వీలుంటే నా నాలుగు లంకెలు ...

13, జులై 2018, శుక్రవారం

అమిత్ షా కేవలం ఒక్క రోజు పర్యటన

0 వ్యాఖ్యలు
అమిత్ షా కేవలం ఒక్క రోజు పర్యటనలో ఎంత బిజీ అంటే విమానశ్రయంలో భాజపా లీడర్స్ ని కలిసే టైమ్ లేనంత...

మరి కలిసింది ఎవరిని??

1. ఒక స్టార్ హోటల్ లో RSS  & హిందూ ధార్మిక సంఘాల లీడర్స్ ని.. (తెలంగాణాలో మత కలహాలకు సృష్టించైనా ఒక రెండు సీట్లు తెలంగాణాలో తెచ్చుకోవాలనే.. పరిపూర్ణాంద స్వామి ఎపిసోడ్ అదే!)

2. ఒక పవర్ బ్రోకర్ మరియు మీడియా మొఘల్ గా భావించే వ్యక్తిని...(మీడియాను మ్యానేజ్ చేయడానికి)

తెలుగు ప్రజలు, తస్మాత్ జాగ్రత్త. ఎంత యింపార్టెంట్ పని కాకపోతే స్పెషల్ ఫ్లైట్ లో అంత దూరం నుంది యిక్కడకు వస్తాడు...

వాసవ్య యాగాటి..
2018-07-13

11, జులై 2018, బుధవారం

0 వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలుకు ప్రయత్నాలు - దీంతో తెలిపోతుంది భాజపా కు మిత్రులెవరో, శత్రులెవరో......

10, జులై 2018, మంగళవారం

0 వ్యాఖ్యలు

కత్తి మహేష్ - మనోభావాలు - చట్టాలు


మత మౌడ్యాన్ని, మతోన్మాదాన్ని, మత రాజకీయాలన్ని వ్యతిరేకించాలి తప్ప,

మతాల్ని, మతం నమ్మే వారి మనోభావాలను దెబ్బతగిలేలాగ మాట్లాడటం మంచిది కాదు (ప్రస్తుత చట్టాల ప్రకారం అది నేరం కూడా).

ఈ సున్నితమైన గీతను అర్థంచేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.. దానివల్ల మతోన్మాద శక్తులకు అసంకల్పిత అవకాశం ఇవ్వడమే... కత్తి మహేష్ విషయంలో జరిగింది అదే!!!

మనదేశంలో "మనోభావాలు" దెబ్బతిన్నాయి అని ఎవరైనా అన్నారంటే, దానర్థం అరాచకం చేయడానికి సిధ్దంగా ఉన్నారని భావించాలి...

పరిపూర్ణంద స్వామి కూడా దానికో ఉదాహరణ. 2019 లో నిజమాబాద్ నుండి బిజిపి ఎమ్మెల్యే గా పోటీచేయాలని భావిస్తున్న ఈ స్వామి, ఏమి చేస్తే ఓట్లు పెరుగుతాయో తెలియదా?

చాలా ఆశ్రమలలో మహిళలపై అఘాత్యాలు జరిగినప్పుడు హిందూమత ఉద్ధరుడైన ఈ స్వామి ఏమైనట్లు??? అటువంటి ఆశ్రమల ముందు ప్రదర్శనలు చేయలేదే? నేనొక వీడియో చూసా ఈ స్వామి జి కూడా జీసస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.. అసవుద్దీన ఒవైసి కూడా అంతే, మరి కత్తి మహేష్ విషయంలోనే  కోర్టులు కాకుండా పోలీసులే శిక్షలు వేశారు...

అంతంత మాత్రంగా ఉన్న భావ ప్రకటన స్వేఛ్చను కూడా ఇటువంటి కారణాలు చూపి హరించేస్తారు పాలకులు..

కోర్టులు ఇవ్వాల్సిన తీర్పులు, శిక్షలు ప్రభుత్వాలు పోలీసులు ద్వారా ఇచ్చేస్తాయి.. 



రాముడే దిగొచ్చినా లైంగిక వేధింపులు ఆపలేడు - వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ 


తన రాజకీయ చేతకాని తన్నాని శ్రీరామ చంద్రుడి ప్రతిభ ను సైతం తాకట్టు పెట్టిన ఈ హిందూ మతతత్వ పార్టీ ఎమ్మెల్యే కు నగర బహిష్కరణ శిక్ష వద్దా ఓ హిందూ సోదరా?

మనోభావాలు దెబ్బతినలేదా?

ఎందుకు??  ఎందుకు???

వాసవ్య యాగాటి
2018-07-10

9, డిసెంబర్ 2013, సోమవారం

ఏది వాదం ఏది వితండ వాదం.. ఏదేనా వాదానికి ఒక నిబద్దత/ప్రామానికం వుండక్కర్లేదా?

0 వ్యాఖ్యలు
ఉదాహరణ 1:
హైదరాబాద్ తో 60 సంవత్సారాల 6 కోట్ల సీమాంధ్రవాసుల అనుబంధం (వృత్తి, విద్య, సాంఘిక పరంగ ) మానోభావాలంటే పట్టించుకున్న నాదుడే లేడు.

కాని, 60 సంవత్సారల క్రితం గోదావరి జిల్లాలో భాగమైన భద్రాచలం మాత్రం ఖమం జిల్లా వాసుల బంధం 'పవిత్ర' మైనది.  భద్రాచలాన్ని విడదీస్తే శవాలు గుట్టలవుతాయి!

ఉదాహరణ 2:
భౌగోలికంగా ఖమ్మంకు దగ్గరా, పరిపాలనా ప్రకారం ప్రజలకు సౌకర్యం అంటారు. అదే బాగా వెనకబడిన అనంతపురం, కర్నూలు హైదరాబాదికి దగ్గరవుతాయి రేపు ఏర్పడబోయే నూతన క్యాపిటల కన్నా అంటే మాకు 10 జిల్లాల తెలంగానే కావాలి.. యింకా ఎంతమంది తెలంగాణా బిడ్డలు చావాలి అని యిండైరెక్టుగా అమాయక ప్రజల బలి దనాలను సైతం ప్రేరేపిస్తారు.

ఉదాహరణ 3:
జగన్ వర్గం (అప్పటికి కాంగ్రేస్ ఎమ్మేల్యేలు) రాష్ట్ర శాసన సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పేడితే, ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగు దేశం మద్ధతు యివ్వలేదనటానికి కారణం తెలుగుదేశం-కాంగ్రేస్ మ్యాచ్ ఫిక్సింగని తెలంగాణా వాదులు/టి ఆర్ స్ / రాష్ట్ర బిజేపి /కోదండరాం విరుచుకు పడ్డారు.

ఇప్పుడు అదే కాంగ్రేస్ ఎంపీ లు పార్లమెంటు లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టితే, ప్రధాన ప్రతిపక్షం అయిన భజపా ఈ తీర్మానానికి బలపరచక పోతే కాంగ్రేస్-భజపా కుమ్మక్కు అయినట్లానా? తెలంగాణా వాదులు/టి ఆర్ స్ / రాష్ట్ర బిజేపీ అనగలదా?


యిలా ఎన్నో వున్నయి..
నాకు తెలంగాణా యిచ్చినా, యివ్వకపోయినా నాకంటూ ఏమీ లాభనష్టాలు లేవు.  తెలంగాణ రాష్ట్రం అవసరమా కాదా అనేది యిక్కడ చర్చ కాదు.. కాని చేసే వాదనలో పస వుండాలి కదా? లాజిక్ / న్యాయం మిస్ అవ్వకూడదు కదా?    ప్రజల  మానోభావాలే ('సెంటిమెంటు') రాజకీయ శాస్త్రానికి పరమావధి అనుకుంటె అంతకంటే పొరపాటు యింకొకటి లేదు. తాత్కాలిక ప్రయోజనాలకోసం రాజకీయ పార్టీలు తమ దీర్ఘకాలిక ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే!

ఏది వాదం ఏది వితండ వాదం.. ఏదేనా వాదానికి ఒక నిబద్దత/ప్రామానికం వుండక్కర్లేదా?