ఉదాహరణ 1:
హైదరాబాద్ తో 60 సంవత్సారాల 6 కోట్ల సీమాంధ్రవాసుల అనుబంధం (వృత్తి, విద్య, సాంఘిక పరంగ ) మానోభావాలంటే పట్టించుకున్న నాదుడే లేడు.
కాని, 60 సంవత్సారల క్రితం గోదావరి జిల్లాలో భాగమైన భద్రాచలం మాత్రం ఖమం జిల్లా వాసుల బంధం 'పవిత్ర' మైనది. భద్రాచలాన్ని విడదీస్తే శవాలు గుట్టలవుతాయి!
ఉదాహరణ 2:
భౌగోలికంగా ఖమ్మంకు దగ్గరా, పరిపాలనా ప్రకారం ప్రజలకు సౌకర్యం అంటారు. అదే బాగా వెనకబడిన అనంతపురం, కర్నూలు హైదరాబాదికి దగ్గరవుతాయి రేపు ఏర్పడబోయే నూతన క్యాపిటల కన్నా అంటే మాకు 10 జిల్లాల తెలంగానే కావాలి.. యింకా ఎంతమంది తెలంగాణా బిడ్డలు చావాలి అని యిండైరెక్టుగా అమాయక ప్రజల బలి దనాలను సైతం ప్రేరేపిస్తారు.
ఉదాహరణ 3:
జగన్ వర్గం (అప్పటికి కాంగ్రేస్ ఎమ్మేల్యేలు) రాష్ట్ర శాసన సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పేడితే, ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగు దేశం మద్ధతు యివ్వలేదనటానికి కారణం తెలుగుదేశం-కాంగ్రేస్ మ్యాచ్ ఫిక్సింగని తెలంగాణా వాదులు/టి ఆర్ స్ / రాష్ట్ర బిజేపి /కోదండరాం విరుచుకు పడ్డారు.
ఇప్పుడు అదే కాంగ్రేస్ ఎంపీ లు పార్లమెంటు లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టితే, ప్రధాన ప్రతిపక్షం అయిన భజపా ఈ తీర్మానానికి బలపరచక పోతే కాంగ్రేస్-భజపా కుమ్మక్కు అయినట్లానా? తెలంగాణా వాదులు/టి ఆర్ స్ / రాష్ట్ర బిజేపీ అనగలదా?
యిలా ఎన్నో వున్నయి..
నాకు తెలంగాణా యిచ్చినా, యివ్వకపోయినా నాకంటూ ఏమీ లాభనష్టాలు లేవు. తెలంగాణ రాష్ట్రం అవసరమా కాదా అనేది యిక్కడ చర్చ కాదు.. కాని చేసే వాదనలో పస వుండాలి కదా? లాజిక్ / న్యాయం మిస్ అవ్వకూడదు కదా? ప్రజల మానోభావాలే ('సెంటిమెంటు') రాజకీయ శాస్త్రానికి పరమావధి అనుకుంటె అంతకంటే పొరపాటు యింకొకటి లేదు. తాత్కాలిక ప్రయోజనాలకోసం రాజకీయ పార్టీలు తమ దీర్ఘకాలిక ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే!
ఏది వాదం ఏది వితండ వాదం.. ఏదేనా వాదానికి ఒక నిబద్దత/ప్రామానికం వుండక్కర్లేదా?