక్కర్లేదు...
From Sarath Chandra's facebook profile:
రిప్లయితొలగించండి>>>>>
వాల్మార్ట్ సరుకుల్లో దాదాపు 70 శాతం చైనా నుండి దిగుమతి చేసుకున్నవే! చైనాలో వస్తూత్పత్తి రంగం ఎంత బలమైనదో అందరికీ తెలిసిన విషయమే.. ఇలా 70 శాతం చైనా వస్తువులతో మార్కెట్లను ముంచేసే వాల్‌మార్ట్‌తో దేశం ఎలా బాగుపడుతుందో లోక్‌సత్తాకే తెలియాలి. చైనా వస్తువులు చైనా లో అమ్మినా, విదేశాల్లో అమ్మినా బాగుపడేది చైనా/వాల్‌మార్ట్(అమెరికా)లే గాని భారత్ కాదు! చదువుకున్న మూర్ఖులకి మాత్రం ఈ ముక్క అర్దం కాదు :(
http://www.cornellpress.cornell.edu/book/?GCOI=80140100107390
>>>>>
ఆర్థిక ధర్మ సూక్ష్మం మాలాంటి ఎండాకాలం బియ్యే గాళ్ళకేం తెలుస్తాయి చెప్పు? ఆ కళ్ళు తెరిపించావు, ప్రవీనయ్యా :))
తొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
తొలగించండిAyya Software babulu meeru matram bagupadochu kani pakkavallu economic reforms valana bagupadakodadu anedi entha nyayam. You are enjoying the free gas, telephones, growth in the private sector, quality education etc etc but wanted to worship authoritarian rule of China where the situation of the villages and large number of workers no body knows and access to them is forbidden for everybody. Let provide constructive feedback.
రిప్లయితొలగించండిidi software vaariki pedda samsya kaakapovachu...
తొలగించండిsamsyalla... raitulaku, chinna vyaparulaku, chinna vyaparulaku pedda eduru debba. kramepi e desam arthika svatantranni kolpoye paristiti dapuristundi....
బుల్లబ్బాయ్ అనే కాంమెటర్ సంస్కారహీణ కామెంటును తొలగించబడినది...
రిప్లయితొలగించండికామెంటు వున్నా తీసేసినా, వాడు చెప్పిన పాయింటు కరష్టే కదా?
రిప్లయితొలగించండిఅది నిజము అవ్వొచ్చు కాకపోవూను వచ్చు.. సంస్కారహీణుడి మాటలలో అర్థాలు పెద్దగా పట్టించుకోను.
తొలగించండిYes, I dont find any offence in his comment.
రిప్లయితొలగించండిHe argued from his end which is completely against your views, may be a bit harsh, but not deserved to be removed.
:venkat.
అది నిజము అవ్వొచ్చు కాకపోవూను వచ్చు.. సంస్కారహీణుడి మాటలలో అర్థాలు పెద్దగా పట్టించుకోను.
తొలగించండి/కొంత కాలం (10 సంవత్సరాలు అనుకుంటా) తరువాత, కంపెనీ లో వున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర ని అంతా చైనా ప్రభుత్వానికి అప్పగించాలి/
రిప్లయితొలగించండిఆహా! అలానా! 10ఏళ్ళ తరువాత, వాల్మార్ట్, సోనీ, ఆపెల్, హోండ, సుజుకి, అన్నీ చైనాకి అప్పగింతలైపోయి వాళ్ళు నెత్తిన ఎర్రగుడ్డేసుకుని పోతారన్న మాట!! 10ఏళ్ళు పైనే అయ్యిందిగా... 1980లో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. మొన్నని ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో దాద్దపు వెట్టి చాకిరి చేస్తున్న కార్మికులు, తిరగబడి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని 20% జీతాలు పెంచడం జరిగింది.
బుల్లీబ్బాయ్ కామెంట్లు షార్ప్‌గా వుంటాయి, వుడుక్కునేవాళ్ళకు వుడుక్కునంత మార్క్స్ దేవ!
ఈ చర్చ చైనా ఆర్థిక వ్యవస్థ పై కాదు. ప్రధాని ఛైనా ఆర్థిక వ్యవస్థని ఉటంకించారు కాబట్టే దాని గురించి వ్రాశాను..
తొలగించండి"దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది" దీనికి ఎవరు కారకులు?
"విదేశీ పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి" ఎందుకు కల్పించాలి?
"చైనాను చూసి నేర్చుకోవాలి" ఏ విషయంలో నేర్చుకోవాలి?
యివ్వన్ని వదిలేసి పరిక్షలో ఏమి ఆడిగినా ఆవు కథే వ్రాసినట్లు, విషయ స్వభావము పై కాకుండా ఎప్పటిలాగే మీరు కోరుకునే ఫ్యూడల్ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే శాస్త్రాన్ని సందర్భరహితంగా ఆడి పోసుకోకువడం తప్ప మరోకటి కాదు.
మీ సమర్థన ఏమైనా ఉంటే తెలపండి ప్రధాని ప్రసంగ సారాంశపై...
సంస్కారహీణుడిని (బుల్లీబ్బాయ్) సమర్థించడం లో ఆంతర్యమేమిటో అర్థమవటంలేదు.
ప్రధాని పొలిటికల్ స్పీచ్‌పై మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా.
తొలగించండిమీరు ప్రస్తావించిన, 'చైనాలో 10ఏళ్ళ తరువాత వ్యాపారాలు అన్నీ పీపుల్స్ పరం చేసి వెళ్ళిపోవాలన్న నిభంధనలకు ఒప్పుకుని జపాన్, అమెరికాలు పరిశ్రమలు స్థాపించాయనడం'లో సత్యాసత్యాలను, నే తెలుసుకోగోరుతున్నా.
/ఫ్యూడల్ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే శాస్త్రాన్ని సందర్భరహితంగా / :))
ఆ శాస్త్రం అమలులో వున్న చైనాలో దేశం, అతిపెద్ద GDPతో అమెరికా తరవాతి స్థానంలో వుంది. FDIలను 20ఏళ్ళక్రితమే అనుమతించింది, అభివృద్ధి చెందింది. మరి FDIలను INDIAలో అనుమతిస్తే ఏదో ఆకాశం విరిగి మీద పడుతుందని 'మతవాద' పార్టీలతో గొంతు కలపడం కమ్యూనిష్టులకు భావ్యమా?! అని సవినయంగా అడుగుతున్నా. ఆ శాస్త్రం మనకు పనిచేయదా?
ఈవేళ అనేక అఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి చిన్న దేశాల్లో పెట్టుబడి పెడుతున్నది మన కమ్యూనిస్ట్ చైనాయే అన్నది మీరు ఈపాటికి గుర్తించే వుంటారు. ఐస్ కరిగిపోతున్న ఆర్కిటిక్ లో కూడా పెట్టుబడి పెడతా అని అర్రులు చాస్తున్న దేశం, చైనా అని పోయిన వారం వార్త మీరు గమనించే వుంటారు.
బుల్లెబ్బాయ్ కామెంట్ మీరలా 'అంతర్గతంగా' దాచేసుకుంటే, 'సంస్కారమో' కాదో ఎలా చెప్పగలం?! అంతర్యాన్ని ఎలా విప్పి చెప్పగలం? ఆలోచించండి. చూస్తే గాని చెప్పలేము.
యిక్కడ చైనాకు మన ఆర్థిక వ్యవస్థకూ చాలా తేడా కనబడుతుంది.. చలా కాల క్రితమే విదేశీ పెట్టుబడులను చైనా ఆహ్వానించినా ఆ దేశం విధించిన షరతలు ఆ దేశ ఆర్థిక రంగ పురోగతికి ఉపయోగ పడినది.. అందుకే చైనాలో పెట్టుబడులను అప్పటిలో ఆమెరికా వ్యతిరేకించింది. మనము షరతులేని పెట్టుబడలను కూడా ఆహ్వానిస్తున్నాము...
తొలగించండిఒక్ చిన్న ఉదయారణ...
తక్కువ ఖరీదు మొబైల్ ఫోన్ అంటే ఠక్కున గుర్తు వచ్చేది చైనా ఫోనే! యిలా ఎందుకు జరిగింది? చైనా ఏమైనా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌నిగాని, నెట్‌వర్కింగ్ చిప్‌ని టెక్నాలజీని గాని ఏమి కనిపెట్టగుండానే అంత తక్కువ ఖరీదుకు ఎలా యివ్వగలుగుతుంది?
యిది ఆదేశ విదేశీ పెట్టుబడుల విధాన పలితమే! విదేశీ కంపెనీలలో చైనా వారిని మాత్రమే స్కిల్డ్/నాన్ స్కిల్డ్ వారిని ఉపయోగించి తీరాలి. కొన్నేళ్ళ తరువాత యుంత్రాలను కూడా చైనా ప్రభుత్వానికి అప్పగించాలి. తద్వారా చైనా వారు ఉత్పత్తి రంగాలలో ప్రావీణ్యం సంపాదించి, ఒకరకంగా చెప్పాలంటే టెక్నాలజినీ దొంగిలించి(దొంగిలించే సత్తా సంపాదించుకొని) తక్కువ దరకే చైనా ఉత్పతులను ప్రంపంచానికి యివ్వగలుగుతున్నారు.
ఈ చర్వని విదేశి పెట్టుబడుల లాభ నష్టాలపై మాత్రమే ఉధ్దేశించ బడినది.
యికపోతే సంస్కారహీణుల భావస్వేచ్చకు నాబ్లాగు వేదిక కాదు.
@"డెల్ ల్యాప్ టాపును కంపెనీ షోరూములోనే కొనడానికి ప్రయత్నిస్తారు" అంటే ఇక్కడ దానిని కొనే భారతీయులందరకీ తక్కువ ధరకే అది దొరుకుతుందన్నమాట. అంటే దీనివలన ప్రయోజనం కలిగేది భారతీయ వినియోగదారులకే కదా.
రిప్లయితొలగించండిఆమ్ బనియా(శెట్టిగారు) నష్టపోయినా, ఆమ్ ఆద్మీ లబ్దిపొందుతున్నాడు కదా.
డెల్ కంపెనీ రిటైల్ కొట్టు పెడితే తక్కువ ధరకే యిస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదు.. ప్రస్తుత దేశీయ రెటైల్/అధీకృత డీలర్లకు యిచ్చే లాభ శాతాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే వారిమీద డిపెండ్ అయ్యె అవసరం ఉండదు గనుక. దేశీయ రెటైల్/అధీకృత డీలర్లకు అమ్ముతుందన్న గ్యారేంటీ కూడా ఏమీ వుండదు.
తొలగించండిదీనివల్ల వస్తువుపై భారతియుడు ఖర్చు పెట్టే ఆఖరి రూపాయి కూడా విదేశాలకు తరలపోతుంది విదేశీ మారక రూపంలో! ప్రైవేటు రంగంలో ఉద్యోగవకాశాలు కూడా సన్నగుల్లుతాయి, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడే కంటే నష్టపోవడమే ఎక్కువ జరుగుతుంది.
ఓపన్ కాంపిటీషన్ వున్నప్పుడు డెల్ ఇవ్వకపోతే లెనొవో, హెచ్.పి. ఫ్యుజిట్సు, సోనిలు బోలెడన్ని ఇస్తారు. వాల్మార్ట్, డెల్‌ను మాత్రమే ఆహ్వానించడం లేదు కదా.
తొలగించండియిక్కడి సమస్య రెండు వ్యాపార సంస్థల పోటీతత్వం మధ్య కాదు.. అదే కదా సమస్య.. అ డెల్ కాకుండా లెనొవో, హెచ్.పి. ఫ్యుజిట్సు, సోనిలు కూడా దేశీయ రెటైల్ సంస్థల ద్వారానే అమ్మలని నిబంధన లేదు..న్ని బ్రాండ్‌ల వారు యిక్కడ రిటైల్ దుకాణాలు తెరొచ్చు.
తొలగించండిరిటైల్ షాపులద్వారా భారతదేశానికి వచ్చే/వారు తెచ్చే గొప్ప శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞణము ఏమీ వుండదు..
ఒక వినియోగదారుడిగా నాకు ఇప్పుడున్న దుకాణాలకన్నా, పెద్దవి, మరిన్ని దుకాణాలు రావాలని కోరుకుంటాను. ఎక్కువమంది దుకాణదారులుంటే, పోటీపడి తక్కువ ధరకు సరకులు లభ్యమవుతాయన్నది నా సూత్రం. వివిధ రకాల సరుకులు అందుబాటులో వుంటాయి. లాభం మన దళారికి వచ్చిందా, విదేశీ దుకాణం వాడికెళ్ళిందా అన్నది నా సమస్య కాదు. ఆర్థికంగా దేశానికి ఏమి ఒరుగుతుంది అనే లెక్కలు నాకు తెలియవు. నేను బాగుపడితే దేశం బాగుపడుతుందనుకునే సామాన్యుడిని. ఇప్పుడు చెప్పండి, నా ఆలోచన తప్పా?
తొలగించండి@Anonymous "లాభం మన దళారికి వచ్చిందా, విదేశీ దుకాణం వాడికెళ్ళిందా అన్నది నా సమస్య కాదు."
తొలగించండిసామాన్య మానవుడిగా మీలాభ నష్టాల గురించి ఆలోచిస్తే, ఈస్ట్ ఇండియా కంపెనినీ, బ్రిటీష్ వారిని వెళ్ళగొట్టడం మనం చేసిన మహా పాపమా? బానిస బ్రతుకూ బ్రతుకేనా?
@Anonymous "ఆర్థికంగా దేశానికి ఏమి ఒరుగుతుంది అనే లెక్కలు నాకు తెలియవు"
సామాన్యుడిగా అయితే మీకు అనవసరం.. కాని పనిచేస్తున్న ప్రభుత్వాలు ఆయా దేశ ఆర్థిక, సార్వ భౌమాథికారాలను కాపాడుకోగలగాలి.
అనుమతించకపోతే స్వదేశీ బూర్జువాలు దోచుకుంటారు. అనుమతిస్తే విదేశీ బూర్జువాలు దేశీలకు పోటీగా వస్తారు. విదేశీ బూర్జువాలు స్వదేశీ బూర్జువాలతో పోటీ పడితే మధ్య కమ్యూనిస్టులకెందుకు బాధ? కమ్యూనిస్టులు దేశీ బూర్జువాల పక్షమా?
తొలగించండిటెక్నాలజీ అంటే నెట్వర్క్ చిప్స్ మాత్రమే కాదు. పెద్ద రిటైల్ దుకాణాల నెట్వర్క్ నిర్వహణ, లాజిటిక్స్, మార్కెటింగ్ స్ట్రాటజీ ఇవన్నీ టెక్నాలజీ కిందికే వస్తాయి. మొదట విదేశీ తయారీ వస్తువులు వచ్చినా రానురాను ఆ సంస్థలు లేబర్ చీప్‌గా వుండే ఇండియాలోనే వుత్పత్తి చేస్తాయన్నది గతి తార్కిక చారిత్రిక సత్యం అన్నది థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, చైనాల విషయంలో జరిగిదన్నది జగద్విదితం. మొదట ఇది స్వేచ్చావిఫణి అన్న నమ్మకం కలిగితేనే అది సాధ్యమవుతుంది అన్నది చిన్న బూర్జువా వ్యాపారస్థులైన మీకు తెలిసిన విషయమే. దోపిడిదొంగలున్న సోమాలియాలో ఎవరైనా పెట్టుబడి పెడతారా?
యిది కేవలం దేశీయ విదేశీయ భూర్జువాల మధ్య పోటీగానే చూడకూడదు. మన దేశం యింకా ఉత్పత్తి రంగంలో అంతంత మాత్రమే, దేశీయ రిటైల్ రంగంలో కూడా విదేశీ ఉత్పత్తులదే హవ్వా! అందువలన, విదేశీ రిటైల్ రంగం దేశీయ రిటైల్ రంగం లో గుత్తాధిపత్యంలోకి జారుకుంటూంది. అంటె, అమెరికానో చైనానో మరే యితర అభివృద్ది చెందిన దేశ ఆర్థిక పుష్టికి దోహద పడుతుందే తప్ప మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఒరిగేదేమీవుండదు. అంటే నా దృష్టి లో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోల్పోవడమే. ఏ దేశమోడి చేతిలో నా పిలక వుంటే నాకేంటి, నా రూపాయి విలువ డలర్ తో ఎంత పడిపోతే అంత నాకు లాభం అనే థృక్పదం తో వుంటే నేను మీతో వాదించలేను. అటువంటి బానిస బ్రతుకును నేను కోరుకోను.
తొలగించండిblog lo matter adirindi
రిప్లయితొలగించండిBasically, we need to study and analyse the reasons for the MNCs to invest in China. In the 80's it was a logical thinking by MNCs to invest in China, produce products at lesser prices, sell in China and take profits OUT OF China. But the outcome has come in differently. These companies produced products at lower prices and started exporting across the Globe. This has resulted in sudden influx of Foreign currency, created millions of jobs in China and improved the logistics, administration, and many more things. Don't get scared by a Dell laptop....Think about producing a laptop/ Tab in India and think of exporting these items across the Globe and earn foreign currency. A small example can be your Akash tablet....
రిప్లయితొలగించండిMore from me,,,,very soon...
See You all later
Sashikanth
Completely Diverting the topic from Retails to Production.. Can you explain me How Indian Economy gains with FDIs in Retail.
తొలగించండిOur beloved communists should think of China and learn. China is not a communist country. As long as they were communists, the ordinary Chinese have lived in BPL standards. After taking the path of capitalist communism with a long vision, their life standards have improved. Our communists can never understand these issues as they don't want to learn from others.
రిప్లయితొలగించండియిటు వంటి కామెంట్స్ సాధారణంగా "beloved" persons నుండి వచ్చేవే. యుటువంటి చర్చకు పనికిరాని, ప్రస్తుత చర్చకు సంబంధం లేనటువంటి అసందర్భ కామెంట్స్ చేయడంలోనే తెలుస్తుంది యితరులను చూసి ఎంత నేర్చుకొనే (learn from others) స్వభావముందో తెలుస్తుంది.
తొలగించండినిన్నటి వరకు చైనా ఆర్థిక/రాజకీయ వ్యవస్థపై ఒంటికాలిపై లేచిన ఒక మేధావి వర్గం, ప్రధాని ఎప్పుడైతే చైనా ని చూసి నేర్చుకోమన్నాడో, దెబ్బకి చైనాని ఆమెరికాతో పోల్చడం మొదలెట్టారు. యిక్కడి చర్చ చైనా కమ్యూనిస్ట్ దేశమా కాదా అన్నది కాదు.. చర్చని ఎంతసేపు కమ్యూనిజ వ్యతిరేక భావజాలం లోకి లాక్కుపోదామనే ప్రయాస.