వీలుంటే నా నాలుగు లంకెలు ...

4, అక్టోబర్ 2011, మంగళవారం

ఆధునిక అతివాద తెలంగాణ కమ్యూనిస్ట్ సిథ్దాంతం - ప్రపంచ శ్రామికులారా ఏకంకండి! తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

103 వ్యాఖ్యలు
భారతదేశ శ్రామికులేకాక, అమెరికా శ్రామికులైనా, పాకిస్తాన్ శ్రామికులైనా మరేదేశ శ్రామికులైనా, ప్రపంచంలో వున్న శ్రామికులందరూ ఏకమై ఈ భూర్జువా భూస్వామ్యవర్గంపై సాయుధ పోరాటంతో సమసమాజం స్థాపించాలని భారతదేశ అతివాద కమ్యూనిస్ట్‌ల ఒక్కపటి అజెండా!

ప్రపంచ శ్రామికులారా ఏకంకండి!
తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

యిది యిప్పటి ఆధునిక అతివాద తెలంగాణ కమ్యూనిస్ట్ సిథ్దాంతం. పోనీ తెలుగు (తెలంగాణ Vs తెలంగాణేతర) శ్రామికులు తన్నుకు చచ్చినా ఏమైనా విప్లవం వస్తుందా అంటే అదీ కాదు.

* దసరా పూట సెలవులు వచ్చేవి శ్రామికులకా? పరిశ్రామాధిపతులకా? యింత గొడవలు జరుగుతున్న సందర్భంలో పరిశ్రామాధిపతులు రిస్క్ రీసుకొని ప్రయాణాలు పెట్టుకోరు.. వారికి కావలసినప్పుడు సెలవులు తీసుకుంటారు. ఎంతోకాలంగా సెలవలకోసం వేచి చూస్తూ తల్లి తండ్రులదగ్గరకు పండగ వంకతోనైనా చూసి వస్తానికి వీలు చేయడం అంటే నా దృష్టిలో మానవత్వం లోపించడమే అవుతుంది.

* బస్సులపై జన్మస్థలాలకు దసరా సెలవలకు వెళ్ళేవారు బడుగులూ, మధ్య తరగతి జీవులు కాదా? - హైదారాబాద్ నుండి ఖరీదైనా కార్లలోనో, విమానాలలో వెళ్ళే బడా పారిశ్రామికాధిపతులకు ఏటువంటి ఆసౌకర్యం కలిగించనటువంటి ఈ రోకోలు ఎవరిపై ఎవరికోసం?

* నిన్న ఓ టీవీ ఛానల్‌లో C.P.I (ML) & పౌరహక్కుల సంఘం నాయకులు మాట్లాడుతూ, రెండు ప్రాంతాల ప్రజలు కొట్టుకొనేలా ప్రభుత్వమే కుట్రపన్నడంవలన ఈ పరిస్థితి దాపురించిందని వాధించారు. ప్రభుత్వాలు కుట్రపన్నుట సహజం అనుకుందాం. ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని ముందే తెలిసినా ఈ మేధావులకు, రెండు ప్రాంత ప్రజలు కొట్టుకు చావకుండా ఏ ఒక్క ఎత్తుగడైనా వేశారా? లేకపోతే కొట్టుకు చచ్చిన తరువాత ప్రభుత్వమే దీనికి భధ్యత వహించాలని డిమాండ్లు చీటీలో వ్రాసుకొని దాచుకున్నారా? లేక ఎలాగూ పాపం ప్రభుత్వానిదే కదా, ప్రజల మధ్య చిచ్చుతో చలికాగుతాగుతామనా?

* ప్రజలలో వ్యక్తిగత  రాగ ద్వేషాలాను రోజు రోజుకు పెంచుతూ, అమ్మనా బూతులూ తిడుతూ అదే తెలంగాణ సంస్కృతి అంటూ చేసే నాయకుడి తోక పట్టుకోని, తెలంగాణాలొ ఎంతో కొంత తమ క్యాడర్‌ని పెంచుకోవచ్చులే అనే తపనే తప్ప యింకొకటి కాదనిపిస్తుంది. మీడియా మొఘల్ మరియు ఆర్.ఎఫ్.సి అధినేత పై కట్టలు తెచ్చుకోనే ఆవేశంతో పాటలు, అదే తెలంగాణాలో మరో గులాబి మీడియా మొఘల్ పై సాఫ్ట్ కార్నర్!

 
* ఆంథ్రప్రాంత బడా పారిశ్రామికులతో కలిసి వ్యాపారాలు చేస్తున్న తెలంగాణ ప్రాంత బడావ్యాపారుల ఊసే వీరికి అక్కర్లేదు.. ఆంథ్రప్రాంతవాసులందరూ (ప్రజలందరూ) దోపిడీదారులూ / బడా వ్యాపారవేత్తలనే తలతిక్క విమర్శలకు వీరి స్పందన కరువు.. ఎవరైన గట్టిగా అడిగితే పెద్ద్ క్లాస్ పీకుతారు.. పలానా సందర్భంలో మేము ఖండించాము.. ఆంథ్రప్రాంతవాసులందరినీ దోపిడీ దారలనడం ఖండనార్హమని. కానీ బహిరంగంగా తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క సందర్భంలోను లౌడు స్పీకర్లలో చెప్పిన దాఖలాలు లేవు. తన్ని తరమండి, లుంగీలు ఊడపీకమని పిప్లవ సాహిత్య పంథాలో కవులు పులలో రూపంలో రెచ్చగొట్టడం అందరికీ తెలిసినదే...

* దోపిడీ వర్గంపై పోరుమాని, కేవలం తెలంగాణా ప్రాంతంకి ముఖ్యమంత్రి పదివి దక్కితే చాలు (పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో) తెలంగాణా ప్రజల జీవితాలు స్వర్గయుగంలోకి వెళ్ళిపోతాయి అనే భ్రమలు కల్పించడం ఏ సిథాంతం ప్రకారం చేస్తున్నారో అర్థం చేసుకోవడం కష్టమే...

ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి సహజ లక్షణమయిన సాంఘీక అసమానతలను ఆసరాగా, ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంలేక పోయినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకంలేకపోయినా, వర్గపోరు మరిచి వ్యక్తిగత రగద్వేషాలను నూరిపోయిడం (వేరే ప్రాంత బడుగు మధ్య తరగతి జీవులపై కూడా) ద్వారా తెలంగాణ ప్రాంతం క్యాడర్ లో వచ్చు ఈ చైతన్యం వాపే అవుతుంది తప్ప బలుపు కాదని గ్రహిస్తే మంచిది. అంతే కాకుండా ఈ ఉధ్యమం ఏ సిథ్దాంత ప్రాతిపదికన చేసున్నదీ తెలియదు. కేవలం ఆంధ్రప్రాంతం వారిని తన్ని తరిమితే ఉధ్యోగవకాశాలు, అన్ని కష్టాలు తెలంగాణా వారికి తీరిపోతాయి అనే ఊహాజనిత భావంతో ప్రేరేపించి జనులను రచ్చగొట్టడం తప్ప యింకొకటి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణాలోని దోపిడీకి గురవుతున్నవారు వుండరనా వీరి అర్థం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అతివాద కమ్యూనిస్ట్ పార్టీలు మూసుకుంటారా? మళ్ళీ ప్రభుత్వంపై యిప్పుడు చేస్తున్న పోరాటాలు కొనసాగించ మంటారా? క్లారిటిగా ప్రజలకు వివరిస్తే బాగుండు.

ఒక్క తెలంగాణాను భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో అంతర్భాగమైన  ఒక రాష్ట్రంగా చేస్తే పెట్టుబడీ, భూస్వామ్య వ్యవస్థ ఎలా కూలుతుందో!

ప్రత్యేక తెలంగాణా అవసరమా, కదా అనే ఆంశంపై రాసిన వ్యాసం కాదు.. కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం  కోసం అలుపెరగకుండా పోరాడుతున్న కామ్రేడ్ల ఆలోచనా పంథాన్ని అవగహానా కోసం రాస్తున్నది....