వీలుంటే నా నాలుగు లంకెలు ...

22, జులై 2009, బుధవారం

భారత్‌-అమెరికా ఉమ్మడి ప్రకటన హానికరం

అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ పర్యటన అనంతరం భారత్‌-అమెరికా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక పొత్తును మరింత పటిష్టపరచాలని కోరుతోంది. '21వ శతాబ్దంలో ప్రపంచ సౌభాగ్యాన్ని, సుస్థిరతను పెంపొందించేందుకు' సంబంధాల్లో మార్పులు రావాలంటూ గొప్పగా మాట్లాడినప్పటికీ అందులోని అంశాలు, కుదుర్చుకొన్న ఒప్పందాలు నిజంగా భారత ప్రయోజనాలకేనా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అమెరికా పరికరాల తుది వినియోగ నియంత్రణపై ఉభయ పక్షాలూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. అలాంటి ఒప్పందం అమెరికా సరఫరా చేసే పరికరాలను ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని తనిఖీ చేసేందుకు వీలుకల్పిస్తుంది. భారత్‌తో పెరుగుతున్న సైనిక సహకారం అమెరికా ప్రయోజనాలకు కీలకమైంది. భారత్‌ వందల కోట్ల డాటర్ల సైనిక పరికరాలు కొనుగోలు చేయాలని అది భావిస్తోంది. తుది వినియోగ నియంత్రణ ఒప్పందం అనేది 'అణు సహకార రంగంలో భారత్‌, అమెరికా సంతకాలు చేసి ఒప్పందంలో చేపట్టాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం' అని హిల్లరీ భారత పర్యటన సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి ఫిలిప్‌ జె క్రాలే పత్రికలకు తెలిపారు. అణు ఒప్పందం భారత్‌ను అమెరికాకు జూనియర్‌ భాగస్వామిని చేస్తుందని, ఒప్పందంలోని నిబంధనలు సైనికంగా భారత్‌ను అమెరికాకు కట్టుబడేట్లు చేస్తాయి.
తుది వినియోగ నియం త్రణ ఒప్పందం భారత సైనిక దళాలు పెంటగాన్‌కు మరింతగా లోబడి ఉండేలా చేస్తుంది. భారత్‌-అమెరికా అణు ఒప్పందంతో దానికి సంబంధం లేదని హిల్లరీ చెబుతున్నప్పటికీ భారత్‌కు అణుశుద్ధి, రీప్రాసెసింగ్‌ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకుండా చేసే దిశగానే అమెరికా కదులుతోంది.
ఇటీవలి జి-8 నిర్ణయం దీన్నే ధృవీకరించింది. ఇంకా అమెరికా సరఫరా చేసే వినియోగించిన ఇంధన సరఫరా ఒప్పందాన్ని భారత్‌ చేసుకోవలసి ఉంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం గతంలో 10 వేల మెగావాట్ల అణు రియాక్టర్లు కొనుగోలు చేస్తానని వాగ్దానం చేసింది. ఈ అణు ఒప్పందాన్ని ప్రపంచ అణు వ్యాప్తి నియంత్రణ పరిధిలోకి తేవాలని అమెరికా భావిస్తోంది. ఈ అంశాలన్నీ ఒక కొలిక్కి వచ్చే వరకూ అమెరికా అణు రియాక్టర్ల కొనుగోలుకు సంబంధించి భారత్‌ ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోరాదని సిపిఎం పునరుద్ఘాటించింది. భారత విధాన నిర్ణయాల్లో అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యత ఉండాలని ఆ ఉమ్మడి ప్రకటన స్పష్టంగా తెలిపింది. దీన్ని ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంలోనూ, భారత్‌-అమెరికా ఉమ్మడి సిఇఓ వేదికలోనూ రూపొందించబోతున్నారు. ఈ లాబీయింగ్‌ వేదికలకు అనుగుణంగానే ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, ఉన్నత విద్య, తదితర రంగాల్లోకి ఎఫ్‌డిఐని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం మరింతగా అనుమతించబోతోంది. అదే సమయంలో ఇరాన్‌ పట్ల శత్రు వైఖరిని చేపట్టాలని అమెరికా విదేశాంగ మంత్రి ఒత్తిడి తేవడం జరిగింది. ఇరాన్‌తో గ్యాస్‌ పైప్‌లైన్‌ ఒప్పందాన్ని పక్కకు పెట్టడంతో ఇరాన్‌ను మరింతగా ఒంటరిపాటు చేయాలని అమెరికా కోరుకుంటోంది. అలాంటి ఒత్తిళ్ళను ప్రతిఘటించాలని పొలిట్‌బ్యూరో పేర్కొంది. డబ్ల్యుటిఓపై దోహా విడల చర్చలను ప్రస్తావిస్తూ వ్యవసాయం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై భారత్‌ తన వైఖరిని విడనాడాలనే ఒత్తిళ్ళకు తలొగ్గరాదు. కర్బన కాలుష్యాలను తగ్గించడానికి అభివృద్ధి చెందిన దేశాలు ఏమీ తీవ్ర చర్యలు తీసుకోకుండానే భారత్‌ను తగ్గించాలంటున్న వాతావరణ మార్పు చర్చల్లో అమెరికా డిమాండ్‌ను అంగీకరించరాదు. ఈ ఏకపక్ష సంబంధాన్ని పటిష్టపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించాల్సింది



1 కామెంట్‌:

  1. అమెరికా సామ్రాజ్యవాదులు పోసే మోచేతి నీళ్ళనే అమృతంలా భావించి దాన్ని తాగడం గొప్ప అనుకునేవాళ్ళు ఉన్నారు. మిరియాల ఫణి ప్రదీప్ ఆర్థిక సంక్షోభం గురించి తన బ్లాగ్ లో వ్రాసినవి చదివితే ఈ విషయం అర్థమవుతుంది.

    రిప్లయితొలగించండి