వీలుంటే నా నాలుగు లంకెలు ...

26, జులై 2011, మంగళవారం

Fibrication of States: చిన్న రాష్ట్రాలపై వివిధ పార్టీల లోగుట్టు

98 వ్యాఖ్యలు


జాతీయ పార్టీలు

భాజాపా/ఆర్ ఎస్ ఎస్:

దేశాన్ని 100 రాష్ట్రాలగా విభజించాలని వారి ప్రతిపాదన. భాషాభిమానం/ప్రాంతీయాభిమానం ప్రజలకు పోయి.. అంతా హిందూవులం అనేభావం తో జనాలందరూ ఏకమయి వారికి అధికారం కట్టబెడతారాని వారి అబిప్రాయం. విభజించి పాలించంటంకూడా వీరి ఎత్తుగడే!


కాంగ్రేస్:

విభజించి పాలించాలి, ఎక్కువ ముక్కలు చెయ్యాలని వారి అభిప్ర్రాయం. బ్రిటీషర్స్ వీరికి ఆదర్శం. కాకపోతే సీమాంధ్రలో కాంగ్రేస్ కనుమరుగవుతుందోమని భయంతో తెలంగాణ విషయంలో తాత్సారం చేస్తుంది. కేంద్రంలో సీమాంధ్రనాయకుల పలుకుబడీ కొంత కారణం.


మావోయిస్టులు:

చిన్న రాష్ట్రాలైతే వారి సాయిధ పోరాటాలకు అడ్డుతక్కువని, ప్రభుత్వాల అరాచకాలను ప్రజలలోకి ఈజిగా తీసుకువెళ్ళవచ్చని వీరి అభిప్రాయం. చిన్నరాష్ట్రాల ద్వారా విప్లవం త్వరగా తేవచ్చని కూడా వీరి అభిప్రాయం.


సిపిఐ:

విశాలాంధ్రకు అనుకూలం, భాషాప్రాయిక్త రాష్ట్రాలకే కట్టుబడివుంది, గాని, తెలంగాణ క్యాడర్ ఎదురు తిరగటం చేత తప్పని పరిస్థితిలో ప్రత్యేక తెలంగాణ బాట. దేశంలో మిగిలిన చోట్ల వేర్పాటువాదానికి వ్యతిరేకం.


సిపియం:

దేశం మరిన్ని రాష్ట్రాలుగా ముక్కలవడం యిష్టంలేదు.. భాషాప్రాయిక్త రాష్ట్రాలకే కట్టుబడివుంది. గూర్ఖలాండ్ విషయంలోగాని,మరే ఏర్పాటువాదానికైనా వ్యతిరేకం.



ప్రాంతీయ పార్టీలు

తెరాసా:

కేవలం తెలంగాణాలో ఏకఛక్రాధిపత్యంతో అధికారం దక్కించుకోవడమే ఏకైక లక్ష్యం అని నిర్మహమోటంగా వేధికలపై ప్రకటించుకున్న పార్టీ. మరో రామోజీరావులాగ మీడియా మొఘల్, ఇంకో డిఎంకే పార్టీ లాగ కుటుంబపాలనకోసం ఎదురుచూపులు చూస్తున్న పార్టీ.


విప్లవ పార్టీలు (ఎమ్‌‌ఎల్-న్యూడెమక్రసీ, మొ..):

చిన్న రాష్ట్రాలపై సరైన అభిప్రాయాలు ఏదీనూ స్పష్టంగా తెలియజేయనప్పటికి, తెలంగాణలో ప్రాంతీయ అసమానతలను అసరగాచూపైనా ప్రజాఊద్యమాలతో ప్రజలను చైతన్యపరిచి కమ్యూనిస్ట్ పార్టిని తెలంగాణాలో బలోపేతం చేయడం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నమ్మకమంలేకపోయినా, తెలంగాణ రాష్ట్రం మాత్రం ప్రజాస్వామ్య పరిథిలో ఏర్పడాలి.


వామపక్ష మేధావి వర్గంగా చెప్పుకుంటున్న కొంతమంది ఫ్రొఫెసర్లు:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, అదేదో విప్లవం వచ్చినట్లేనని వీరి ప్రచార ఆర్భాటం. తెలంగాణ వచ్చినా భారత రాజ్యాధికారణ పరిధిలో (ప్రజాస్వాయంలో)పనిచేయాలని తెలిసినా, జనుల సర్వ కష్టాలకు ప్రత్యేక తెలంగానే మందు అనేరీతిలో తెలంగాణాలోని పెట్టుబడీభూస్వామ్య వర్గానికి కొమ్ముకాస్తూ ఉధ్యమాలు చేయడం. పోరాటాల ద్వారా కాకుండా లాబీయింగ్ ద్వారా తెలంగాణ తెస్తామనేవారి చేతిలో పావులు వీరు.


టీడీపి, లోక్‌సత్తా, మిగతాపార్టీలు:

స్థిరమైన అభిప్రాయాలేమీ లేవు.. సమయానుకూలంగా మార్చుకుంటారు. వారివారి తాత్కాలిక వ్యక్తిగత లాభనష్టాల భేరీజుపై అభిప్రయాలు మారతాయి.


సమైఖ్యాంధ్రా నాయకులు:

కేవలం హైదరాబాదును రక్షించుకొనుటయే ఏకైక లక్ష్యంతో కృత్రిమంగా ఏర్పాటైన ఒక అనూహ్యవేధిక. వున్న ఊళ్ళలో అన్ని అమ్ముకోని హైదరాబాద్లో వ్యపారాలు చేస్తున్నవారు, బడాపారిశ్రామికవేత్తలు, రాజకీయ పెత్తందారీస్వభావగ్రస్థులు ఈ ఉధ్యమానికి దశ, దిశ నిర్ధేశుకులు.


ఫైన పేర్కన్న నా అభిప్రాయాలన్నీ నిజం కాకపోవచ్చు. వారివారి రహస్య అజెండాలు, వారి అంతర్గత సాహిత్యం చదివుండకపోవచ్చు, కాని సగటు పాఠకుడుగా వివిధ వార్తా సాధనాల ద్వారా నేను సంగ్రహించినది యిదే!