వీలుంటే నా నాలుగు లంకెలు ...

7, ఏప్రిల్ 2011, గురువారం

సత్య సాయిబాబా ట్రస్ట్/ఒకరిద్దరు రాష్త్ర మంత్రుల చరలో/కబంద హస్తాలలో బందీగా వున్నారా?

9 వ్యాఖ్యలు

నాకు బాబాగారి మహిమలు మరియు వారి దైవత్వము మీద యించైనా నమ్మకము లేదు. అయితే వారిగొడవ మనకెందుకులే అనుకుందామంటే కుదరడం లేదు, నాకు మీడియా ఫోబియా మరి. మన మీడియా ఎప్పటిలాగే ఈ వార్తను హైజాక్ చేసేసింది వాళ్ళ రేటింగ్స్ కోసమని. ఫుంకాలు ఫుంకాలుగా కథానాలు ప్రసారం చేసెస్తున్నాయి అసలు విషయం ప్రక్కనపెట్టి.

అసలు విషయంపై నాకో సందేహము కలుగుతోంది. రోగి ని (వారిని నమ్మిన వారికి 'రోగీ అని సంభోదిస్తే కోపమొస్తుందేమో! కాని వైద్యులు చికిత్స చెస్తున్నందున మరియు రోగ నిర్దారణ జరగడం వలన మెడికల్ సైన్స్ పరి భాషలో రోగి అనడంలో తప్పులేదు అనుకుంటా!) ఎవ్వరకి చూపించకపోవటం చేత  (మన ముఖ్యమంత్రికి సైతం) వారు  ట్రస్ట్/ఒకరిద్దరు రాష్త్ర మంత్రుల  చరలో  కిడ్నప్/కబంద హస్తాలలో బందీగా వున్నారా అనే ధర్మ సందేహము కలుగుతుంది. ఇది నాఆరోపణ కాదు, కేవలం నా సందేహము మాత్రమే. ఎందుకంటే, ఈవ్యవహారం సుమారు నలభై వేల కోట్ల రూపాయల ట్రస్ట్ ఆస్తులకు వారసత్వముతో ముడిపడివుంది.
సందేహాలకు కారణాలు..
1. క్యాబినేట్ మంత్రులు ఇద్దరు అక్కడే తిష్టవేసారు. ఓకరేమో వారి ఆరోగ్యం కుదిటపడింది అంటారు, యింకొకరేమో యింకా వారి ఆరోగ్యం ఆందోళనకరంగానే వుందంటారు ఒకే సమయంలో.
2. పొంతన లేని అనుమానస్పదపు మెడికల్ బులిటెన్లు.
3. కానరాని ట్రస్ట్ సభ్యులు.
4. రెండు లారీల పూలు తెప్పించారని, స్టేడియంలో  వేదికతో పాటు మెటల్ బారికేడ్లు మరియు స్టేడియంకి "లోపలకి", "వెలుపలకి" ద్వారాలు సిద్ధం చేసారాని మీడియాలో కథనాలు.
5. పొంతనలేని వాదనలతో వారి శిష్యరిక బౄందం, బాబాగారు అతను చెప్పినట్లే 95 సంత్సరాలు బతికే వుంటారు అని కొందరు, లేదు వారికి ఈ మానవజాతి దేహం ఏప్పుడు కావాలంటే అప్పుడు వదిలే అవకాశం వుంది అని మరికోందరు.
6. ముఖ్యమంత్రి గారు పుట్టపర్తి వెళ్ళడానికి చాల హడావిడి చేసారు, కాని వెళ్ళడం రద్దయింది, కారణం మాత్రం చెప్పలేదు.
7. మీడియాను అనుమతించక్కర్లేదు, కనీసం బాబాగారి ప్రస్తుత ఫోటోగాని, వీడియో గాని విడుదల చేయకపోవడం. ఫోటోలు,విడియోలు వల్ల వైరస్ సోకదు. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు జరిగినప్పుడు లైవ్ విడియోలు కుడా తీస్తుంటారు.


నా సందేహము ఏమిటంటే, ట్రస్ట్ ఆస్తిపాస్తుల/పంపకాల వ్యవహారం తేలేవరకు, ప్రభుత్వం లోని పెద్దలు గాని ట్రస్ట్ సభ్యులుగాని ప్రస్తుత బాబా గారి మంచి/చేడు చెప్పరేమో?

బాబాగారు కూడా ఎవరు కాదన్నా అవునన్నా మానవ దేహం కలిగి వుండటం చేత, రాష్ట్రంలో ఒక రొగి ఆరోగ్యం/భద్రత  పై యింత గందరగోళం జరుగుతుండటం వలన మానవ హక్కుల సంఘం స్వచ్ఛందం (సుమొటో)గా కేసు తీసుకొని, అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని  ప్రస్తుత యథార్ద స్థితిని తెలపమని కోరితే, వారి భక్తులకు, వారి దేహ సమకాలికులకు సందేహము నివౄత్తి చేసినట్లువుతారు.

ఏదిఏమైన, వారు కోలుకోని ప్రజలకు కనబడాలని ఆశిద్దాం.

11, అక్టోబర్ 2010, సోమవారం

సిగ్గు, లజ్జ లేని అధికార దాహం తొ భాజాపా/కాంగ్రెస్ నాయకత్వం...

2 వ్యాఖ్యలు
వెంకయ్యనాయుడు గారు ఇలా సెలవిచ్చారు... "కర్నాటకాలొ జరిగిన ముఖ్యమంత్రి విశ్వాసతీర్మాన విజయం  ప్రజాస్వామ్య విజయం" ఇంకనయం "రామ రాజ్యం" గెలుపు అనలేదు .

విప్ / ఓట్టింగ్ జరగకుండా పార్టీ ఫిరాయుంపుల చట్టం వర్తిస్తుందా? మూడోవొంతు సభ్యులు వేరే కుంపటి పెట్టుకునే అవకాశము ప్రస్తుత చట్టం కలిపిస్తుంది. స్వపక్షంలో అసమతి మూడొంతులు వుందా లేదా అనేది ఎవరు నిర్ణయించాలి? ఏవిధంగా  నిర్ణయించాలి?  ఎప్పుడు నిర్ణయించాలి? పార్టీ ఫిరాయుంపుల చట్టం స్వతంత్ర  సభ్యులకు ఎలా వర్తిస్తుందో బొత్తిగా బోదపడటం లేదు. ఇప్పుడు కర్నాటకాలో 11 మంది స్వపక్ష సభ్యులను ఐదగురు స్వతంత్రుల శాసనసభ సభ్యత్వం రద్దుచేసారు. అదికూడా విశ్వాస పరీక్షకు ముందు. ఇది ప్రజాస్వమ్యం కు పరాకాష్టంగా భావించొచ్చేమో! రేపు మరే శాసనసభలోనో విపక్ష సభ్యులను కూడా అనర్హత వేటు వేసి ఓట్టింగ్ జరిపించవచ్చేమో (స్వతంత్ర శాసన సభ్యులను అనర్హత వేటు వేసిన మాదిరిగా)!  ఎన్నికలప్పుడు ఎన్నికల అభ్యర్దులను నిలబేట్టేటప్పుడు వారికి పార్టీపై నిబద్దత వుందా లేదా అనేది కాకుండా, కేవలం గెలుపు గుర్రలు అనిచెప్పి ఎంత అవినీతి పరుడైనా, ఎంత అసాంఘిక  శక్తికైనా సీటు ఇచ్చినందుకు ప్రతిఫలమే ఈ ఫిరాయింపులు. మా శాసనసభ్యులను ప్రలొభ పెడుతున్నారు అని ప్రతిపక్షం పై ఏడుపు ఎందుకు? ప్రలొభపడేవాడు వుంటే ప్రలోభ పెట్టేవారూ వుంటారు. క్రితం సారి, ఈ భాజాపాయే కదా కాంగ్రేసు వారిని ప్రలొభ పెట్టి రాజీనామ చేయించి ఎన్నికలుకు వెళ్ళింది.

అవినీతికి మారుపేరైన జనార్ధన రెడ్డి సహాయంతో పాలన కొనసాగిస్తుండటం, భాజాప ని దేశవ్యాప్తంగా రామ పాలన సాధిస్తనికేనా? బాజాప అసలిరంగు ఈ అధికార దాహంతో బయటపడినందుకు దేశప్రజలు ఆనందపడాలి.  యిక కాంగ్రెస్ పార్టీ అధికారదాహం గురించి చెప్పె అంత వయసు నాకు లెదు.. ఎందుకంటే, 125 సంవత్సరాల నుండి దేశ ప్రజలు చూస్తూనే వున్నరు. అయినా వారికే ప్రజలు పట్టం గడుతున్నారు. అందుకేనేమో భాజాపా ధీమా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెసినా ఫర్వాలేదు అనుకుంటుంది.. కుహానా ప్రజాస్వామ్య వాదులంటే వీరుకాక మరెవరైనా వుంటారా?
 వెంకయ్యనాయుడు గారి ఉద్దేశం లోని ఈ ప్రజాస్వామిక విజయాన్ని చూసి మనం సిగ్గుపడదాం! ఎందుకంటే మనకు సిగ్గు లజ్జ వున్నాయి కదా.  

15, సెప్టెంబర్ 2010, బుధవారం

'యువరాజు' కోసమే ఈ నాటకం?

4 వ్యాఖ్యలు
పర్యావరణం, భూసేకరణ, ఆహార హక్కు చట్టం, మావోయిస్టుల సమస్య తదితర అంశాలపై ఇటీవలి కాలంలో యుపిఎలోని కేంద్ర మంత్రులే భిన్న వాదనలు ముందుకు తెచ్చారు. సోనియా నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్‌ఎసి (జాతీయ సలహా మండలి) సభ్యులు కూడా పలు అంశాలపై మన్మోహన్‌ సర్కారు వైఖరిని బహిరంగంగా విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుపిఎ, కాంగ్రెస్‌ మధ్య...వ్యక్తిగతంగా సోనియా, మన్మోహన్‌ మధ్య విభేదాలు పెరిగాయన్న ప్రచారం ఊపందుకుంది. పలు ప్రధాన మీడియా సంస్థలు కూడా ఈ అంశంపైనే ఇటీవల ఎక్కువగా కేంద్రీకరించాయి. వాస్తవానికి 'విభేదాల' పేరుతో కాంగ్రెస్‌ ప్రస్తుతం కీలకమైన అంతర్నాటకానికి తెరలేపింది.
'జెఎంఎంతో కలిసి జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై బిజెపిలో విభేదాలున్నాయన్న మాట అవాస్తవం. ఇదంతా ఆ పార్టీ ఆడుతోన్న నాటకం. ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తోన్న ప్రయత్నం ' అంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ ఇటీవల బిజెపిపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల్లో తప్పొప్పులను పక్కనబెడితే, ప్రస్తుతం కాంగ్రెస్‌ కూడా అటువంటి నాటకానికే తెర లేపింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయంటూ ఢిల్లీ రాజకీయ శ్రేణుల్లో ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ' మరో ఏడాదిలో రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారు...ఉప ప్రధానిగా ప్రణబ్‌ ముఖర్జీ బాధ్యతలు చేపడతారు... మన్మోహన్‌ త్వరలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాష్ట్రపతి అభ్యర్థ్ధిగా నిలబడతారు...2012 యుపి ఎన్నికల అనంతరం రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ మధ్యంతర ఎన్నికలకు వెళుతుంది...' అంటూ తాజా పరిస్థితిని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా విశ్లేషిస్తున్నారు.
విభేదాలు నిజమేనా ?
పర్యావరణ పరిరక్షణ పేరుతో పేదరికాన్ని పెంపొందించడం సరికాదని ఇటీవల ప్రధాని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకమైనదని ఆ తర్వాత రెండ్రోజులకు సోనియా సూత్రీకరించారు. పర్యావరణం, భూసేకరణ, ఆహార హక్కు చట్టం, మావోయిస్టుల సమస్య తదితర అంశాలపై ఇటీవలి కాలంలో యుపిఎలోని కేంద్ర మంత్రులే భిన్న వాదనలు ముందుకు తెచ్చారు. సోనియా నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్‌ఎసి (జాతీయ సలహా మండలి) సభ్యులు కూడా పలు అంశాలపై మన్మోహన్‌ సర్కారు వైఖరిని బహిరంగంగా విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుపిఎ, కాంగ్రెస్‌ మధ్య...వ్యక్తిగతంగా సోనియా, మన్మోహన్‌ మధ్య విభేదాలు పెరిగాయన్న ప్రచారం ఊపందుకుంది. పలు ప్రధాన మీడియా సంస్థలు కూడా ఈ అంశంపైనే ఇటీవల ఎక్కువగా కేంద్రీకరించాయి. వాస్తవానికి 'విభేదాల' పేరుతో కాంగ్రెస్‌ ప్రస్తుతం కీలకమైన అంతర్నాటకానికి తెరలేపింది. ఎన్‌డిఎ హయాంలో వాజ్‌పేయి-అద్వానీ (ఆర్‌ఎస్‌ఎస్‌) శిబిరాలు పలు అంశాలపై భిన్న వైఖరులను వినిపించేవి. విమర్శించే అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇవ్వకపోవడం...ప్రజాసంబంధ విషయాల్లో పార్టీలోనే తీవ్ర అభిప్రాయ భేదాలున్నాయన్న అభిప్రాయాన్ని కలిగించడం...అంతిమంగా ప్రజలను అయోమయానికి గురిచేయడం ఈ వ్యూహం లక్ష్యం. కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు సరిగ్గా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. పార్టీ వ్యూహం వెనుక రెండు నిర్దిష్ట లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి : సోనియాను పేదల పక్షపాతిగా నిరూపించడం. రెండు : రాహుల్‌ను భావి ప్రధానిగా అందరిచేతా అంగీకరింప చేయడం.
ఆయుధం ఎన్‌ఎసి !
ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ వివాదం నేపథ్యంలో 2006లో ఎన్‌ఎసి ఛైర్మన్‌ పదవికి, ఎంపీ స్థానానికీ సోనియా రాజీనామా చేశారు. రారుబరేలీ నుండి ఎంపీగా తిరిగి గెలుపొందినప్పటికీ మళ్లీ ఆమె ఎన్‌ఎసి బాధ్యతలు స్వీకరించలేదు. 2009లో యుపిఎ-2 అధికారంలోకి వచ్చాక కూడా ఎన్‌ఎసి పునర్వ్యవస్థీకరణ జరగలేదు. మూడు నెలల క్రితమే సోనియా సారథó్యంలో ఎన్‌ఎసికి కొత్త రూపునిచ్చారు. ఆహార భద్రత, మహిళా రిజర్వేషన్లు, పంచాయతీ రాజ్‌ సంస్కరణలు తదితర అంశాలపై కాంగ్రెస్‌ పార్టీకి, యుపిఎ ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరించడమే ఎన్‌ఎసి లక్ష్యమని నాడు ప్రచారం జరిగింది. వాస్తవానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉంటూనే సోనియా ఆ పని చేయవచ్చు. గతంలో అలా చేశారు కూడా. సోనియా అంగీకారంతో సంబంధం లేకుండా, ఆమె ఆదేశాలను అమలు చేయకుండా మన్మోహన్‌ పనిచేస్తారని ఏ ఒక్కరూ భావించడం లేదు. మరి ఎన్‌ఎసి అవసరం ఏమిటి ? సోనియాను ఆమ్‌ఆద్మీ పక్షపాతిగా చూపించేందుకు ప్రయత్నించడమే ! ఒకవైపు మన్మోహన్‌ సర్కారు సంస్కరణల పంథాలో దూసుకుపోతుంటే...సోనియా నేతృత్వంలోని ఎన్‌ఎసి ప్రజల మౌలిక హక్కుల గురించి, సంస్కరణల ప్రభావం గురించి మాట్లాడుతుంది. ఇదే కాంగ్రెస్‌ వ్యూహం. గత కొద్ది వారాలుగా ఎన్‌ఎసి సభ్యులకు, పలువురు కేంద్ర మంత్రులకు మధ్య నడుస్తోన్న మాటల యుద్ధమే ఇందుకు నిదర్శనం. ప్రధాని మన్మోహన్‌ అమెరికాకు సన్నిహితుడన్న ప్రచారం మొదటి నుంచీ ఉంది. అణు ఒప్పందం నేపథ్యంలో ఈ భావన మరింత మందిలో దృఢపడింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా, పేదల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే వేదికగా ఎన్‌ఎసిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఆహార భద్రతా చట్టం మొత్తానికీ సోనియానే సూత్రధారి అన్న ప్రచారం ఈ పాటికే ఊపందుకుంది. ఇటువంటి మరికొన్ని పథకాలు, సంక్షేమ చట్టాలు త్వరలో సోనియా ముద్రతో బయటికి రాబోతున్నాయని కాంగ్రెస్‌ శ్రేణులు పేర్కొంటున్నాయి. 2014 ఎన్నికల నాటికి ఆమ్‌ఆద్మీ సంరక్షకురాలిగా సోనియా నిలబడాలంటే ఎన్‌ఎసి మరింత క్రియాశీలంగా పనిచేయాలన్నది పార్టీ భావన. మన్మోహన్‌ సంస్కరణల వల్ల ప్రభుత్వంపై పెరిగే అసంతృప్తిని తగ్గించుకోవడానికి ఎన్‌ఎసిని ఆయుధంగా వినియోగించుకునేందుకూ పార్టీ వ్యూహ రచన చేస్తోంది.
రాహుల్‌కు రహదారులు...
ఒరిస్సాలో వేదాంత సంస్థ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతిని నిరాకరించడం దేశ వ్యాపారవర్గాలను, సంస్కరణలను బలపరిచే శక్తులను ఆశ్చర్యపరిచింది. నిరాశకూ గురి చేసింది. ప్రాజెక్టుకు అనుమతిని నిరాకరించాలని యువనేత రాహుల్‌గాంధీ ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేయడం...ప్రాజెక్టుకు కేంద్రం ఎర్రజెండా చూపడం రెండ్రోజుల వ్యవధిలోనే జరిగిపోయాయి. గిరిజన హక్కుల కోసం సైనికుడిలా నిలబడతానంటూ ఒరిస్సా గిరిజనులకు ఆ తర్వాతి రోజే రాహల్‌ హామీనిచ్చారు. వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకునేందుకే రాహుల్‌ ఈ తతంగమంతా నడిపారని చెప్పడానికి రాజకీయ పరిజ్ఞానం కూడా అవసరం లేదు. సైనికుడిగా మారి ఎవరిపై పోరాటం చేయనున్నారో రాహుల్‌ కూడా వివరించలేదు. మన్మోహన్‌ ప్రభుత్వం కార్పొరేట్‌ ప్రపంచానికి మొగ్గు చూపుతుంటే...సోనియా, రాహుల్‌ ఆమ్‌ఆద్మీ సంక్షేమం కోసం పరితపిస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలే ఇటీవల ప్రచారం ప్రారంభించారు. ' మన్మోహన్‌ అమెరికా ఎజెండా స్థానంలో, ఆమ్‌ఆద్మీ ఎజెండా అమలు కావాలంటే సోనియానే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలి....ఆమె ప్రధాని పదవిని ఈపాటికే త్యాగం చేశారు కాబట్టి యువనేత రాహుల్‌ గాంధీ దేశ పగ్గాలు చేపట్టాలి ' స్థూలంగా ఇదీ ప్రస్తుతం కాంగ్రెస్‌ శ్రేణులే సాగిస్తోన్న ప్రచార సారాంశం. ఇటీవల కోల్‌కతాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సిపిఎం ప్రభుత్వంపైన, మార్క్సిజంపైన రాహుల్‌ విమర్శలు చేశారు.
రష్యాలో మాదిరిగానే బెంగాల్లోనూ ఒక్క రోజులోనే కమ్యూనిస్టులు కనుమరుగవుతారని జ్యోతిష్యమూ చెప్పారు. అమెరికన్‌ వ్యూహకర్తలకు, దేశంలోని బడా కార్పొరేట్‌ అధిపతులకూ తనపై నమ్మకం కలిగించడమూ ఈ వ్యాఖ్యల వెనుక ఒక లక్ష్యమన్న వాదనా వినబడుతోంది. 2014లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవడం, రాహుల్‌ను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడం కోసం కాంగ్రెస్‌ ఆడుతోన్న ఈ నాటకం భవిష్యత్తులో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ' అణు పరిహార బిల్లు ఆమోదం పొందడం కోసం బిజెపి అగ్రనేతల గడప తొక్కడానికి కూడా మన్మోహన్‌ సిద్ధపడ్డారు. అమెరికా మెప్పు కోసం చూపిస్తోన్న శ్రద్ధలో సగమైనా దేశ ప్రజలపై చూపితే బాగుంటుంది ' అంటూ కాంగ్రెస్‌ నేత ఒకరు ఇటీవల కొందరు మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. ఇటువంటి మాటలు తన చెవికి చేరితే మన్మోహన్‌కు అప్పుడప్పుడూ కోపం రావడము...కాంగ్రెస్‌ అదిష్ఠానంపై అలగడమూ సహజమే కదా ?!
...డి.జయప్రకాష్‌