1. చాలా త్వరగా లేదా కాస్త ఆలస్యంగా ముఖ్యమంత్రి పదవి చేబట్టడానికి వీలుగా తన రాజకీయ ప్రాబల్యం విస్తరించుకోవాలనే ఒక యువ నాయకుడి మొండితనపు వ్యూహం...
2. అనుకోని విషాద పరిస్థితుల్లో అందివచ్చిన ముఖ్యమంత్రి స్థానాన్ని వీలైనంతకాలం నిలబెట్టుకోవాలనే ఒక వృద్ధనేత ఉద్దేశపూర్వక ఊగిసలాట విధానం..
3. స్వంతంగా మెజార్టీ లేని కేంద్ర ప్రభుత్వం, అత్తెసరు మెజార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడేమవుతుందోననే అనిశ్చితిలో అధిష్టానపు అచేతన ఆజమాయిషీ...
4. ప్రాంతంపై తమ ఆధిపత్యం ప్రదర్శించుకోవడంలోనే అస్తిత్వం వుందనుకునే నేతల దుందుడుకు ధోరణులు, ఇంకా అనేక అవకాశవాదాలు,అవగాహనా లోపంతో ఆవేశ కావేశాలు...
5. ఇవన్నీ ఎలా వున్నా ప్రజల శ్రేయస్సుకు స్వతంత్రంగా వ్యవహరించలేని పాలనా, పోలీస్ యంత్రాంగం నిశ్చేతనత్వం....
ఇవి తప్పా యింకా ఇంకేమయినా కారణాలు ఉన్నాయంటారా? (పూర్తి పాఠం)
రాజకీయానుభవం లేని జగన్ కి వారసత్వం పేరుతో ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఇదేమైనా రాచరిక దేశమా? రోశయ్య కాలేజిలో చదివే రోజుల్లో స్టూడెంట్స్ లీడర్. ఆ తరువాత MLC, తరువాత మంత్రి అయ్యాడు. ఇంత అనుభవం ఉన్న నాయకుడిని వదిలేసి రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని జగన్ కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే జోకే.
రిప్లయితొలగించండిYes i agree with u. Iam saying abt jagan. If he become cm, then ika chukkale.
రిప్లయితొలగించండితుగ్లక్ లా తొమ్మిదేళ్ళు పరిపాలించిన చంద్రబాబుని చూశాం. జగన్ ముఖ్యమంత్రి అయితే అంత కంటె అద్వాన్నమైన ఔరంగజేబు పాలన వస్తుంది.
రిప్లయితొలగించండి