కత్తి మహేష్ - మనోభావాలు - చట్టాలు
మత మౌడ్యాన్ని, మతోన్మాదాన్ని, మత రాజకీయాలన్ని వ్యతిరేకించాలి తప్ప,
మతాల్ని, మతం నమ్మే వారి మనోభావాలను దెబ్బతగిలేలాగ మాట్లాడటం మంచిది కాదు (ప్రస్తుత చట్టాల ప్రకారం అది నేరం కూడా).
ఈ సున్నితమైన గీతను అర్థంచేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.. దానివల్ల మతోన్మాద శక్తులకు అసంకల్పిత అవకాశం ఇవ్వడమే... కత్తి మహేష్ విషయంలో జరిగింది అదే!!!
మనదేశంలో "మనోభావాలు" దెబ్బతిన్నాయి అని ఎవరైనా అన్నారంటే, దానర్థం అరాచకం చేయడానికి సిధ్దంగా ఉన్నారని భావించాలి...
పరిపూర్ణంద స్వామి కూడా దానికో ఉదాహరణ. 2019 లో నిజమాబాద్ నుండి బిజిపి ఎమ్మెల్యే గా పోటీచేయాలని భావిస్తున్న ఈ స్వామి, ఏమి చేస్తే ఓట్లు పెరుగుతాయో తెలియదా?
చాలా ఆశ్రమలలో మహిళలపై అఘాత్యాలు జరిగినప్పుడు హిందూమత ఉద్ధరుడైన ఈ స్వామి ఏమైనట్లు??? అటువంటి ఆశ్రమల ముందు ప్రదర్శనలు చేయలేదే? నేనొక వీడియో చూసా ఈ స్వామి జి కూడా జీసస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.. అసవుద్దీన ఒవైసి కూడా అంతే, మరి కత్తి మహేష్ విషయంలోనే కోర్టులు కాకుండా పోలీసులే శిక్షలు వేశారు...
అంతంత మాత్రంగా ఉన్న భావ ప్రకటన స్వేఛ్చను కూడా ఇటువంటి కారణాలు చూపి హరించేస్తారు పాలకులు..
కోర్టులు ఇవ్వాల్సిన తీర్పులు, శిక్షలు ప్రభుత్వాలు పోలీసులు ద్వారా ఇచ్చేస్తాయి..
రాముడే దిగొచ్చినా లైంగిక వేధింపులు ఆపలేడు - వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్
తన రాజకీయ చేతకాని తన్నాని శ్రీరామ చంద్రుడి ప్రతిభ ను సైతం తాకట్టు పెట్టిన ఈ హిందూ మతతత్వ పార్టీ ఎమ్మెల్యే కు నగర బహిష్కరణ శిక్ష వద్దా ఓ హిందూ సోదరా?
మనోభావాలు దెబ్బతినలేదా?
ఎందుకు?? ఎందుకు???
వాసవ్య యాగాటి
2018-07-10