చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పై నిన్న ప్రధాని నన్ను(ప్రజలను) ఉధ్దేశించి మాట్లాడిన తరువాత ప్రధానికి నా బహిరంగ లేఖ..
ప్రధాని ఉపన్యాస సారాంశం..
1. సంస్కరణలు తప్పవు... దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది.
2. విదేశీ పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి.
3. చైనాను చూసి నేర్చుకోవాలి.
1. సంస్కరణలు తప్పవు... దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది.
అసలు సమస్య అదేకదా ప్రధాని గారు.. మీరు ప్రారంభించిన నూతన ఆర్థిక విధానాల సంస్కరణల ఫలితమే కదా ఈ దేశం క్లిష్ట పరిస్థితిలోకి చేరింది. ఆంటే యిప్పటి వరకూ జరిగిన సంస్కరణలు దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికే ఉపయోగ పడినవని మీ పరొక్ష అంగీకారమా? సంస్కరణలు ఆ జాతి ని ఉద్దరించాలి గాని పరాయి దేశాలకు జాతిని తాకట్టు పెట్టడం కాదు.
2. విదేశి పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి...
విదేశి పెట్టుబడి దారులేమానా శారీరిక / మానసిక వికలాంగులా? లేక వారు భారత సమాజంలో సాంఘిక అసమానతలకు లోనవుతున్నవారా? వారిలో ఆత్మవిశ్వాసాన్ని, మనమీద నమ్మకాన్ని వారికి ఎందుకు కలింగించాలి?
వ్యాపారం సంస్థలేమి నిశ్వార్థ స్వఛ్చంద సంస్థలేమి కాదు కదా? మీరు చదివిన ఆర్థిక రంగ శాస్త్రాలలో ఎక్కడా చెప్పరు కదా! వ్యాపారం ఆంటే కేవలం లాభ నష్టాల భేరీజు మాత్రమే ఈ విషయాన్నిఅందరూ ఒప్పుకున్నదే. ఆఫ్‌ఘనిస్తాన్ లోనైనా వ్యాపారం చేస్తాడు లాభాలు వస్తాయంటే..
3. చైనాను చూసి నేర్చుకోవాలి...
మీరేనా మాట్లాడింది? చైనా ఆర్థిక సంస్కరణలపై చలాసార్లు విమర్శించిన మీరు యిన్నాలకు కళ్ళు తెరిచారా? లేక యిన్నాల్లు మోసంచేశారా?
నాకు తెలిసినంత వరకు చైనా అవలంభిస్తున్న విదేశీ కంపెనీల పై విధానం...
a. చాలా వరకు వసతులు రాయతీలు / ఉచితం గా కల్పించడం జరుగుతుంది (భూమి, నీరు, కరెంటు..)
b. కొంత కాలం (10 సంవత్సరాలు అనుకుంటా) తరువాత, కంపెనీ లో వున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర ని అంతా చైనా ప్రభుత్వానికి అప్పగించాలి.
c. కంపెనీలో అన్ని రంగాలలో స్వదేశీ కార్మికుల కే ఉద్యోగం కల్పించాలి. చాలా క్లిష్టమైన రంగంలో చైనా కార్మికులు లేకపోతే వారికి ట్రైనింగ్ యిచ్చి వారినే ఉద్యోగంలోకి తీసుకోవాలి...
నాకు తెలిసినంత వరకు చైనా అవలంభిస్తున్న విదేశీ పెట్టుబడుల ఆహ్వానం పై విధానం...
a. ఆ కొత్త పెట్టుబడులతొ దేశానికే మైనా శాస్త్రసాంకేతికి పరిజ్ణాణం వచ్చేదయి వుండాలి..
b. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో పారిశ్రామిక ఉత్పాదన పెంచేదై వుండాలి.
c. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో ప్రజలకు ఉపాధి కల్పించ కలగాలి..
పైన పేర్కొన్న మూడింటిలో కనీసం ఒక్కటి కూడా నెరవేరదు రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల ద్వారా.. మరి ఎందుకు విదేశీ పెట్టుబడీదారులలో విశ్వాసాన్ని కలింగించాలి? చైనా నుండి ఏమి నేర్చుకోవాలి?
ఆమెరికా పెట్టుబడీ దారుల వ్యూహం పలించినట్లు వుంది.. టైమ్స్ పత్రక ద్వరా మీరు అసమర్థులు అనే విషయంతొ మిమ్ములను బాగానే రెచ్చగొట్టారు.. మిరు కోరుకొనే ప్రంపచ స్థాయి ఆర్థిక వేత్త బిరుదు వంటివి నోబుల్ బహుమతైనా సరే మీతెలివి తేటలను బట్టి యివ్వరు.. వాళ్లకు మీరు ఎంత వరకు ఉపయోగపడ్డారు మీజాతిని ఎంత వరకు వాళ్ళకు తాకట్టు పెట్టారు అనేవే వారికి కొలమానం.
మీ బొగ్గు మసిని బాగానే ప్రక్కదారి పట్టించారు. ఎంతంటే, భజాపాను కమ్యూనిస్ట్‌లు ఒకే వేదికను పంచుకోనేటంత. చిన్న సమస్యను మరో పెద్ద సమస్య సృష్టించడంతో సరి!
క్విట్ ఇండీయా స్పూర్తికి విరుద్ధంగా మరో ఈస్ట్ ఇండియా ప్రవేశ సన్నివేశాన్ని మాకు చూపించి... మా రాబోయే తరానంతటిని ఆర్థిక బానిసలుగా పరాయి దేశానికి అప్పగించే విదానం తప్ప మరోకటి కాదు..
మిమ్ములను గెలిపించిన పాపానిక
మనస్థాపంతో
ఓ భారతీయుడు...
మన సాఫ్ట్‌వేరు రంగ మితృలకు అర్థమయ్యే ఉధాహరణ:
ఒక DELL Laptop కొనాలంటే హైదరాబాద్ లో అయితే ఏమి చేస్తాము? యిప్పుడున్న స్వదేశీ సంస్థలైన ఏదైనా షాపింగ్ మాల్ కో వెళ్ళి, లేక సికింద్రాబాద్ లో చెన్నెయ్ ట్రేడ్ సెంటర్ కో వెళ్ళి లాప్‌టాప్ కొంటాం..
ఒక్ Rs.40,000/- అయిందనుకోండి..
దానిలో అధిక లాభ శాతము డెల్ కంపెనీకి చేరుతుంది (ఆమెరికాకు)
దానిలో కొంత లాభ శాతం డెల్ తయారు చేసిన కంపెనీకి చేరుతుంది (చైనాకు)
దానిలో ఓ పది శాతం ఆ లాప్‌టాప్ అమ్మిన షాప్‌కి చేరుతుంది (మన దేశంలో బడా/చిరు వ్యాపారులకు).
ఆంటే మనం ఖర్చు పెట్టే దానిలో ఒక పది శాతమైనా మన దేశ ప్రయోజనాలకు ఉపయోగ పడుతుంది.. (DELL SHOPPE అని పెద్ద డెల్ బోర్డ్ వుంటే అది మొత్తం డెల్ కంపెనీ ది కాదని గుర్తించంది.. అది డెల్ కి ఆథరైజ్‌డ్ స్వదేశీ రీటైల్ షోరూమ్ మాత్రమె)
కానీ రేపు.. హైదరాబాద్ లో డెల్ కంపెనీనే డైరెక్ట్‌గా రిటైల్ షోరూమ్ ప్రారంభిస్తే పరిస్థితి ఏమిటి.. డెల్ ల్యాప్‌టాప్ ని కంపెనీ షోరూమ్ లోనే కొంటానికి ప్రయత్నిస్తారు. ఆ పది శాతం లాభం కూడా అమెరికాకు తరలిపోలోతుంది. ఇక అన్ని షాప్‌లలో డెల్ ల్యాప్‌టాప్స్ అమ్మక్కర్లేదు..
1. షాపింగ్ మాల్స్ లో సేల్స్‌మ్యన్స్ కూడా అంత మందిని కొనసాగించక్కర్లేదు.. నిరుద్యోగం పెరుగుతుంది..
2. రిటైల్ రంగంలో వచ్చే ఆఖరి లాభం కూడా యితర దేశాలకు చేరుతుంది.
3. కనీసం టెక్నాలజీ కూడా మనకు ఈ రంగంలో కొత్తగా వచ్చేది ఏమీ లేదు...
4. ఫ్యాక్టరీలు కట్టడానికి కావలసినంత పెట్టుబడూలూ ఈ రంగానికి అవసరం వుండదు. ప్రధాని భాషలో చెప్పాలంటే, కేవలం వారికి విశ్వాసం/నమ్మకం కలిగించటానికే నంట దోచుకు పోవడానికి.
5. నిన్న అసమర్థ ప్రధాని అన్న టైమ్స్ మ్యాగ్‌జైన్ నేడు ప్రధాని పదవిని కూడా లెక్క చెయ్యని వీరుడు సూరుడు అని అన్నా ఆశ్చర్య పోవక్కర్లేదు...